Posts

Showing posts from November, 2019

మహా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఉద్ధవ్ థాక్రే....

Image
మహా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఉద్ధవ్ థాక్రే.... ముంబాయి :  ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. దాదర్‌లోని శివాజీ పార్క్‌లో ఆయనతో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ గురువారం సాయంత్రం  ప్రమాణం చేయించారు.  ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రే, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు.  శివసేన నుంచి సిఎం  ఉద్దవ్‌తో పాటు మంత్రులుగా  ఏక్‌నాథ్ ముండే, సుభాష్ దేశాయ్ ఎన్సీపీ నుంచి జయంత్ పాటిల్,కాంగ్రెస్ నుంచి బాలాసాహెబ్, నితిన్ కేత్‌లు మంత్రులుగా ప్రమాణం చేశారు.

పుట్టినరోజు నాడే...

Image
వరంగల్ :  హన్మకొండలో  దారుణ  సంఘటన చోటుచేసుకొంది  పుట్టినరోజు నాడే అనుమానాస్పద మరణం ఆ కుటుంబాన్ని  తీవ్ర విషాదాన్ని మిగిలిచింది .   హంటర్ రోడ్డు సమీపంలో బుధవారం రాత్రి స్థానికులు కొందరు బాలిక మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అనుమానాస్పద మృతిగా భావించి పోలీసులు  కేసు నమోదు చేశారు.  అనంతరం  బాలిక తల్లిదండ్రుల  వివరాలు సేకరించి  విచారణ చేపట్టారు. దీనదయాళ్‌నగర్‌లో నివాసం ఉండే మానస బుధవారం తన పుట్టిన రోజు కావడంతో గుడికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన కూతురు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. ఫోన్ మధ్యాహ్నం నుంచి స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో అనుమానం  కుటుంబ సభ్యులు బుధవారం  రాత్రి పోలీసులకు పిర్యడుచేశారు.   ఉదయం బాలిక మృతదేహాన్ని గుర్తించారు. కూతురిని ఆ స్థితిలో చూసి తల్లిదండ్రులు భోరున విలపించారు. పుట్టినరోజు నాడే కూతురు ఇలా విగతజీవిగా పడి ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఘటనా స్థలానికి కొద్ది దూరంలో బీరు సీసాలు, అమ్మాయి చెప్పులు లభించాయి. మానసను అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి సమీపంలో

ఫాష్... ఫ్లాష్ ... టి ఎస్ ఆర్టీసీ కార్మికులకు గుడ్‌న్యూస్‌... సిఎం కేసిఆర్‌

Image
షరతుల్లేకుండా విదుల్లోకి కార్మికులు... సమ్మెకాలంలో మృతిచెందిన కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం... యూనియన్ల మాయలో పడవద్దు... ప్రభుత్వానికి సహకరించి.. ఆర్టీసీని లాభాలబాటలో నడిపించాలి... హైదరాబద్‌ : ఆర్టీసీ కార్మికుల సమ్మె సుఖాంతం. అమాయక కార్మికుల సంక్షేమం దృష్టా అందర్ని విధుల్లోకి తీసుకుంటున్నాం అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఆర్టీసీ కార్మికులు ఆత్మస్థైర్యాన్ని నింపారు. ఆర్టీసీని ఆదుకోవడంలో బాగంగా తక్షణ సాయం కింద 100 కోట్ల మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే ఆర్టీకి అదనంగా 750కోట్ల రూపాయలు సమకూర్చుకునేందుకు వీలుగా కిలోమీటరుకు 20పైసలు పెంచేందుకు అనుమతి ఇస్తున్నట్లు చేప్పారు. కేవలం యూనియన్ల మాయాజాలంమే సమ్మేగా అభివర్ణిస్తూ యునియన్లను దరిచేరనీయమని, కార్మికులు కూడా యూనియన్ల ఉన్నాదంలో పడి రోడ్డున పడవద్దంటూ హితవు పలికారు. అసంబద్ద డిమాండ్లు, అనాలోచిత సమ్మెతో కార్మికుల బతుకులతో యూనియన్‌ ఆటలాడుకుందని ఎద్దేవా చేశారు. ఎటువంటి షరతులు లేకుండా శుక్రవారం ఉదయం కార్మికులంతా విధుల్లో చేరవచ్చని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండికి ఆదేశాలు జారీ చేస్తున్నామని పేర్కొన్నారు. కార్మికులు యూనియన్ల అభిప్

దారుణం..డాక్టరు ప్రియాంక రెడ్డి హత్య..

Image
హైదరాబాద్ :   షాద్‌ నగర్‌ టోల్‌ ప్లాజా సమీపంలో గురువారం రాత్రి వెటర్నరీ డాక్టరు ప్రియాంకరెడ్డి హత్యకు గురయ్యారు. ఈసంఘటనపై లోతుగా పరిశీలిస్తే పథకం ప్రకారమే వెటర్నరీ డాక్టరు ప్రియాంకరెడ్డి హత్య జరిగినట్లు తెలుస్తోంది. టోల్‌ ప్లాజాకు దూరంగా స్కూటర్‌ పార్కు చేయడం చూసిన దుండగులు ఉద్దేశపూర్వకంగా గాలి తీసి పక్షర్‌ ప్లాన్‌ వేశారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రియాంకరెడ్డి తిరిగిరావడం స్కూటర్‌ పై వెళ్లేందుకు ప్రయత్నించగానే పంక్చర్‌ అయిందంటూ కాస్త బలవంతంగా స్కూటర్‌ పంక్చర్‌ వేయిస్తామంటూ తమతో స్కూటర్‌ తీసుకువెళ్లడం, ఈపరిణామాలపై ప్రియాంక చాలాసేపటివరకు తన కుటుంబ సభ్యులతో ఫన్‌ మాట్లాడుతూ తీవ్రంగా భయాంధోళన చెందడం ఈవిషయాలన్నీ గమనిస్తే పథకం ప్రయారమే ప్రియాంకరెడ్డిని అత్యాచారం చేసి హత్యచేశారనే పలువురు భావిస్తున్నారు. అయితే భయపడుతూ ప్రియాంక తన సోదరికి బదులుగా పోలీసులకు ఫోన్ చేసినా, ప్రియాంక సోదరి అయినా పోలీసులకు ఫోన్ చేయాలనీ సలహా ఇచ్చినా ఈదారుణం నుండి ప్రియాంక బయటపడే అవకాసం ఉండేది అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది . ఈ సంఘటన  పై శంశబాద్‌ డిసిపి ప్రకాష్‌ రెడ్డి అందించిన వివరాలిలా ఉన్నాయి. హత్యకు గురైంది

కొత్త వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు ఉచితం..

Image
విజయవాడ : కొత్తగా కొనుగోలు చేసే వాహనాలకు  హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు ఏర్పాటుకు అదనపు  రుసుము చెల్లించనవసరంలేదని, వాహన ధరలొనే కలిపి ఉంటుందని డిటీసీ ఎస్ వేంకటేశ్వరరావు తెలిపారు. కొత్త వాహనాలు  కొనుగోలు సమయంలోనే హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను వాహనయజమానులకు తయారీదారులు  లేదా వాహనడీలర్ ద్వారా ఇప్పించేందుకు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.  ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను వాహన యజమానులకు ఇచ్చే దానిలో ఎటువంటి ఉల్లంఘనలు జరగకుండా చూడాలని, వాహన డీలర్లకు ఈ మేరకు  ఆదేశాలను జారీచేశారు.

ఉగాదికి 25 లక్షల మంది పేదలకు ఇళ్ళస్థలాలు...

Image
గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పట్టణప్రాంతాల్లోని పేదలకు 2,58,648 గృహాలు మంజూరు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో కేంద్రం ద్వారా 3,83,272 ఇళ్లు మంజూరు చేయించాం. అమరావతి  :  ఉగాది నాటికి కులం, మతం, జాతి వివక్ష అన్నది లేకుండా రాష్ట్రంలోని నిరుపేదలందరికీ సంతృప్తస్థాయిలో ఇళ్లు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు స్పష్టం చేశారు. బుధవారం వెలగపూడి సచివాలయంలోని నాల్గవ బ్లాక్ లో ఉన్న ప్రచార విభాగంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో భాగమైన పేదలందరికీ ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారన్నారు. ఇప్పటికే అర్హులైన లబ్ధిదారుల జాబితాలను రూపొందించడం జరిగిందని అన్నారు. నవరత్నాల్లో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రానున్న నాలుగేళ్లలో 25 లక్షల పక్కాగృహాలను కూడా నిర్మించి ఇస్తామని తెలిపారు. ఇప్పటికే పేదలకు ఇచ్చే భూమిని సేకరించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రెవెన్యూ శాఖ మంత్రితో కలిసి 7 జిల్లాల్లో భూసేకరణ కోసం సమీక్షలు క

లైంగిక నేరాలపై ఇక కఠిన చర్యలు...

Image
ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత,మహిళా చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఏపీఐఐసీ ఛైర్మన్ ఆర్కే. రోజా అమరావతి :  బాలలపై రోజు రోజుకూ పెరిగిపోతున్న లైంగిక వేధింపులను నియంత్రించేందుకు ప్రభుత్వం కఠిన  చర్యలు తీసుకుంటోందని సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం 'లైంగిక నేరాల నుండి బాలల రక్షణ చట్టం-2012' అనే అంశంపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.దమయంతి అధ్యక్షత వహించారు. సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, మహిళా చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఏపీఐఐసీ ఛైర్మన్ ఆర్కే. రోజా సమీక్షా సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి మాట్లాడుతూ పిల్లల్ని దైవంతో సమానంగా చూసుకుంటున్నామన్నారు. వీరిపై వయసుతో సంబంధం లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశార

బ్రూస్ లీ జన్మదిన వేడుకలు...

Image
మధురవాడ :  ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ యోధుడు, బ్రూస్ లీ 80 వ జన్మదిన వేడుకలు మధురవాడ శిల్పారామంలో బుధవారం ఘనంగా జరిగాయి. ఆనంద్ టైక్వాండో అండ్ మార్షల్ ఆర్ట్స్ శిక్షణా కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో ముందుగా బ్రూస్ లీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మార్షల్ ఆర్ట్స్ కు ప్రపంచ ఖ్యాతి రావడానికి బ్రూస్ లీ పాత్ర ను టైక్వాండో ప్రధాన శిక్షకులు, రాష్ట్ర అమెచ్యూర్ టైక్వాండో సంఘ ఉపాధ్యక్షులు బి ఆనంద్ రావు క్రీడాకారులకు వివరించారు. బ్రూస్ లీ 34 ఏళ్లకే తనువు చాలించినప్పటికీ మార్షల్ ఆర్ట్స్ లో చిరస్థాయిగా తన పేరు సజీవంగా ఉండేలా ఆయన పలు మార్గదర్శకాలు చూపారన్నారు.  యువ క్రీడాకారులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని ఆనంద్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఈ యేడాది జిల్లా మొదలుకొని జాతీయస్థాయిలో రాణించి నా నా టైక్వాండో క్రీడాకారిని ఏ పూర్ణిమ లక్ష్మిని ఘనంగా సత్కరించారు. భీమిలి ఉత్సవాలలో నిర్వహించిన టైక్వాండో పోటీల విజయవంతానికి పూర్ణిమ లక్ష్మి కీలకంగా వ్యవహరించారని ఆనంద్ చెప్పారు. ఈ కార్యక్రమంలో టైక్వాండో కోచ్ లు బి జగదీష్, ఏ. పవన్ కుమార్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

డిసెంబర్ లో విశాఖ ఉత్సవ్ ....

Image
విశాఖపట్నం (జనహృదయం) :  డిసెంబర్ 28, 29 తేదీలలో విశాఖ ఉత్సవ్ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు తెలిపారు.  ఈ మేరకు  స్థానిక సర్క్యూట్ హౌస్ లో ఆయన విశాఖ ఉత్సవ్ పోస్టర్ ను విడుదల చేశారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఉత్సవ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు.  విశాఖ నగరానికి, జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని, భారతదేశానికి ముంబై నగరం ఎలాగో, ఆంధ్ర ప్రదేశ్ కు వైజాగ్ అలాంటిదని ఆయన తెలిపారు.  విశాఖ ఉత్సవ్ ను ప్రతిరోజు లక్షమంది పర్యాటకులు సందర్శించే లా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.  విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ పెంచేలా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.భీమిలి ఉత్సవాన్ని ప్రతిరోజు దాదాపు 30 వేల మంది సందర్శించారని తెలిపారు.  ఉత్సవానికి ప్రధాన వేదికగా ఆర్కే బీచ్ ఉంటుందని తెలిపారు.సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం ఆర్కే బీచ్ లో ప్రధాన వేదిక, నోవాటెల్ హోటల్ ఎదురుగా జాతర వేదికను, స్థానిక కళాకారుల కోసం ప్రత్యేకంగా వైయస్సార్ సిటీ సెంట్రల్ పార్క్ లో మరొక వేదికను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.  స్థానికుల మనోభావాలు గౌరవించే

మావోయిస్టు కార్యక్రమాలకు దూరంగా ఉండండి...

Image
పాడేరు డిఎస్పీ రాజ్‌ కమల్  పిలుపు ... జి.మాడుగుల (జనహృదయం) : గిరిజన అభివృద్ధికి అవరోదం కలిసిస్తున్న మావోయిస్టులకు దూరంగా ఉండాలని ఉద్దేశపూర్వకంగా ఎవరైనా సహకారం అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పాడేరు డిఎస్‌ప రాజ్‌ కమల్  పేర్కొన్నారు. మంగళవారం ఆయన జి మాడుగుల పోలీస్‌ స్టేషన్‌ తనిఖీ చేసిన అనంతరం మాట్లాడుతూ ప్రజలు గిరిజన ప్రాంతాల్లో అభివ ద్ధి కార్యక్రమాలు చేపడుతున్నావారు కావాలో అభివ ద్ధి అడ్డుకుట్టు వారి ఉనికికోసం అమాయక ప్రజలను చంపుతున్న మావోయిస్టులు కావాలో తేల్చుకోవాలని ఆయన కోరారు. ప్రతి మారుమూల ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం నిధులు ఖర్చు పెడితే రహదారుల పనులు జరగకుండా అడ్డుకుంటున్నారని వారికి సహాయ చేయకుండా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. డిసెంబరు 2 నుంచి 8 వరకు మావోయిస్టులు. నిర్యహించు పి ఎల్‌ జి ఏ వారోత్సవాలు కు ప్రజలు ఎవరు సహకరించవద్దని డిఎస్పీ రాజకమల్‌ కోరారు. ఈ సమావేశంలో సి ఐ శ్రీనివాసరావు ఎస్‌ ఐ ఉపేంద్ర పాల్గొన్నారు

ఎవర్నీ ఇబ్బంది పెట్టడం మా లక్ష్యం కాదు..

Image
జర్నలిస్ట్‌ ల వినతి పత్రానికి స్పందించిన మంత్రి పేర్ని నాని.... వారం రోజుల్లో అన్ని యూనియన్లతో సమావేశం ఏర్పాటు చేయాలని సమాచార శాఖకు ఆదేశం.. విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రివర్యులు పేర్ని వెంకట్రామయ్య(నాని) గారితో జరిపిన చర్చల్లో ఎపిజెఎఫ్‌యూనియన్‌ అందించిన వినతి కి మంత్రివర్యులు సానుకూలంగా స్పందించారు వారం రోజుల్లో రాష్ట్రంలో ఉన్న యూనియన్‌ నాయకుల చే సమావేశం ఏర్పాటు చేయాలని ఐ ఎన్‌ పిఆర్‌ కమిషనర్‌ కు సూచించారు. జీవో నెంబర్‌ 142 ద్వారా జిఎస్టి మినహాయింపు కోరుతూ చిన్న పత్రికల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని దాని ద్వారా చిన్న పత్రికలో పనిచేస్తున్న 95 శాతం మంది పత్రిక జర్నలిస్టులకు అక్రిడేషన్‌ అందించలేని పరిస్థితి ఏర్పడుతుందని జర్నలిస్టులు మంత్రి ద ష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన సమాచార శాఖ మాత్యులు ఐ ఎన్‌ పి ఆర్‌ కమిషనర్‌ తో వెంటనే చర్చలు జరిపారు అక్రిడేషన్‌ అందించేందుకు అతి తక్కువ సమయం ఉన్నందున త్వరగా ఈ విషయంపై అఖిలపక్ష సమావేశం యూనియన్ల ద్వారా జరపాలని సూచించారు మంత్రి నాని మాట్లాడుతూ గత ప్రభుత్వం

మన బెజవాడ

Image
విజయవాడ :  మన బెజవాడ హుందాతో కూడిన రాజకీయాలకు నెలవు. సంగీత సాహిత్యాలకి కాణాచి. చైతన్యానికి, దాతృత్వానికి, సేవాభావాలకు మారు పేరు. అయ్యదేవర కాళేశ్వరరావు, అచ్చమాంబ, కే.ఎల్.రావు, టి.వి.ఎస్. చలపతి రావు, డాక్టర్ దక్షిణా మూర్తి, మరుపిళ్ళచిట్టి, కాకాని వెంకట రత్నం, కాకరపర్తి భావన్నారాయణ, ఖుద్దూస్, ఇటు సేవారంగంలో అటు రాజకీయ రంగంలో ఆణి ముత్యాలు.. బెజవాడ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పేర్లు. సంగీతంలో పారుపల్లి రామకృష్ణయ్య పంతులు, చిలకలపూడి వెంకటేశ్వర శర్మ, మద్దులపల్లి లక్ష్మీనరసింహ శాస్త్రి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, బాలాంత్రపు రజనీ కాంత రావు, వోలేటి వెంకటేశ్వర్లు, మహాదేవ రాధాకృష్ణం రాజు, కంభంపాటి అక్కాజీ రావు, శ్రీరంగం గోపాల రత్నం బెజవాడకు కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. సాహిత్యంలో కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, పేరాల భరత శర్మ, చెరుకుపల్లి జమదగ్ని శర్మ వంటి కవి పండిత శ్రేష్ఠులు, పరిశ్రమలతో పాటు ధార్మిక సంస్థలు నెలకొల్పిన చుండూరు వెంకటరెడ్డి, కౌతా పూర్ణానందం, మాగంటి సూర్యనారాయణ, జీ.ఎస్. రాజు, సినీ రంగం ప్రముఖులు పోతిన శ్రీనివాసరావు, పూర్ణ మంగరాజు కామరాజు, విజయ పిక్చర్స్ చెరుకూరి పూర్ణచంద్రరావు, నవయ

కుటమికే పీఠం.... సిఎంగా ఉద్దవ్‌ ఠాక్రే

Image
ముంబాయి : శివసేనకే నింహాసనం ఖరారయ్యింది. అనూహ్య రాజకీయపరిణామాలు నేపథ్యంలో రోజుకోమలుపుతిరుగుతూ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, రాజీనామా వ్యవహారాలు చకచకా జరిగిపోయి, వ్యూహానికి ప్రతివ్యూహంతో బిజేపి, శివసేన సంకీర్ణ కూటమి అలుపెరగని పోరుసాగించాయి. వీటిలో బిజేపి ఓమెట్టు ఎక్కి ముందువరసలో నిలువగా అంతే స్పీడులో వెనక్కిరావాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. చివరి వరకు కలిసికట్టుగా ముందుకు సాగిన సంకీర్ణ పార్టీలకు ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది. ఈమేరకు శివసేన అధినేత ఉద్దవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతన్నాయి. గురువారం సాయింత్రం మహారాష్ట్ర ముంఖ్యమంత్రిగా దాదర్‌లో గల శివాజీపార్కులో ప్రమాణసీకారోత్సవానికి ఏర్పాటు జరుగుతున్నాయి. మహా కూటమిలో మంత్రి పదవుల పంపకంపై నిర్ణయం ఓకొలిక్కిచేరి శివసేన పార్టీ నుంచి సిఎంతో సహా 16మంది, ఎన్సీపీకి డిప్యూటీ సిఎంతో పాటు 14మందికి, కాంగ్రెస్‌ నుంచి స్పీకర్‌తో సహా 13మందికి మంత్రి పదవులు ఇచ్చేందుకు నిర్ణయించుకున్నారు. మహా సిఎం ఉద్దవ్‌ ఠాక్రే ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, బెంగళ్‌ సిఎం మమతా బెనర్జీ, డిల్లీ సిఎం అరవ

వైఎస్సార్ వాహనమిత్ర తో 2లక్షల 36వేల మందికి లబ్ది...

Image
• మొదటి విడతలో లక్షా 73వేల 102 మందికి లబ్ది • రెండవ విడతలో 62వేల 637 మంది వాహన దారులకు లబ్ది • ఈ పథకం కింద ఈఏడాది రూ. 236 కోట్లు ఖర్చు చేయనున్నాం అమరావతి (జనహృదయం) :  రాష్ట్రంలో వైఎస్సార్ వాహనమిత్ర పథకం ద్వారా ఈ ఏడాది రెండు విడతల్లో మొత్తం 2లక్షల 36వేల 343 మంది  వాహనదారులకు లబ్ది కలిగించడం జరుగుతోందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రవాణాశాఖా మాత్యులు పేర్ని వెంకట్రామయ్య(నాని) వెల్లడించారు. ఈ మేరకు బుధవారం అమరావతి సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన హామీమేరకు తెల్లరేషన్ కార్డు కలిగిన ఆటోలు, టాక్సీ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్స్ యజమాని కం డ్రైవర్లకు ఇన్సూరెన్స్, ఫిట్నెస్ మరియు వాహన మరమ్మత్తుల నిమిత్తం 10వేల రూ.లు వంతున ఆర్ధిక సహాయం అందించేందుకు ప్రవేశపెట్టిన తొలి సంక్షేమ పథకం వైఎస్సార్ వాహనమిత్ర పథకమని పేర్కొన్నారు. ఈ పథకం అమలుకై గత సెప్టెంబరులో జిఓ నంబరు 34,38ల ద్వారా విధివిధానాలను జారీ చేసి ఏలూరులో దీని అమలుకు శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. ఈ పథకం అమలుకు 400కోట్ల రూ.లను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేయగా మొదటి విడతలో లక్షా 73

సంక్షేమ పథకాలకు కేబినేట్ ఆమోదం...

Image
అమరావతి : రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) రాష్ర్ర మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. బుధవారం వెలగపూడి సచివాలయంలోని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి. విజయ్ కుమార్ రెడ్డితో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడుతూ మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు కేబినెట్ ఆమోదం , జగనన్న విద్యాదీవెన కింద 100 శాతం ఫీజు రీఎంబర్స్ మెంట్ అందించాలని కేబినెట్ నిర్ణయించింది.  సంతృప్తస్థాయిలో(సాచ్యురేషన్) జగనన్న విద్యాదీవెన పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది.  ఎస్సీ, ఎస్టీతో పాటు బీసీ, కాపు, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగులకు ఈ పథకం వర్తింపజేయాలని,   బీటెక్, బీ ఫార్మసీ, ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎంబీఏ,ఎంసీఏ, బీఈడీ లాంటి కోర్సులకూ పూర్తిస్థాయి ఫీజురీయింబర్స్ మెంట్ జగనన్న వసతి దీవెన కింద ఏడాదికి భోజన, వసతి కోసం ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది.  ఐటీఐ చదువుకుంటున్న వారికి ఏడాదికి రూ.10 వేలు, పాలిటెక్నిక్ చదువుతున్న వారికి ఏడాదికి రూ.15 వేలు, డిగ్రీ ఆ పై చదువుతున్న వారికి ఏడాదికి రూ.20 వేలు ఇ

పిఎసేల్వి సి 47 ప్రయోగం సక్సెస్....

Image
శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్‌వీ సీ 47 ప్రయోగం విజయ వంతమైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగాన్ని ఉదయం 9.28 గంటలకు చేపట్టారు. అనంతరం వివిధ దశల్లో 26.50 నిమిషాల వ్యవధిలో 14 - ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో ఇది ప్రవేశపెట్టింది. నిర్దేశిత కక్ష్యలోకి ఒక్కొక్కటిగా ఉపగ్రహాలు చేరాయి. పీఎస్ఎల్‌వీ సంకేతాలను అంటార్కి టకలోని ఇస్రో కేంద్రం అందుకుంది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్సీ47 ప్రయోగానికి మంగళ వారం ఉదయం 7.28 గంటలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ ప్రక్రియ 26 గంటల పాటు సాగింది.  ఈ ప్రయోగం ద్వారా కార్టోశాట్-3తో పాటు అమెరికాకు చెందిన 13 నానో పాటు అమెరికాకు చెందిన 13 నానో ఉపగ్రహాలను నింగిలోకి పంపారు.. మూడోతరం హైరిజల్యూషన్ ఎర్త్ ఇమేజింగ్ ఉపగ్రహం కార్టోశాట్-3. దీని జీవిత కాలం ఐదేళ్లని,  దీని బరువు సుమారు 1625 కిలోలు. పట్టణాభివృద్ధి ప్రణాళిక, గ్రామీణ వనరులకు సంబంధించిన సేవలను ఇది అందించనుంది. ఉగ్రవాద శిబిరాలను కార్టోశాట్-3 మరింత స్పష్టంగా తీయనుంది. ఈ  ప్రయోగం విజయంతమైన అనంతరం ఇస్రో ఛైర్మన్ శివ

రాజీభవన్ లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

  అమరావతి (జనహృదయం): భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి నేటికి 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జ్యోతి ప్రజ్వలన చేసి రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్ని నీలం సాహ్ని, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ విశ్వభూషన్ , మంత్రులు అబేద్కర్ చిత్ర పటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గవర్నర్ గవర్నర్ భిశ్వభూషన్ హరిచందన్ మాట్లాడుతూ.. రాజ్యాంగం అందరికి సమాన హక్కులు కల్పించిందని తెలిపారు. చట్టం ముందు అందరూ సమానమే అన్నారు. దేశ సమగ్రత దెబ్బతీసే విధమైన చర్యలను ఉపేక్షించకూడదన్నారు. హక్కులకు భంగం కలిగితే ఎవరైనా కోర్టుకు వెల్గొచ్చునని సూచించారు. 'న్యాయ వ్యవస్థ, రాజ్యాంగ దినోత్సవ పాలనా వ్యవస్థలు ప్రజలకు రక్షణా ఉంటాయి. సమస్యలు ఎన్ని ఉన్నా.. పౌరులు తమ హక్కులను పరిరక్షించడమే కాకుండా వారి బాధ్యతలను నిర్వర్తించాలి. స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ చేసి అహింసా పోరాటాన్ని ఆదర్శంగా తీసుకోవాలి' అని గవర్నర్

కోట్ల మంది కలిసి ఉండడానికి కారణం అదే : మోడీ

Image
కోట్ల మంది కలిసి ఉండడానికి కారణం అదే : మోడీ న్యూఢిల్లీ : దేశంలోని 130 కోట్ల మంది కలిసి మెలిసి ఉండడానికి రాజ్యాంగమే కారణమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మంగళవారం 70వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన పార్లమెంటు ఉభయ సభల సమావేశంలో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను కొనియాడారు. రాజ్యాంగం మనకు వెలుగునిచ్చే దీపిక, ఎందరో వీరుల త్యాగానికి ప్రతీక అని చెప్పారు. రాజ్యాంగం ప్రమాదంలో పడినప్పుడు ప్రజలే రక్షించారని, ఇక ముందు కూడా రక్షించుకుంటారని వ్యాఖ్యానించారు. సేవాభావం కన్నా కర్తవ్యం గొప్పదని ప్రబోధించారు. 70 ఏళ్ల క్రితం సమావేశంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి రాజ్యాంగ నిర్మాణంలో ప్రత్యక్ష, పరోక్ష పాత్రధారులకు పేరు పేరునా వెంకయ్యనాయుడు, ప్రభుత్వ పెద్దలు పాల్గొన్నారు. కాగా, మహారాష్ట్రలో ధన్యవాదాలు తెలియజేశారు. బీజేపీ వైఖరికి నిరసనగా కాంగ్రెస్, శివసేన పార్టీలు ఈ సమావేశాన్ని మరోవైపు ఇదే రోజు ముంబైలో ఉగ్రదాడులు జరగడం బహిష్కరించాయి. పార్లమెంట్ వెలుపల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా బాధాకరమని, మృతులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ గాంధీ రాజ్యాంగాన్ని చ

మహాకూటమిదే అంతిమవిజయం..

మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశానికి గవర్నర్ ఆదేశం ముంబై: మహారాష్ట్రలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీఎం ఫడ్నవిస్ రాజీనామా అనంతరం.. అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆదేశించారు. రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ అనిశ్చితి, సుప్రీంకోర్టు తీర్పును దృష్టిలో ఉంచుకుని బుధవారం ఉదయం 8 గంటలకు అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గవర్నర్ ఆదేశాల మేరకు బుధవారమే ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు బలపరీక్షను నిర్వహించనున్నారు. మరోవైపు అసెంబ్లీ బలపరీక్ష చేపట్టేందుకు గవర్నర్ చకచక ఏర్పాట్లు చేస్తున్నారు. అసెంబ్లీ ప్రొటెం స్వీకర్ గా బీజేపీ ఎమ్మెల్యే, సీనియర్ శాసనసభ్యుడు కాళిదాస్ కోలంబకర్‌ను నియమించారు.  దేవేంద్ర ఫడ్నవీస్ సారథ్యంలోని సభలో సీనియర్ సభ్యుడైన ఎమ్మెల్యేను ప్రొటెం స్వీకర్ గా ఎన్నుకోవాలి  బీజేపీ ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఐదు గంటల వరకు  ఉంటుంది.   ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన నేతృత్వలోని సభ్యులచే ఆయన ప్రమాణ స్వీకారం చేయించి, బలపరీక్షను ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి సిద్ధమయింది. కూటమి నేతగా ఉద్ధవ్ ఠాక్రేను  ఎన్నుకునేందుకు మూడు పార్టీల నేతలంతా స

కొత్తపల్లి జలపాతం లో పర్యాటకుల సందడి

  జి మాడుగుల (జనహృదయం) : విశాఖ జిల్లాలోని జి మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతం నిత్యం ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులతో కళకళ లాడుతోంది. కార్తీకమాసం చివరి వారం కావడంతో ముడురోజులు శని.అది సోమవారం లలో సుమారు 20వేలమంది వరకు పర్యాటకులు  ఈ జలపాతాన్ని సందర్శించారు. ఆంధ్ర ఒడిశా తెలంగాణ రాష్ట్రలతో పాటు ఇతరప్రాంతాలనుంచి పర్యాటకులు వచ్చి ఇక్కడ సందడి చేశారు. చాలామంది బస్సులు కారులు జీవులు వ్యాన్లు . ద్వి చక్ర వాహనాలు మీద వచ్చి వంటలుచేసుకొని కార్తీకవనబోజనాలు చేసి చెట్లకింద బసచేసిఉల్లాసంగా గడిపారు. జలపాతంలో నీళ్లు చలి తో వణికిస్తున్నప్పటికి   చలిని ఖాతరు చేయకుండ చిన్నపిల్లలు పెద్దలు అనే భేదాలు లేకుండా ఉల్లాసంగా జలకాలాడారు.  జలపాతం అందాలు చూడచక్కగా ఉన్న కనీస సదుపాయాలు మరుగుదొడ్లు. బట్టలు మార్చుకోవడానికి గదులు లేక ఇబ్బందులు పడుతున్నారు. దూరప్రాంతాలనుంచి వచ్చిన పర్యాటకులకు ఆహార పదార్థాలు దొరక్క ఇబ్బందులు పడ్డారు . భారీస్థాయిలో పర్యాటకులు వస్తున్నారు కావున ప్రభుత్వం చొరవచూపించి కొత్తపల్లి జలపాతంలో సౌక్యరాలు కల్పించి పర్యాటకులకు ఇబ్బందులు లేకుండా  చూడాలని పర్యాటకులుకోరుతున్నారు.

అన్యమత ప్రచార బోర్డులతో రావద్దు...

  సింహాచలం (జన హృదయం) :  సింహగిరిపై భక్తులను తరలిస్తున్న సింహాచలం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుల పై అన్యమత ప్రచారాన్ని సంబంధించిన స్టిక్కర్లు ఉండడాన్ని దేవస్థానం ట్రాన్స్ పోర్ట్ సూపరింటెండెంట్ ముద్దాడ వెంకట రమణ గమనించి ఆ బస్సులను నిలిపివేశారు బస్సు డ్రైవర్ కండక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.  అన్యమత ప్రచారం బోర్డులు కలిగిన సిటీ బస్సులను సింహగిరిపై నడపడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలియ చేశారు ఈ విషయాన్ని వెంకటరమణ ఆలయ ఈవో వెంకటేశ్వరరావు కు తెలియజేశారు బస్సులో ఉన్న ప్రయాణికులు దించి వేసి ఆ బస్సులను ఖాళీగా దిగువకు వెంకటరమణ పంపించివేశారు సింహగిరిపై వచ్చే బస్సులపై హిందూ మత ప్రచారం తప్ప అన్యమత ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని అటువంటి బస్సు తీసుకురావద్దని ఆర్టీసీ ఉద్యోగులకు వెంకటరమణ హెచ్చరించారు. ఈ సంఘటనపై సింహాచలం డిపో మేనేజర్ స్పందిస్తూ  అన్యమత ప్రచారం చేస్తున్న బోర్డులు ఉన్న బస్సుల ను కొండమీదకు పంపకుండా తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు

తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టలు తేవాలి.... మంత్రి వనిత

  రాజమహేంద్రవరం (జనహృదయం):  తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టలు తెచ్చేందుకు కృషి చేయాలని శిశు సంక్షేమ శాఖామంత్రి తానేటి వనిత పిలుపునిచ్చారు.  జూనియర్ కాలేజీలో జరిగిన  46 వ వార్షికోత్సవానికి హాజరయిన సంధర్భంగా మాట్లాడుతూ    పిల్లలు అందరూ తల్లిదండ్రులను గౌరవించాలని ప్రతి ఒక్కరితో మర్యాదగా ఉంటూ బాగా చదువుకుంటూ తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టలు పెంచాలన్నారు.  ఇంటర్ చదివే విద్యార్థులు ఈ వయసులో చాలా జాగ్రత్తగా ఉండాలని టీనేజ్  ఆలోచనాలలోనే మీ యొక్క జీవితం ఆధారపడి ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ ఎక్కువ వాడుతూ సమయాన్ని వృధా చేస్తున్నారు,ఈ సైబర్ ప్రపంచం లో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఇంటర్నెట్ తో జాగ్రత్త పాటించాలన్నారు.  ఏ ఆటంకం వచ్చిన,సమస్య వచ్చినా మహిళ మిత్ర మరియు సఖి వన్ స్టాప్ సెంటర్ ని ఉపయోగించుకోవాలని కోరారు.  ఇబ్బందులు ఎదురైతే తానెప్పుడూ అందుబాటులో ఉంటానని, ఎవరైనా ఎప్పుడైనా కలవచ్చని సూచించారు.  ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు ,ఆకుల వీర్రాజు ,జక్కంపూడి విజయలక్ష్మి ,షర్మిల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జాతీయ పోటీలకు ఎంపికైన వైద్యుడు

గాజువాక (జనహృదయం):  జిల్లాస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ పోటీల్లో గాజువాక కు చెందిన సీనియర్ ఫిజియోథెరపిస్ట్ ఆర్ బి కె చక్రవర్తి వెండి పతకం సాధించారు. ఈనెల 23 24 తేదీల్లో విజయనగరంలో జరిగిన జిల్లాస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2019 పోటీల్లో 800 మీటర్లు పరుగు 5 కిలోమీటర్లు బ్రిస్మ్ వాక్ కేటగిరీల్లో చక్రవర్తి వెండి పతకాలు సాధించారు. అంతేకాకుండా ఆయన జాతీయ పోటీకి ఎంపికయ్యారు. వైద్య సేవలు చేయడమే కాకుండా ఫిట్నెస్ గురించి అనేక అవగాహన సదస్సులు నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచిన చక్రవర్తిని ఈ సందర్భంగా పలువురు వైద్యులు శ్రేయోభిలాషులు సన్మానించారు.

అంతర్ రాష్ట్ర రహదారి దిగ్బంధం...

Image
గూడెంకొత్త‌వీధి  (జన హృదయం) :  సీలేరు విశాఖ జిల్లా ఆర్‌వీనగర్‌ నుంచి తూర్పుగోదావరి జిల్లా పాలగెడ్డ వరకు ఉన్న శిథిలావస్థితిలో ఉన్న అంతర్‌రాష్ట్ర రహదారి పై అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా గూడెంకొత్తవీధి మండల బంద్‌ విజయవంతంగా  జరిగింది. బంద్‌ వల్ల అంతర్‌రాష్ట్ర రాకపోకలునిలిచిపోయాయి. అఖిలపక్షనాయకుల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు హజరయ్యారు. అటు మండల కేంద్రం వద్ద , ఇటు సీలేరు వద్ద నున్న అంతర్‌ రాష్ట్ర కూడలిలో అఖిలపక్ష నాయకులు వంటావార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారిపై వంటావార్పు చేసి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించగా, ధారకొండ, సప్పర్ల వద్ద కూడా ఆందోళనకారులు రహదారికి అడ్డంగా వాహనాలుపెట్టి, రాళ్లు పెట్టి రాకపోకలకు ఆటకం కల్పించారు. ఈ రహదారిపై కనికరించండంటూ ఎన్ని సార్లు అధికారులను కలిసి మొరపెట్టకున్నప్పటికీ అధికారుల్లో చలనం లేకపోవడంతో మండలంలో బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మండలంలో వ్యాపారసంస్థలన్నీ మూతబడ్డాయి. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, జెన్‌కో కార్యాలయాలు మూతబడ్డాయి. మరో వైపు ఆంధ్రా-ఒడిశా రహదారిని దిగ్భందనం చేసి రాకపోకలు నిలిపివేశారు. రహదారిపై వంటావార్పు చ

మహారాష్ట్రలో తమకే బలం ... శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ

Image
162 మంది ఎమ్మెల్యేలు తమతోనే... మంగళవారం ఉదయానికి వాయిదా పడ్డ సుప్రీం తీర్పు... ముంబాయి (జనహృదయం) : మహారాష్ట్ర అధికారం పీఠం దక్కించుకునేందుకు ఎవరి వ్యూహాలతో వారు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్‌ తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు బలపరీక్షకు సిద్దమౌతుండగా, రాజ్యాంగ విరుద్దంగా ఏర్పడ్డ పడ్నవీస్‌ ప్రభుత్వాన్ని వెంటనే బలపరీక్షకు ఆదేశించి వారు విఫలమైతే తమను ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాల్సిందిగా తమతో 162 మంది ఎమ్మేల్యేల మద్దతు తమకే ఉందని శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ పార్టీలు గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించింది. అత్యంత ఉత్కంఠ భరితంగా ఏర్పడ్డ మహా ప్రభుత్వ ఏర్పాటు, పదవీ ప్రమాణం చేసిన పడ్నవీస్‌ ప్రభుత్వం విశ్వాసపరీక్ష నెగ్గుకొస్తుందా? అనే విషయాలు ఏక్షణం ఏ మలుపు తిరుగుతాయోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సుప్రీం కోర్టులో ఈమేరకు ఇరువర్గాల వాదనలు విన్న తరువాత తీర్పును మంగళవారం ఉదయానికి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే తమవద్ద 162 మంది ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారంటూ ముంబైలో గ్రాండ్‌ హయత్‌ హోటల్‌లో పరేడ్‌ నిర్వహించాయి. ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకే తమ ప్రయత్నం అంటూ ప్రజా స్వామ్య

స్పందనకు 927 దరఖాస్తులు.. విశాఖలో

Image
విశాఖపట్నం (జనహృదయం) : విశాఖ  కలెక్టరేట్లో  సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 927 అర్జీలు వచ్చాయి.  జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వచ్చి తమ పిర్యాదులను సమర్పించారు. ఈ కార్యక్రమంలో  సంయుక్త కలెక్టర్ ఎల్ శివ శంకర్, జెసి 2 ఎన్ వి సూర్యకళ, జిల్లా రెవెన్యూ అధికారి ఎం శ్రీదేవి ఆర్ డి ఓ కె.పెంచల కిషోర్, ప్రత్యేక ఉప కలెక్టర్లు శ్రీనివాస మూర్తి రంగయ్య దరఖాస్తులు స్వీకరించారు.

డిసెంబర్ లో విశాఖ ఉత్సవ్ ....

Image
విశాఖపట్నం (జనహృదయం) :  డిసెంబర్ 28, 29 తేదీలలో విశాఖ ఉత్సవ్ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు తెలిపారు.  ఈ మేరకు  స్థానిక సర్క్యూట్ హౌస్ లో ఆయన విశాఖ ఉత్సవ్ పోస్టర్ ను విడుదల చేశారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఉత్సవ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు.  విశాఖ నగరానికి, జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని, భారతదేశానికి ముంబై నగరం ఎలాగో, ఆంధ్ర ప్రదేశ్ కు వైజాగ్ అలాంటిదని ఆయన తెలిపారు.  విశాఖ ఉత్సవ్ ను ప్రతిరోజు లక్షమంది పర్యాటకులు సందర్శించే లా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.  విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ పెంచేలా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.భీమిలి ఉత్సవాన్ని ప్రతిరోజు దాదాపు 30 వేల మంది సందర్శించారని తెలిపారు.  ఉత్సవానికి ప్రధాన వేదికగా ఆర్కే బీచ్ ఉంటుందని తెలిపారు.సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం ఆర్కే బీచ్ లో ప్రధాన వేదిక, నోవాటెల్ హోటల్ ఎదురుగా జాతర వేదికను, స్థానిక కళాకారుల కోసం ప్రత్యేకంగా వైయస్సార్ సిటీ సెంట్రల్ పార్క్ లో మరొక వేదికను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.  స్థానికుల మనోభావాలు గౌరవించే

జీఓ 142 సవరించి అక్రిడేషన్లు ఇవ్వాలి ...

Image
విశాఖపట్నం  : జర్నలిస్టుల అక్రిడేషన్ ల జీవో నెంబర్ 142 న సవరించి అర్హత కల్గిన జర్నలిస్టుల అందరికీ అక్రిడేషన్ లు జారీ చేయాలని కోరుతూ లోకల్ న్యూస్ పేపర్ అసోసియేషన ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కి పంపించే నిమిత్తం సోమవారం స్పందన కార్యక్రమం లో జాయింట్ కలెక్టర్ శివ శంకర్ కువినతి పత్రాన్ని అందజేశారు. ఈ జీవో వల్ల జర్నలిస్టులు వారి హక్కులను కోల్పోతున్నారని, స్థానిక పత్రికలు మూతపడే అవకాశం ఉందని ఆయనకు తెలిపారు . జీవోలో జిఎస్టి నిబంధనను రద్దు చేయాలని, స్థానిక దినపత్రికలకు తగిన అక్రిడేషన్లలు జారీ చేయాలని , ఎంపానెల్ మెంట్ లేని దినపత్రికలకు అక్రిడేషన్ లు ఇవ్వాలని, పిరియాడికల్స్ కు , పేజీలు తగ్గించాలని తది తర డిమాండ్లతో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మీరు అందజేసిన పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ తెలిపారు .స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కు కలిసిన వారిలో లోకల్ న్యూస్ పేపర్ అసోసియేషన్ అధ్యక్షులు సత్యనారాయణ కార్యదర్శ ధవలేశ్వరపు రవికుమార్ బి.శివ ప్రసాద్, అబ్బాస్,ఎస్. సన్యాసిరావు , వెంకట వేణు చక్రి ,మెట్ట కృష్ణారావు, పరశురాం, దుంపల ప్రస

ప్రమాదానికి గురైన యువతికి అండగా...

Image
బాధితురాలికి ఉద్యోగం కల్పిస్తామని హామీ 26 న కేర్‌ ఆస్పత్రిలో బాధితురాలికి ఆపరేషన్‌ అనంతపురం  :  రోడ్డు ప్రమాదంలో గాయపడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ యువతికి అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి అండగా నిలిచారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో మాట్లాడి తక్షణం యువతికి వైద్య చికిత్స జరిగేలా చొరవ తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురంలోని ఆజాద్‌నగర్‌లో నివాసముంటున్న పి.అబ్దుల్‌ అజీం (పెయింటర్‌), పి.షాహిదా దంపతుల కుమార్తె పి.ఖతిజతుల్‌ కుబ్రా బి.టెక్‌ పూర్తి చేసింది. ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు చేరుకుని కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. గత శనివారం ఓ ఇంటర్వ్యూకు హాజరవగా ఉద్యోగానికి ఎంపికైంది. ఈ సంతోషకమైన విషయాన్ని అనంతపురంలో ఉన్న తన తండ్రికి సెల్‌ఫోన్‌లో చెబుతున్న సమయంలో బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వెంటనే కుటుంబ సభ్యులకు హైదరాబాద్‌ చేరుకున్నారు. గచ్చిబౌలిలోని కేర్‌ ఆస్పత్రిలో కుబ్రా చికిత్స కోసం రూ.లక్షకు పైగా ఖర్చు అయ్యింది. అయితే కుబ్రా వెన్నెముక తీవ్రంగా దెబ్బతినడంతో ఆపరేషన్‌ చేయాలని వైద్యులు సూచించారు. ఇందుకోసం సుమారు రూ.6 లక్షల వరకు ఖర్చవుతుందని త

అవినీతి నిర్ములనకోసం టోల్ఫ్రీ నెంబర్ 14400...

Image
తాడేపల్లి (జనహృదయం) : రాష్ట్రంలో అవినీతి నిర్మూలించేందుకు ప్రజలను సమాయత్తం చేసేందుకు ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నెంబరు ఏర్పాటు చేశారు. దీనిలో బాగంగా సోమవారం ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి తన క్యాంప్‌ కార్యాలయంలో 14400 నెంబరును ప్రారంభించారు. అనంతరం సిఎం నేరుగా కాల్‌ సెంటర్‌ కు ఫోన్‌ చేసి దిశా నిర్దేేశం చేశారు. ఎలాంటి ఫిర్యాదునైనా 15 రోజులు నుంచి నెల రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పట్టణాభివ ద్ధి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ, డిజిపి గౌతం సవాంగ్‌, ఏసిబి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

నిర్వాసితుల గోడు పట్టదా...

  ఎటపాక (జనహృదయం): పోలవవరం నిర్మాసితుల గోడు పట్టించుకోవాలంటూ ఆంధోళన వ్యక్తం అవుతోంది. విలీన మండలాలకు చెందిన పోలవరం నిర్వాసితులు ఆదివారం మండల పరిధిలోని తోటపల్లి గ్రామం లో ఈ మేరకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా నిర్వాసితులు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదికిన నిర్మిస్తున్నారే తప్ప విలీన మండలాలైన ఎటపాక, కూనవరం, విఆర్‌ పురం, చింతూరు మండలాల నిర్వాసిత ప్రజల గోడు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. నిర్వాసితుల సమాధుల పై పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నారని ప్రభుత్వాలు విష్మరించకూడదని గుర్తు చేశారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే విలీన మండలాలు జల సమాధి అవుతుందని అన్నారు. విలీన మండలాల నిర్వాసితులందరికి 2013 చట్ట ప్రకారం ప్యాకేజి, పునరావాసం కల్పించిన తర్వాతే ప్రాజెక్టు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.వైకాపా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా 2006 లో భూ పరిహారం తీసుకున్న నిర్వాసిత రైతులందరికీ ఎకరాకు రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో దొంతు మంగేశ్వరవు,కందుకూరి మంగరాజు, బొల్లా నర్సింహారావు, దుద్దుకురి హరినాధ్‌, పుసం రాఘ

ఘనంగా కార్తీక సమారాధన... తూ . గో . జిల్లాలో

Image
కాకినాడ (జనహృదయం) : తూర్పుగోదావరి జిల్లా నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం వైభవంగా జరిగింది. ధన్వంతరి పూజ తో కార్యక్రమాన్ని మొదలు పెట్టిన ఈ కార్యక్రమానికి తూ.గో. జిల్లా నాయీబ్రాహ్మణ సంఘం ప్రధానకార్యదర్శి  సుందరపల్లి గోపాలక ష్ణ అధ్యక్షతన వహించగా ముఖ్య అతిథులుగా కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీతా విశ్వనాధ్‌ మున్సిపల్‌ నగర మేయర్‌ సుంకర పావని తిరుమల కుమార్‌ తుమ్మిడి రామ్‌ కుమార్‌ 93 బీసీ కులాల రాష్ట్ర అధ్యక్షులు మాకిరేడ్డి భాస్కర్‌ గణేష్‌ బాబు తూర్పుగోదావరి జిల్లా యాదవ మహాసభ అధ్యక్షులు కుండల సాయి కుమార్‌ యాదవ్‌ తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు వెంకటేశ్వర జనసేన పార్టీ నాయకులు జ్యోతుల వెంకటేశ్వరరావు హాజరైనారు. ఈసందర్భంగా వక్తలు మాట్లాడుతూ సభ్యులంతా ఐకమత్యంతో మెలిగి సంఘ అభివృద్దికి తోడ్పాటు అందించుకోవాలని, సమిష్టిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏర్పాటు చేసిన చిరంజీవి మహాలక్ష్మి తణుకు వారి భరతనాట్యం ఆహూతు లందరినీ ఉర్రూతలూగించింది. కాకినాడ ఎంపి వంగా గీతా విశ్వనాధ్‌ చిరంజీవి మహాలక్ష్మి ని ఇంటర్మీడియట్‌ విద్య చదివిస్తానని హామీ ఇచ్చారు

సుప్రీం కు చేరిన మహా వివాదం .... రేపటికి వాయిదా..

Image
రాజ్యాంగ విరుద్దంగా ప్రభుత్వ ఏర్పాటు జరింగందంటూ కోర్టును ఆశ్రయించిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రేస్‌ మహా విదాదం పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం.. రేపు ఉదయం 10.30గంటల లోపు గవర్నర్‌ ఆహ్వానపత్రం, ఎమ్మెల్యేల మద్దతు లేఖలు సమర్పించాలి... సుప్రీం మహారాష్ట్ర సిఎం, డిప్యూటీ సిఎం తోపాటు కేంద్రానికి సుప్రీం నోటీసులు... గవర్నర్‌ వ్యవహరించిన తీరు రాజ్యాంగ విరుద్దమా?... ఆదివారం పడ్నవీస్‌సాడే బలపరీక్షకు ఆదేశించాలని కోర్టును కోరిన న్యావయాది కపిల్‌సిబాల్‌... డిల్లీ : మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటులో గవర్నర్‌ వ్యవహరించిన తీరు రాజ్యాంగ విరుద్దంగా ఉందని అత్యున్నత న్యాయస్థానాన్ని శివసేన ఆశ్రయించింది.  శనివారం ఉదయం మహారాష్ట్రలో బిజేపి అభ్యర్ది దేవేంద్ర పడ్నవీస్‌ ముఖ్యమంత్రిగా ప్రయాణ స్వీకారం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేన కూటమి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ ఏర్పాటులో రాత్రికి రాత్రే ఊహించని పరిణామాలు ఉత్పన్నమై శనివారం ఉదయానికి రాష్ట్రపతి పాలన ఎత్తివేయడం, దేవేంద్ర పడ్నాయక్‌ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేయడంతో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమైన పార్టీలకు ఊహించని షాక్‌ తగిల

విశ్వసనీయతే బలం, దానికి భంగం కలుగకుండా పాలన సాగాలి.. సిం జగన్

Image
అమరావతి (జనహృదయం):  విశ్వసనీయతే బలమని, దానికి భంగం కలుగకుండా పాలనసాగాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారులకు దిశా నిర్దేశం చేసారు. నవరత్నాలే ప్రభుత్వ ప్రాధాన్యతగా అభివ ద్ధి కార్యక్రమాలు అమలు చేయాలనిసూచించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో సీఎం వైయస్‌.జగన్‌ సమావేశమయ్యారు. ఈసందర్భంగా సిఎం మాట్లాడుతూ పథకాల అమలుతీరు సంతృప్తి కలింగించే విదంగా ఉండాలన్నారు. అనవసర వ్యయం లేకుండా, సామాన్యులపై భారం మోపకుండా ఆదాయాలు పెంచే మార్గాలపైనా ద ష్టి సారించాలని కోరారు. రాష్ట్రంలో జనవరి లేదా ఫిబ్రవరిలో రచ్చబండ కార్యక్రమం ఉంటుందని దీనికి సిద్దమవ్వాలని, జిల్లాల పర్యటనలో ఇచ్చిన హామీలు అమలు కావాల్సిందే నని స్పష్టం చేశారు. శంకుస్థాపన చేస్తే నాలుగు వారాల్లోగా పనులు ప్రారంభం కావాలని, కేంద్రప్రభుత్వ ప్రాయోజిత పథకాల నుంచి వీలైనన్ని నిధులు తెచ్చుకోవాలని సమీక్షా సమావేశంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ మార్గదర్శక సూత్రాలు నిర్దేశించారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతోపాటు, జిల్లాల పర్యటనల సందర్భంగా చేసే వాగ్దానాలను క్షేత్రస్థాయిలో తప్పకుండా అమ

హత్య కేసులో మిస్టరీని చేదించిన పోలీస్...

చింతపల్లి (జనహృదయం):  హత్య కేసు మిస్టరీని ఛేదించి తమ సత్తా చాటుకున్నారు చింతపల్లి పోలీసులు. ఈనెల 9న లంబసింగి ఘాట్ లో జరిగిన హత్యలో ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ మేరకు చింతపల్లి సిఐ సన్యాసిరావు ఎస్ఐ పాపి నాయుడు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇద్దరు పాత నేరస్తులు దోచుకున్న సొమ్ము లో తేడాలు రావడంతో వారి మధ్య తలెత్తిన వివాదం హత్యకు దారితీసింది. ఎలమంచిలి మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన బొద్ధపు బాబురావు, చల్ల రామ్ మోహన్ రెడ్డి గత కొంతకాలంగా అనకాపల్లి, ఎలమంచిలి పరిసర ప్రాంతాల్లో పలు నేరాల్లో పాల్గొన్నారు. దీని ద్వారా వచ్చిన సొమ్ము బాబురావు మోహన్ రెడ్డికి ఇచ్చేందుకు నిరాకరించడంతో మోహన్ రావు తన చిన్నాన్న అయిన రాఘవేంద్రరావు సహాయంతో బాబురావును హత్య చేసేందుకు పథకం రూపొందించారు. దీంతో ఈనెల 9న నర్సీపట్నానికి చెందిన మరో నలుగురు యువకులతో కలిసి కసింకోట సమీపంలో ఉన్న బాబు రావుని పట్టుకొని చావబాదారు. అపస్మారక స్థితికి చేరుకున్న బాబురావును నర్సీపట్నం నుండి తమతో తీసుకు వెళ్లిన అద్దె కారు లో వేసి లంబసింగి ఘాట్ కి ప్రయాణమయ్యారు. నర్సీపట్నంలో నలుగురు యువకులు దిగి పోగా రాఘవేంద్ర రావు మరియు రాహు రామ్మోహ

అందరికీ అందుబాటులో ఇసుక ...

Image
భీమిలి (జనహృదయం):  పూర్తి స్థాయిలో  ఇసుక సరఫరా కోసం చర్యలు చేపదుతున్నామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. భీమునిపట్నం , కృష్ణా కాలనీ సమీపంలో శుక్రవారం ఇసుకర్యాంప్ ప్రారంభించిన అనతరం  మాట్లాడుతూ ఇది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని అన్నారు. విశాఖ జిల్లాలో ఇప్పటికే 8 ర్యాంప్ లు ప్రారంభించామన్నారు. నర్సీపట్నం , నక్కపల్లి, అనకాపల్లి, అగనంపూడి, చోడవరం, ముడసర్ర్లోవ , అచ్యుతాపురం, భీమిలీలో ఏర్పాటు చేసి అందరికి పూర్తి స్థాయిలో ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఇసుకను ఎవరైనా అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రతి ఇసుక ర్యాంప్ దగ్గర ఇసుక ధరను తెలిపే బోర్డులను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జె.సి ఎల్.శివశంకర్ మాట్లాడుతూ భీమిలిలో ప్రారంభించిన ఈ ఇసుక ర్యాంప్ లో ఉన్న ఇసుకను సరఫరా చేయడానికి ఒక టీమ్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని వారి ద్వారా ఎటువంటి అవకతవకలు లేకుండా అందరికీ ఇసుకను సరఫరా చేస్తామని అన్నారు. అలాగే ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ .కిషోర్, భీమిలీ తహసీల్దార్ వెంకట

ఏజెన్సీ లో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్...

Image
సబ్ కలెక్టర్ డాక్టర్. వెంకటేశ్వర్ .. పాడేరు (జనహృదయం):  ఏజెన్సీ లో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియ చేపడతామని సబ్ కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ స్పష్టం చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో పోలింగ్ కేంద్రాల పై సమావేశం నిర్వహించారు. రాజకీయ నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోని పోలింగ్ కేంద్ర విభజన ప్రక్రియ చేపడతామన్నారు. కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, చనిపోయిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని రాజకీయ నాయకులు సూచించారు. ఒక పోలింగ్ కేంద్రం పరిధిలో 1200 ఓట్లు కంటే ఎక్కువ ఉంటే మరొక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామని సబ్ కలెక్టర్ చెప్పారు. చనిపోయిన వారి పేర్లు తొలగించడానికి చర్యలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి మణికుమారి ,బొర్రా నాగరాజు, ఆడపా బజ్జు నాయుడు ,కురుస ఉమామహేశ్వరరావు, భగత్ రాం, మోరి రవి , ధనలక్ష్మి, గంజాయి ధనలక్ష్మి ,తులసి రావు ,తదితరులు పాల్గొన్నారు.

చింతపల్లి తాసిల్దార్ పై ఆదివాసీల ధ్వజం

Image

యువత అన్ని రంగాల్లోని ముందుండాలి పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పిలుపు

Image

యువత అన్ని రంగాల్లోని ముందుండాలి పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పిలుపు

Image

సానుకూలంగా స్పందించిన సమాచారశాఖ మంత్రి పేర్ని..

గన్నవరం (జనహృదయం) : చిన్న పత్రికలకు అక్రిడిటేషన్లు మంజూరులో జిఎస్టి లైసెన్స్ మినహాయింపు ఇవ్వాలని కోరుతూ స్టేట్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ (సామ్నా) శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య( నాని)ని కలిసింది. అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ రమణారెడ్డి, విజయవాడ ప్రెసిడెంట్ ఎం వి సుబ్బారావు, జనజ్వాల పత్రిక బ్యూరో డి.శ్రీనివాస్ లు తాడేపల్లి లోని వైయస్సార్ పార్టీ కార్యాలయంలో మంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించారు. అక్రిడిటేషన్లు మంజూరుకు ఎంపానెల్ మెంట్ తో సంబంధం లేకుండా అర్హత కలిగిన చిన్న పత్రికల జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని, జీవో లోని షెడ్యూలు-ఎ లో పేర్కొన్న పత్రికల సైజులు, పేజీల అంశాన్ని చిన్న పత్రికల విషయంలో మినహాయింపు ఇస్తూ పాత విధానాన్ని కొనసాగించాలని కూడా మంత్రిని కోరడం జరిగింది. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ చిన్న పత్రికలకు అక్రిడిటేషన్లు విషయంలో జిఎస్టి మినహాయింపు అంశం పరిశీలిస్తామని, ఇంకా ఇతర అంశాలపై త్వరలో జర్నలిస్టులతో సమావేశమవుతామని చెప్పారు.

ప్రపంచంలో గుర్తింపుకు ఆంగ్లం అవసరం..

Image
రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ విశాఖపట్నం( జనహృదయం):   ఆంగ్ల మాధ్యమంతో ప్రపంచంలో గుర్తింపు సాధ్యమవుతుందిని   రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ అన్నారు.  గురువారం సర్క్యూట్ హౌస్ లో  మాట్లాడుతూ తమ కమిషన్ ఇప్పటి వరకు 14 వేల వినతులను స్వీకరించగా వాటిలో 12 వేలు పరిష్కరించామని తెలిపారు. ఎస్సీ ఎస్టీ అత్యాచారాలపై తక్షణం స్పందిస్తున్నా మని, బాధితులకు వేగంగా న్యాయం అందేలా చూస్తున్నట్లు చెప్పారు. కుల వివక్షతను కూకటివేళ్ళతో పెకలించి వేసేందుకు అన్ని చర్యలను చేపడుతున్నట్లు తెలిపారు. 13 జిల్లాలలో సమీక్షలు నిర్వహించామని ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన నిధుల ఖర్చును, వసతిగృహాల నివేదికలను పరిశీలించాము అన్నారు. ఎస్సీ ఎస్టీలకు కొన్ని గ్రామాలలో స్మశాన భూమి లేదని ప్రభుత్వం ఆయా గ్రామాలకు స్మశాన భూమిని కేటాయించ వలసిందిగా నివేదికలు పంపినట్లు తెలిపారు. ఎస్సీ ఎస్ టి లవారంతా వ్యవసాయ ప్రాధాన్యతగా జీవనం సాగిస్తున్న నందున ప్రభుత్వ రుణంతో భూములను కొనుగోలు చేసి ఇవ్వాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు చెందిన 14 లక్షల ఎకరాలు ప్రభుత్వం మంజూరు చేసిన భూములు ఉండేవని వాటిలో 9 లక్షల ఎకరాల భూముల

తమిళనాట కీలక ప్రకటన చేసిన తలైవా…

Image
చెన్నై : రానున్న ఎన్నికల్లో తమళనాడులో కీలక మార్పులు రానున్నాయని సినీ హీరో రజినీకాంత్‌ స్పష్టం చేశారు. తాను ఆ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తానంటూ రాజకీయ ప్రవేశం గూర్చి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు తలైవా… ఇప్పటివరకూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాని ఈ హీరీ ఎన్నికల్లోకి రావాలంటూ పెద్ద ఎత్తున తమిళప్రజలు కోరినప్పటికీ సమయం కోసం వేచి చూచిన రజినీకాంత్‌ చేసిన వ్యాఖ్యలు తమళ రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అందుకే తాను రానున్న ఎన్నికల్లో కీలకంగా నిలిచేందుకు నిర్ణయించానంటూ పేర్కొన్నారు.

గంగపుత్రుల బతుకుల్లో వెలుగులు … సి ఎం జనన్‌ వెల్లడి

Image
ముమ్మిడివరం (జనహృదయం) : మత్యకారులకు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో అట్టహాసంగా ప్రారంభించిన మత్యకారుల భరోసా కార్యక్రమంలో బాగంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసంకల్ప యాత్రలో మత్యకారులకు ఇచ్చి మాట నిలబెట్టుకుంటున్నానని గుర్తు చేశారు. మత్య కారుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మత్య కారుల జీవితాల్లో వెలుగులు నింపేదిశగా సంక్షేమ కార్యక్రమాలు రూపాందిచామని మత్యకార భరోసా ద్వారా వారికి సేవలు అందిస్తామన్నారు. మత్యకారులు సముద్రంలో వేటనిషేద సమయంలో కుటుంబానికి రూ.10 వేల వంతున ప్రభుత్వం చెల్లిస్తుందని, వేట సమయంలో మత్యకారులు ప్రమాదవసాత్తు మరణిస్తే రూ.10 లక్షలు అందిస్తామని అన్నారు. మత్యకారులకు డీజిల్‌పై రూ.9 రాయితీ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రపంచ మత్యకార దినోత్సవాన మత్యకాత భరోసా ప్రారంభం ఆనందంగా ఉందన్నారు. బడ్డెట్‌లో మత్యకారులకు రూ.551కోట్లు కేటాయించామన్నారు. గంగపుత్రులకు పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన అయిదు నెలల్లోనే నెరవేర్సున్నానని తానిచ్చిన హామీలన్నీ దశలవారీగా నెరవేరుస్తానని ఆ

ప్లాస్టిక్ రహిత సమాజానికి కృషి చేయాలి .. ఐటీడీఏ పి ఓ డీకే బాలాజీ ..

Image
పాడేరు (జనహృదయం) : ప్లాస్టిక్ రహిత సమాజానికి  మన్యంలో ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా  కృషిచేయాలని  పాడేరు  ఐ టి డి ప్రాజెక్ట్ అధికారి డి కె బాలాజీ ,ఫస్ట్ క్లాస్ జుడిషియల్ మేజిస్ట్రేట్ మరియు మండల లీగల్ సెల్ సర్వీసెస్ చైర్ పర్సన్ శ్రీమతి డాక్టర్ కె శారద ,సబ్ కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సలిజాముల పిలుపునిచ్చారు. సమాజంలో ప్లాస్టిక్ నిషేధానికి ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు .ప్లాస్టిక్ వ్యర్థాలు భూమి లో చేరి భూగర్భ జలాలు కాలుష్యం అవుతుందని అన్నారు .ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ కవర్లను, సంచులను వినియోగించకూడదని అన్నారు. వాటి వలన వ్యాధి వ్యాపిస్తుందని చెప్పారు .ప్లాస్టిక్ వినియోగం వలన పర్యావరణానికి హాని చేస్తుందన్నారు .పర్యావరణానకి ఏర్పాడే ముప్పు వలన సకల జీవరాశులకు తీవ్రమైన హాని జరుగుతుందన్నారు .ప్లాస్టిక్ వ్యర్ధాలను ఎక్కడబడితే అక్కడ వేయడం వలన పశువులు ,పక్షులు మృత్యువాత పడుతున్నారు. పట్టణంలో బహిరంగ ప్రదేశాల్లో రోడ్ల పక్కన వ్యర్థాలను వేయకూడదని అన్నారు. నిర్దేశించిన ప్రాంతంలోనూ చెత్త కుండీలలో మాత్రమే వేయాలని సూచించారు .పట్టణంలో విచ్చల విడిగా చెత్త వేయడం వలన అంటువ్యాధులు, మలేరియా ,డయేరియా వంటి వ్య

తెలంగాణా ఆర్టీసీ సమ్మెతో కార్మికులు ఏం సాధించారు? ప్రభుత్వ స్పందన ఎలా …

Image
హైదరాబాద్‌ : ఆర్టీసీ సమ్మెతో కార్మికులకు ఒరిగిందేమీలేకపోగా ఉద్యోగ భత్రకే ముప్పు వాటిల్లడంతో ప్రభుత్వ దయాదాక్షణ్యాలే పరమావదిగా ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొందా? అంటే అవుననే పరిస్థితి కనిపిస్తోందిని చెప్పకతప్పదు. తెలంగాణా వ్యాప్తంగా ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం లక్ష్యంగా 47రోజులపాటు కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. వీరికి అఖిలపక్షం అండగా నిలిచింది. అయినప్పటికీ సమ్మె లక్ష్యం మాటెలా ఉన్నా సమ్మెకు పూర్వం ఉన్న పరిస్థితిలోనైనా ఉద్యోగం కొనసాగింపుకోసం కార్మికులు డిపోలచుట్టూ తిరగడం విచారకరం. ఎటువంటి షరతులు లేకుండా ఉద్యోగంలో చేరతామంటూ కార్మికులు డిపోల చుట్టూ తిరుగుతున్నప్పటికీ అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. పైగా ప్రభుత్వం నుండి స్పష్టమైన ఆదేశాలు వచ్చేవరకు తాము ఎవరినీ విధేల్లోకి చేర్చుకునే వీలులేదంటూ తెగేసిచెప్పడంతో కార్మికులు నిరాశతో వెనుదిరగుతున్నారు. భవిష్యత్‌ కార్యక్రమం పై మల్లగుల్లాలు పడుతున్నారు. సమ్మె కాలంలో ప్రభుత్వానికి కార్మికులకు పలుదఫాలుగా జరిగిన చర్చలు విఫలం కావడం, ఇరువర్గాలు ఎవరి పంతం వారు నెగ్గించుకునే దిశగా పావులు కదుపుతూ కోర్టును ఆశ్రయించారు. అయినప్పటికీ కార్మికులు ఉద్దేశపూర్వ

పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్ ….

Image
విజయనగరం (జనహృదయం):  అసంపూర్తిగా నిలిచిపోయిన పూర్ణపాడు – లాబేసు వంతెన నిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది.  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి చొరవతో ఈ వంతెన నిర్మాణానికి సంబంధించిన ఈఓఏటి గడువును రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది జూన్ 30 వతేదీ వరకూ పొడగిస్తూ తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో ఇప్పట్లో పూర్తవదనుకున్న పూర్ణపాడు – లాబేసు వంతెన నిర్మాణం మరో ఏడు నెలల్లో పూర్తి చేసేందుకు అవకాశం ఏర్పడింది. కురుపాం అసెంబ్లీ నియోజకవర్గంలోని కొమరాడ మండలంలో మొత్తం 31 పంచాయితీలు ఉండగా వాటిలో 22 పంచాయితీలు నాగావళి నదికి ఒకవైపున ఉండగా, మరో 9 పంచాయతీలు నదికి మరోవైపున ఉన్నాయి. అయితే నాగావళి నదిపై వంతెన లేనికారణంగా 9 పంచాయతీలకు చెందిన ప్రజలు మండల కేంద్రమైన కొమరాడ కు రావాలన్నా, 22 పంచాయతీలకు చెందిన గ్రామస్తులు నియోజకవర్గకేంద్రమైన కురుపాం కు చేరుకోవాలన్నా చుట్టూతిరిగి రావాల్సి ఉంటుంది. పార్వతీపురం మీదుగా చుట్టుతిరిగి రావడానికి సుమారు అరవై కిలోమీటర్ల దాకా ప్రజలు ప్రయాణించాల్సివస్తోంది. ఈ నేపథ్యంలోనే గతంలో అయితే నాగావళి నదిపై పూర్ణపాడు-లాబేసు గ్రామాలమధ్యన వంతెన నిర్మాణాన్ని ప్రారంభించారు. మొదట నిర్

పాడేరు ఘాట్‌లో ట్రాక్టరుబోల్తా…

Image
పాడేరు (జనహృదయం) : పాడేరు ఘాట్‌లో ట్రాక్టరు బోల్తాపడి రాకపోకలు స్థంభించిపోయాయి. గురువారం సాయంత్రం పాడేరు నుండి మాడుగుల వైపు వెళుతున్న ఓ ట్రాక్టరు బోల్తాపడి రహదారికి అడ్డంగా పడడంతో పాడేరు – చోడవరం మద్య ఘాట్‌ రోడ్డులో రాకపోకలు కిలోమీటరు మేర గంటల తరబడి రాకపోకలు స్థంబించిపోయాయి. దీంతో వాహనాల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరో వాహన సహాయంతో బోల్తా పడిన ట్రాక్టరును ప్రక్కకు లాగించి రాకపోకలు పునరుద్దరించారు.

తమిళనాట కీలక ప్రకటన చేసిన తలైవా…

Image
చెన్నై : రానున్న ఎన్నికల్లో తమళనాడులో కీలక మార్పులు రానున్నాయని సినీ హీరో రజినీకాంత్‌ స్పష్టం చేశారు. తాను ఆ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తానంటూ రాజకీయ ప్రవేశం గూర్చి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు తలైవా… ఇప్పటివరకూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాని ఈ హీరీ ఎన్నికల్లోకి రావాలంటూ పెద్ద ఎత్తున తమిళప్రజలు కోరినప్పటికీ సమయం కోసం వేచి చూచిన రజినీకాంత్‌ చేసిన వ్యాఖ్యలు తమళ రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అందుకే తాను రానున్న ఎన్నికల్లో కీలకంగా నిలిచేందుకు నిర్ణయించానంటూ పేర్కొన్నారు.

అక్రిడేషన్‌ మంజూరులో షరతులు సడలించాలి..

విజయవాడ : చిన్న పత్రికలకు అక్రిడేషన్‌ మంజూరులో జిఎస్టీ, ఎంపానల్‌మెంట్‌ షరతులను సడలించాలని స్టేట్‌ స్మాల్‌ అండ్‌ మీడియం న్యూస్‌ పేపర్స్‌ అషోషియేషన్‌ (సామ్నా) డిమాండ్‌ చేసింది. ఈమేరకు నామ్నా అధ్యక్ష , కార్యదర్శులు నల్లి ధర్మారావు, సిహెచ్‌ రమణారెడ్డి సమాచార మాట్లాడుతూ అక్రిడేషన్ల మంజూరులో రెండు షరతులను సడలించి గతంలో మాదిరిగా ఇవ్వాలని కోరారు. జివోలోని షెడ్యూల్‌ ఎ లో పేర్కొన్న పత్రికల సైజులు, పేజీల అంశంలో చిన్నపత్రికలకు మినహాయింపు ఇస్తూ పాత విదానాన్ని కొనసాగించాలని కోరారు.

దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం .. మంత్రి వనిత

Image
విజయవాడ (జనహృదయం):   రాష్ట్రంలో దివ్యంగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని మహిళ మరియు శిశు దివ్యాంగుల వయోవృద్ద్దుల సంక్షేమ శాఖ మాత్యులు తానేటి వనిత పేర్కొన్నారు.  విజయవాడ లోగల బసవ పున్నయ్య కన్వెన్షన్ హాల్ లో డిసెంబర్ 3 న జరగనున్న  ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం లో బాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ రానున్న రోజుల్లో దివ్యాంగులకు మంచిరోజులు రానున్నాయని,. ప్రస్తుతం వాళ్లకు అందుతున్న పేంక్షన్ ను ఇంకా పెంచే విధంగా కృషి చేస్తానని చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన  అయిదు  నెలల్లోనే 4లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చాయని అందులో దివ్యంగుల 3 నుంచి 4 శాతం వరకు రిజర్వేషన్లు గవర్నమెంట్ తరపునుంచి కల్పించామని తెలిపారు.  వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం 2016 సెక్టన్ 72 ప్రకారం జిల్లాలో కమిటి లు ఏర్పాటుచేస్తామని చైర్మన్ గా కలెక్టర్ మెబెర్స్ గా ఎస్పి , డిఆర్దియే పిడి ,ఏడి డిసేబుల్ ,ఎస్ ఎస్ ఎ పి ఓ,సిఎఒ ,  జిల్లా వైద్య ఆరోగ్యాధికారితో పాటు ఒక దివ్యంగుల సభ్యులు ఉంటారని చెప్పారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించి  వికలాంగుల జాతీయ హక్కుల సమితి అధ్యక్షుడు బందెల కిరణ్ రాజు నిర్వహించిన  ముందస్

సీలేరు రహదారిబాగుచేయాలని కోరుతూ అధికారుల నిర్బంధం

Image

వాల్తేరు డివిజన్ యధావిధిగా కొనసాగించాలి : ఎంపి విజయసాయిరెడ్డి

Image
  న్యూఢిల్లీ (జన హృదయం): వాల్తేరు డివిజన్ యధావిధిగా కొనసాగించాలని వైయస్సార్ సిపి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం రాజ్యసభ జీరో అవర్లో ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న వాల్తేరు డివిజన్ కు 125 ఏళ్ల చరిత్ర ఉందని అటువంటి డివిజన్ ను రద్దు చేయడం రైల్వే చరిత్రలోనే ఎక్కడా జరగలేదని దీనివల్ల ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని ఆవేదన చేశారు. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ లో భాగమైన వాల్తేరు డివిజన్ భారతీయ రైల్వేలో అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న డివిజన్లలో ఐదో స్థానంలో ఉందని అన్నారు. నార్త్ వెస్ట్రన్ రైల్వే జోన్, నార్త్ ఈస్ట్ ప్రాంటియర్ రైల్వే జోన్ ల ఉమ్మడి ఆదాయం కంటే కూడా వాల్తేరు డివిజన్ ఆదాయం అధికంగా ఉందన్నారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే లో వాల్తేరు డివిజన్ ఆదాయం తూర్పు తీర రైల్వే లోని మూడవ అత్యధిక ఆదాయ వనరుగా ఉందన్నారు. గణనీయంగా ఎదుగుతున్న వాల్తేరు రైల్వే డివిజన్ ను బలోపేతం చేయాల్సింది పోయి రద్దు చేసి విజయవాడ డివిజన్ పరిధిలోకి విలీనం చేసే విధానానికి స్వస్తి పలకాలన్నారు. దీనివలన అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖక

తూ .గో . జిల్లాలో పర్యటించనున్న సిం జగన్

Image
కాకినాడ  (జనహృదయం):  ప్రజాసంకల్పయాత్ర హామీలకు ముఖ్యమంత్రి జగన్ కార్యరూపం దాల్చనున్నారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొంటారు తాను ఎన్నికలకు ముందు నిర్వహించిన ప్రజాసంకల్ప యాత్ర లో మత్స్యకారులకు పలు హామీలు ఇచ్చారు వాటి అమలుకు సీఎం గురువారం శ్రీకారం చుట్టనున్నారు గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ కార్యకలాపాల్లో జీవన ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు ఆ సంస్థ ఇవ్వాల్సిన బకాయిలు చెల్లింపులో జాప్యం జరగడంతో ఆ మొత్తాన్ని ప్రభుత్వమే ఇస్తామని వాగ్దానం చేశారు ఈ మేరకు 78.22 కోట్లు మత్స్యకారులకు అందజేయనున్నారు. ముమ్మడివరం లో డిగ్రీ కళాశాల నిర్మాణానికి ఎదురులంక, ఎస్సీ లంక. భూముల్లో 75 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శిలాఫలకాన్ని ఆవిష్కరించనున్నారు. గురువారం ఉదయం పది గంటల సమయంలో జగన్ మోహన్ రెడ్డి హెలికాప్టర్ లో ముమ్మిడివరం మండలం గాడిలంక చేరుకొని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు

లైఫ్ సర్టిఫికేట్లు సమర్పించేందుకు 30 తుది గడువు

Image
సమాచార శాఖ ఉప సంచాలకులు వి. మణిరాం విశాఖపట్నం (జనహృదయం): జిల్లాలో పింఛను పొందుతున్న వృద్ధ కళాకారులు ఈ నెల 30లోగా లైఫ్ సర్టిఫికేట్లను తమ కార్యాలయానికి సమర్పించాలని సమాచార పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకులు వి. మణిరాం తెలిపారు.  జిల్లాలో వృద్ధ కళాకారుల పింఛన్లను పొందుతున్న వారందరూ ప్రతీ ఏటా సమర్పించే లైఫ్ సర్టిఫికేట్లను నవంబర్ 30లోగా జిల్లా పరిషత్ కార్యాలయంనకు దగ్గరలో ఉన్న ఉప సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, విశాఖపట్నం వారికి స్వయంగా సమర్పించాలని కోరారు. ఇప్పటివరకు వృద్ధ కళాకారుల ఖాతాలలో పింఛన్లు జమకాబడనట్లయితే అటువంటి ఖాతా పుస్తకాన్ని సంబంధిత బ్యాంకు నందు అప్ డేట్ చేయించి దాని ప్రతిని, ఆధార్ కార్డు ప్రతిని, స్వీయ దరఖాస్తు ఫారాన్ని తమ కార్యాలయానికి సమర్పించాలని కోరారు. గడువులోగా లైఫ్ సర్టిఫికేట్లను సమర్పించిన వృద్ధ కళాకారులకు మాత్రమే సంచాలకులు, భాషా మరియు సాంస్కృతిక శాఖ, విజయవాడ వారి నుండి పింఛన్లు జమచేయబడతాయని స్పష్టం చేసారు. వృద్ధ కళాకారులు సమర్పించిన లైఫ్ సర్టిఫికేటు నందు పాస్ పోర్టు సైజు ఫొటోను అతికించి తమ పేరు, వయస్సు, చిరునామా, పిన్ కోడ్, ఫోన్ నెంబరుతో పాటు ఆధార్ నెంబరు , బ్యాంకు ఖాతా,