Posts

Showing posts from January, 2020

చెలిమికే ప్రాధాన్యం... తేడా వస్తే తాటతీస్తామంటున్న 'గిరి'జనం...

Image
ఆదివాసీ చేతిలో హతమైన మావోయిస్టు... ఏఓబిలో ఎదురుతిరిగిన ఆదివాసీలు ... ఇరువురికి గాయాలు ఒకరు పరార్‌ మరొకరిని ఆసుపత్రిలో చేర్చిన వైనం.. సీలేరు/ చింతపల్లి (జనహృదయం) : ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులకు ఎదురుదెబ్బతగిలింది. ఇంతకాలం ఆదివాసీల ఆదరాభిమానాలే తమ కార్యకలాపాలకు ఆలవాలంగా చేసుకున్న మావోయిస్టులకు ఆదివాసీల వ్యతిరేకత వారి మనుగడకే ముప్పుకలిగిస్తోంది. ఆదివాసీలను కట్టడి చేసేందుకు యత్నించిన మావోయిస్టులు వారి ఆగ్రహానికిగురై ఒకరు మృతిచెందగా మరొకరు ఆసుపత్రిపాలయ్యారు. ఆదివాసీలు తలచుకుంటే గుండెల్లో గూడుకట్టి దాచుకుంటారని తేడా వస్తే తాటతీస్తారని ఆంద్రా, ఒరిస్సా సరిహద్దు ప్రాంతానికి చెందిన గిరిజన తండా వాసులు నిరూపించారు. ఏళ్లతరబడి మావోయిస్టుల కదలికలకు ఆయువుపట్టుగా ఉన్న ఆదివాసీల ఆదరాభిమానాలకు ఒక్కసారిగా తిరగబడి సాయుధులైన మావోయిస్టులను సైతం మట్టుపెట్టారు. ఇంతటి విపత్కర పరిస్థితులకు మావోయిస్టుల అనాలోచిత నిర్ణయాలు, గిరిజనులపై సాగిస్తున్న మారణకాండ కారణమా అనే అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. దశాబ్దాలకాలం నుంచి పోలసుల నుంచి మావోయిస్టులను కాపాడేది ఆదివాసులేనని వారిలో మార్పు తెచ్చేందుకు పోలీసులు,

కాచిగూడ-గుంటూరు ప్యాసింజర్‌ రైలు 20 రోజుల పాటు రద్దు

Image
కాచిగూడ: కాచిగూడ రైల్వేస్టేషన్‌ నుంచి ప్రతిరోజూ మధ్యాహ్నం 2.40నిమిషాలకు బయలుదేరే కాచిగూడ-గుంటూరు ప్యాసింజర్‌ రైలు కాచిగూడ రైల్వేస్టేషన్‌ నుంచి  ఈనెల 18 నుంచి ఫిబ్రవరి 5 తేదీ వరకు 20 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు హైదరాబాద్‌ డివిజనల్‌ రైల్వే సీనియర్‌ డీసీఎం వెంకన్న తెలిపారు. రైల్వే ప్రయాణికుల కోసం మరిన్ని సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడానికి గుంటూరు రైల్వే స్టేషన్‌ పరిసర ప్రాంతాల్లో రైల్వే పనులను ఆధునీకరిస్తున్నట్లు అందుకు కాచిగూడ రైల్వేస్టేషన్‌ నుంచి నిత్యం బయలేదేరుతున్న గుంటూరు ప్యాసింజర్‌ రైలు వచ్చేనెల 5వ తేదీ వరకు రద్దు చేస్తున్న ట్లు ఆయన పేర్కొన్నారు. ఈమార్పును రైల్వే ప్రయాణికులు గమనించగలరని ఆయన విజ్ఞప్తి చేశారు.

విశాఖపట్నం లో రాష్ట్ర స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలు

విశాఖపట్నం : రానున్న జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రామకృష్ణ బీచ్ లోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్ దగ్గర ఆయన పరిశీలించారు. వాహనాల పార్కింగ్, శకటాలు, ప్రధాన వేదిక, ప్రముఖులు కూర్చొనే ఏర్పాట్లు, తదితర ఏర్పాట్లు పై పోలీసు అధికారులతో ఆయన చర్చించారు. ఈ పర్యటనలో జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, డిసిపి రంగారెడ్డి, విశాఖపట్నం ఆర్డీవో పెంచల కిషోర్,  కమాండంట్, 5వ పటాలం, ఎపిఎస్పి,జె. కోటీశ్వరరావు, అదనపు కమాండంట్ 16వ పటాలం, ఎపిఎస్పి పి సామ్యూల్ జాన్,  ఆర్ ఎస్ ఐ,  పి. సుధాకరరావు, ఆర్ ఐ, జి నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

అంటార జిల్లా దొంగఅరెస్ట్ ... భారీగా చోరీ సొత్తు స్వాధీనం ...

Image
  అనకాపల్లి : అంతర జిల్లా దొంగల ముఠాను అరెస్ట్ చేసి భారీ ఎత్తున చోరీ సొత్తు పోలీసులు స్వాధీనం  చేస్తుకున్నారు. మూడు జిల్లాల్లో చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాలుగా నిలిచిన ఈ ముఠా అరెస్ట్ తో సంక్రాంతి కి తాళాలు వేసే ఇళ్లకు కొంత భరోసా కలిగినట్లైంది .   విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో చోరీ చేసిన దాదాపు 2700 గ్రాముల బంగారం, నాలుగు కిలోల వెండిని సీజ్‌ చేసి, ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈమేరకు  విశాఖ జిల్లా అడిషినల్‌ ఎస్పీ (క్రైమ్‌) బి.అచ్యుతరావు పోలీసు అందించిన వివరాలిలావున్నాయి.  విశాఖ సిటీ పరిధి (అగనంపూడికి ) చెందిన ఆటో డ్రైవర్‌ తాటిపూడి శంకర్‌ (40), సబ్బవరం మండలం పైడివాడకు చెందిన శెట్టి అప్పలరాజు (40), తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడికి చెందిన శెట్టి ప్రసాద్‌ (30) కలిసి మూడు జిల్లాల్లో దొంగతనాలు చేశారని అడిషనల్‌ ఎస్పీ చెప్పారు. చెల్లా రామ్మోహన్‌రెడ్డి, బి.బాబారావు విశాఖనగరంతో పాటు గ్రామీణ ప్రాంతాలు, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లోని 46 ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారన్నారు. అనకాపల్లి పట్టణ పరిధిలో తొమ్మిది చోట్ల, గ్రామీణ ప్రాంతాల్లో తొమ్మిది చోట్ల, ఎలమంచిలి సర్కిల్‌ పరిధిలో

గుజరాత్ లో దారుణం అత్యాచారం.. ఆపై చంపి చెట్టుకు వీలదీశారు...

Image
 గుజరాత్ : మానవ మృగాలు నుంచి రక్షించేందుకు ఎన్ని చట్టాలోచ్చినా మార్పు రావడంలేదు.  దేశ వ్యాప్తంగా ఆందోళన కలిగించిన  నిర్భయ దిశ ఘటనలకంటే  దారుణమైన ఘటన గుజరాత్ లో వెలుగుచూసింది. సభ్యసమాజాన్నే కలవరపెట్టింది.గుజరాత్ లో ఓ దళిత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కామాంధులు ఆమెను చంపేసి మర్రి చెట్టుకు వేలాడదీసిన వైనం కలకలం రేపింది.ఈ ఘటన తెలిసిన వెంటనే స్థానికుల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. బాధితురాలికి న్యాయం చేయాలంటూ 'జస్టిస్ ఫర్ కాజల్' పేరుతో హ్యాష్ ట్యాగ్ దేశమంతా వైరల్ అయ్యింది. బాధిత యువతిని నలుగురు రేప్ చేసి చంపేసి చెట్టుకు వేలాడదీశారని వైద్యుల పోస్టుమార్టంలో తేలింది. డిసెంబర్ 31 నుంచి బాధిత యువతి కనిపించడం లేదు. అంతా వెతికిన తల్లిదండ్రులు 3న పోలీసులకు ఫిర్యాదు చేశారు.   యువతి ప్రియుడితో వెళ్లి పోయిందని.. ప్రచారం జరిగింది. తాజాగా యువతి చెట్టుకు వేలాడుతూ కనిపించింది. ఆమెపై సామూహిక అత్యాచారం చేసి చంపినట్టు కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి బాధితులు ఆరోపించిన నలుగురు నిందితులు బిమల్ దర్శన్ సతీష్ జిగర్ అనే నలుగురు యువకులను అరెస్ట్ చేశారు. రిమాండ్ కు తరలించారు.

ఎపిలో కొలువుల జాతర ...

Image
అమరావతి: ఎపిలో మళ్ళీ కొలువుల జాతరకు నోటిఫికేషన్ విడుదలయ్యింది.    గ్రామ, వార్డు సచివాలయాల్లో 16,207 ఉద్యోగాల భర్తీ కోసం పంచాయతీరాజ్, పురపాలక శాఖ వేర్వేరుగా శుక్రవారం ప్రకటనలు జారీ చేశాయి. గ్రామ సచివాలయాల్లో 13 రకాలైన 14,061 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. పశుసంవర్ధక శాఖకు చెందిన పోస్టులకు సంబంధించి అర్హులైన అభ్యర్థులు లేనందున విద్యార్హతను తగ్గించేందుకు ప్రభుత్వ అనుమతి కోసం అధికారులు ప్రతిపాదించారు. ముఖ్యమంత్రి అనుమతించాక ఆ శాఖలో ఖాళీల భర్తీ కోసం వేరుగా మళ్లీ నోటిఫికేషన్​ ఇచ్చే అవకాశాలున్నాయి. వార్డు సచివాలయాల్లో ఆరు రకాలైన 2,146 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం నేటి నుంచి 31లోగా అర్హులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి.

టోలప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ ...

Image
విజయవాడ : సంక్రాంతి పండుగ తో ఆంద్రకు బంధువులు రాక ఉపందుకొంది. ఈ నేపథ్యంలో రహదారులన్నీ కిటతలాడుతున్నాయి. కంచికచర్ల మం కీసర టోల్ గేటు వద్ద సంక్రాంతి సందర్భంగా తెలంగాణ నుండి ఆంధ్ర కు వస్తున్న వాహనాలతో  రహదారులు రద్దీగా మారాయి. హైదరాబాద్, విజయవాడ 65 నెంబర్ జాతీయ రహదారిపై పలు టోల్ ప్లాజాల వద్ద పెరిగిన వాహనాల రద్దీ పెరిగి ట్రాఫిక్ స్తంభించిపోతోంది   కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. టోల్ప్లాజాల వద్ద అదనపు కౌంటర్ల ఏర్పాటు చేసిన వాహన రాక పోకలకు అంతరాయంకలుగాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు

ఏసీ బస్సు దగ్ధమై 20 మంది ప్రయాణికులు సజీవ దహనం

ఉత్తరప్రదేశ్లో గత రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 20 మందికి ప్రయోజనం పైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి నుంచి 40 మంది 45 మంది ప్రయాణికులతో వెళుతున్న ఏసీ బస్సు అనే ప్రాంతం వద్ద బలంగా ఢీ కొంది దీంతో బస్సు లో ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల్లో బస్సు మొత్తం వ్యాపించడంతో ప్రయాణికులు తప్పించుకునే వీలు లేకుండా పోయింది స్థానిక పోలీసులు వెంటనే రంగంలోకి దిగి 21 మంది ప్రయాణికులను కాపాడారు అయితే అప్పటికే మంటల్లో చిక్కుకున్న మరో 20 మంది పైగా ప్రయాణికులు సజీవదహనమయ్యారు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు డీజిల్ ట్యాంక్ పగడం తో మంటలు చెలరేగాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు ప్రమాద విషయం విషయంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

వ్యక్తిగత హాజరు మినిహాయింపు కోరిన సీఎం జగన్

Image
హైదరాబాద్ : ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆస్తుల కేసు విచారణ వాయిదా పడింది డిశ్చార్జి పిటిషన్లు అన్ని కలిపి విచారణ జరపాలన్న ఏపీ సీఎం జగన్ పిటిషన్ పై వాదనలు పూర్తి కాగా విచారణను ఈ నెల 17 కు వాయిదా వేశారు విచారణ సమయంలో ఈడి కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కావాలని జగన్ కోరారు  తన తరపున సహ నిందితుడు హాజరవుతారని అడిగారు తాను కీలకమైన పదవిలో ఉన్నందున కోర్టుకు హాజరు కాలేనని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు అంతకు ముందు ముఖ్యమంత్రి జగన్ గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు  అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నాంపల్లి కోర్టుకు వెళ్లారు ముఖ్యమంత్రి రావడంతో కోర్టు దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు సీఎం జగన్ తో పాటు ఈ కేసులో నిందితునిగా ఉన్న మాజీమంత్రి ప్రసాదరావు వైఎస్సార్ సీపీ విజయసాయి రెడ్డి ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి రిటైర్డ్ ఐఏఎస్ శామ్యూల్ తదితరులు విచారణకు హాజరయ్యారు

విమానం కూలి 180 మంది మృతి

Image
ఇరాన్ రాజధాని టెహరాన్‌లోని ఖొమైనీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో ఈ ఉదయం ఉక్రేనియన్ విమానం కూలిపోగా.. 170 మంది ప్రయాణికులతో సహా 180 మంది మరణించారు. సాంకేతిక సమస్యల కారణంగానే విమానం కూలిపోయినట్టు తెలుస్తోంది. విమానాశ్రయం నుంచి బయల్దేరిన మూడు నిముషాలకే ఈ ఘోర ప్రమాదం జరిగింది. పెద్ద పేలుడుతో ఆకాశంలో మండుతూ ప్లేన్ కూలిన దృశ్యాలతో కూడిన వీడియోను బీబీసీ సేకరించింది. బోయింగ్ 737-800 విమానం కూలిన విషయాన్ని అధికారులు ధృవీకరించారు. ఈ దుర్ఘటనలో ఎవరూ ప్రాణాలతో బతికి బయటపడలేదని వారు తెలిపారు. ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.

చంద్రబాబు, లోకేష్ సహా టిడిపి నాయకుల అరెస్ట్ ...

విజయవాడ : విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్ తో సహా పలువురి టిడిపి  నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.వేదిక కల్యాణ మండపం ప్రారంభోత్సవం తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు, జేఏసీ నేతలు పాదయాత్రగా బయల్దేరగా బయలుదేరారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబుతో సహా పలువురు నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్టాడిన చంద్రబాబు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తిరగబడితే పోలీసులు ఏమీ చేయలేరని అన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని, ఏ చట్ట ప్రకారం తమను అడ్డుకుంటున్నారో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

మావోయిస్టు కీలక నాయకులు అరెస్ట్‌... విశాఖ మన్యంలో

Image
అరెస్టయిన వారిలో  ఏవోబీ జోనల్‌ కమిటీ సబ్యుడు, ఏసీఎం మావోయిస్టు రాష్ట్ర కమిటీ నాయకుడు , ఏవోబీ ప్రత్యేక జోనల్‌ కమిటీ సబ్యుడు బెల్లం నారాయణస్వామి అలియాస్‌ నందు అలియాస్‌ ఆజాద్‌, అతని భార్య కలిమెల ఏరియా కమిటీ సబ్యురాలు గంగి మాది ను విశాఖ జిల్లా గూడెంకొత్తవీధి మండలం అద్దరవీధి వద్ద జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబందించిన చింతపల్లి ఎఎస్‌పీ సతీష్‌కుమార్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా తాటిమర్రి గ్రామానికి చెందిన ఆజాద్‌ సుమారుగా 35 సంవత్సరాలుగా ఉద్యమంలో పనిచేస్తున్నాడు. ఇతనిపై సుమారు 20 లక్షలు రూపాయలు ప్రభుత్వ రివార్డు ఉంది. ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో సుమారు వందకు పైగా కేసులు నమోదయ్యాయి. దీనికి తోడు  బెల్లం నారాయణస్వామి అలియాస్‌ నందు అలియాస్‌ ఆజాద్‌ భార్య, కలిమెల ఏరియా కమిటీ సబ్యురాలు గంగి మాది అలియాస్‌ పూల్ బత్తిని కూడా అరెస్టు చేసినట్లు ఎఎస్‌పీ తెలిపారు. ఈమెపై రూ. ఆరు లక్షలు రివార్డు ఉందని, సుమారు 30కు పైగా కేసులు ఏవోబీలో నమోదయ్యాయి. గత 23 సంవత్సరాలుగా మావోయిస్టు ఉద్యమంలో పనిచేస్తుందని ఎఎస్‌పీ తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు ఎఎస్‌పీ తెలిపారు.

గిరిజన గిరిజనేతర సున్నిత సమస్యను రెచ్చగొట్టే ధోరణి న్యాయమా ?

Image

విశాఖలోనే రిపబ్లిక్ డే..వేడుక

విశాఖపట్నం :  ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రచారం జరుగుతున్నవిశాఖపట్నంలోనే జనవరి 26వ తేదీన గణతంత్ర వేడుకలు (రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్) నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  నిర్ణయం తీసుకున్నారు. రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ ఒకవైపు అమరావతి ప్రాంతంలో ఆందోళనలు పతాకస్థాయికి చేరుతున్న నేపధ్యంలో  ఈ మేరకు   సంచలన నిర్ణయం తీసుకున్నారు.   విశాఖపట్నంలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గణతంత్ర వేడుకల్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, రిపబ్లిక్ డే ప్రసంగాన్ని వెలువరిస్తారు. జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేశాక తొలిసారి జరుగుతున్న గణతంత్ర వేడుకలు, దానికి తోడు కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను అనధికారికంగా ప్రకటించిన తర్వాత జరగనున్న తొలి ఉత్సవాలు కావడంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఎక్కువ సమయం విశాఖపట్నంలో సౌకర్యాలు, సమస్యలపైనే ముఖ్యమంత్రి జగన్ ఫోకస్ చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగానే విశాఖ నగరంలోనే ఈసారి గణతంత్ర వేడుకలు నిర్వహించాలని నిర్ణయం తీస

మాజీ మంత్రి అయ్యన్న పై కేసు నమోదు చేయాలి

Image
నర్సీపట్నం:   ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై నర్సీపట్నంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అయ్యన్న బెయిల్ రద్దు చేసి అరెస్టు చేయాలని కోరుతూ  వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో వైసిపి నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించి నర్సీపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు

ఫ్లాష్ ..ఫ్లాష్ ... నిర్భయ దోషులకు 22న ఉరిశిక్ష

Image
న్యూఢిల్లీ : నిర్భయ దోషులకు ఈ నెల 22న నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలని ఢిల్లీ పాటియాల హౌజ్ కోర్టు తీర్పునిచ్చింది. దీని సంబంధించి నిందితులకు డెత్ వారెంట్ ను కోర్టు జారీ చేసింది. జనవరి 22న ఉదయం 7 గంటలలోపు ఉరిశిక్ష ప్రాసెస్ ను పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది. 2012 డిసెంబరు 16న రాత్రి ఢిల్లీలోని ఒక బస్సులో నిర్భయను ఆరుగురు గ్యాంగ్ రేప్ చేసి తీవ్రంగా గాయపరిచారు. 13 రోజుల తర్వాత నిర్భయ సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఆరుగురు నిందితుల్లో ఒక నిందితుడు రాంసింగ్ తీహార్ జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మరొక నిందితుడు మైనర్. అతనికి మూడు సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఇక మిగిలింది నలుగురు నిందితులు ముఖేష్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్. వీరిలో ముఖేష్, పవన్, వినయ్ క్షమాభిక్ష పిటిషన్ వేశారు. వారిక్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించారు. అయితే కోర్టు తీర్పు పై నిందితుల తరపు న్యాయవాది స్పందించారు. ఉరిశిక్ష తీర్పు పై క్యూరేటివ్ పిటిషన్ వేస్తానని తెలిపాడు. నిర్భయ దోషులకు ఉరిశిక్ష పడడంతో ఆమె తల్లిదండ్రులుమాట్లాడుతూ . ఇప్పుడు తమ కూతురు ఆత్మ శాంతిస్తుందని  నిర్భయ తల్లి అన్న

48 గంటల మన్యం బంద్ సంపూర్ణం..

Image
స్టంభించిన జనజీవనం... అరకు, లంబసింగిలో కానరాని పర్యాటకుల తాకిడి... చింతపల్లి, పాడేరు, అరకు (జనహృదయం): గిరిజన చట్టాలు హక్కులు పటిష్టవంతంగా అమలు  చేయడమే ప్రధాన లక్ష్యంగా గిరిజన జాయింట్‌ యాక్షన్‌ కమిటీ పిలుపునిచ్చిన 48 గంటల బంద్‌ విశాఖ మన్యంలో విజయవంతంగా ముగిసింది.  తొలి రోజు పూర్తిగా విజయవంతంగా ప్రశాంతంగా జరగగా రెండో రోజు కూడా అదే తరహాలో ముమ్మరంగా సాగింది. ఏజెన్సీ 11 మండలాల్లో అన్ని గ్రామాల్లో బంద్‌ వాతావరణం స్పష్టంగా కనిపించింది మునూపెన్నడూ లేని విదంగా చింతపల్లి, పాడేరు, అరకు వంటి ప్రధాన కేంద్రాలతో పాటు అన్ని గ్రామాలలోను వ్యాపార సముదాయాలు పాఠశాలలు బ్యాంకులు మూతపడ్డాయి ప్రభుత్వ కార్యాలయాలు నామమాత్రంగా పనిచేస్తున్నాయి. సోమ, మంగళవారాల్లో జరగాల్సిన వారపు సంతలు రద్దయ్యాయి. బంద్‌ సందర్భంగా ఎక్కడా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. గిరిజన నాయకులు ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేస్తూ రాత్రింబవళ్ళు రహదారి పైనే ఉండి వంటావార్పు కార్యక్రమాలు  నిర్వహించారు కనీవినీ ఎరుగని రీతిలో మన్యం బంద్‌ విజయవంతంగా జరింగింది. గత రెండు రోజులుగా కనీసం పాల పేకెట్‌ కూడా దొరకని పరిస

మన్యం బంద్ విజయవంతం 48 గంటలుగా స్తంభించిన జన జీవనం

Image

మన్యం బంద్ సక్సెస్.....

Image
స్థంభించిన ప్రజాజీవనం... మూతబడిన వ్యాపార సంస్థలు..బ్యాంకులు..రద్దయిన వారపుసంతలు... మంగళవారం కూడా కొనసాగనున్న బంద్‌... చింతపల్లి, పెదబయలు, జికేవీది (జనహృదయం): గిరిజన ప్రాంతంలో 1/70 చట్టం పటిష్టంగా అమలు చేయాలని, ఏజన్సీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు గిరిజనులకే కేటాయించాలన్న ప్రధాన డిమాండ్లతో చేపట్టిన మన్యం బంద్‌ తొలిరోజు విజయవంతంగా ప్రశాంతంగా ముగిసింది. జాయింట్‌ యాక్షన్‌ కమిటి ఆధ్వర్యంలో 48 గంటల పాటు తలపెట్టిన మన్యం బంద్‌ తొలిరోజు విజయవంతం కాగా మంగళవారం కూడా సంపూర్ణంగా జరిగే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బంద్‌ సందర్భంగా ఉద్యోగులు, వ్యాపార సంస్థలు స్వచ్చందంగా బంద్‌ పాటిచాయి. ఏజెన్సీ వ్యాప్తంగా 11 మండలాల పరిధిలో గిరిజన సంఘ నాయకులు ఎక్కడి కక్కడ బంద్‌ పాటించేందుకు పిలుపునివ్వగా అన్ని వర్గాల వారు బంద్‌కు సహకరించారు. రవాణ వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయింది. కనీసం ద్విచక్రవాహనాలు సైతం తిరగలేదు. ప్రభుత్వ కార్యాలయాలు నామమాత్రంగా తెరుచుకోగా బ్యాంకులు, ప్రయివేటు, ప్రభుత్వ పాఠశాలలు మూతబడ్డాయి. ఏజన్సీ వ్యాప్తంగా 11 మండలాల పరిథిలో ఉన్న వ్యాపార సముదాయాలు బంద్‌ పాటించగా, సోమవారం జరిగే వార

పోలీసులకు చిక్కిన లంబసింగి దారి దోపిడీ ముఠా

Image
నర్సీపట్నం : పర్యాటకులు, గంజాయి స్మగ్లర్లు  టార్గెట్‌గా చేసుకొని దారిదోపిడీలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయింది. విశాఖ జిల్లా లంబసింగి ప్రాంతానికి పర్యాటకుల తాకిడి పెరగడంతో తమ ఆదాయానికి ఇదే సరైన సమయంగా భావించిన ఓ ముఠా దారిదోపిడీలకు రంగం సిద్దంచేసుకొంది. పనిలో పనిగా గంజాయి రవాణా చేసేవారి నుంచి పోలీసుల ముసుగులో డబ్బు గుంజే ప్రయత్నం చేస్తూ లంబసింగి పర్యటన భయానకంగా చేసిన దోపిడీ ముఠాను పోలీసులు చాకచక్యంగా వ్యవహిరించి కటకటాలకు పంపారు. దీంతో పర్యాటకులకు కాస్త ఉపశమనం దొరికినట్లయింది.   గత నెల 16న పర్యాటక ప్రాంతమైన లంబసింగి విహారయాత్రకు వెళ్లి తిరుగు ప్రయాణంలో దారి దోపిడీ దొంగలకు చిక్కి వారి దగ్గర ఉన్న డబ్బులను కోల్పోయి వారి చేసిన చిత్రహింసలకు గురై నలుగురు యువకులు పోలీసులను ఆశ్రయించారు. వారు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు ఎనిమిది మందిని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలో సంచలనం కలిగించిన లంబసింగి పర్యాటకుల దారి దోపిడీ కేసును నర్సీపట్నం పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఎనిమిది మంది యువకులను శనివారం అరెస్టు చేశారు.  జిల్లలో సంచలనం సృష్టించిన ఈ  కేసు వివరాలను

రోడ్డు ప్రమాదంలో కాలిపోయిన టూరిస్ట్ బస్

Image
శ్రీకాకుళం  : జిల్లాలోని పైడి భీమవరం సమీపంలో జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం తప్పింది. ఉత్తరఖండ్‌కు చెందిన టూరిస్ట్‌ బస్సు మంటల్లో కాలి బూడిదయింది. పూరిలో జగన్నాధస్వామి దర్శనం చేసుకుని విశాఖపట్నం వెళ్తుండగా.. ఒక పర్రిశమకు చెందిన బస్సు అదుపు తప్పి టూరిస్ట్‌ బస్‌ను ఢీకొనడంతో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 15 మంది స్వల్పంగా గాయపడ్డారు. వారిని శ్రీకాకుళం రిమ్స్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రణస్థలం ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే బస్సు దిగిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ ఘటనతో అరగంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. 

రాజధాని కోసం రెండు ఆప్షన్లు... బీసీజీ కమిటీ వెల్లడి

Image
అమరావతి : తొమ్మిది నగరాల ఆధారంగా  రాజధాని విషయంలో  కమిటీ కీలక సూచనలు చేసింది. దీనికోసం  మొత్తం తొమ్మిది  నగరాలను పరిగణనలోకి తీసుకున్నామని, బీసీజీ నివేదికలోని ముఖ్యాంశాలను ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్ కుమార్ వెల్లడించారు. రాజధాని కోసం బీసీజీ కమిటీ రెండు ఆప్షన్లను...  ఆప్షన్‌-1లో.. విశాఖపట్నంలో సీఎం, గవర్నర్ ఆఫీసులు, సెక్రటేరియట్, ప్రజలతో నేరుగా సంబంధం లేని శాఖల కార్యాలయాలు, అత్యవసర సమావేశాల కోసం అసెంబ్లీ, హైకోర్టు బెంచ్‌ను పెట్టుకోవచ్చు. అమరావతిలో శాఖాధిపతుల కార్యాలయాలు, అసెంబ్లీ, హైకోర్టు బెంచ్.. కర్నూలులో హైకోర్టు, స్టేట్ కమిషన్, అప్పిలేట్ బాడీలను ఏర్పాటు చేయొచ్చు. ఆప్షన్-2లో విశాఖలో సీఎం ఆఫీస్, సెక్రటేరియట్, అన్ని శాఖాధిపతుల కార్యాలయాలు, అత్యవసర సమావేశాల కోసం అసెంబ్లీ, హైకోర్టు బెంచ్.. అమరావతిలో హైకోర్టు బెంచ్, అసెంబ్లీ.. కర్నూలులో హైకోర్టు, అప్పిలేట్ బాడీలను ఏర్పాటు చేయొచ్చని సూచించింది.   ''బీసీజీ బృందం 13 జిల్లాలున్న రాష్ట్రాన్ని ఆరు ప్రాంతాలుగా విభజించింది. ఈ ప్రాంతాల్లో ఏయే వనరులు, మౌలిక సదుపాయాలు ఉన్నాయి, అభివృద్ధికి ఆటంకాలేంటనే విషయాన్ని పరిశీలించారు. ఈ ఆరు ప్రాంతా

ఎసిబికి చిక్కిన విఆర్వో ... విశాఖ జిల్లాలో

Image
అనకాపల్లి : లంచం పేరు వింటే వెన్నులో వణుకు పుట్టించే విదంగా అధికారులు చర్యలు చేపట్టాలని సీఎం నిర్దేశించినల్ 24 గంటలలోపు విశాఖ జిల్లా ఎసిబి అధికారులు ఓ అవినీతి అధికారిని కటకటాలు పంపించారు. సీఎం చేపియినా విదంగా రెవెన్యూ శాఖలో పేరుకుపోయిన అవినీతి జాడ్యాన్ని వదిలించే పని ప్రారంభించారు. ఈమేరకు శుక్రవారం రెవిన్యూ శాఖకు చెందిన విఆర్వోని వలపన్ని పట్టుకున్నారు. ఈ సంఘటన వివరాలిలావున్నాయి. కశింకోట మండలం తాసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించగా తాళ్లపాలెం చెందిన విఆర్ఓ రాజేష్ రెండు వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. కశింకోట మండలం  లో తాళ్లపాలెం గ్రామానికి చెందిన గళ్ళ సత్యనారాయణ తన (49,1/2) సర్వే(133/1) సెంట్లు భూమిని ఆన్లైన్ చేయడానికి అని పలుమార్లు దరఖాస్తులు చేసి విసిగి పోయి.ఇటీవల డిసెంబరు నెలలో మళ్ళీ అప్లై చేసి పట్టాదారు పాసుపుస్తకం ఆన్లైన్ చేయడానికి తాళ్లపాలెం వీఆర్వో రాజేష్,  చెప్పగడ్డ ప్రసాద్ ను 3000 రూ అడగగా తాను 2000 ఇవ్వడానికి బేరంకుదుర్చుకున్నాడు.ఈ అవినీతి అధికారి బాగోతాన్ని సీఎం ఏర్పాటు చేసిన ఫిర్యాదు నెంబర్14400 కు ప్రసాద్ తెలియజేసాడు. వెంటనే  ఏసీబీ  డి ఎస్ పి కె.గంగరాజు

రాజధానిపై అందిన బీసీజీ నివేదిక ....

Image
తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంపై బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ (బీసీజీ) ప్రభుత్వానికి శుక్రవారం తమ  నివేదిక అందించింది . సీఎం క్యాంపు ఆఫీస్‌లో బీసీజీ సభ్యులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి ఏపీలో సమతుల్య, సమగ్రాభివృద్ధిపై నివేదిక సమర్పించారు. ఇప్పటికే రాజధాని అంశంపై జీఎన్‌ రావు కమిటీ రిపోర్టుపై మంత్రివర్గం చర్చ పూర్తయిన నేపథ్యంలో   బీసీజీ నివేదికలపై చర్చించి, అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోనుంది. హైపవర్‌ కమిటీ భేటీ అనంతరం రాజధాని అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 6న హైపవర్‌ కమిటీ భేటీ అయి చర్చించి  ఈనెల 20 లోపు ప్రభుత్వానికి నివేదిక అందిస్తుంది.  హైపవర్‌ కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మెంబర్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. మొత్తం పదిమంది మంత్రులు, సీఎం ముఖ్య సలహాదారు, ఐదుగురు సీనియర్‌ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు సభ్యులుగా ఉన్నారు.  రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని పేర్కొంటూ జీఎన్‌ రావు కమిటీ రెండు వారాల క్రితం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అమరావతిలో లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌ (శాసన రాజధాని), విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్ (పరిపాలన రాజధా

పటిష్టంగా దిశ చట్టం అమలు చేయాలి .. కృత్తికా శుక్లా వెల్లడి ...

Image
అమరావతి :   ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దిశ చట్టం పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని దిశా చట్ట పరిరక్షణ ప్రత్యేక అధికారిణి కృతికా శుక్లాస్పష్టం చేశారు.  దిశా చట్టం విధి విధానాలపై ఆమె శుక్రవారం 13 జిల్లాల అధికారులతో వీడియో కాన్షరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళలకు రక్షణ కవచంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశా చట్టాన్ని తీసుకు వచ్చారని, చట్టం అమలుకు ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పని చేయాలనికోరారు .  చట్టం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినం చర్యలు తీసుకుంటామని కృతిక శుక్లా స్పష్టం చేశారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ పథకాల ద్వారా బాధితులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. వైఎస్సార్‌ కిశోరి వికాసం పథకం కింద ప్రాథమిక స్థాయి నుంచే సెల్ఫ్‌ డిఫెన్స్‌పై అవగాహన కల్పిస్తామని తెలిపారు.

పేదలందరికీ 'వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ’... సీఎం జగన్

Image
వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ' పైలట్‌ ప్రాజెక్టుకు  శ్రీకారం... ఏలూరు : వైద్యం పేదలందరికీ చేరువచేయాలన్న  సంకల్పంతో 'వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ' పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్  రెడ్డి  అన్నారు. పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించే ఆరోగ్యశ్రీ పథకం తనకు ఎంతో సంతృప్తికరమైనదిగా   ఆయన పేర్కొన్నారు. 'వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ' పైలట్‌ ప్రాజెక్టుకు సీఎం జగన్‌ పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీకారం చుట్టారు. ఏలూరు ఇండోర్‌ స్టేడియంలో ఈ ప్రాజెక్టును ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా  సీఎం జగన్‌  అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలోమాట్లాడారు.  నూతన సంవత్సరంలో తమ ప్రభుత్వం  ఆర్టీసీని  ప్రభుత్వంలో విలీనం చేయగా  రెండో సంక్షేమ పధకం ఆరోగ్య శ్రీ అనిచెప్పారు.  దీని ద్వారా రాష్ట్ర చరిత్రలో మరో కొత్త అధ్యాయానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సీఎం ప్రకటించారు. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే విధంగా దివంగత ముఖ్యమంత్రి 'వైఎస్సార్‌' ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని, ప్రస్తుతం 1059 రోగాలకు మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తిస్తోందని, ఆ సంఖ్యను 2059 రోగాలకు వర్తించే విధంగా  ఈ పథకాని

ఏపీలో మూడు రాజధానులు పై సీఎం మరోసారి ...

ఏలూరు: అన్ని ప్రాంతాలవారికి అభివృద్ధి ఫలాలు అందించడమే తమ ప్రభుత్వ ద్యేయమని రాజధాని విభజనపై  సీఎం జగన్ పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. మూడు రాజధానుల ఫార్ములాతో ముందుకెళ్తామన్న సంకేతాలిచ్చారు. శుక్రవారం ఏలూరులో ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన సభలో ఆయన  చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.  గత ప్రభుత్వ నిర్ణయాలతో  కొందరికే న్యాయం జరిగిందంటూ సీఎం రాజకీయ విమర్శలు చేశారు.   అన్ని ప్రాంతాలకు నీళ్లు, నిధులు, పరిపాలన అందాలన్నదే తమ ప్రభుత్వ విధానమని నాటి నిర్ణయాలను సరిదిద్ధి  అన్ని ప్రాంతాలవారికి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. తమ దృష్టిలో మూడు ప్రాంతాలూ సమానమేనంటూ రాజధానిపై పరోక్షంగా జగన్ పేర్కొన్నారు.  

రాజధాని ప్రాతంలో ఉద్రిక్తత ... మహిళల అరెస్ట్ .. అడ్డుకున్న స్తానికులు ...

అమరావతి:  రాజధాని నిరసనల్లో భాగంగా  మందడం గ్రామంలో  ర్యాలీ నిర్వహించారు. అనంతరం మహిళలు సచివాలయం రోడ్డు వద్ద ధర్నాకు చేపట్టారు  వారిని అక్కడ  నుండి తొలిగించేందుకు మహిళా పోలీసులు పెద్ద సంఖ్యలో  చేరుకొని  మహిళలను  పోలీసు వ్యాన్ ఎక్కించారు. ఆ సమయంలో ఇబ్బంది పడిన స్థానిక మహిళలు పెద్ద పెట్టున రోదించారు. పోలీసులు తమతో వ్యవహరించి న తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేసారు. వారికి మద్దతుగా అక్కడే ధర్నా చేస్తున్న గ్రామస్థులు పెద్ద సంఖ్యలో చేరుకొని పోలీసులతో వాగ్వాదానికి దిగారు  బలవంతంగా తమను అదుపులోకి తీసుకోవటం పైన ఆవేదన వ్యక్తం చేసారు. ఒకే బస్సులో అనేక మందిని ఎక్కించటం ద్వారా వారు ఒత్తిడికి లోనయ్యారు. దీంతో..అక్కడకు చేరుకున్న గ్రామస్థులు వెంటనే వ్యాన్ లోకి ఎక్కించిన మహిళలను వదిలేయాలంటూ ఆందోళనకు దిగారు. వ్యాన్ ముందుకు వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా పడుకొన్నారు. దీంతో..వారిని తప్పించేందుకు పెద్ద సంఖ్యలో పోలీసులను తరలించారు .  పోలీసులు తమ పట్ల వ్యవహరిస్తున్న తీరును మహిళలు తప్పు బట్టారు. తమ గొంతు పట్టుకొని నేరస్థుల మాదిరి దురుసుగా వ్యవహరిస్తున్నారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో అక్కడ చేరుకున్న పోలీసు ఉన్నతాధికా

సీబీఐ కోర్ట్ లో జగన్ వ్యక్తి గతంగహాజరవ్వాల్సిందే ....

హైదరాబాద్ :  ఏ పీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టు షాక్ ఇచ్చింది. ముఖ్యమంత్రి అయిన తరువాత అధికారిక విధుల్లో ఉంటున్న జగన్ తన లాయర్ ద్వారా పిటీషన్ దాఖలు చేయిస్తూ..విచారణకు న్యాయవాదిని పంపిస్తున్నారు అయితే,ఈ నెల 10వ తేదీన ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరవ్వాలని సీబీఐ కోర్టు కీలక సూచనలు చేసింది.   ఈమేరకు సీఎం జగన్ కోర్టుకు విచారణ నిమిత్తం రావాల్సిందేనని స్పష్టం చేసింది.  జగన్ సీఎం అయిన తర్వాత కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సీబీఐ కోర్టు జగన్ అభ్యర్థించారు . దీనికి సంబంధించి హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు . దీని పైన ఒక వైపు వాదప్రతివాదనలు కొనసాగుతున్నాయి . ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టులో జగన్ లాయర్ ఆబ్సెంట్ పిటిషన్ వేస్తున్నారు . అయితే ఈసారి జగన్ లాయర్ సిబిఐ కోర్టు కొన్ని ఆదేశాలిచ్చింది. ఈనెల పదో తేదీన తప్పనిసరిగా జగన్ తో పాటుగా విజయసాయిరెడ్డి హాజరు కావాల్సిందేనని కోర్టు ఆదేశించింది. 

బ్రేకింగ్ న్యూస్.... అత్యాచారం ఆపై మర్మాంగాన్ని కోసేసిన వైనం ...

Image
విజయవాడ :  కామంతో కళ్ళు మూసుకుపోతున్న మానవ మృగాల ఆగడాలను చట్టాలు కట్టడి చేయలేని పరిస్థితి నెలకొంది. వావివరసలు కనిపించడంలేదు లైంగిక వాంఛ కోసం ఎంతకైనా తెగబడుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలో అత్యంత దారుణ సంఘటనసంభవించింది. కామాంధుడు వదిన వరసయ్యే మహిళపై అత్యాచారానికి పాల్పడడం తో పాటు ఆపై ఆమె మర్మాంగాన్ని కోసేసిన పాశవిక ఘటనచోటుచేసుకొంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని  బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.  మైలవరం  నియోజకవర్గం జి. కొండూరు మండలం మునగపాడులో కామాంధుడు రెచ్చిపోయాడు. వదిన వరసయ్యే మహిళను చెరబట్టాడు. గ్రామానికి చెందిన మూడా బాలు అనే వ్యక్తి 45 సంవత్సరాల మహిళపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యంత రాక్షసంగా ఆమె మర్మాంగాన్ని కోసేశాడు. ఈ దారుణ ఘటన అనంతరం బాధితురాలు  తేరుకుని 100కి డయల్ చేయడంతో పోలీసులు స్పందించారు. సంఘటన స్థలానికి చేరుకుని బాధితురాలిని చికిత్స నిమిత్తం మైలవరం ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడు బాలు  కోసం పోలీసులు గాలింపు  చేపట్టారు.

రాజధానికోసం సకలజనుల సమ్మెకు సిద్ధం

అమరావతి: ఏపీ రాజధాని గ్రామాల్లో శుక్రవారం నుంచి సకలజనుల సమ్మెకు జేఏసీ (ఐక్యకార్యాచరణ కమిటీ) పిలుపు ఇచ్చింది. 29 గ్రామాల్లో సకలజనుల సమ్మె చేస్తామని ప్రకటించింది. ఆస్పత్రులు, మందుల దుకాణాలు, పాలసరఫరా మినహా మిగిలినవన్నీ బంద్ అవుతాయని తెలిపింది. మరోవైపు రైతుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసిననాటినుంచి రైతుల దీక్షలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో రైతులు చేపట్టిన రిలే నిరాహారదీక్ష శుక్రవారం నాటికి 16వ రోజుకు చేరుకుంది. పెద్ద సంఖ్యలో మహిళలు, రైతులు, రైతు కూలీలు హాజరై నిరసన తెలుపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల నుంచి రైతులు దీక్షా స్థలికి తరలివస్తున్నారు.కమిటీలతో ఒరిగేదేమీలేదని, ఎవరినడిగి జగన్ ఈ కమిటీలు వేస్తున్నారని, మహిళా రైతులు ప్రశ్నించారు. నలుగురు మంత్రులు నానా విధాలుగా మాట్లాడుతున్నారని, తామంతా కలిస్తే ఏమైనా చేయగలమని అన్నారు. తమకిప్పుడు రాజధానిగా అమరావతే కావాలని డిమాండ్ చేస్తున్నారు. తాము భూములు రాజధాని నిర్మాణం కోసం ఇచ్చామని, చంద్రబాబుకు ఇవ్వలేదని స్పష్టం చేశారు. జగన్ అధికారంలోకి రాగానే ప్రజా వేదికను కూలగొట్టారని, అది ఎవరి సొమ్ము? జగన్

ఉద్యోగులకు  అండగా ప్రభుత్వం 

విజయవాడ : ప్రభుత్వం నుండి ప్రజలకు చేరవేసే ప్రతి పథకంలోను ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా ఉద్యోగులు వ్యవహరించడం జరుగుతుందని రవాణా, సమాచారశాఖ మాత్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని)అన్నారు. ప్రజలకు ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు అమలులో ఉద్యోగులు ఒక భాగమని, తమ ప్రభుత్వం ఉద్యోగుల పక్షాన అండగా ఉంటుందన్నారు. ఈ విషయం లో మరో ప్రశ్నకు తావులేదన్నారు.  నూతన సంవత్సర వేడుకలలో భాగంగా రవాణాశాఖ(నాన్- టెక్నికల్) ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం రాజుబాబు ఆధ్వర్యంలో రవాణాశాఖ ఉద్యోగ సంఘ నాయకులు, ఉద్యోగులు మంత్రి పేర్ని వెంకట్రామయ్యను కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, నోట్ బుక్ లను అందజేశారు. మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ఆర్టీసీని కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడం వలన 51 వేల 488 మంది ప్రభుత్వ ఉద్యోగులయ్యారని, వారి కుటుంబాల్లో ఆనందం వెళ్లి విరుస్తున్నాయన్నారు.  ఈ ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికె దక్కిందని, ఇది  దేశ చరిత్రలో లిఖించతగ్గ గొప్ప విషయం అని ఆయన అన్నారు. వైఎస్ఆర్ పార్టీ  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా 4 లక్షల మంది గ్ర

రైతులకు జగన్ సర్కారు తీపి కబురు

అమరావతి : ఏపీ రైతులకు జగన్ సర్కారు తీపి కబురు అందించింది. అన్నదాతల బ్యాంకు ఖాతాల్లోకి రూ.2వేలు జమ చేయనుంది. పీఎం కిసాన్‌ కింద రావాల్సిన భరోసా సొమ్మును రైతు భరోసా పథకంలో భాగంగా.. రైతుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయనుంది. సుమారు 46,50,629 మంది ఖాతాలకు రైతు భరోసా తుది విడత మొత్తం దాదాపు రూ.1,082 కోట్లను నేరుగా బదిలీ చేస్తామని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. వాస్తవ సాగుదారులు, కౌలు రైతులు, ఆర్‌ఓఎఫ్‌ఆర్, దేవాదాయ, ధర్మాదాయ భూముల్ని సాగు చేసుకుంటున్న వారు, ఇతర వర్గాల సాగుదార్లకు సొమ్ము అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని రైతులు, కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.13,500 ఇస్తామని ప్రకటించి ఇప్పటికే రూ.11,500ను జమ చేసింది. కాగా, లబ్ధిదారుల పేర్లను శుక్రవారం నుంచి గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించనున్నారు.

ఢిల్లీలో అదృశ్యమైన వైద్యులు సిక్కింలో

న్యూఢిల్లీ: డిల్లీలో  అదృశ్యమైన ఇద్దరు తెలుగు వైద్యులు దిలీప్‌ సత్య, హిమబిందు ఆచూకీ లభ్యమైంది. గత నెల 25న వీరిద్దరూ ఢిల్లీలో అదృశ్యమై ప్రస్తుతం సిక్కింలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హిమబిందు భర్త శ్రీధర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న డిల్లీ పోలీసులు బృందాలుగా విడిపోయి వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా వారి సెల్ ఫోన్ల పై నిఘా ఉంచారు. ఈ క్రమంలో దిలీప్‌ సత్య తన సోషల్‌ మీడియా ఖాతాను ఉపయోగించడంతో సాంకేతిక నిఘా ద్వారా వారి పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ సిక్కిం ఎందుకు వెళ్లారు? వీరి అదృశ్యం వెనుక కారణాలపై విచారణ జరపనున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన హిమబిందు, అనంతపురం జిల్లా హిందూపూర్‌కు చెందిన దిలీప్‌ సత్య అదృశ్యమైనట్లు డిసెంబర్‌ 25న డిల్లీలోని హాజ్‌ఖాన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఈ మేరకు అదృశ్యమైన వైద్యుల ఆచూకీపై వారి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. 

లంచం అంటే వెన్నులో వణుకుపుట్టాలి... ఏపి సిఎం...

అమరావతి : లంచం తీసుకోవాలంటే వెన్నులో వణుకు పుట్టాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు. అవినీతి నిరోదక శాఖ పనితీరుపై జరిగిన సమీక్షలో ఈమేరకు ఏసిబి అధికారులకు సిఎం జగన్‌ దిశానిర్ధేశం చేశారు. ప్రస్తుతం అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన మూడునెలల్లో పనితీరు మెరుగుపర్చాలని లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో అవినీతి నిర్మూలన ప్రధాన ద్యేయంగా ముందుకు సాగాలని ఏ శాఖలోనైనా అధికారులు లంచం పేరెత్తితే వెన్నులో వణుకు పుట్టాలని ఆవిదంగా ఏసిబి అధికారుల పనితీరు మెరుగుపర్చుకోవాలని హెచ్చరించారు. కాల్‌సెంటర్‌కి వచ్చే పిర్యాదుల పై దర్యాప్తు చురుగ్గా సాగాలని, దాడులు ముమ్మరం చేయాలని సూచించారు. రెవెన్యూ మరికొన్ని శాఖల్లో అవినీతిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో లంచావతారుల గుండెళ్లో రైళ్లు పరిగెట్టించాలని, ప్రజల్లో నమ్మకాన్ని సాధించాలని సిఎం ఏసిబి అధికారులను ఆదేశించారు. మరో మూడునెలల గడువులో పనితీరు మెరుగుపర్చుకోవాలని హితవుపలికారు.

పౌరసత్య బిల్లుకు వ్యతిరేకంగా దీక్షలు

విజయవాడ : కేంద్రప్రభుత్వం తీసుకు వచ్చిన CAA, NRC, NRP , బిల్లులను వ్యతిరేకిస్తూ ఏపీ లౌకిక, రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో రిలే నిరసన దీక్షలను సీపీఐ, సీపీఎం,రాష్ట్ర కార్యదర్సులు రామకృష్ణ, మధు ప్రాంభించారు. ఈ సందర్బంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుమాట్లాడుతూ జాతీయ పౌర రిజిస్టర్ పేరుతో భారతదేశ లౌకిక వ్యవస్థ పై బీజేపీ దాడి చేస్తుంది  బీజేపీ అధికారంలోకి వచ్చాక మైనార్టీల మీద దాయిలు పెరిగాయి  ఆర్టికల్ 370 రద్దు తో కాశ్మీర్ కు ఉన్న ప్రత్యేక హక్కులు రద్దు చేశారు  ట్రిబుల్ తలాక్ పేరుతో సివిల్ వివాదాలను క్రిమినల్ వివాదాలులుగా మార్చారు బీజేపీ మైనార్టీ హక్కులు కాల రాస్తోంది  దేశంలో 70 సంవత్సరాలుగా ఉన్న వారిని ఈ దేశ పౌరులా అని అడగటం సిగ్గు చేటు  Nrc ని రాష్ట్రంలో అమలు పర్చమని అసెంబ్లీలో తీర్మానం చేయాలి  14 రాష్టాలు nrc ని వ్యతిరేకిస్తున్నాయి  పార్లమెంట్ లో బిల్లు ఓటు వేసిన పార్టీలు సైతం nrc ని వ్యతిరేకిస్తున్నాయి  బీజేపీ దేశంలో ప్రమాదకర పరిస్థితులు సృష్టిస్తోంది  గో సంరక్షణ సమితుల పేరుతో అరాచకలు సృష్టిస్తున్నారు  Nrc కి వ్యతిరేకంగా జనవరి 8 తేదీన కార్మిక వర్గం ఆందోళనలు పిలుపు ఇస్తోం

ట్రాన్స్పోర్ట్ సూపెర్వైసోర్ ఆత్మహత్య ....

విశాఖపట్నం: పరవాడ మండలం ట్రాన్స్‌పోర్టు కంపెనీ సూపర్ వైజర్ నంబూరి హనుమంతురావు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పని ఒత్తిడి కారణమంటూ మృతుడు రాసిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడు విజయవాడ కొండపల్లి వాసిగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంక్రాంతికిప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్‌ : సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని వివిధ మార్గాల్లో ఆరు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు.సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ సువిధ ప్రత్యేక రైలు (నెంబర్‌: 82725) సికింద్రాబాద్‌ నుంచి జనవరి 10వ తేదీ సాయంత్రం 6గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 4.30గంటలకు నర్సాపూర్‌ చేరుతుంది. సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ స్పెషల్‌ (రైల్‌నెం:07256) సికింద్రాబాద్‌ నుంచి జనవరి 12, 13వ తేదీల్లో రాత్రి 7.25గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 6గంటలకు నర్సాపూర్‌ చేరుతుంది.  సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ సువిధ ప్రత్యేక రైలు(నెంబర్‌:82731) సికింద్రాబాద్‌ నుంచి జనవరి 11వ తేదీ రాత్రి 7.25 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 6గంటలకు నర్సాపూర్‌ చేరుతుంది.  నర్సాపూర్‌-సికింద్రాబాద్‌ స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌:07255) నర్సాపూర్‌ నుంచి జనవరి 18వ తేదీ సాయంత్రం 6గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 4గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది.  నర్సాపూర్‌-సికింద్రాబాద్‌ సువిధ స్పెషల్‌ (రైల్‌నెంబర్‌: 82727 (నర్సాపూర్‌ నుంచి జనవరి 19వ తేదీ రాత్రి 8గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 5.50గంటలకు సికింద్రాబాద్‌ చేరుతు

లారీ బోల్తా ఒకరు మృతి

బెంగళూరు :  కృష్ణగిరి జిల్లా డెంకణీకోట తాలూకు అంచెట్టి సమీపంలో  ట్యాంకర్‌ లారీ బోల్తాపడడంతో ఒకరు మృతి చెందారు. అంచెట్టి నుంచి ఉరిగం గ్రామానికి ప్రభుత్వ టాస్మార్క్‌ దుకాణానికి మద్యం బాటిళ్ళతో కూడిన బాక్స్‌లను తీసుకొని వెళ్తున్న ట్యాంకర్‌ లారీ ఎర్రమద్దనపల్లి గ్రామం వద్ద వెళ్తుండగా అకస్మాతుగా అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో లారీలో ప్రయాణిస్తున్న కృష్ణగిరి సమీపం పాంచాలియూరు గ్రామానికి చెందిన గోవిందన్‌(40) మృతి చెందాడు. కృష్ణగిరి సమీపం తిప్పనపల్లి గ్రామానికి చెందిన డ్రైవర్‌ శివకుమార్‌(39) పరారయ్యాడు. సమాచారం తెలిసిన వెంటనే అంచెట్టి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం కారణంగా మార్గంలో అర గంట సేపు వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది

నేడు గవర్నర్ తో సీఎం భేటీ

అమరావతి: రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు సాయంత్రం 4 గంటలకు సమావేశం కానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై గవర్నర్‌తో సీఎం చర్చించనున్నారు. మూడు రాజధానులు అంశం, రైతుల ఆందోళనలపై గవర్నర్‌కు వివరించే అవకాశం ఉంది. అలాగే జీఎన్ రావు కమిటీ నివేదిక, ప్రతిపక్షాల ఆందోళనలపై ఇరువురి మధ్య చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది

వాతావరణ సూచన ....

విశాఖపట్నం :  బంగాళాఖాతం నుంచి కోస్తాపైకి తేమగాలులు వీస్తున్నాయి. అదే సమయంలో ఉత్తర ఒడిశా పరిసరాల్లో ద్రోణి బలహీనపడినా దాని నుంచి ఉత్తర కోస్తాపైకి గాలులు వీస్తున్నాయి. ఈ రెండింటి ప్రభావంతో బుధవారం మధ్యాహ్నం నుంచి కోస్తాలో అనేకచోట్ల మేఘాలు ఆవరించాయి. దీంతో వాతావరణం చల్లబడడమే కాకుండా అక్కడక్కడా వర్షాలు కురిశాయి. బుధవారం సాయంత్రం వరకు పరదేశిపాలెం, కాపులుప్పాడలో మూడు, చిలకలూరిపేటలో రెండు, శ్రీకాళహస్తిలో ఒక సెంటీమీటరు వర్షపాతం నమోదైంది. రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఇంటికే ఇసుక నేడు శ్రీకారం ....

అమరావతి : ప్రజలకు ఇంటివద్దకే ఇసుక సరఫరా చేసే కార్యక్రమం కృష్ణా జిల్లాలో నేటి నుంచి అమల్లోకి రానుంది. రవాణా సదుపాయం బాధ్యతను కూడా ఏపీఎండీసీనే తీసుకుని కొత్త విధానానికి శ్రీకారం చుడుతున్నట్లు బుధవారం ఆ సంస్థ ఎండీ ఎం.మధుసూదన్‌రెడ్డి చెప్పారు. ఇసుక కొనుగోలుదారులు భవన నిర్మాణ ప్రదేశం వివరాలు పోర్టల్‌లో ఉంచి, మ్యాప్‌ ద్వారా జియో ట్యాగింగ్‌ చేస్తారు. దీంతో నిర్మాణ ప్రదేశానికి నేరుగా ఇసుక వచ్చేస్తుంది. బుకింగ్‌ డబ్బు చెల్లించడంతో పాటు రవాణా చార్జీ కూడా చెల్లించాలి. రవాణా చార్జీ కూడా ఏపీఎండీసీ నిర్ణయించింది. 20 కిలోమీటర్ల దూరం వరకు టన్నుకు కిలోమీటరుకు రూ.6.60 రవాణా చార్జీ చెల్లించాలి. 30 కిలోమీటర్ల దూరం అయితే కిలోమీటరుకు రూ.6 చెల్లించాలి. 30 కిలోమీటర్లకు పైన అయితే కిలోమీటరుకు రూ.4.90 చొప్పున రవాణా చార్జీ నిర్ణయించామని ఆయన తెలిపారు. తొలుత కృష్ణా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, తదుపరి అన్ని జిల్లాల్లోను అమలు చేస్తారు.

దిశా చట్టం అమలుకోసం ప్రత్యేక చర్యలు

అమరావతి :  దిశ చట్టం పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వం 87 కోట్ల రూపాయలను కేటాయించింది.  ఈమేరకు  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. మహిళలు, బాలలపై లైంగిక నేరాల సత్వర విచారణకు వీలుగా నిధులు మంజూరు చేశారు. ఈ నిధులను రాష్ట్రంలో మహిళా పోలీసుస్టేషన్ల నవీకరణ , ఫోరెన్సిక్‌ ప్రయోగశాలల బలోపేతం ఉపయోగిస్తారు. ప్రతి జిల్లాలో ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు, దిశ కాల్‌సెంటర్‌, యాప్‌ల కోసం వినియోగించనున్నారు. విశాఖపట్నం, తిరుపతి ఫోరెన్సిక్‌ ప్రయోగశాలల్లో డీఎన్‌ఏ, సైబర్‌ విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్ ప్రయోగశాలలోని డీఎన్ఏ , సైబర్ విభాగాల్ని మరింత పటిష్ఠం చేయనున్నారు  డయల్‌ 100, 112లకు సంబంధించి ఒకే కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేసి దాన్ని దిశ కంట్రోల్‌ రూంగా పిలవనున్నారు. దిశ యాప్‌ కోసం కోటి 26 లక్షల రూపాయలను వినియోగించనున్నారు. ప్రతి బస్‌స్టాప్‌ సెంటర్‌కు ఒక మహిళా ఎస్సై పోస్టు మంజూరు చేశారు. ప్రత్యేక కేసుల విచారణ సందర్భంగా అదనపు విధులు నిర్వర్తించే మహిళా పోలీసుస్టేషన్‌ సిబ్బందికి 30 శాతం ప్రత్యేక భత్యం చెల్లించనున్నా

పాఠక మహాశయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ....

Image
జనహృదయం పాఠక మహాశయులకు, శ్రేయోభిలాషులకు, ప్రకటన కర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు...  గత ఏడాది ఆన్ లైన్ ఎడిషన్ ప్రారంభించినప్పటినుండి మీరంతా జనహృదయం వెబ్సైటి ను ఆదరించి ప్రోత్త్సహించిన విదంగా 2020లో కూడా మీ సహాయ సహకారాలు అందిస్తూ ఆదరించాలని మనవి చేస్తున్నాను. మీకు మీ కుటుంభ సభ్యులకు దేవుని ఆశీర్వాదములు ఎల్లప్పుడూ ఉండి ఎన్నో విజయాలు వరించాలని దేవుని ప్రార్థిస్తున్నాను.  మీరు కోరినవన్నీ జరిగి నూతన ఉత్సాహముతో, ప్రశాంతతతో ముందుకు సాగాలని  ఆశిస్తున్నాను. మీ రాజన్ ... ఎడిటర్, జనహృదయం దిన పత్రిక