Posts

Showing posts from January, 2021

ఏపీలో స్థానిక సమరంరానికి మోగిన నగారా

Image
  విజయవాడ: ఏపీలో ‌ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. విజయవాడలోని ఎస్‌ఈసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తొలివిడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ శనివారం ఉదయం విడుదల చేశారు.    నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. తొలి దశలో విజయనగరం, ప్రకాశం జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో ఎన్నికలు ఉంటాయని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి ముందుకెళ్తున్నట్టు రమేశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. రాజ్యాంగం రచించిన అంబేడ్కర్‌ మానసపుత్రికే ఎన్నికల సంఘం. ఎన్నికలు సకాలంలో నిర్వహించడం కమిషన్‌ విధి. ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం నుంచి మిశ్రమ అనుభవాలు ఉన్నాయి. నిన్న హాజరు కావాలని కోరినా అధికారులు రాలేదు. మధ్యాహ్నం 3గంటలకు సీఎస్‌, పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి హాజరుకావాలని కోరాం’’ అని ఎన్నికల కమిషనర్‌ తెలిపారు.  రెవెన్యూ డివిజన్‌ ప్రాతిపదికగానే ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు.   సుప్రీంకోర్టు నిర్ణయం వస్తే తప్పకుండా పాటిస్తామని ఎస్‌ఈసీ స్పష్టం చేశారు.  

ఫ్లాష్ .... ఫ్లాష్.... రామతీర్ధం ఘటన కేసు సీఐడి కి బదిలీ ... ఏపీ ప్రభుత్వ నిర్ణయం ...

అమరావతి : దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసమైన ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన నేపథ్యంలో జగన్ సర్కారు ఓ అడుగు ముందుకేసింది. ఈ కేసులో విచారణ సిఐడికి అప్పగిస్తూ  నిర్ణయం తీసుకుంది.  ఈ మేరకు  విజయనగరం జిల్లా రామతీర్థం ఘటన పై ఏపీ సర్కార్ సిఐడి కి విచారణకు ఆదేశించింది.  రాజమండ్రి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం పై దాడి ఘటనలో కూడా సిఐడి విచారణ చేపట్టనుంది . రెండు రోజుల్లో దోషులను గుర్తించి అరెస్టు చేస్తారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటించారు  

అక్క చెల్లెమ్మలకు సొంత గూడు ప్రభుత్వ లక్ష్యం

Image
  నర్సీపట్నం : నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పధకంలో భాగంగా ఆదివారం పాయకరావుపేట నియోజక వర్గం కోటవురట్ల మండలం పాములవాక, పీ కే పల్లి, చినబొ డ్డేపల్లి , ఆకసాహెబ్ పేట గ్రామ పంచాయతీ లకు చెందిన 211 మంది సొంత ఇళ్లు లేని అర్హులైన పేద లబ్ది దారులకు స్థల పట్టాలను రెవెన్యూ శాఖా మాత్యులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు కావలసిన అవసరాలను అడగకుండానే తీరుస్తూ ప్రజారంజకమైన పాలన అందిస్తున్నారన్నారు. అర్హులందరికీ వైయస్సార్ జగన్ అన్న కాలనీలలో ఇళ్ల స్థలాలను ఇవ్వడంతో పాటు, ఇంటి నిర్మాణాలను చేపట్టి గ్రామగ్రామాన పండగ వాతావరణాన్ని కల్పిస్తున్నారన్నారు . ప్రతి నిరుపేద కుటుంబంలో ముందుగానే సంక్రాంతి పండుగ వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని నవరత్నాలలో సొంత ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇంటికి స్థలాలను ఇస్తున్నారని, అంతే కాకుండా వాటి నిర్మాణాలను కూడా చేపట్టి మహిళ లను ఇంటి యజమానులుగా చేస్తున్నారన్నారు. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు విద్య వైద్య రంగాలకు కూడా ప్రాముఖ్యత కల్పిస్

అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు మంజూరు కు కృషి…..

Image
  నర్సీపట్నం: అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆదివారం విశాఖ జిల్లా నర్సీపట్నం విచ్చేసిన ఆయనను ఎ.పి.డబ్ల్యు.జె.ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. ఈశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిసారు.ఈ సందర్భంగా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు అంశంపై మాట్లాడి వినతి పత్రం అందజేశారు.  రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాల్సిందిగా మంత్రిని కోరారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు అక్రిడిటేషన్ గడువును పొడిగిస్తూ వచ్చారు తప్ప నూతనంగా అక్రిడేషన్ కార్డు ఇవ్వలేదని, ఈ విషయంలో సమాచార శాఖ అధికారులు సైతం జర్నలిస్టులను అయోమయానికి గురి చేస్తున్నారన్నారని మంత్రి కి తెలిపారు. జర్నలిస్టు సంఘాలు లేకుండా కమిటీ వేశారని ,దీనిపై ఒకసారి పునరాలోచన చేసి అధికారుల కమిటీని రద్దు చేసి, జర్నలిస్టు సంఘాల కమిటీ నియమించాలని, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు సౌకర్యం కల్పించాలని మంత్రి ని కోరారు.  అదేవిధంగా అర్హులైన ప్రతి జర్నలిస్టు

రామతీర్థంలో విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనలో 12 మంది అనుమానితులను అరెస్

Image
  విజయనగరం జిల్లా రామతీర్థంలో విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసులు 12 మంది అనుమానితులను అరెస్టు చేశారు. రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్ రామతీర్థం ఆలయానికి వచ్చి పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రుల బందోబస్తుకు వచ్చిన జిల్లా ఎస్పీ బి.రాజకుమారి ఈ ఘటనకు సంబంధించి మీడియాకు కీలక విషయాలు వెల్లడించారు. రామతీర్థం విగ్రహ ధ్వంసం ఘటనకు సంబంధించి ప్రస్తుతం దేవస్థానం చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో 12 మంది అనుమానితులను అరెస్టు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్పీ రాజకుమారి వెల్లడించారు. ఈ అరాచకానికి పాల్పడ్డ దుండగులను త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు.ఈ ఘటనపై దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను పట్టుకొని శిక్షిస్తామని చెప్పారు. దీని వెనుక ఎంతటి వారున్నా శిక్ష తప్పదని హెచ్చరించారు.

తల్లి పక్కలోంచి తెల్లారేసరికి బిడ్డ మాయం..

  హైదరాబాద్: ఫుట్ పాత్ పై జీవనం సాగిస్తున్న జంట. యాచనే వారి జీవనాధారం. నెల రోజుల క్రితం ఆ దంపతులకు ఓ పండంటి బాబు పుట్టాడు. వారిని రోజూ గమనిస్తున్న ఓ వ్యక్తి వారి వద్దకు ఓ ఆఫర్ తో వచ్చాడు. ’మీ అబ్బాయిని నాకివ్వండి. మీరు జీవితంలో సంపాదించలేనంత డబ్బు ఇస్తా.‘ అని ఆఫర్ ఇచ్చాడు. దానికి ఆ తల్లి ఒప్పుకోలేదు. సరే మీ ఇష్టమంటూ అతడు వెళ్లిపోయాడు. కానీ ఇది జరిగిన కొద్ది రోజులకే ఆ బిడ్డ మాయమయ్యాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ మొదలు పెట్టి సీసీ కెమెరాలను పరిశీలిస్తే ఓ షాకింగ్ నిజం బయటకొచ్చింది. హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఈ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యాచించడమే జీవన వృత్తిగా బతుకుతున్న ఓ జంట, హైదరాబాద్ లో వివిధ ప్రాంతాల్లో ఫుట్ పాత్ లపై ఉంటోంది. ఒక చోట స్థిరంగా ఉండకుండా నెలకోసారి ప్రాంతం మారుతూ యాచన చేస్తున్నారు. వీరికి ఓ నెల రోజుల క్రితం బాబు పుట్టాడు. ఈ జంటను కొద్ది రోజులుగా గమనిస్తున్న ఓ వ్యక్తి ఓ రోజు వారి వద్దకు వచ్చాడు. ‘మీకు 70 వేల రూపాయలు ఇస్తా. ఈ బాబును నాకివ్వండి. పెద్ద పెద్ద ఇళ్లల్లో వాళ్లకు పిల్లలు లేక బాధపడుతున్నారు. మీ బాబు వాళ్

విశాఖలో ఉగాది నుండి ప్రారంభం కానున్న ఎగ్జిక్యూటి క్యాపిటల్

Image
  అమరావతి  :   ఏప్రిల్ 13 ఉగాది. ఉగాది పురస్కరించుకొని విశాఖ పరిపాలన రాజధాని ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అధికారులు సమాయత్తం కావాలని రాష్ట్ర ప్రభుత్వం సచివాలయంలో ఉన్నతాధికారులకు ఆదేశించినట్టు తెలిసింది. దీనిపై ప్రస్తుతం హైకోర్టులో ఉన్న కేసులు అన్నీ ఏప్రిల్ నాటికి తీరిపోతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధాని తరలింపునకు సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్త ముహూర్తం ఫిక్స్ చేసింది. 2021 ఉగాది నుంచి మార్చాలని డిసైడైంది. ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఉగాది నుంచి ప్రభుత్వం పరిపాలనా రాజధాని విశాఖకు తరలించాలని నిర్ణయించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వం అందుకోసం చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టాన్ని అసెంబ్లీ ఆమోదించింది. దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో కూడా పలుమార్లు రాజధాని తరలింపునకు సంబంధిచిన ప్రచారం జరిగింది. అయితే, అది వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఈ సారి ఉగాదికి కచ్చితంగా మార్పు ఖాయమని భావిస్తున్నారు.

ఏపీలో దేవాలయాలకు జియో ట్యాగింగ్ ... డిజిపి గౌతమ్ సవాంగ్

Image
  అమరావతి: రాష్ట్రంలోని  దేవాలయాలకు  జియో ట్యాగింగ్‌, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని  డీజీపీ సవాంగ్ ప్రకటించారు.  ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా దేవాలయాల విధ్వంసం కొనసాగుతుండటంతో పోలీసు శాఖ అప్రమత్తమయ్యింది. ఇందులో భాగంగా దేవాలయాలు, ప్రార్థనా మందిరాల దగ్గర నిరంతర నిఘా కొనసాగుతుందని డీజీపీ సవాంగ్ ప్రకటించారు. పోలీసుశాఖతోపాటు అన్ని శాఖలు  అప్రమత్తంగా ఉన్నాయని చెప్పారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. భద్రతా చర్యలను పర్యవేక్షించాలని జిల్లాల ఎస్పీలను ఆదేశించారు. విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో 400 ఏండ్ల నాటి శ్రీరాముడి విగ్రహాన్ని గత నెల 28న (సోమవారం) దుండగులు ధ్వంసం చేశారు. తల భాగాన్ని వేరుచేసి ఎత్తుకెళ్లారు. విషయాన్ని గుర్తించిన అర్చకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో ఏపీ రాజకీయాలకు రామతీర్థం కేంద్ర బిందువుగా మారింది. శనివారం  ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.  ఇదంతా  టీడీపీ కార్యకర్తల పనేని, తమ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయడానికే పచ్చపార్టీ ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నదని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. 

భారత్ లో కరోనా టీకాలకు డీసీజీఐ అనుమతి

Image
  ఢిల్లీ :  కరోనా మహమ్మారితో  పోరాటం చేస్తున్న భారతావనికి డీసీజీఐ ఊరట కల్పించింది.  ఈ మేరకు ఆదివారం   కోవాగ్జిన్,  కొవిషీల్డ్ వ్యాక్సిన్ల అత్యవసర అనుమతికి డిసీజీఐ ఆమోదం తెలిపి శుభవార్త చెప్పింది. కోవాగ్జిన్‌ను భారత్ బయోటెక్ అభివృద్ధి చేయగా.. కోవిషీల్డ్‌ను ఆక్స్ ఫర్డ్, అస్త్రాజెనకా, సీరం ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా కలిసి అభివృద్ధి చేశాయి.కరోనా వ్యక్సి న్ పై పలు పరిశోధనలు అనంతరం ఈ మేరకు నిరయం ప్రకటించింది.  ఈ సందర్భంగా డీసీజీఐ డైరెక్టర్‌ విజి సోమాని మాట్లాడుతూ.. కొవాగ్జిన్‌ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. ఈ వ్యాక్సిన్లతో ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు. కోవాగ్జిన్‌, కోవిషీల్డ్‌ వ్యాక్సిన్లను రెండు డోసులుగా ఇవ్వాల్సి ఉంటుంది. నిపుణుల కమిటీ అన్ని అంశాలు పరిశీలించాకే రెండు వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. . డిసీజీఐ అనుమతితో మరో వారం రోజుల్లోనే భారత్‌లో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. డీజీసీఐ ప్రకటనపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. కాగా  వ్యాక్సిన్‌ అభివృద్దికి కృషి చేసిన శాస్త్రవేత్తలకు మోదీ అభినందనలు తెలిపారు.  

హైదరాబాద్ టు విజయవాడ స్పెషల్ ఫ్లైట్స్ .....సంక్రాంతి వేళ

Image
  విజయవాడ :  హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లేవారికి ప్రత్యేక విమాన సర్వీసులు మొదలు కాబోతున్నాయి. గన్నవరం విమానాశ్రయం నుంచి సంక్రాంతికి అదనపు సర్వీసులు ఆరంభమవుతున్నాయి. ఇప్పటికే స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థ సంక్రాంతి రద్దీ కోసం జనవరి 10 నుంచి 31వరకు హైదరాబాద్‌కు ప్రత్యేక విమానాలను ప్రకటించి  ఏపీ ప్రయాణికులకు శుభవార్తతెలిపింది.  ఈ మేరకు జనవరి 10 నుంచి ప్రతిరోజూ సాయంత్రం 4.30కు హైదరాబాద్‌లో బయల్దేరి.. విజయవాడకు విమానం చేరనుంది. అలాగే సాయంత్రం 6 గంటలకు విజయవాడలో బయల్దేరనున్న విమానం రాత్రి 7.10కి హైదరాబాద్‌కు చేరుతుంది. మరికొన్ని విమానయాన సంస్థలు కూడా సంక్రాంతి రద్దీకి అనుగుణంగా సర్వీసులను నడిపే యోచనలో ఉంది. ఈ విమాన సర్వీసుల షెడ్యూల్‌ను తాజాగా స్పైస్‌జెట్‌ విమాన సంస్థ ప్రకటించింది. 

ఏపీలో దేవతా విగ్రహాలపై దాడులు

Image
  విజయవాడ :   విజయవాడలోని పండిట్ నెహ్రు బస్ స్టేషన్ సమీపంలో ఉన్న సీతారామ మందిరంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.  రామతీర్థంలో శ్రీరాముని విగ్రహం ధ్వంసం ఘటన మరువక ముందే తాజాగా విజయవాడలో తాజాగా  మరో ఘటన చోటు చేసుకుంది. ఏపీలో దేవతా విగ్రహాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. వివరాల్లోకి వెళ్తే తాళం వేసి ఉన్న మందిరంలోని సీతమ్మవారి విగ్రహం ధ్వంసమై ఉంది. ఈ ఘటనపై ఆర్టీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఈ పని చేశారా.? లేక విగ్రహం కిందపడి పగిలిపోయిందా.? అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

విశాఖ జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీ

Image
                                                               ( జనహృదయం - ప్రతినిధి)   నర్సీపట్నం నియోజక వర్గం..        నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం లో భాగంగా   శనివారం నర్సీపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు   పెట్ల ఉమాశంకర్ గణేష్  మాకవరపాలెం మండలం పైడిపాల , పెద్దిపాలెం, బురుగు పాలెం, తడపాల, తూటిపాల గ్రామాలకు  చెందిన అర్హులైన లబ్ధిదారులకు వైయస్సార్ జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు.              ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల అభివృద్ధి కొరకు పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. సొంత ఇల్లు లేని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం జరుగుతున్నదన్నారు. అంతేకాకుండా ఇళ్లను నిర్మించి ఇవ్వడం జరుగుతుందన్నారు.          ఈ కార్యక్రమంలో   మండల తాసిల్దార్  రాణి అమ్మాజి, ఇతర రెవిన్యూఅధికారులు ,సిబ్బందిహాజరయ్యారు.   చోడవరం నియోజక వర్గం..            చోడవరం నియోజక వర్గ శాసన సభ్యులు కరణం ధర్మ శ్రీ  శనివారం రోలుగుంట మండలం కొంత్లాం, అడ్డ సరం, కంచుగుమ్మల, శరభ వరం, లోసంగి గ్రామాలు,              రావికమతం

పాడి రైతులకు నాలుగు కోట్ల 35 లక్షల పంపిణీ

Image
నర్సీపట్నం : పాడి పరిశ్రమ అభివృద్ధికి రైతులంతా పట్టుదలతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ పిలుపునిచ్చారు.  మండలంలో విశాఖ డైరీ ఆధ్వర్యంలో నర్సీపట్నం డివిజన్ స్థాయిలో సంక్రాంతి బోనస్ కింద పాడి రైతులకు నాలుగు కోట్ల 35 లక్షల రూపాయలు చెక్కులను అందజేస్తున్న టు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు.  ఈ కార్యక్రమంలో విశాఖ డైరీ డైరెక్టర్ సూర్యనారాయణ, మేనేజర్ సత్యనారాయణ. వైకాపా అధ్యక్షుడు సత్యనారాయణ పాల్గొన్నారు.

పేదలందరికీ ఇల్లు

Image
విశాఖపట్నం: పేదలందరికీ గూడు కల్పించే దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. పెందుర్తి నియోజకవర్గం వేపగుంట – పినగాడి రోడ్, చీమలాపల్లి గ్రామంలో ఉన్న మీనాక్షి కన్వెన్షన్ లో నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ , రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొని..పేద ప్రజలకు ఇళ్ల పట్టాలను అందించారు. ముందుగా కార్యక్రమాలను పురస్కరించుకొని వేపగుంట జంక్షన్ లో అధిక సంఖ్యలో జనం ఘన స్వాగతం పలికారు. అనంతరం *స్వర్గీయ డా.వై.ఎస్. రాజశేఖరరెడ్డి గారి* విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభాప్రాంగణం (మీనాక్షి కన్వెన్షన్) వరకు భారీ బైక్ రాలీ నిర్వహించారు. ఇళ్ల పట్టాలు పంపిణీ అనంతరం ..శ్రీరాంపురం గ్రామం కొనేరులో శ్రీశ్రీశ్రీ శివ, పార్వతుల విగ్రహాన్ని మంత్రులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే అదీప్ రాజ్, జిల్లా, నియోజకవర్గ స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు ప

ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా కొత్త వైరస్ స్ట్రెయిన్

Image
బెంగళూరులో 144 సెక్షన్.. బెంగళూరు: ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా కొత్త వైరస్ స్ట్రెయిన్ సోకిన నేపథ్యంలో శివమొగ్గలోవారు నివసిస్తోన్న సావర్కర్ నగర్ ప్రాంతంలో కొత్త వ్యక్తులను రానివ్వట్లేదు. ఈ ప్రాంతం మొత్తాన్ని శానిటైజేషన్ చేశారు. 39 మందిని సెకెండరీ కాంటాక్ట్‌గా గుర్తించారు. వారికి పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌గా తేలినట్లు జిల్లా వైద్యాధికారి రాజేష్ సురగిహళ్లి తెలిపారు. కొత్త కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, కోవిడ్ ప్రొటోకాల్‌ను అనుసరిస్తున్నామని చెప్పారు. ఉద్యాననగరి బెంగళూరులో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ కలకలం రేపుతోంది. ఇప్పటికే ఏడు కేసులు బెంగళూరు సిటీలో వెలుగులోకి వచ్చాయి. బ్రిటన్ నుంచి వచ్చిన ఆ ముగ్గురిలోనూ కొత్త కరోనా లక్షణాలు కనిపించాయి. బెంగళూరుకే పరిమితమైందనుకున్న కరోనా కొత్త వైరస్ శివమొగ్గ జిల్లా వరకూ పాకింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి కొత్త కరోనా వేరియంట్ సోకింది. వారి సెకెండరీ కాంటాక్టును అధికారులు గుర్తించే పనిలో పడ్డారు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంది. కొత్త సంవత్సరాది వేడుకల

ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

Image
(ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పిలుపు) నర్సీపట్నం(జనహృదయం): ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని నర్సీపట్నం శాసనసభ్యుడు పెట్ల ఉమాశంకర్ గణేష్ పిలుపునిచ్చారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం లో భాగంగా గురువారం నర్సీపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు పెట్ల ఉమా శంకర్ గణేష్ నర్సీపట్నం అర్బన్ బలిఘట్టం,సుబ్బారాయుడు పాలెం గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు బైపురెడ్డిపాలెం వైయస్సార్ జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల అభివృద్ధి కొరకు పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. ఇచ్చిన మాట తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలు, కుల మతాల కతీతంగా లక్షల మంది సొంత ఇల్లు లేని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం జరుగుతున్నదన్నారు. అంతేకాకుండా ఇళ్లను నిర్మించి ఇవ్వడం జరుగుతుందన్నారు. రానున్ననూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ లలో ప్రతీ కుటుంబం సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నానన్నారు. నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాల ను మంజూరు చేయడం

మావోయిస్టు కార్యకలాపాలకు కరోనా ఎఫెక్ట్

Image
  ( పీవీ సత్యనారాయణ రావు- జనహృదయo ప్రత్యేక ప్రతినిధి) * 2020 లో తగ్గిన ప్రభావం * వర్గ శత్రువులు నడుమ తగ్గిన  ఉద్రిక్తత. నర్సీపట్నం : 2020 సంవత్సరం ప్రపంచ ప్రజల జీవనశైలిని మార్చేసింది.. సామాన్య ప్రజలు మొదలు మిలియనీర్లు..బిలియనీర్లు సైతం కరోనా మహమ్మారి ప్రభావానికి విలవిల లాడుతున్నారు.. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ చిన్నా భిన్నమైంది..ఈ ప్రభావానికి సీపీఐ మావోయిస్టులు సైతం అతీతం కాలేదు. లాక్ డౌన్ ముందు…లాక్ డౌన్ తర్వాతగా విభజించుకుంటే ఆంధ్రా- ఒడిస్సా సరిహద్దు (ఏఓబీ) జోన్ ఈస్ట్ డివిజన్ పరిధిలోని మావోల ప్రభావం తగ్గుముఖం పట్టిందనే చెప్పాలి.గత కోద్ది సంవత్సరాల నుండి వరుస ఎన్ కౌంటర్లు, అరెస్టులు, లోంగుబాట్లు కారణంగా కేడర్ పరంగా బలహీన పడిన మావోయిస్టు పార్టీ మనుగడ అంతంత మాత్రం గానే ఉంది.       కరోనా కష్టకాలంలో  గతంలో ఎన్నడూ లేనివిధంగా మావోయిస్టు పార్టీ ఆదీవాసీల సంక్షేమం కోసం అంటూ స్వచ్చంధ కాల్పులు విరమణ ప్రతిపాదించింది.అయితే మావోయిస్టుల ప్రతిపాదనను పట్టించుకోకుండా పోలీసులు ఒకవైపు గిరిజన గ్రామాల్లో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రజల్లో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, వైద్యశిబిరాలు నిర్వహ