Posts

Showing posts from October, 2021

క‌త్తిప‌ట్టి కొండ‌లెక్కిన విశాఖ జిల్లా పోలీస్ బాస్‌…

Image
  (రాజ‌న్ – జ‌న‌హృద‌యం ప్ర‌తినిధి) గంజాయి రవాణా, సాగు అధికంగా జ‌రుగుతున్న విశాఖ ఏజన్సీ మావోయిస్టుల కార్య‌క‌లాపాల‌కు అడ్డాగా నిలువ‌డంతో ఇంత‌కాలం గంజాయిసాగుపై కాస్త చూసిచూడ‌నట్టు వ్య‌వ‌హ‌రించిన పొలీసులు ఇక‌పై ఉక్కుపాదం మోపేందుకు సిద్ద‌మ‌య్యారు. ఏకంగా జిల్లా పోలీసు ఉన్న‌తాధికారే స్వ‌యంగా రంగంలోకి దిగి త‌న చేత క‌త్తి ప‌ట్టి గంజాయిసాగును నిర్మూలించేందుకు ఏజ‌న్సీ కొండ‌లు జ‌ల్లెడ ప‌డుతున్నారు. దీంతో విశాఖ పోలీస్ ప్ర‌శంస‌లు అందుకొంటోంది. గంజాయి ర‌వాణాఅరిక‌ట్టేంద‌కు పోలీసు, ఎక్సైజు అధికారులు రాత్రింబ‌వ‌ళ్లు కాపాలా కాసి ఎన్ని వాహ‌నాలు సీజ్ చేసినా, ఎంత‌మందిని క‌ట‌క‌టాల‌కు పంపినా విశాఖ ఏజ‌న్సీ కేంద్రంగా గంజాయి ర‌వాణా నిత్యం సాగుతూనే ఉంది. కొత్త‌కొత్త మార్గాల‌ను అన్వేషిస్తూ స్మ‌గ్ల‌ర్లు త‌మ ప‌ని చేసుకుపోతున్నారు. అయితే ఈ అక్ర‌మ ర‌వాణాలో సామాన్యులే అధికంగా బ‌లైపోతూ బ‌డా వ్యాపారులు చిక్క‌కుండా త‌మ చీక‌టి వ్యాపారాన్ని విస్త‌రిస్తూనే ఉన్నార‌నేందుకు నిత్యం ఈ ప్రాంతంతో పాటు తెలంగాణా, ఒరిస్సా రాష్ట్రాల‌లో పోలీసుల‌కు చిక్కుతున్న వారు ఇచ్చిన స‌మాచారం ప్ర‌కారం విశాఖ ఏజ‌న్సీ గంజాయి ర‌వాణా, సాగుకు అనుకూలంగా ని