Posts

Showing posts from April, 2020

ఏపీలో 1332 కు చేరిన కరోనా కేసులు

Image
అమరావతి : ఏపీలో పెరుగుతున్న కరోనా పరీక్షలకు దీటుగా పాజిటివ్ సంఖ్య పెరుగుతోంది.  ఈ మేరకు బుధవారం ఉదయం నాటికి ఈ కేసుల సంఖ్య 1332 కు చేరింది.   ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది.  రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 7727 శాంపిల్స్ను పరీక్షించగా కొత్తగా 73 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 1332 చేరింది. ఇప్పటివరకు ఈ వ్యాధి బారిన పడి 287 మంది కోలుకున్నారని తెలిపారు.  కాగా వైరస్ బారినపడి రాష్ట్రంలో ఇప్పటి వరకు 31 మంది మరణించారని పేర్కొ న్నారు.   ప్రస్తుతం 1014 యాక్టివ్ కేసులు ఉన్నట్టు ఆరోగ్యశాఖ వివరించింది. జిల్లాల వారీగా కరోనా బాధితులు కోరుకున్నవారు మృతుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఆన్లైన్లో పెళ్లి చేసుకున్న దంపతులు ...

Image
తిరువంతపురం: కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పుడు ఆన్లైన్ పెళ్లిళ్లు తెరపైకి వస్తున్నాయి.  'పాట రోజుల్లో పెళ్లంటే అటేడుత‌రాలు, ఇటేడుత‌రాలు గుర్తుండిపోయేలా అంగ‌రంగ వైభ‌వంగా వారం రోజుల‌పాటు చేసేవారు. ఆ త‌ర్వాతపెళ్లి తంతు ఒక్క‌రోజుకు మారింది. అయితే గతంతో పోలిస్తే ఖర్చు  మాత్రం పెరుగుతూ వ‌చ్చింది. స్తోమతను బట్టి వందలు, వేళల్లో జనం హడావిడి మాత్రం యధావిధిగా జరుగుతోంది. కొన్ని పెళ్లిళ్లు వధూవరులు ఉంటె చాలన్నట్లు జరుగుతుంటాయి.  అయితే  కరోనా పుణ్య‌మాని ఇప్పుడు ‌పెళ్లంటే వ‌ధూవ‌రులు కూడా ప‌క్క‌న, ఒక చోట ఉండాల్సిన ప‌ని లేకుండా పోయింది. ఎవ‌రెక్క‌డ ఉన్నా వారి చేతిలో ఫోన్ ఉంటే చాలు  పెళ్లి చిటికెలో ప‌ని అయిపోతుంది.  ఇదేంటని ఒకింత ఆశ్చర్యం కలిగినా ఇది నిజం.  వివరాల్లోకి వెళితే .. ..  తాజాగా ఓ జంట ఆదివారం నాడు ఫోన్‌లోనే పెళ్లిచేసుకొని ఆన్లైన్ పెళ్ళికి శ్రీకారం చుట్టింది. . కేరళకు చెందిన బ్యాంకు ఉద్యోగి  అయిన శ్రీజిత్‌ అల‌ప్పుజాలో‌ వ‌ధువు అంజ‌నా బంధువు ఇంటికి వెళ్లాడు. అక్క‌డ వ‌ధువు తండ్రి ఉండ‌గా, పెళ్లికూతురు, ఆమె త‌ల్లి, సోద‌రుడు ల‌క్నోలో ఉన్నారు. అనుకున్న ముహూర్తం ప్ర‌కారం మ‌ధ్యాహ్నం పన్నెండు గంట‌ల స‌మ‌

దేశంలో వెయ్యి దాటినా కరోనా మృతులు ...

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ తో గడిచిన 24 గంటల్లలో 73 మందిమృతి చెందడంతో  మొత్తం కరోనా మృతుల సంఖ్య 1007కి చేరింది. ఈ మేరకు  బుధవారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు భారత్‌లో 31,332 కరోనా కేసులు నమోడు అవగా  7,695 మంది కరోనా నుంచి కోలుకున్నారని, ప్రస్తుతం దేశంలో 22,629 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 9,318 కరోనా కేసులు నమోదు కాగా, 400 మంది మృతిచెందారు. ఆ తర్వాత గుజరాత్‌లో 3,744, ఢిల్లీలో 3,314, మధ్యప్రదేశ్‌లో 2,387, రాజస్తాన్‌లో 2,364, తమిళనాడులో 2,058, ఉత్తరప్రదేశ్‌లో 2,053 కరోనా కేసులు నమోదయినట్లు కేంద్రం పేర్కొంది. 

నేటి ముఖ్యాంశాలు

మూడో విడత రేషన్ పంపిణీకి సిద్ధం ►ఏపీలో నేటి నుంచి మూడో విడత ఉచిత రేషన్ పంపిణీకి ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.  రాష్ట్ర వ్యాప్తంగా బియ్యంకార్డు ఉన్న1,47,24,017 కుటుంబాలకు లబ్ది చేకూరే విధంగా రంగం సిద్ధం చేశారు.  అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న 81,862 పేద కుటుంబాలకు కూడా ఉచిత రేషన్ అందించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా  1,48,05,879 కుటుంబాలకు చేయూత అందించేందుకు ప్రభుత్వం వన్ కసరత్తు ముమ్మరం చేసింది. సొంత గూటికి చేరనున్న మత్స్యకారులు ► లాక్ డౌన్ కారణంగా గుజరాత్ లో చిక్కుకున్న ఏపీకి చెందిన మత్స్యకారులను తీసుకువచ్చేందుకు చేసిన ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ మేరకు వారు ఏపీకి చేరుకోనున్నారు.  గుజరాత్ లో చిక్కుకున్న ఐదువేల మంది మత్యకారులను 60 బస్సుల్లో విడతలవారీగా ఏపీకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి ►ఏపీలో  1,259 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా  ఇప్పటివరకు 258 మందిని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు.  ఈ మహమ్మారి బారినపడి 31 మంది మృతి చెందారు. ప్రస్తుతం 970 యాక్టివ్ కేసులు ఉండగా వారికి చికిత్స అందిస్తున్నారు. తెలంగాణ  : ►తెలంగాణలో  1,009 కరో

ఏపీలో 1259 కి చేరిన కరోనా కేసులు

అమరావతి:   ఏపీలో రోజు రోజుకి  కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 5783 మంది నుంచి శాంపిళ్లను సేకరించిి పరీక్షలు వారిలో 82 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ మేరకు తాజా హెల్త్ బులిటెన్  ఏపీ వైద్య ఆరోగ్య శాఖ  విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1259 కి చేరింది. కొత్తగా నమోదైన 82కేసుల్లో కర్నూల్ లో 40,గుంటూరు 17, కృష్ణా 13, కడప 7, నెల్లూరు 3, అనంతపురంలో 1, చిత్తూర్ లో 1 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 332 కేసులు, గుంటూరు 254,కృష్ణా జిల్లాలో 223 కేసులు నమోదు కాగాకరోనా పాజిటివ్ తో 258 మంది రోగులు కోలుకుని ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. వివిధ ఆసుపత్రుల్లో 970 మందికి చికిత్స కొనసాగుతోంది.

కరోనా పై ఆందోళన వద్దు సమర్ధవంతంగా ఎదుర్కొందాం : సీఎం

  అమరావతి  : రాష్ట్రంలో కరోనా పై ఆందోళన వద్దని సమర్థవంతంగా ఈ మహమ్మారిని ఎదుర్కొందాం అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ  రానున్న రోజుల్లో కరోనాతో కలిసి జీవించాల్సిసి వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతున్నామని, కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతుందని, కరోనా లక్షణాలు కనిపిస్తే ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్ష చేయించుకోవాలని సీఎం కోరారు.   ప్రతి 10 లక్షల జనాభాకు 1396 టెస్టులు చేస్తున్నామని  తెలిపారు. ఈనెల రోజుల్లో టెస్టింగ్‌ సౌకర్యాలను పెంచుకున్నామని, కరోనా వైద్య పరీక్షల కోసం రాష్ట్రంలో 9 వీఆర్‌డీఎల్‌, 44 ట్రూనాట్‌ ల్యాబ్‌లు కూడా ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకు 74,551 టెస్టులు చేశామని వెల్లడించారు. లాక్‌డౌన్‌కు సహకరిస్తున్న ప్రజలందరికి ధన్యవాదాలు తెలియజేశారు. రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లను ఇప్పటికే గుర్తించామన్నారు. రెడ్‌జోన్‌లో 63, ఆరెంజ్‌ జోన్‌లో 54, గ్రీన్‌ జోన్‌లో 559 మండలాలున్నాయని, 5 కోవిడ్‌ క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రులు ఏర్పాటు చేశామని తెలిపారు. క్వారంటైన్‌ సెంటర్లలో అన

ఏపీలో 1177 కి చేరిన కరోనా కేసులు

Image
అమరావతి : రాష్ట్రంలోను కరోనా  కేసుల సంఖ్య   1177 కి చేరింది.   గత 24 గంటల్లో 6517 శాంపిల్స్‌ను పరీక్షించగా80 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1177 కు చేరింది.   వైరస్‌ బారినపడి రాష్ట్రంలో ఇప్పటివరకు 31 మంది మరణించారని, 235 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది. ప్రస్తుతం ఏపీలో 911 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు ఆరోగ్యశాఖ పేర్కొంది. కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో నలుగురు రాజ్‌భవన్‌ సిబ్బందికి కరోనా సోకినట్టు ఆరోగ్యశాఖ పేర్కొంది. 

కరోనా ను జయించిన పసిప్రాయం

ఉత్తరాఖండ్ :  కరోనా మహమ్మారికి గురైన పసిప్రాయం కేవ‌లం ఆరు రోజుల్లోనే క‌రోనాను జ‌యించి 9 నెల‌ల బాలుడు రికార్డు సృష్టించాడు. దీనికి అక్కడి వైద్యులు సాధించిన ఘనత గా పేర్కొనవచ్చు. కాగా చిన్న వ‌య‌సులో, అతి త‌క్కువ స‌మ‌యంలో కోవిడ్ నుంచి బ‌య‌ట‌ప‌డిన‌ట్లు ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. ఈ ఘ‌ట‌న ఉత్త‌రాఖండ్లో చోటుచేసుకుంది. క‌రోనా ల‌క్ష‌ణాల‌తో ఏప్రిల్ 17న హాస్పిట‌ల్ లో చేర్పించ‌గా, క‌రోనా పాజిటివ్ అని తేలింది.  తండ్రి ద్వారా  చిన్నారికి కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు. శిశువు తండ్రి తబ్లీగా జమాత్‌కు వెళ్లి రాగా,  కరోనా సోకడంతో ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే చిన్నారి మాత్రం ఆరు రోజుల్లోనే ఈ మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు. 48 గంట‌ల వ్య‌వ‌ధితో రెండుసార్లు  కరోనా నెగిటివ్ రావ‌డంతో గురువారం చిన్నారిని డిశ్చార్జ్ చేశారు. ఈ సంఘటనపై  ఆసుపత్రి వైద్యులు ఎన్‌ఎస్‌ ఖాత్రి మాట్లాడుతూ 9 నెలల వయసున్న పసికందు కావడంతో ఈ కేసు ఛాలెంజింగ్‌గా తీసుకున్నామని అన్నారు. ఈ బాబు ఉ త‌ల్లికి మాత్రం క‌రోనా సోక‌లేదు. అయిన‌ప్ప‌టికీ చిన్నారితో పాటు తల్లి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నామని డాక్టర్లు వివరించ

ఏపీలో 893 చేరిన కరోనా పాజిటివ్ కేసులు

అమరావతి : ఏపీలో కొత్త‌గా 80 క‌రోనా వైర‌స్ పాజిటీవ్ కేసులు న‌మోదవగా, రాష్ట్రంలో పాజిటీవ్ కేసులు సంఖ్య 893 చేరింది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసింది. నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈ ఉదయం 9 గంటల వరకు 6522 మంది నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షించారు. వీటిలో కర్నూలు 31, గుంటూరు 18, చిత్తూరు 14, అనంతపురం 6, తూర్పుగోదావరి జిల్లా 6,  కృష్ణా 2, ప్రకాశం 2, విశాఖ జిల్లాలో 1 కేసు చొప్పున  కొత్త‌గా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో  ఇప్పటివరకు అత్యధికంగా కర్నూలు జిల్లాలో 234 కేసులు, గుంటూరు జిల్లాలో 195 కేసులు నమోదు అయినట్లు అయింది. కాగా ఇప్పటివరకు 27 మంది మృతి చెందగా, 141 మంది రోగులు కోలుకుని ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్‌ చేసినట్లు వైద్య వర్గాలు పేర్కొన్నాయి.

ప్రాణాయామం.. ప్రాణాన్ని నిల‌బెట్టింది

ఢిల్లీలో తొలి కరోనా బాధితుడు 45 ఏళ్ల వ్యాపారి  రోహిత్ దత్తా  పూర్తిగా కోలుకొని బయటపడ్డారు. ఆయన ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా కోవిడ్-19 బారి నుంచి తానెలా బయటపడిందీ వివరించారు. క‌రోనా సోకిన వాళ్లు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఏంటో సూచించారు. ఈ మేరకు గురువారం ఓ వీడియోను పోస్ట్ చేశారు. అది కాసేప‌టికే వైర‌ల్ అయ్యింది. ఈ వీడియోలో రోహిత్ ద‌త్తా మాట్లాడుతూ..ఆసుపత్రిలో ఉన్న 14 రోజులూ క్రమం తప్పకుండా యోగా, ప్రాణాయామం చేసేవాడిన‌ని వివరించారు. ఈ రెండింటితోనే తాను ఈ మహమ్మారి గండం నుంచి గట్టెక్కానని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు వీటిని అభ్యాసం చేయాలని సూచించారు.  కరోనాకు భయపడాల్సింది ఏమీ లేదని పేర్కొన్న రోహిత్ దత్తా యోగా, ప్రాణాయామం, మానసిక స్థైర్యం.. కరోనాను ఓడించేందుకు ఈ మూడే కీలకమన్నారు. రోహిత్ దత్తా ఫిబ్రవరి 24 న యూరప్ నుండి తిరిగి వచ్చారు. త‌ర్వాత   జ్వరంగా ఉండ‌టంతో స్థానికి  రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి వెళ్ల‌గా, అక్కడ క‌రోనా పాజిటివ్ అని నిర్ధారించారు.దీంతో హాస్పిట‌ల్‌లోనే క్వారంటైన్‌లో ఉంచిన‌ట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా వైద్య‌సిబ్బంది బాగా చూసుకున్నారని వివ‌రించారు. తనను తాను శారీరకంగ

ఏపీలో 813 కు చేరిన కరోనా కేసులు

అమరావతి :  ఏపిలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 56 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 813కు చేరింది. వీరిలో చికిత్స అనంతరం 120 మంది డిశ్చార్జ్‌ కాగా, మొత్తంగా 24 మంది మరణించారు. ఇక కరోనా బారిన పడి ప్రస్తుతం 669 మంది చికిత్స పొందుతున్నారు.  ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉదయం పదిగంటల మీడియా బులిటెన్ విడుదల చేసింది. జిల్లాల వారీ వివరాల ప్రకారం గత 24 గంటల్లో చిత్తూరులో 6, గుంటూరులో 19, కడపలో 5, క్రిష్ణాలో 3, కర్నూలులో 19, ప్రకాశంలో 4 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

25.55 లక్షలు దాటిన కరోనా కేసులు : ప్రపంచవ్యాప్తంగా

న్యూఢిల్లీ :  దేశంలో కొత్తగా  1383 కరోనా పాజిటివ్ కేసులు  నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.  కరోనా మహమ్మారి బారినపడి గడిచిన 24 గంటల్లో  50మంది మృతి చెందగా, 1383 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు  కు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బుధవారం ఉదయం కరోనా హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దేశంలో ఇప్పటివరకూ మొత్తం 19,984 పాటిజివ్ కేసులు నమోదు కాగా, 640 మంది మృతి చెందారు. ప్రస్తుతం యాక‍్టివ్‌ కేసులు 15,474 ఉన్నాయి. ఇక 3,870 మంది కరోనా వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.  దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మహారాష్ట్రలో కరోనా వైరస్‌ రోజు రోజుకూ విజృంభిస్తోంది. ఇప్పటివరకూ అక్కడ 5,218  కేసులు నమోదు అయ్యాయి. అలాగే 2,178 కరోనా కేసులతో గుజరాత్‌ రెండో స్థానంలో ఉంది. కేరళలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నిన్న ఒక్కరోజే అక్కడ 19 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. 25న్నర లక్షలు దాటిన కరోనా పోజిటివ్ కేసులు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు  25.55 లక్షలు దాటాయి. 1.77 లక్షల మంది మృతి చెందగా, 6.90 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. అలాగే అగ్

దేశంలో 19 వేలకు చేరువైన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య 19 వేలకు చేరువైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ పటిష్టవంతంగా అమలు చేయడం ద్వారా కరోనా మహమ్మారి కట్టడి చేసేందుకు అలుపెరగని పోరాటం చేస్తున్ననాయి దీనికి ప్రజలు కూడాాా తమ వంతు పూర్తి సహకారాన్ని అందించి తోడ్పాటు అందించాలని ప్రభుత్వాధినేతలు వేడుకుంటున్నారు. జాతీయం : ►  దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 18, 985కి చేరింది. ►  ఇప్పటివరకు దేశంలో 15,122 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ►  దేశవ్యాప్తంగా 603 మంది మృతి చెందారు. ►  ఇప్పటివరకు 3,259 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌: ► ఏపీలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 757కి చేరింది. ►చికిత్స పొందుతూ పూర్తిగా కోలుకొని మొత్తం 96మంది డిశ్చార్జి అయ్యారు. ► వివిధ కోవిడ్‌ ఆసుపత్రుల్లో 639 మంది చికిత్స పొందుతున్నారు. ►రాష్ట్రవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 22కు చేరింది. ► నేటి నుంచి రేడియోలో టెన్త్ పాఠాలు ప్ర్రారంభం ► నేడు వైద్యుల ‘వెలుగు హెచ్చరిక’ కార్యక్రమం జరగనుంది. ► నేటి నుంచి రైతుబజార్లలో కిలో రూ.20 చొప్పున బత్తాయి విక్రయాలు తెలంగాణ : ► తెలంగాణలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 928కి చేరింది. ► ప్రస్తుతం కరోనా బ

ఏపీలో మరో 35 కరోనా కేసులు.. 96 కు చేరిన డిశ్చార్జ్ సంఖ్య

అమరావతి : ఏపీలో కొత్తగా మరో 35 కరోనా కేసులు నమోదయ్యాయి. వాటితో కలిపి ఏపీలో  కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 757కి చేరింది.  ఏపీలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 96 మంది డిశ్చార్జ్‌ కాగా, 22 మంది మృతిచెందారు. ప్రస్తుతం ఏపీలో 639 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర నోడల్‌ అధికారి మంగళవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. గడిచిన 24 గంటల్లో కర్నూలు జిల్లాలో 10, వైఎస్సార్‌ కడప జిల్లాలో 6, అనంతపురం జిల్లాలో 3, గుంటూరు జిల్లాలో 9, కృష్ణా జిల్లాలో 3, పశ్చిమ గోదావరి జిల్లాలో 4 కరోనా కేసులు నమోదైనట్టు ప్రకటించారు.

సంగడ సబ్ సెంటర్ హెల్త్ అసిస్టెంట్ సస్పెన్షన్

పాడేరు (జనహృదయం) : ముంచంగిపుట్టు మండలం లబ్బూరు పి.హెచ్ సి పరిధి లోని సంగడ సబ్ సెంటర్ హెల్త్ అసిస్టెంట్ కె.చినసత్యనారాయణ ను సస్పెండ్ చేస్తూ ఐటీడీఏ పి.ఓ డి.కె .బాలాజీ మంగళవారం వారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.  కె. చిన్న సత్యనారాయణ. గతనెల 14 నుంచి విధులకు హాజరు కావడంలేదని చర్యలు తీసుకున్నారు. ఎపిడిమిక్ సమయంలో మలేరియా నిర్ములనా కార్యాచరణ సక్రమంగా అమలు చేయకపోవడం, విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన చర్యలు చేపట్టామన్నారు.పి ఓ డిటీటీ రత్నకుమార్ ను విచారణాధికారిగా నియమించారు. విచారించి నివేదికను సమర్పించాలని ఆదేశించారు. సస్పెన్షన్ ఉత్తర్వులు అమలు చేయాలని అదనపు జిల్లా వైద్యాధికారి ని ఆదేశించారు.

సత్తెనపల్లి ఘటనలో ఎస్సై సస్పెండ్

ఘటనపై భిన్నమైన ఆరోపణలు గుంటూరు  : జిల్లా లోని సత్తెనపల్లిలో ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన సోమవారం ఆందోళనకు దారి తీసింది. ఈ సంఘటనలోో మృతుని తండ్రి బంధువుల ఆరోపణలు విభిన్నంగా ఉన్నాయి. ఎస్‌ఐ కొట్టడంతో చనిపోయాడని బంధువుల ఓవైపు ఆరోపణ చేస్తుండగా పోలీసులు కొడతారనే భయంతో సృహ కోల్పోయాడని  మృతుని తండ్రి పేర్కొనడం గమనార్హం. పట్టణంలోని టింబర్‌ డిపో నిర్వాహకుడు షేక్‌ మహ్మద్‌ గౌస్‌(35) సోమవారం ఉదయం మందులు కొని ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి వెళుతుండగా నరసరావుపేటరోడ్డులో చెక్‌ పోస్టు వద్ద ఎస్‌ఐ రమేశ్‌ ఆపి మందలించారు. అప్పటికే పోలీసులు కొడతారనే భయంతో ఉన్న, హృద్రోగి అయిన గౌస్‌ పడిపోవడంతో తండ్రి  షేక్‌ మహ్మద్‌ ఆదం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గౌస్‌ మృతి చెందాడు. పోలీసుల దాడితోనే గౌస్‌ మరణించాడని ఆస్పత్రి ముందు, మృతదేహంతో పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బంధువులు ఆందోళన చేశారు. సీఐ పైనా దాడి చేశారు. ఎమ్మెల్యే అంబటి రాంబాబు జోక్యం చేసుకుని గౌస్‌ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని జిల్లా రూరల్‌ ఎస్పీని కోరడంతో ఆందోళన సద్దుమణిగింది. తర్వాత ఏఎస్‌పీ మాట్లాడుతూ ఆర్డీఓతో విచారణ చేయిస్తామని, పోలీసుల తప్ప

ఏపీలో మరో 35 కరోనా కేసులు

అమరావతి : ఏపీలో కొత్తగా మరో 35 కరోనా కేసులు నమోదయ్యాయి. వాటితో కలిపి ఏపీలో  కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 757కి చేరింది.  ఏపీలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 96 మంది డిశ్చార్జ్‌ కాగా, 22 మంది మృతిచెందారు. ప్రస్తుతం ఏపీలో 639 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర నోడల్‌ అధికారి మంగళవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. గడిచిన 24 గంటల్లో కర్నూలు జిల్లాలో 10, వైఎస్సార్‌ కడప జిల్లాలో 6, అనంతపురం జిల్లాలో 3, గుంటూరు జిల్లాలో 9, కృష్ణా జిల్లాలో 3, పశ్చిమ గోదావరి జిల్లాలో 4 కరోనా కేసులు నమోదైనట్టు ప్రకటించారు.

ఏపీలో 722 కరోనా కేసుల్లో 92 మంది డిశ్చార్జి

ఏపిలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 75 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో  కరోనా బాధితుల సంఖ్య 722కు చేరింది. వీరిలో 92 మంది డిశ్చార్జ్‌ కాగా, 20 మంది మరణించారు.  ఇక ప్రస్తుతం 610 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం కోవిడ్‌-19 కేసులకు సంబంధించిన బులెటిన్‌ను విడుదల చేసింది. ఈ మేరకు అనంతపురంలో కొత్తగా 4, చిత్తూరులో 25, తూర్పు గోదావరిలో 2, గుంటూరులో 20, కడపలో 3, క్రిష్ణాలో 5, కర్నూలులో 16 కేసులు నమోదయ్యాయి. ఇక నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొత్తగా ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు. రాష్ట్రంలో కొత్తగా డిశ్చార్జ్‌ అయిన వారి వివరాలు గడిచిన 24 గంటల్లో 27 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. గుంటూరులో 15, కృష్ణలో 10, విశాఖపట్నంలో ఇద్దరు డిశ్చార్జ్‌ అయ్యారు. కొత్తగా నమోదైన మరణాలు అనంతపురం, కృష్ణ, కర్నూలు జిల్లాల్లో కోవిడ్‌తో ఒక్కొక్కరు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 20కి చేరింది. టాప్‌‌-2లో ఆంధ్రప్రదేశ్‌ కోవిడ్‌– 19 నివారణ చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా  వైర

పోలీసు లాఠీ కి ఓ నిండు ప్రాణం బలి

గుంటూరు:  జిల్లా లోని సత్తెనపల్లి పట్టణంలో ఓ వ్యక్తి పోలీస్ లాఠీకి బలయ్యారన్న వార్త దావానలంలా వ్యాపించింది. వివరాల్లోకి వెళితే  సతైనపల్లి పట్టణంలోని వెంకటపతికాలనీకి చెందిన షేక్ మొహమ్మద్ గౌస్ సోమవారం ఉదయం నిత్యావసర సరుకుల కోసం బయటకు వచ్చిన సందర్భంలో పోలీసులు ఆపి వివరాలు సరైన సమాధానం చెప్పకపోవడంతో పోలీస్ సిబ్బంది అతనిని లాఠీతో కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయాడు వెంటనేే పోలీస్ వాహనంలో దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు అయితే మహమ్మద్ గౌస్ కి ఇదివరకే గుండె నొప్పి ఉండడం తో పోలీసు దెబ్బలకు భయాందోళనకు గురై సృహ కోల్పోయి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. శాఖాపరమైన దర్యాప్తు చేసి చర్య తీసుకుంటాం ఈ ఘటనపై గుంటూరు ఐజి ప్రభాకర్ మాట్లాడుతూ జరిగిన సంఘటనపై శాఖాపరమైన విచారణ చేపడతామని పోలీసులు తప్పు చేస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు కాగా మహమ్మద్ లాక్ డౌన్ ఈ సమయంలో గౌస్ రోడ్డుపై ప్రయాణిస్తూ పోలీసులు అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేక భయపడి ఇదివరకున్న గుండె నొప్పి మళ్లీ రావడంతో అపస్మారక స్థితిలో చేరిపోయాడు చేరుకున్నాడని అతనిని ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మృతి చెందాడని వైద్యులు పేర్

దేశంలో 16 వేలు దాటిన కరోనా కేసులు

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులను తగ్గించేందుకు పటిష్టవంతంగా లాక్ డౌన్ అమలు చేసేందుకు ప్రభుత్వం ఓవైపు కసరత్తు చేస్తూనే ఆర్థిక రంగం గాడిన పడేందుకు తగిన ఏర్పాట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాయి. దేశ  ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది దీనిని కట్టడి చేసేందుకు అక్కడి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుంది అలాగే తెలంగాణలో లాక్ డౌన్ మే 7 వరకు కొనసాగిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు ఏపీలోనూ రెడ్ జోన్ ఆరంజ్ జోన్లలో లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేస్తూ బ్లూ జోన్ ఏరియా లో కూడా ప్రజలు సామాజిక దూరం పాటించే విధంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయం : ►  దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 16,116 కి చేరింది. ►  దేశంలో ఇప్పటి వరకు కరోనాతో 519 మంది మృతి చెందారు. ►  దేశవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని 2,302 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ►  దేశంలో ప్రస్తుతం 13,295 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ►  నేటి నుంచి పని చేయనున్న లోక్‌సభ, రాజ్యసభ సెక్రటేరియట్‌లు ఆంధ్రప్రదేశ్‌ : ►  ఏపీలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 647కి చేరింది. ►  కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 67 మంది

అమ్మా నీకు వందనం : డీజీపీ గౌతమ్ సవాంగ్

Image

దేశంలో 15 వేల 700 దాటిన కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో లాక్‌డౌన్‌ ప్రకటించి నెల రోజులు గడుస్తున్నా  రోజురోజుకు  కొత్త కరోనా కేసులు పెరిగిపోతూ అందరినీ ఆందళోనకు గురిచేస్తోంది. ఆదివారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశంలో కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 15 వేల 700 దాటింది. గత 24 గంటల్లో 1334 మందికి పాజిటివ్‌గా తేలడంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 15,712కు చేరింది. దేశంలో ఇప్పటివరకు ఈ మహమ్మారి కారణంగా 507 మంది మృతి చెందగా..  2,230 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 12,794 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 3,648 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 211 మంది మరణించారు. మహారాష్ట్ర తర్వాత ఢిల్లీ (1,893), మధ్యప్రదేశ్‌(1,402), రాజస్తాన్‌ (1,395) రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదయ్యాయి. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కలవర పెడుతున్న కరోనా పాజిటివ్ కేసులు 647కు చేరుకున్న కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య గడచిన 24 గంటల్లో కొత్తగా 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదు *ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ 129 బులిటెన్‌ విడుదల* కర్నూల్ లో అత్యధికంగా 26 కరోనా పాజిటివ్ కేసులు అనంతపురం లో 3, విశాఖలో 1, కృష్ణాలో 6, ప గో లో 5, గుంటూరులో 3 కర

ఓ పేద మహిళలకు సెల్యూట్ చేసిన డిజిపి

(విజయవాడ - జనహృదయం) అమ్మా నీకు వందనం నీ తల్లి ప్రేమకు ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ వందనం చేస్తుందంటూ రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ ఓ పేద మహిళకు సెల్యూట్ చేశారు శనివారం డిజిపి తన కార్యాలయం నుండి  తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న లోకమని తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ ఆమెకు సెల్యూట్ చేశారు. ఆమె పేరు లోకమని తూర్పుగోదావరి జిల్లాలోని ఓ పల్లెటూరు ఈమె చేసిన పనికి డీజీపీ స్పందించి సెల్యూట్ చేశారు. వివరాల్లోకి వెళితే కన్నతల్లికి తన పిల్లల ఆకలి దప్పికలు తెలుస్తాయి అన్నట్టు  పోలీసులు లాక్ డౌన్ సందర్భంగా మండుటెండను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న తీరును చూసి చలించిపోయిన ఆ తల్లి తన దగ్గర ఉన్న డబ్బులతో కూల్ డ్రింక్ బాటిల్ తెచ్చి పోలీసులకు ఇవ్వడం తల్లి ప్రేమను రుజువు చేసినట్లయిందని డీజీపీ పేర్కొన్నారు ఈ ఘటన పోలీసులకు తమ తల్లులను గుర్తు చేసిందని అన్నారు పోలీసుల విధి నిర్వహణలో ఇటువంటి సంఘటనలు ఆత్మస్థైర్యాన్ని నింపి మరింత బాధ్యతాయుతంగా ముందుకు సాగేందుకు దోహదపడతాయని డిజిపి అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా ఆ అమ్మకు  డీజీపీ గౌతమ్ సవాంగ్ వందనం చేశారు కేవలం నెలకు మూడు వేల ఐదు వందలు రూపాయల జీతం ఉన్న పేద తల్లి పో

ఓ పేద మహిళలకు సెల్యూట్ చేసిన డిజిపి

Image
(విజయవాడ – జనహృదయం) అమ్మా నీకు వందనం నీ తల్లి ప్రేమకు ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ వందనం చేస్తుందంటూ రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ ఓ పేద మహిళకు సెల్యూట్ చేశారు శనివారం డిజిపి తన కార్యాలయం నుండి  తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న లోకమని తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ ఆమెకు సెల్యూట్ చేశారు. ఆమె పేరు లోకమని తూర్పుగోదావరి జిల్లాలోని ఓ పల్లెటూరు ఈమె చేసిన పనికి డీజీపీ స్పందించి సెల్యూట్ చేశారు. వివరాల్లోకి వెళితే కన్నతల్లికి తన పిల్లల ఆకలి దప్పికలు తెలుస్తాయి అన్నట్టు  పోలీసులు లాక్ డౌన్ సందర్భంగా మండుటెండను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న తీరును చూసి చలించిపోయిన ఆ తల్లి తన దగ్గర ఉన్న డబ్బులతో కూల్ డ్రింక్ బాటిల్ తెచ్చి పోలీసులకు ఇవ్వడం తల్లి ప్రేమను రుజువు చేసినట్లయిందని డీజీపీ పేర్కొన్నారు ఈ ఘటన పోలీసులకు తమ తల్లులను గుర్తు చేసిందని అన్నారు పోలీసుల విధి నిర్వహణలో ఇటువంటి సంఘటనలు ఆత్మస్థైర్యాన్ని నింపి మరింత బాధ్యతాయుతంగా ముందుకు సాగేందుకు దోహదపడతాయని డిజిపి అభిప్రాయపడ్డారు.   ఈ సందర్భంగా ఆ అమ్మకు  డీజీపీ గౌతమ్ సవాంగ్ వందనం చేశారు కేవలం నెలకు మూడు వేల ఐదు వందలు రూపాయల జీతం ఉన్న పేద తల్లి

దేశంలో 24 గంటల్లో 1007 కేసులు, 23 మరణాలు

  దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1,007 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 23 మరణాలు సంభవించాయయని వైద్యారోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,387 చేరాయని, మొత్తం మరణాల సంఖ్య 437కు చేరిందని తెలిపారు. కరోనా బారినపడిన 1749 మంది కోలుకున్నారని తెలిపారు. ఇది 13.06శాతంతో సమానమని చెప్పారు. ప్రతి 24 నమూనాళ్లో 1 కరోనా పాజిటివ్ కేసు నమోదవుతోందని అగర్వాల్ వెల్లడించారు. లాక్‌డౌన్‌కు ముందు దేశంలో కరోనా కేసుల సంఖ్య రెట్టింపు అవ్వడానికి కేవలం మూడు రోజులు మాత్రమే పట్టేదని.. అయితే, లాక్‌డౌన్ కాలంలో గత రోజుల డేటాను పరిశీలిస్తే కేసుల రెట్టింపునకు కనీసం 6.2 రోజులు పడుతోందని వివరించారు. 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేసుల రెట్టింపు సరాసరి జాతీయ సగటు కంటే తక్కువగా ఉందని చెప్పారు కేరళ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, తమిళనాడు, హర్యానా, ఢిల్లీ, బీహార్, ఒడిశా, తమిళనాడు, తదితర రాష్ట్రాలు జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్నాయన్నారు. కరోనా కారణంగా కోలుకుంటున్న వారి సంఖ్య , మరణిస్తున్న వారి నిష్పత్తి 80:20గా ఉందని అగర్వాల్ వివరించారు. ఇతర దేశాలతో పోలిస్తే

లాక్ డౌన్ అమలుకు కేంద్రం మార్గ నిర్దేశాలు

Image
  దేశంలో మే 3 వరకు జరగనున్న లాక్ డౌన్ అమలు తీరు తెన్నుల పైన కరోనా వైరస్‌ని పూర్తిగా కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం  మార్గ దర్శకాలు జారీ చేసింది.  ఏప్రిల్ 20 తర్వాత మాత్రం కొన్నింటికి మినహాయింపు ఇచ్చింది. వ్యవసాయం, కొన్ని పరిశ్రమలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపులు ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్, తయారీ యూనిట్ పరిశ్రమలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. అలాగే గ్రామాల్లో భవన, ఇళ్ల నిర్మాణ రంగ కార్యకాలపాలు నిర్వహించుకోవచ్చు. అలాగే మున్సిపల్ పట్టణ ప్రాంతాల్లో కార్మికులు నిర్మాణ భవనం దగ్గరే ఉండేటట్లైతే అక్కడ నిర్మాణాలు జరుపుకోవచ్చు. నిత్యవసర వస్తువులు అంటే మందులు, ఫార్మా ఉత్పత్తులు చేపట్టవచ్చు. సినిమా హాళ్లు, మాల్స్, షాపింగ్ కాంప్లెక్సులు, జిమ్‌లు, స్పోర్ట్స్ కాంప్లెక్సులు, స్విమ్మింగ్ పూల్స్, బార్లు మే 3 వరకూ తెరవకూడదని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రాల మధ్య, అలాగే జిల్లాల మధ్య ప్రజల ప్రయాణాలు, రాకపోకలపై కేంద్రం మే 3 వరకూ నిషేధం విధించింది. మెట్రో రైళ్లు, బస్సు సర్వీసులు కూడా మే 3 వరకూ లాక్‌డౌన్‌లోనే ఉంటాయి. లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా ప్రజలు ముఖానికి మాస్క

మే 3 వరకు కొనసాగనున్న లాక్ డౌన్: ప్రధాని మోదీ

Image
  ఆర్థిక పరిస్థితి కంటే ప్రజల ప్రాణాలు మిన్న కేసులు పెరగకుండా కఠినతరం చేయనున్న లాక్ డౌన్ (జన హృదయం ప్రతినిధి – విశాఖపట్నం ) : దేశవ్యాప్తంగా మే 3 వరకు పొడిగించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం ప్రకటించారు దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి లాక్ డౌన్ ఒక్కటే ప్రధాన మార్గమని సామాజిక దూరం పాటించడం ద్వారానే ఈ వ్యాధి నివారణకు సాధ్యమవుతుందని ప్రధాని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితిలో ఆర్థిక పరిస్థితులను మెరుగు పరచుకోవడం కంటే ప్రజల జీవితం ప్రామాణికంగా తీసుకొని ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డోన్ యధావిధిగా కొనసాగించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు దేశవ్యాప్తంగా ఎక్కడ ప్రజలు తమ ఆహారానికి ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని కూడా ప్రధాన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ప్రపంచవ్యాప్తంగా కరోనా నివారణలో భారత్ ముందు నిలిచిందని ప్రధానిి పేర్కొన్నారు ఇదే ఐక్యమత్యంతోోో దేశ ప్రజలంతా మరో 19 రోజులపాటు సామాజిక దూరాన్ని పాటిస్తూ విజయవంతంగా కరోనా మహమ్మారిని విజయవంతంగా ఎదుర్కోవాలని ప్రధాని కోరారు ప్రజల జీవనశైలిలో ఎదుర్కొంటున్నన ఇబ్బందులు అన్నీ తనకు తెలుసునని

ఏపీలో 420 కి చేరిన కరోనా కేసులు

Image
ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతూ ఆందోళన కలిగిస్తుంది. అధికార యంత్రాంగం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నపటికీ ప్రజలు కట్టుదిట్టంగా లాక్ డౌన్ అమలుకు పూర్తిస్థాయిలో సహకరించక పోవడం వల్ల పాజిటివ్ కేసులు దినదిన అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పటికైనా ప్రజలు చైతన్యంతో లాక్ డౌన్ అమలుకు పూర్తిస్థాయిలో సహకరించి కరోనా కట్టడికి తోడ్పాటు అందించాలని ప్రభుత్వాధినేతలు వేడుకుంటున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మార్చి 23 నుండి కొనసాగుతున్న  లాక్ డౌన్ పై ప్రధానమంత్రి నేడు జాతిని ఉద్దేశించి ప్రసంగించేే అవకాశం… *ఆంధ్రప్రదేశ్‌:* ► ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 420కి చేరింది.. ► ఏపీలో ప్రస్తుతం 401 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.. ► ఇప్పటి వరకు 12 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ► కరోనా వైరస్‌తో ఏడుగురు మృతి చెందారు. ► పల్లెల్లో పంటల కొనుగోళ్లు ► గ్రామస్థాయిలో 786 కేంద్రాలు ఏర్పాటు.. ► నేటి నుంచి జొన్న, మొక్కజొన్న , శనగలు, కంది, పసుపు కొనుగోలు.. ► నేటి నుంచి కృష్ణా జిల్లాలో రోజుకు 800 నుంచి 1000 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తామని కలెక్టర్‌ ఏఎండీ

కరోనా మృతులు కట్టడి చేస్తాం: ట్రంప్‌

న్యూఢిల్లీ : అమెరికాలో కరోనా (కోవిడ్‌-19) వైరస్‌ బారిన పడి మరణించే వారి సంఖ్య లక్షకు లోపలే ఉంటుందని దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రోజువారి వైట్‌హౌజ్‌ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. దేశ ఆర్థిక రంగం కూడా త్వరలోనే కోలుకుంటుందని ఆయన చెప్పారు. ఆర్థిక రంగం పునరుద్ధరణ చర్యల కోసం కోవిడ్‌–2 టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆర్థిక కార్యకలాపాలు యథావిధిగా ప్రారంభమైన తర్వాత ప్రజలకు సామూహిక కోవిడ్‌ పరీక్షలు జరపబోమని చెప్పారు. కోవిడ్‌ మృతుల సంఖ్యను రెండు లక్షలు మించకుండా ఉన్నట్లయితే దాన్ని నిరోధించేందుకు తాము తీసుకుంటున్న చర్యలు ఫలించినట్లేనంటూ వారం క్రితం మాట్లాడిన ట్రంప్, మృతులు లక్షకు లోపలే ఉంటారని ఇప్పుడు చెప్పడం విశేషం. ఇప్పటి వరకు అమెరికాలో దాదాపు నాలుగున్నర లక్షల మందికి ఈ వైరస్‌ సోకగా, వారిలో 15000 మంది మరణించారు. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ మాట్లాడుతూ కోవిడ్‌ను నిరోధించేందుకు తాము తీసుకుంటోన్న సామాజిక దూరం లాంటి చర్యలు విజయవంతం అవుతున్నాయని చెప్పారు. దేశ ఆర్థిక రంగం కూడా పూర్తిగా కోలుకుంటోందని అన్నారు. ముందుగా ఊహించిన దానికంటే కోవిడ్‌ రూపంలో పెద్ద దెబ్బే తగిలింద

 దేశంలో 24 గంటల్లో 678 కరోనా కేసులు

న్యూఢిల్లీ :  దేశంలో గడిచిన 24 గంటల్లో  678 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, కరోనా మహమ్మారి బారినపడి 33 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ  వెల్లడించింది. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఇప్పటివరకూ 6402కు పెరిగిందని మృతుల సంఖ్య 199కి చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. 5709 పాజిటివ్‌ కేసులు ప్రస్తుతం చురుగ్గా ఉండగా 503 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని చెప్పారు. మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య దేశంలోనే అత్యధికంగా 1300 మార్క్‌ను దాటిందని ముంబైలో 381 ప్రాంతాలను హాట్‌స్పాట్స్‌గా గుర్తించారని తెలిపారు. మరోవైపు కరోనా మహమ్మారి దేశంలో సమూహ వ్యాప్తి (కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌) దశకు చేరుకోవచ్చని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా శ్వాసకోశ వ్యాధులున్న 5911 మందిని పరీక్షించగా వారిలో 102 మందికి కరోనావైరస్‌ ఉన్నట్టు నిర్ధారణ అయిందని, వారిలో 40 మందికి కరోనా రోగులతో సన్నిహితంగా మెలిగిన ఉదంతం లేదని ఐసీఎంఆర్‌ పేర్కొంది. దేశంలోని 15 రాష్ట్రాల్లో విస్తరించిన 36 జిల్లాల్లో ఇలాంటి రోగులున్నారని, ఈ రాష్ట

నర్సాపురం చేరిన ట్రైన్ ఆసుపత్రి

. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు దక్షిణ మధ్య రైల్వే శాఖ నర్సాపురం స్టేషన్ కు పది కోచ్ లతో కూడిన ప్రత్యక రైలు ను కేటాయించింది. ఈ మేరకు స్థానిక రైల్వే స్టేషన్లో అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. స్టేషన్ లోని కోచ్ కేర్ డిపో ఆధ్వర్యం లో పది బోగి లలో 100బెడ్స్ ఏర్పాటు కు అన్ని చర్యలు ముమ్మరంగా జరుగు తున్నాయి. ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లు గురించి స్టేషన్ మేనేజర్ మధుబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇప్పటికీ ఆరు బోగిలలో పని పూర్తి అయ్యిందని, రేపటికి మొత్తం పని పూర్తి అయ్యి పది బోగీలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. పడి కోచ్ లలో యెనిమిది జనరల్ కోచ్ లు, రెండు స్వీపర్ కోచ్ లు ఉంటాయన్నారు. కరోనా బాధితుల సేవల కోసం , సామాజిక సేవలో భాగంగా ప్రత్యేక బోగీలను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకొచ్చే చర్యలను చేపట్టింది అని వివరించారు. బోగి లో ఆక్షిజన్ తో బాటు వైద్య పరీక్షలు కు సంబంధించి కీట్స్ కూడా ఉంటాయన్నారు. అలాగే వైద్య సిబ్బంది కి బోగి లో ప్రత్యేక గది ఉందన్నారు. కరోనా కేసులకు వైద్య పరీక్షలు నిర్వహించే విధంగా బోగి లను సిద్దం చేస్తున్నట్లు స్టేషన్ మేనేజర్ తెలిపారు. సౌత్

కరోనా వేళ కళ్యాణం ఒకటైన రెండు జంటలు

Image
అనకాపల్లి :  కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ అమల్లో ఉండగా పరిమితమైన జనం అంటే కేవలం ఏడుగురితోనే పెళ్లి తతంగం పూర్తి చేసేందుకు అనుమతులు ఉండటంతో రెండు జంటలు గురువారం రాత్రి ఒక్కటయ్యాయి. కరోనా వేళ కల్యాణం తీరే వేరు. పెళ్లంటే ..సందళ్లు..తప్పెట్లు..తాళాలు..ఇవేవి లేకుండానే కేవలం ఏడుగురు అతిథులే సాక్షులుగా వివాహ తంతులు ముగిశాయి. గవరపాలెంలో పెళ్లి కొడుకు మహేశ్‌తో పాటు ఏడుగురు, తాకాశి వీధిలో పెళ్లికొడుకు ఈశ్వరరావుతో పాటు ఏడుగురు మాత్రమే ఉండేటట్లు పెళ్లి తతంగం పూర్తి చేశారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, వారి తల్లిదండ్రులు, పెళ్లి చేసే పురోహితుడు మాత్రమే ఉండేటట్లు కేవలం ఏడుగురితో రెండు పరిణాయాలు జరిగాయి

దేశంలో 24 గంటల్లో 650 కేసులు, 30 మరణాలు

న్యూఢిల్లీ : కరోనా  విజృంభనతో భారత్‌లో పాజిటివ్‌ కేసులు గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 650 కేసులు నమోదయ్యాయి. 30 మంది మృత్యువాత పడ్డారు. కాగా ఒక్క రోజు వ్యవధిలోనే ఆరు వందలకు పైగా కేసులు నమోదవ్వడం ఇదే రికార్డుగా మారింది. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం శుక్రవారం ఉదయం 9 గంటల వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 6412కు చేరింది. మృతుల సంఖ్య 200 చేరువగా ఉంది. ప్రస్తుతం 5709 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా 504 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి  అయ్యారనిి కేంద్రం వెల్లడించింంది. కాగా, దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర 1364 కేసులతో మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో తమిళనాడు 834, ఢిల్లీ 720 ఉన్నాయి. 442 కేసులతో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. ఉత్తర ప్రదేశ్‌ 410, కేరళ 357, మధ్య ప్రదేశ్‌ 259, గుజరాత్‌ 241, కర్ణాటక 181, హర్యానా 169, జమ్మూ కశ్మీర్‌ 158, పశ్చిమ బెంగాల్‌ 116, పంజాబ్‌ 101, ఒడిశా 44, బిహార్‌ 39, ఉత్తరాఖండ్‌ 35, అస్సాం 29, చండీగఢ్‌ 18, హిమాచల్‌ ప్రదేశ్‌ 18, జార్ఖండ్‌ 13, అండమాన్‌ నికోబార్‌ 11, చత్తీస్‌గఢ్‌ 11, గోవా 7, పుదుచ్చ

ఏపిలో 363 కు చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య....

Image
అమరావతి : రాష్ట్రంలోని కోవిడ్ బాధితుల సంఖ్య 363కు చేరింది. గురువారం  కొత్తగా 15 కరోనా కేసులు నమోదయ్యాయని ఏపీ సర్కారు ప్రకటించింది.  కాగా  కరోనా  వ్యాధితో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం జిల్లాలో ఒకరు చనిపోగా.. గుంటూరులో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య ఆరుకు చేరింది.  చిత్తూరు జిల్లాలో ఒకర్ని డిశ్చార్జ్ చేశారు. దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 10కి చేరింది. గురువారం ఒక్క ప్రకాశం జిల్లాలోనే 11 కేసులు నమోదు కాగా.. గుంటూరులో రెండు, తూర్పు గోదావరి, కడప జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం తెలిపింది.  జిల్లాల వారీగా చూస్తే.. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 75 కరోనా కేసులు నమోదయ్యాయి. తర్వాతి స్థానంలో గుంటూరు జిల్లా ఉంది. ఇక్కడ 51 మంది కరోనా పాజిటివ్ అని తేలింది. నెల్లూరు (48), ప్రకాశం (38), క్రిష్ణా (35) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మాత్రమే కరోనా కేసులు నమోదు కాలేదు

ప్రశంసలు పొందుతున్న జివిఎంసి కమిషనర్ సృజన

Image
విశాఖపట్నం :  కరోనా ప్రభావం, లాక్‌డౌన్‌తో జనాలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. కానీ ఆ మహమ్మారిని కట్టడి చేసే పనిలో అధికారులు, పోలీసులు బిజీ అయ్యారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ రాత్రింబవళ్లు విధుల్లో ఉంటున్నారు. జివిఎంసి కమీషనర్ సృజన కూడా ఇలాంటి క్లిష్టమైన సమయంలో తన అంకితభావాన్ని చాటుకున్నారు. విశాఖలో ఉండే 30 లక్షలమందికిపైగా ప్రజలకు జవాబుదారీగా ఉన్నారు. తన నెల రోజుల పసికందుతో విధులకు హాజరవుతున్నారు. ప్రతిరోజు అధికారులు, సిబ్బందితో సమీక్ష చేస్తున్నామన్నారు. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమె ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.. కమిషనర్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వాస్తవానికి సృజన నెల రోజుల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చారు. చిన్నారి ఆలనాపాలనా చూసుకోవాల్సిన ఆమె.. సెలవుల్ని వదిలేశారు. ప్రజలో కోసం, కరోనా నివారణ కోసం విధుల్లో చేరారు. మొదటి మూడు వారాలు సృజన తన బిడ్డను ఇంట్లోనే వదిలేసి ఆఫీసుకు వచ్చారు. పిల్లవాడి బాగోగుల్ని భర్త, తల్లికి వదిలేశారు. ఆమె మద్య, మధ్యలో బిడ్డను చూడటానికి వెళ్లొచ్చేవారు. విశాఖ ప్రజల కోసం కష్టపడుతున్నారు. అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. కరోనాతో విశాఖవాసులు ఆందోళన

నెలాఖరు వరకు లాక్ డౌన్లోడ్ ఒరిస్సా సీఎం

  ఒరిస్సా : దేశంలో కరోనా  కట్టడికి విధించిన లాక్ డౌన్  ఏప్రిల్ 14తో ముగియనుండగా.. పలు రాష్ట్రాలు దీనిని పొడిగించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సూచించాయి. కొన్ని రాష్ట్రాలు స్వచ్ఛందంగానే తాము లాక్‌డౌన్ కొనసాగిస్తామని నిర్ణయించాయి. ఏప్రిల్ 14 తర్వాత కూడా తమ రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగుతుందని కొన్ని రాష్ట్రాలు సంకేతాలు ఇచ్చాయి. తాజాగా, ఒడిశా కూడా అదే మార్గంలో పయనిస్తోంది. ఏప్రిల్ 30 వరకు తమ రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగుతుందని క్యాబినెట్ సమావేశం అనంతరం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు.                                       అంతేకాదు, ఏప్రిల్ 30 వరకు రైలు, విమాన సర్వీసులను కూడా పునరుద్దరించరాదని కేంద్రానికి ఆయన విజ్ఞ‌ప్తి చేశారు. జూన్ 17 వరకు విద్యా సంస్థలు మూసేస్తామని నవీన్ వెల్లడించారు. దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న సమయంలో అన్ని రాష్ట్రాల కంటే ముందే ఒడిశా సీఎం స్పందించి.. పటిష్ఠ చర్యలు చేపట్టారు. కొన్ని జిల్లాలను లాక్‌డౌన్ చేసి.. రాజధాని భువనేశ్వర్, భద్రక్‌లను 48 గంటలపాటు షట్‌డౌన్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30 వరకు కొనసాగించాలని సిఫార్సు చేస్తామని నవ

సమగ్ర కుటుంబ సర్వే జరగాలి: సీఎం జగన్‌

కరోనా నివారణ చర్యలపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష అమరావతి: కరోనా వైరస్‌ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి హాజరయ్యారు. సమీక్షా సమావేశానికి ముందు.. దేశంలో కరోనా విస్తరణ, నమోదవుతున్న కేసులు, అనుసరిస్తున్న వైద్య విధానాలు, వివిధ అధ్యయనాలకు సంబంధించి వివరాలను ముఖ్యమంత్రికి ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి అందించారు. అనంతరం రాష్ట్రంలో కరోనా వైరస్‌ విస్తరణ స్థితిగతులు, నివారణా చర్యల వివరాలను సీఎం కు అధికారులు నివేదించారు. (ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు) పోలీసు శాఖ పనితీరుపై ప్రశంసలు.. ఉదయం 9 గంటల వరకూ గడచిన 12 గంటల్లో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని.. ఢిల్లీ వెళ్లినవారు, వారి ప్రైమరీ కాంటాక్టులు వల్లే కేసుల సంఖ్య పెరగడానికి కారణాలని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. వీరి పరీక్షలు పూర్తవుతున్న కొద్దీ... వాటి కేసుల సంఖ్య తగ్గుతుందన్నారు. ఢిల్లీ వెళ్లినవారు,

పోలీసుల పనితీరు హర్షనీయం సీఎం

కరోనా  వ్యాప్తిని తగ్గించేందుకు కుటుంబాన్ని సైతం పక్కనపెట్టి పోలీసులు తీవ్రంగా కష్టపడుతున్నారు. అయితే కొందరు పోలీసులు చేస్తున్న ఓవరాక్షన్ వల్ల మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు వస్తోంది. పలుచోట్ల పౌరులను పోలీసులు కారణం లేకపోయినా చితకబాదుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై సీఎం జగన్ డీజీపీ సవాంగ్‌కు పలు సూచనలు చేశారు. శుక్రవారం సీఎం జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో పోలీసుల తీరుపై ఆయన క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సమీక్షలో సీఎం జగన్ మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించే వారిపట్ల పోలీసులు అనుసరించాల్సిన విధానం పట్ల కూడా దృష్టిపెట్టాలని డీజీపీ సవాంగ్‌కు సూచించారు. పోలీసులపై విపరీతమైన పని ఒత్తిడి ఉందనే విషయాన్ని తాము అంగీకరిస్తామని చెప్పారు. అయితే పౌరులపై మనం ఉపయోగించే భాష, వారికి కౌన్సెలింగ్‌ ఇస్తున్న తీరు కూడా ముఖ్యమని సీఎం జగన్ పేర్కొన్నారు. గౌరవ, మర్యాదలు చూపుతూనే లాక్‌ డౌన్‌ను పటిష్టంగా అమలు చేయాలని పోలీసులకు సూచించారు. అలాగే బాపట్ల యువకుడు ఆత్మహత్య కేసు విషయంలో విచారణ చేయించాలని ఆదేశించారు.          అలాగే రాష్ట్రం వెలుపల ఉన్న తెలుగువారి

ఎక్కడపడితే అక్కడ ఉమ్మేస్తే అంతే.

రాష్ట్రంలో కొత్త రూల్... హైదరాబాద్ :- కరోనాను ఎదుర్కొనేందుకు, రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త రూల్ పాస్ చేసింది.  రోడ్లపైన, సామాజిక ప్రాంతాల్లో ఉమ్మివేయడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శాంతి కుమారి మాట్లాడుతూ, కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు వ్యక్తిగతంగానే కాకుండా పరిసరాల పరిశుభ్రతను కలిగి ఉండాలని, అందుకే ఈ నిబంధనను అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం బుధవారం ఈ జీవో విడుదల చేసిందని, దీని ప్రకారం పాన్, చూయింగ్ గమ్, పొగాకు ఉత్పత్తులు వంటివి ఏవైనా ఎక్కడ పడితే అక్కడ ఎవరూ ఉమ్మివేయకూడదని ఆమె హెచ్చరించారు. ఇలా ఉమ్మివేయడం వల్ల కరోనా వ్యాప్తికి ఎక్కువగా అవకాశం ఉందన్నారు. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వివరించారు.  ఇదిలా ఉంటే ఎవరైనా నిబంధనలను అతిక్రమించినట్లైతే వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించలేదని, అయితే ప్రజలందరూ సామాజిక బాధ్యతగా దీనిని పాటిస్తే కరోనాపై చేస్తున్న పోరాటానికి కొంత మద్దతుగా ఉంటుందని వైద్య విద్య విభాగం డైరెక్టర్ డాక్టర్ కే రమేశ్ రెడ్డి తెలిపారు...

రైతుకు కన్నీరు మిగిల్చిన అకాల వర్షం.

  విజయనగరం:  జిల్లా లో భారీ వర్షం కురిసింది. పార్వతీపురం, సాలూరు, చీపురుపల్లి నియోజకవర్గాల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. ఈదురుగాలుల వల్ల పంటలకు నష్టం కల్గింది. అంతేకాకుండా విద్యుత్‌ స్తంభాలు నెలకొరిగాయి. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వానకు ఇంటి అద్దాలు పగిలాయి. పశ్చిమ గోదావరి జీలుగుమిల్లిలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వేరు శనగ, పొగాకు, మిరప, మామిడి రైతులకు భారీ నష్టం వాటిల్లింది. భీమవరం, కొవ్వూరు, తణుకు, ఏలూరు పరిసర ప్రాంతాల్లో కూడా ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. అకాల వర్షాలకు అన్నదాతకు నష్టం జరిగింది. నోటికి వచ్చిన పంటలు తడిసి ముద్దవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కృష్ణా జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు ఆందోళనకు గురి చేశాయి. జిల్లాలోని కైకలూరు, మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్, గుడివాడతో పాటు పలు ప్రాంతాల్లోలో తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షానికి చేతికి వచ్చిన పంట నేలపాలైంది. ఆరుగాలం శ్రమించిన రైతాంగానికి చివరికి కన్నీరే మిగిలింది. అసలే కరోనా వల్ల వ్యవసాయరంగం కుదేలైం

భార‌త్‌లో 24 గంట‌ల్లోనే 591 క‌రోనా కేసులు

   డిల్లీ: దేశంలో 24 గంట‌ల్లోనే 591 కొత్త క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదుకావ‌డంతో, ప్ర‌స్తుతం భార‌త్‌లో క‌రోనా బాధితుల సంఖ్య 5,865 కు పెరిగింద‌ని కేంద్ర మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. తాజా గ‌ణాంకాల ప్ర‌కారం  477 మంది  క‌రోనా నుంచి కోలుకోవడంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇలావుండగా, క‌రోనాపై పోరాటంలో ఇత‌ర దేశాల‌కు భార‌త్ స‌హాయం అందిస్తుంది. క‌రోనాకు వ్యాక్సిన్ లేదు. మ‌లేరియా నియంత్ర‌ణ‌కు వాడే హైడ్రాక్సి క్లోరోక్విన్  క‌రోనాపై స‌త్ఫ‌లితాలు ఇస్తుండంతో ఈ మెడిసిన్‌కు డిమాండ్ బాగా పెరిగింది. క‌రోనా రోగుల ప్రాణాలు కాపాడ‌టంలో ప‌లు దేశాలు దీన్నే వాడుతున్నాయి. అంతేకాకుండా ప్ర‌పంచంలోనే  ఈ మెడిసిన్‌ను అత్య‌ధికంగా ఉత్ప‌త్తి చేసే దేశం మ‌న‌దే కావ‌డంతో ప‌లు దేశాలు హైడ్రాక్సి క్లోరోక్విన్‌ను పంపించాలంటూ భార‌త్‌ను కోరుతున్నాయి. ఇప్ప‌టికే భూటాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, మయన్మార్, సీషెల్స్, మారిషస్ దేశాలకు ఈ మందు పంపినట్లు అధికారులు తెలిపారు. శ్రీలంక‌కు మంగ‌ళ‌వారం 10 ట‌న్నుల మెడిసిన్ పంపిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ప్రపంచవ్యాప్తంగా  ప‌దిహేను ల‌క్ష‌ల‌మంది  కోవిడ్ -19 బారిన పడ్డారని బ్లూమ్‌బెర్గ్ నివే

ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

అమరావతి : కరోనా వైరస్‌ కట్టడికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గడచిన 12 గంటల్లో ఏపీలో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కాలేదు. బుధవారం రాత్రి 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు 217 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. అన్ని కేసులు నెగటివ్‌గా నిర్ధారించబడ్డాయని ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 348 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 90 శాతం మంది ఢిల్లీ నుంచి వచ్చిన వారే ఉండడం గమనార్హం. ఢిల్లీకి వెళ్లొచ్చిన 1000 మంది ప్రయాణికులతో పాటు వారితో కాంటాక్ట్‌ అయిన 2500 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తంగా ఇప్పటివరకు 7,155 మందికి పరీక్షలు నిర్వహించగా 348 మందికి పాజిటివ్ నిర్థారణ అయింది. కరోనా నుంచి కోలుకుని 9 మంది డిశ్చార్జ్ అయ్యారు. 

దశల వారీగా లాక్ డౌన్ ఎత్తివేతకు కేంద్రం కసరత్తు

న్యూఢిల్లీ: కరోనా విజృంభిస్తున్న తరుణంలో తీసుకోవాల్సిన చర్యలపై పార్లమెంట్‌లోని ఫ్లోర్‌ లీడర్లతో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ క్లిప్‌ లీక్‌ అయ్యింది. బుధవారం నాటి ఈ కాన్ఫరెన్స్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధిగా సుదీప్‌ బంధోపాధ్యాయ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీఎంసీ వర్గాలు లీక్‌ చేసినట్లుగా భావిస్తున్న ఈ వీడియోలో ఓ స్క్రీన్‌పై సుదీప్‌ బంధోపాధ్యాయ్‌.. మరో స్క్రీన్‌పై ప్రధాని మోదీ మాట్లాడుతున్న దృశ్యాలు కనిపించాయి. ఈ సందర్భంగా.. దేశంలో ప్రస్తుతం  ‘సామాజిక అత్యవసర పరిస్థితి(సోషల్‌ ఎమర్జెన్సీ)’ తరహా అసాధారణ స్థితి నెలకొని ఉందని మోదీ వ్యాఖ్యానించారు. మహమ్మారిపై పోరులో గెలిచేందుకు భౌతిక దూరం పాటించడం ఒక్కటే ప్రస్తుతం మన ముందున్న మార్గమని ఆయన పేర్కొన్నారు.(మోదీకి కృతజ్ఞతలు తెలిపిన బ్రెజిల్‌ అధ్యక్షుడు) అదే విధంగా ఏప్రిల్‌ 14న లాక్‌డౌన్‌ ఎత్తివేసే నిర్ణయంపై పునరాలోచించాల్సిందిగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జిల్లా అధికారులు తనకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఒకేసారి లాక్‌డౌన్‌ ఎత్తివేసే ఆలోచన ప్రస్తుతానికి లేదని... దశల వారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేస్తామని ప్

పోలీస్ అన్నా నీకుమా సెల్యూట్

ప్రపంచవ్యాప్తంగా జనం బెంబేలెత్తుతున్న వైరస్ కరోనా వైరస్. ఈ వైరస్ ప్రపంచ దేశాల్లో సైతం బెంబేలెత్తిపోతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో మందులేని వైరస్ కి ఉన్న ఏకైక ముందు మనల్ని మనం రక్షించుకోవడం. సామాజిక దూరం పాటించడం, mask ధరించడం, అదేవిధంగా హ్యాండ్ వాష్ తో  చేతులు  ఇరవై సెకండ్లు బాగా నురుగు వచ్చేటట్లు మోచేతుల దాకా గోళ్ళ సందుల్లోప్రతిసారి శుభ్రం చేసుకోవాలి, వేడి నీళ్ళలో పసుపు వేసుకొని నాలుగైదు సార్లు రోజు తాగాలి, ఫ్రిడ్జ్ లో వాటర్ వాడకూడదు, కూరగాయలు వేడినీళ్లతో ఉప్పు వేసి  అరగంట తర్వాత బాగా కడుగుకొని లోపల పెట్టుకొనవలెను. పాల ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్లు సబ్బుతో బాగా కడిగి లోపల పెట్టు కో వలెను.     ఈ విధమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ఇంట్లోనే ఉండి బయటకు రాకుండా క్షేమంగా ఉండటంతోపాటు మీ ఫ్యామిలీ ని క్షేమంగా ఉంచుతారు, ఈ వ్యాధి బయటకు వ్యాపించకుండా దేశానికి సహాయం చేసిన వారవుతారు. రోజు వేడినీళ్లలో పుదీనా లవంగాలు పొడిచేసి ఆవిరి పట్టాలి. అదేవిధంగా వేడినీటిలో అల్లం, తెల్ల గడ్డలు, లవంగా,  patta, ఇవన్నియు గ్రైండర్లో పొడి చేసినీళ్లు బాగా మరిగినాక  వేడి నీళ్ళు  రోజూ రెండు పూటలా తాగవలెను.      ఈ కరోనా వైరస

కరోనాకు 2లక్షల వరకు ఆరోగ్యశ్రీ. :ఎమ్మెల్యే రోజా

  ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిని గుర్తించడంలో వాలంటరీ వ్యవస్థ అద్భుతంగా పని చేసిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ల్యాబ్స్ పెట్టి కరోనా కట్టడి చేస్తున్నారని.. అలాగే కరోనాను ఆరోగ్యశ్రీ కింద చేరుస్తూ జగన్ తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు తెలిపారు. రూ. 12 వేల నుంచి రూ.2 లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే భరించే విధంగా నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం అన్నారు. ఇక ప్రతిపక్ష నేత  చంద్రబాబు తనను గెలిపించిన ప్రజల్ని గాలికి వదిలేశారని రోజా అన్నారు. బాబు ఆంధ్ర నుంచి అమెరికా వరకు సలహాలివ్వడం దురదృష్టకరమని.. చంద్రబాబు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు అవసరమేమో.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి అవసరం లేదన్నారు. కరోనా వంటి కష్టసమయంలో రాజకీయ విమర్శలు సరికాదన్నారు.. ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుందన్నారు.

మీ సహాయం వెలకట్టలేనిది : ట్రంప్

  భా రత ప్రజలకు అమెరికా అధ్యక్షుడు  డొనాల్డ్ ట్రంప్  ధన్యవాదాలు తెలిపారు. అమెరికా కోరిక మేరకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రల ఎగుమతిపై ఆంక్షలు తొలగించి.. ఆ దేశానికి సరఫరా చేసినందుకు ట్విటర్ ద్వారా ఆయన థ్యాంక్స్ చెప్పారు. ప్రపంచమంతా కరోనాపై పోరాడుతున్న తరుణంలో మోదీ బలమైన నాయకత్వం మొత్తం మానవాళికే అండగా నిలబడుతోందని ట్రంప్ ప్రశంసించారు. దీనిపై  ప్రధాని మోదీ  స్పందించారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌పై నిర్ణయం తీసుకున్న భారత్‌కు, భారత ప్రజలకు కృతజ్ఞతలు. భారత్ సాయాన్ని ఎప్పటికీ మరచిపోం. నరేంద్ర మోదీ బలమైన నాయకత్వం కరోనా పోరులో.. కేవలం భారత్‌కే కాదు, మొత్తం మానవాళికి అండగా నిలబడుతోంది. అసాధారణ పరిస్థితుల్లో స్నేహితుల మధ్య మరింత సహకారం అవసరం’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. ట్రంప్‌తో ఏకీభవిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘విపత్కర పరిస్థితులే మిత్రులను మరింత దగ్గర చేస్తాయి. భారత్‌ - అమెరికా సంబంధాలు మునుపెన్నడూ లేనంతగా మరింత బలపడుతున్నాయి’ అని మోదీ పేర్కొన్నారు. కరోనా మహమ్మారిపై పోరాటానికి భారత్‌ చేయగలినంతా చేస్తుందని తెలిపారు. కరోనా వైరస్‌ను కలిసికట్టుగా ఎదుర్కొంటూ విజయం సాధ

పుచ్చకాయ గింజలు పారేయకండి పుష్కలంగా ఉన్న ఔషధాలు

Image
పుచ్చకాయలు వేసవి కాలం రాగానే దర్శనమిస్తాయి. వీటిని తింటూ హాయిగా దాహార్తిని తీర్చకుంటుంటాం. ఐతే కరోనా వైరస్ విజృంభిస్తున్న క్రమంలో వీటిని కొనాలన్నా భయపడుతున్నారు. ఐతే పుచ్చకాయలను కొనుక్కుని వచ్చి వాటిని శుభ్రంగా ఉప్పు నీటితో కొద్ది సేపు కడిగి ఆ తర్వాత ఓ నాలుగైదు గంటల తర్వాత ముక్కలుగా కోసుకుని తినవచ్చు. ఐతే శుభ్రపరచడంలో ఒక్కొక్కరు ఒక్కోలా చేసుకున్నప్పటికీ ఈ కాలంలో చాలా జాగ్రత్తగా వుండాలి మరి. ఇకపోతే పుచ్చ ముక్కలను తిని గింజలను పడేస్తూ ఉంటాం. అయితే గింజలలో అనేక పోషక విలువలు ఉన్నాయి. పుచ్చకాయ గింజల్లో విటమిన్స్‌తో పాటు మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, పాస్పరస్, కాపర్, జింక్, మాంగనీస్ సమృద్ధిగా ఉంటాయి. పుచ్చగింజల్లో ఉన్న పోషక విలువలేమిటో చూద్దాం. 1. పుచ్చ గింజలలో ఉండే అమైనోఆసిడ్స్ రక్త నాళాలను వెడల్పు చేసి రక్త ప్రసరణ బాగా జరిగేలా చేసి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. అంతేకాక రోగనిరోధక శక్తిని పెంచటానికి కూడా దోహదం చేస్తుంది. 2. ఈ గింజలలో ఐరన్ సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో క్యాలరీలను శక్తిగా మార్చటంలో సహాయపడుతుంది. 3. మోనోసాచ్యురేటెడ్, పాలీ అన్‌సాచ్యూరేటెడ్ ఫ్యాటీ ఆసిడ్లు సమృద్ధిగా ఉండుట వలన గుం