Posts

Showing posts from November, 2021

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వాహనాలు సీజ్ చేయొద్దు

Image
  తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు హైదరాబాద్ : డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వాహనాలు సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పై హైకోర్టులో 40 రిట్ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు మద్యం సేవించి వాహనం నడిపితే ఆ వాహనం సీజ్ చేయవద్దంటూ ఆదేశాలిచ్చింది. అయితే అదే సమయంలో మద్యం సేవించి వాహనాలు నడిపేందుకు అనుమతించవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. మద్యం తాగని మరో వ్యక్తి వారి వెంట ఉంటే వాహనం వారికి అప్పగించాలని, ఎవరూ లేకపోతే బంధువులు లేదా స్నేహితుడిని పిలిపించి వాహన ఇవ్వాలని పేర్కొంది. ఎవరూ రాకపోతే పోలీస్ స్టేషన్ కి తరలించి తర్వాత అప్పగించాలని తీర్పునిచ్చింది .  ప్రాసిక్యూషన్ అవసరమైన కేసుల్లో మూడు రోజుల లోపు చార్జిషీటు దాఖలు చేసి ప్రాసిక్యూషన్ పూర్తయ్యాక వాహనం అప్పగించాలని కోర్టు పేర్కొంది.  వాహనం కోసం ఎవరూ రాని పక్షంలో చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపింది.  ఈ ఆదేశాలు అమలు చేయని పోలీసులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని తెలంగాణ హై కోర్టు హెచ్చరించింది.