Posts

Showing posts from December, 2019

మాజీ ఎంపీ రాయపాటి  ఇంట్లో సిబిఐ దాడులు

మాజీ ఎంపీ రాయపాటి  ఇంట్లో సిబిఐ దాడులు మంగళవారం ఉదయం నుంచి రాయపాటి ఇల్లు, ఆఫీస్ లో కొనసాగుతున్న సోదాలు.  రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ తో పాటు పలు కంపెనీల్లో సోదాలు చేస్తున్న సీబీఐ అధికారులు  హైదరాబాద్, గుంటూరు,  కొనసాగుతున్న సీబీఐ సోదాలు 300 కోట్ల రూపాయలను బ్యాంకు నుంచి రుణం గా తీసుకున్న రాయపాటి కంపెనీ తీసుకున్న రుణం చెల్లించని రాయపాటి రాయపాటి కంపెనీ పై కేసు నమోదు చేసిన సి.బి.  రాయపాటి తోపాటు ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ సీఈవో ఇళ్లపై కొనసాగుతున్న సోదాలు పలు కీలక డాక్యూమెంట్స్ స్వాధీనం

రోడ్డు ప్రమాదంలో ఆడిట్ అధికారి మృతి

విజయవాడ :  కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న యాసిడ్ ట్యాంకర్‌ను ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో యాసిడ్ పడి ఆడిట్ అధికారి రాగమంజీర మీద పడింది. దీంతో ఆమెకు తీవ్రగాయాలు కావడంతో వెంటనే అక్కడున్న స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాగమంజీర  మృతి చెందారు. ఈ ఘటనలో ఆమె భర్తకు కూడా తీవ్రగాయాలు కావడంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతిచెందిన అధికారిది విశాఖ జిల్లా పెందుర్తిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యప్తు చేపట్టారు. గ్రూప్ 1 ఆడిట్ ఆఫీసర్‌గా రాగమంజీర ఇబ్రహీంపట్నంలో డైరెక్టరేట్ ఆఫ్ స్టేట్ ఆడిట్ కార్యాలయంలో అసిస్టెంట్ ఆడిటర్ గావిధులు నిర్వహిస్తున్నారు.

పాన్ ఆధార్ లింక్ గడువు పెంపు

Image
పాన్‌ కార్డుతో ఆధార్‌ కార్డు లింక్‌ గడువును పెంచుతూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నిర్ణయం తీసుకుంది.  తుది గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించినట్లు తెలిపింది. డిసెంబర్‌ 31 లోగా పాన్‌ను ఆధార్‌తో జత చేసుకోవాలని లేదంటే ఆది క్యాన్సిల్ అవుతుందని గతంలో పేర్కొంది. అయితే తాజా గడువు పెంచుతున్నట్లు పేర్కొంది. పాన్‌ కార్డుతో ఆధార్‌ అనుసంధానానికి మరోమూడు నెలలు పెంచింది. వాస్తవానికి అక్కడ ఒక ప్రవాస భారతీయుడికి (ఎన్‌ఆర్‌ఐ) ఆధార్ కార్డు లేదా పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య) అవసరం లేదు, కానీ వాటిని మార్చి 31 లోగా లింక్ చేయడం తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆర్థిక వ్యవహారాలతో కూడిన ఒక ఎన్నారై పాన్ కార్డు మరియు ఆధార్ రెండింటినీ కలిగి ఉండాలని సూచించారు.

ఏపీలో ఇసుకడోర్ డెలివరీకి ఏర్పాట్లు

Image
తాడేపల్లి :  ఏపీలో ఇసుకను డోర్ డెలివరీ చేయాలని ప్రభుత్వం  నిర్ణయించింది.  ఈమేరకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం  జగన్ సమీక్ష నిర్వహించారు. ఇసుక డోర్ డెలివరీ పైలట్ ప్రాజెక్టుగా కృష్ణా జిల్లాను ఎంచుకున్నారు. జనవరి 2న ఇసుక డోర్ డెలివరీని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత జనవరి 7న ఉభయ గోదావరి జిల్లాల్లో ఇసుక డోర్ డెలివరీ చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా జనవరి 20లోపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇసుక డోర్ డెలివరీ పూర్తి కావాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇసుక కొరతతో భవన నిర్మాణ రంగం కుదేలైందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 200 పైచిలుకు స్టాక్ యార్డులకు గాను.. 13 యార్డుల్లో బుకింగ్ ఓపెన్ చేసిన కాసేపట్లోనే ఇసుక అయిపోతోందని అధికారులు చెప్పగా.. సమీపంలోని యార్డుల్లో బుకింగ్ కు అవకాశం ఉండేలా చూడాలని ముఖ్య మంత్రి సూచించారు. ఫిబ్రవరి నుంచి జూన్ వరకూ నాలుగు నెలల్లో నెలకు 15 లక్షల టన్నులు చొప్పున వర్షాకాలం అవసరాల కోసం రిజర్వ్ చేయాలని, 60 లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఏపీలో  ఇసుకను ఎపీఎం

ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా కె.వెంకట్రామిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికల్లో ఇటీవల సంఘం అధ్యక్షుడిగా గెలుపొందిన కె.వెంకట్రామిరెడ్డి నేడు ప్రమాణస్వీకారం చేశారు. వేదపండితుల ఆశీర్వచనాల నడుమ ఘనంగా ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఈ  కార్యక్రమానికి ఇటీవల ఎన్నికైన సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్. ప్రసాద్, ఉపాధ్యక్షులు శామ్యూల్ జూబ్లి, సుజాత, సంయుక్త కార్యదర్శులు రాజేష్(ఆర్గనైజేషన్), వీరశేఖర్(క్రీడలు), వి.దేవి (మహిళ), అదనపు కార్యదర్శి రమేష్ బాబు, కోశాధికారి ఎం.ప్రసాద్ లు హాజరయ్యారు. పలువురు అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛంతో సంఘం అధ్యక్షుడిని, ఇతర సభ్యులను అభినందించారు.

ఢిల్లీలో ఇద్దరు తెలుగు వైద్యుల అదృశ్యం, భర్త ఫిర్యాదు

ఢిల్లీలో ఇద్దరు తెలుగు డాక్టర్ల అదృశ్యం మిస్టరీగా మారింది. ఈ నెల25న  డాక్టర్‌ హిమబిందు(29), డాక్టర్‌ దిలీప్‌ సత్య(28) ఢిల్లీలో అదృశ్యమయ్యారు. కాగా హిమబిందు భర్త డా. శ్రీధర్‌ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దిలీప్‌, హిమబిందు, శ్రీధర్‌ ఈ ముగ్గురు కర్నూల్‌ మెడికల్‌ కళాశాలలో కలిసి చదువుకున్నారు. చండీగఢ్‌లో  చిన్న పిల్లల వైద్యునిగా దిలీప్‌ పనిచేస్తున్నారు. ఈ నెల 24న పుదుచ్చేరిలోఇంటర్వ్యూకి వెళ్లి 25న తిరిగి వస్తుండగా ఢిల్లిలోని శ్రీధర్‌ దంపతుల ఇంట్లో ఆగారు. అనంతరం ఉదయం 11.30 నిమిషాల సమయంలో దిలీప్‌తో కలిసి చర్చికి వెళ్తున్నానని చెప్పి హిమబిందు, దిలీప్‌ బయటికి వెళ్లారు. కాసేపటి తరువాత ఇద్దరి మొబైల్‌ ఫోన్లు స్విచ్ఛాఫ్‌ రావడంతో బిందు భర్త శ్రీధర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఇద్దరి ఆచూకీ కనిపెట్టాలని ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ , ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్లను అభ్యర్థించారు.

అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు

Image
తాడేపల్లి: సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తే 8309887955 వాట్సాప్‌ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. మంత్రి పేర్ని నాని సోమవారం తాడేపల్లిలో వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రోజువారీ ఆర్టీసీ సర్వీసు ఒక్క పైసా కూడా పెంచలేదని, కేవలం స్పెషల్‌ సర్వీసుల్లో మాత్రమే 50 శాతం పెంచినట్లు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ 'జనవరి 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులందరూ ప్రభుత్వ ఉద్యోగులు. చంద్రబాబు నాయుడు ఆర్టీసీ విలీనం అసాధ్యమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి చూపించారు. ఆర్టీసీపై ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రజా నాయకుడు జగన్‌. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న దమ్మున్న ముఖ్యమంత్రి జగన్‌' అని అన్నారు.  జర్నలిస్ట్‌ యూనియన్లు ఏమైపోయాయి? : అలాగే జర్నలిస్టు యూనియన్లు తీరును మంత్రి పేర్ని నాని తప్పుబట్టారు. మీడియా ప్రతినిధులపై దాడి జరిగితే ఖండించకపోవడం సరికాదని అన్నారు. పత్రికా సమాజం, జర్నలిస్ట్‌ య

 వసతిగృహాన్ని సందర్శించిన ఆర్ డి ఓ

Image
నర్సీపట్నం : బాలికల వసతి గృహంలో వార్డెన్ భర్త తమను వేధిస్తున్నాడని బాలికలు పిర్యాదు చేయడంతో వెంటనే వసతిగ్రుహాన్ని సందర్శించారు. శివపురం లో గల గిరిజన బాలికల సంక్షేమ వసతి గృహం ఎస్ టి -3  ను ఆర్డీఓ లక్ష్మీ శివ జ్యోతి సందర్శించారు. వసతి గృహ బాలికలు సోమవారం ఉదయం సబ్కలెక్టర్ కార్యాలయంలో ఆర్టిఓ కలిసి  హాస్టల్ మెట్రిన్ భర్త తమ హాస్టల్ లో నిబంధనలకు విరుద్ధంగా ఉంటూ తమపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని తగు చర్యలు తీసుకో వలసిందిగా కోరగా దానికి స్పందిస్తూ సోమవారం మధ్యాహ్నం వసతి గృహాన్ని సందర్శించి బాలికల తో మాట్లాడి విషయాలను తెలుసుకున్నారు. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఎస్-1, ఎస్-2 వసతి గృహాలను కూడా ఆర్డీవో సందర్శించారు . వసతి గృహంలో వచ్చిన సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామన్నారు.

స్పందన అర్జీలు సత్వర పరిస్కారం....ఆర్డీవో శివ జ్యోతి

Image
నర్సీపట్నం : స్పందన  అర్జీలను పరిశీలించి, ఆయా గ్రామాలలో స్వయంగా పర్యటించి  చర్యలు తీసుకుంటానని  రెవిన్యూ డివిజనల్ అధికారి కె లక్ష్మి శివ జ్యోతి తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందన లో భాగంగా సోమవారం 26  అర్జీలు వచ్చాయి. స్పందన లో అధిక సంఖ్యలో భూ సంబంధిత సమస్యలపై ప్రజలు వారి వినతులను అందజేశారు. ఈ సందర్భంగా  ఆర్ డి ఓ  మాట్లాడుతూ తాను నర్సీపట్నం లో జాయిన్ అయిన తర్వాత మొదటిసారి స్పందన లో పాల్గొని ప్రజల సమస్యలను తెలుసు కోవడం  జరుగుతుందన్నారు. సమస్య లపై సంబంధిత మండల అధికారులకు నిర్ణీత గడువులోగా అర్జీలను పరిశీలించి పరిష్కరించే విధంగా చర్యల కు ఆదేశించడం జరిగిందన్నారు. అధిక సంఖ్యలో భూ సంబంధిత సమస్యలు వస్తున్నాయి కాబట్టి , స్వయంగా మండలాలలో పర్యటించి సమస్యలను గూర్చి తెలుసుకొని పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకుంటామన్నారు.        నాతవరం మండలం వైబి పట్నం చెందిన ముత్తాల నాగమణి సర్వేనెంబర్ 473 /5లో రెండెకరాల భూమిలో సాగు చేసుకుంటున్నానని, దానికి పాస్ పుస్తకం కూడా ఉన్నదని అయినప్పటికీ కొంతమంది తనపై దౌర్జన్యం చేసే ఆక్రమించుకుంటన్నారని తగు న్యాయం చేయాల్సిందిగా కోరారు. మాకవరపాలెం రాచపల్లి గ్రా

డైల్ యువర్ కలెక్టర్ కు 7 ఫోన్ కాల్స్

విశాఖపట్నం :  కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్  కార్యక్రమానికి 7 గురు ఫోన్ చేసి తమ సమస్యలను నివేదించు కున్నారు. జాయింట్ కలెక్టర్ ఎమ్. వేణుగోపాలరావు ఫోన్ కాల్స్ కు సమాధానాలిచ్చారు.  కసింకోట మండలం నర్సింగబిల్లి గ్రామం నుండి ఎన్. ఎస్. ఎన్. సూర్య ప్రభాకర్ రావు ఫోన్ చేస్తూ తనకు రైతు భరోసా మంజూరు అయినప్పటికీ పూర్తి మొత్తం తన ఖాతాలో జమ చేయ లేదని ఫిర్యాదు చేశారు. విశాఖపట్నం నుండి సుబ్రహ్మణ్యశాస్త్రి మాట్లాడుతూ తమకు చెందిన భూమిని 22ఎ లో పెట్టారని దాని మూలంగా భూమి రిజిస్ట్రేషన్ కావట్లేదని సదరు భూమిని వెంటనే 22a నుండి తొలగించాలని విన్నవించుకున్నారు. విశాఖపట్నం నుండి నరసింహ స్వామి ఫోన్ చేస్తూ రాంబిల్లి మండలం మర్రిపాలెం గ్రామంలో తమకు చెందిన మూడు ఎకరాల భూమి ఉన్నదని, దానికి సంబంధించి పూర్వకాలం నుండి రికార్డు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. ఆ భూమికి పట్టాదార్ పాస్ పుస్తకం ఇప్పించవలసిందిగా కోరారు. చింతపల్లి మండలం అన్నవరం గ్రామం నుండి బాలరాజు ఫోన్ చేస్తూ ఎస్సీ కార్పొరేషన్ లోన్ కు దరఖాస్తు చేసుకుని చాలా కాలం అయింది అని ఇంతవరకు మంజూరు కాలేదని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అభ్యర్థించారు.

ఇళ్లపట్టాల పంపిణీకి సిద్ధం కావాలి ..కలెక్టర్ వినయచంద్

Image
విశాఖపట్నం :  ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో తహసీల్దార్లు, డి టి లు, ఇతర అధికారులతో ఇళ్ల పట్టాల పంపిణీ పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన మార్చి 25 న ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారని తెలిపారు. క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించడానికి ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ జనవరి ఒకటవ తేదీన విశాఖపట్నం రానున్నారని తెలిపారు. ఆరోజు ఆయన మండలాలలో పర్యటించి కార్యక్రమం ప్రగతిపై విస్తృత స్థాయిలో సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు.  గ్రామ పంచాయతీల్లో ని లబ్ధిదారులకు ఆ గ్రామ పరిధిలోనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని తెలిపారు.  సచివాలయం లోనూ అర్హుల, అనర్హుల జాబితాలను, అర్హత ప్రమాణాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని తెలిపారు. గ్రామపంచాయతీ పరిధిలో ప్రభుత్వ భూమి అందుబాటులో లేని తరుణంలోనే, భూసేకరణ చేయాలని తెలిపారు. అన్ని గ్రామాలలో గుర్తించిన ప్రభుత్వ భూముల లో లేఅవుట్ వేసి, ప్లాట్లు సిద్ధం చేయాలని తెలిపారు. అలసత్వం లేకుండా పూర్తి శ్రద్ధతో పని చేయకపో

రాజధాని రైతులకు జనసేన మద్దతు

మంగళగిరి : రాజధాని రైతుల ఆందోళనలకు జనసేన అధినేత పవన్  కల్యాణ్ సంఘీభావం తెలపనున్నారు.  ఈ మేరకు రేపు ఉదయం మందడం, వెలగపూడి, తుళ్లూరులో.. పర్యటించాలని నిర్ణయించారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన సమావేశంలో పవన్  ఈమేరకు నిర్ణయించారు. అమరావతిలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై నాదెండ్ల మనోహర్, నాగబాబు పవన్ కు 20 పేజీల నివేదిక అందజేశారు.  వివిధ జిల్లాల్లో ప్రజల అభిప్రాయాలను నేతల నుంచి ఆరా తీస్తున్నారు. పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల పాట పాడుతున్న ప్రభుత్వం రెవిన్యూ లోటు ఎలా భర్తీ చేస్తుందని పవన్ కు ఇచ్చిన నివేదికలో ప్రశ్నించారు. ఇప్పటికిప్పుడు సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల తరలింపు ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని తేల్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ, వ్యయాలు పరిశీలిస్తే ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా ఉందనే విషయం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. 22వేల 112 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు ఉంటే అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. బ్యాంకులు కూడా రుణాలిచ్చేందుకు ముందుకు రావడం లేదని అభిప్రాయపడ్డారు.3 రాజధానుల చర్చతో  కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డ

షుగర్ పేషెంట్స్ క్యారెట్ తీసుకుంటే ప్రమాదమా..

  షుగర్ వ్యాధి వచ్చినవారు క్యారెట్స్ తీసుకోవడం మంచిదని చెబుతుంటారు. ఇందులో నిజం ఉంది. కానీ, అతిగా తినడం అంత మంచిది కాదని చెబుతున్నాయి తాజా పరిశోధనలు. డయాబెటీస్ వచ్చిన వారు డైట్ విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. తీసుకునే ఆహారంపై సరైన అవగాహన అవసరం. ఈ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే చాలు అప్రమత్తం అవ్వాల్సిందే. ఎందుకంటే ఈ వ్యాధి కారణంగా అనేక వ్యాధులు చుట్టు ముడతాయి. కాబట్టి ఈ సమస్యకు కారణమయ్యే ఆహార పదార్థాలను దూరం పెట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. మరీ షుగర్ వచ్చినవారు క్యారెట‌ని తినొచ్చా.. తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.. ​ఇలా కూడా తీసుకోవచ్చు.. క్యారెట్.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూరగాయల్లో ఇది ఒకటి. దీనిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుంటారు నిపుణులు. చూడగానే ఎర్రగా నోరూరించే ఈ వెజిటేబుల్‌ని పెద్దలు, పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటుంటారు. తియ్యగా ఉండే ఉండే ఈ కూరగాయని ఊరికే తింటుంటారు. మరికొంతమంది సలాడ్స్‌లో వేసుకుని, జ్యూస్, స్వీట్స్‌లా చేసి తీసుకుంటుంటారు. ​క్యారెట్‌లోని విటమిన్స్.. క్యారెట్‌లో విటమిన్ ఏ, సి, కె విటమిన్స్‌తో పాటు పొటాషియం ఎక్క

లంబసింగి లో వణికిస్తున్న చలి పులి ...

Image
చింతపల్లి : విశాఖ ఏజెన్సి లంబసింగిని   చలి పులి   వణికిస్తుంది . గత వారం రోజులుగా బంగాళాఖాతం ఒడిశా తీరాన ఏర్పడిన అల్పపీడన  ద్రోణి కారణంగా వాతావణం లో కలిగిన  మార్పులతో  పడిపోయాయి. . దీంతో  సోమవారం ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగింది.  చింతపల్లి లో సోమరవం 8.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వాతావన విభాగం శాస్త్రవేత్త సౌజన్య తెలిపారు. సహజంగానే చింతపల్లి కంటే లంబసింగి లో రెండు డిగ్రీలు తక్కువగా నమోదు అవుతుంది. ఈమేరకు లంబసింగి లో  ఉష్ణోగ్రత 6డిగ్రీలకు చేరింది . కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా తగ్గడం కారణంగా  చలి తీవ్రత పెరిగిపోయింది. అలాగే మంచు కూడా దట్టంగా కురుస్తుంది. తాజా వాతావరణ పరిస్థితులు స్థానిక ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నా పర్యాటకుల సందర్శనకు అనుకూలమైన సమయం. లంబసింగికి 2కిలోమీటర్లు దూరంలో నున్న చెరువుల వెనంలోనూ వాతావరణం బాగుంది. మంచు అందాలు ఆకట్టుకుంటున్నాయి. అలాగే తాజంగి జలాశయం వద్ద పర్యాటకుల కోసం జిప్ లైన్ , సహస క్రీడలు అందుబాటులో ఉన్నాయి . 31రాత్రి లంబసింగి లో జరుపుకోవాలని భావించే పర్యాటకులకు వాతావణం అనుకూలస్తోంది.

విశాఖ రాజధానికి మద్దతుగా భారీ ర్యాలీ ...

Image
నర్సీపట్నం : విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటుకు సీఎం జగన్మోహనరెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా నర్సీపట్నం టౌన్ లో మూడు వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు.  నర్సీపట్నంశాసన సభ్యుడు పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేపట్టారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించినందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ర్యాలీలో నర్సీపట్నం నియోజకవర్గంకు చెందిన నాలుగు మండలాల వైసిపి  పార్టీ నాయకులు, కార్యకర్తలు  యువకులు , నర్సీపట్నంలోని ప్రభుత్వ ప్రైవేటు జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు, యాజమాన్యం,  ప్రైవేట్ కాలేజీల యూనియన్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ విశాఖలో రాజధాని ఏర్పాటుతో వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. 

కొనసాగుతున్న మీసేవల సమ్మె.....పౌరసేవలకోసం జనం పాట్లు...

Image
విశాఖపట్నం (జనహృదయం) : తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో మీ సేవా ఆపరేటర్‌లు చేస్తున్న బంద్‌ తొమ్మిదవ రోజుకు చేరుకుంది గత 15 ఏళ్లుగా మీసేవ నమ్ముకొని జీవనం గడుపుతున్న తమ బ్రతుకులు రోడ్డుపాలు చేయొద్దని తమకు బ్రతుకు భరోసా కల్పించాలని ఆపరేటర్లు ఈనెల 20 నుంచి సమ్మె చేపట్టారు. గత తొమ్మిది రోజులుగా సాగుతున్న మీసేవ నిర్వాహకుల సమ్మెతో ఓ వైపు ఆపరేటర్లు, మరోవైపు పౌరసేవలు స్థంభించిపోెయి  ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో మీసేవ బంద్‌ ప్రభావం తీవ్రంగా ఉంది. మీసేవలన్నీ ఒక్కసారిగా మూతబడడంతో తమ లావాదేవీలపై ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  నెలాఖరు కావడంతో విద్యుత్‌ బిల్లులు చెల్లింపు కోసం నానా అవస్థలు పడుతున్నారు. డిజిటల్‌ లావాదేవీలపై అంతగా అవగాహన లేని గ్రామీన జనం పాట్లు వర్ణణాతీతంగా మారాయి. గతంలో ఎన్నడూ లేని విదంగా ఏకంగా తొమ్మితి రోజులు మీసేవలు మూతబడడంతో వివిద కార్యాలయాలకు సంబందించిన పౌరసేవలు నిలిచిపోయి అడంగల్‌ కావాలన్నా కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితి రైతులు ఎదుర్కొంటున్నారు. ప్రధానమైన రెవన్యూ సేవలు స్థంభించి

దళితులపై వివక్ష తగదు ...

Image
గన్నవరం :  స్వాత్రంత్రం వచ్చి 73 సంవత్సరాలు అయిన దళిత బహుజనులు పట్ల వివక్షత పోలేదని నా దీపం గ్రూప్స్ అధినేత గోగులమూడి రత్నం ఆవేదన చెందారు సోమవారం ఆయన మాట్లాడుతూ ఈ నెల 28న ఎన్నికల సంఘం నిర్వహించిన అఖిల పక్షం సమావేశానికి  హాజరైన దళిత బహుజన పార్టీ అధ్యక్షులు వడ్లమూడు కృష్ణ స్వరూప్ హై కోర్ట్ అడ్వాకెట్ ని ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి ,వారి సిబ్బంది కలిసి మెడపట్టి కృష్ణ స్వరూప్ ను బయటకు గెంటివేయడం దళితుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడమేనని వాపోయారు. . ఈ సంఘటన ను ఎస్సి ఎస్టీ చట్టం పరిధిలోకి తీసుకుని నాగిరెడ్డి పై తక్షణమే చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు తరుపున డిమాండ్ చేశారు. ఈ చర్య కేవలం  కృష్ణ స్వరూప్ కు జరిగిన అన్యాయం కాదని, యావత్తు దళిత జాతికి జరిగిన అన్యాయంగా పేర్కొన్నారు. దళితుల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసిన కమిషనర్ పై తక్షణమే చర్యలు తీసుకోని భవిష్యత్ లో దళితులపై అరాచకాలు, అవమానాలు,అవరోధాలు,దూషింపబడడం జరగకుండా ప్రభుత్వం తగు కఠిన చర్యలు తీసుకోవలని కోరారు. 

ఆంధ్రా కాశ్మీర్ లమ్మసింగి సోయగాలు.... 

అక్కడ మంచుముత్యాలు కురుస్తూంటాయి.. కొమ్మకొమ్మకూ పూలన్నట్లు...ఎటుచూసినా మంచు బిందువులే రాలుతూంటాయి... అక్కడ పిల్లగాలులతో సయ్యాటలాడుతూ తె ల్లటిమబ్బులు నేలను తాకుతూ జారిపోతూంటాయి.... తెల్లటి చామంతుల్లా మెరిసి.. విరిసిన కాఫీ పూల పరిమళాలు పలకరిస్తూంటాయి... ఎతె్తైన కనుమల మధ్య, చుట్టూ పరుచుకున్న లోయల మధ్య ఒంటరిగా ఉండే ఆ సీమలో అడుగుపెడితే.. లేలేత ఎరుపుతో నవనవలాడే యాపిల్ కాయలతో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తోటలు కన్పిస్తాయి. స్వర్గానికి నిచ్చెనలు ఇక్కడినుంచే వేయొచ్చన్న భావన మనసును తాకుతుంది. ఇదంతా చూస్తే మీకు అందాల కాశ్మీరం కళ్లముందు కదలాడుతుంది. కానీ ఇది కాశ్మీర్ కాదు. అక్కడున్న అందాలను తనవి చేసుకున్న లమ్మసింగి సొబగులు ఇవి. విశాఖ జిల్లా చింతపల్లి ఏజెన్సీలో ఉన్న ఈ గిరిజన పల్లె అందరికీ లంబసింగిగా సుపరిచితమే. ఎముకలు కొరికే చలికి..అత్యల్ప ఉష్ణోగ్రతల నమోదుతో వార్తల్లోకి ఎక్కింది. పర్యాటకులనూ, ప్రకృతి ప్రేమికులను, శాస్తవ్రేత్తలను రా..రమ్మని పిలుస్తున్న లమ్మసింగి కథాకమామిషు ఇది.... ఆ గిరిజన పల్లె చలికి పుట్టినిల్లు.. కొండకోనల మధ్య ప్రకృతి అందాలు ఆరబోసుకున్న ఓ చిన్నపల్లె... మిట్ట మధ్యాహ్నమైనా ఆ ఊరివేపు తొ

ఢిల్లీ ని కప్పేసిన పొగ మంచు

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీని సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కప్పేయడంతో పలు విమానాలు, 30 రైళ్ల రాకపోకల్లో తీవ్ర జాప్యం జరిగింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు ప్రభావంతో సోమవారం ఉదయం మూడు విమాన సర్వీసులను దారి మళ్లించారు. పలు విమానసర్వీసుల రాకపోకల్లో తీవ్ర జాప్యం నెలకొంది. ఢిల్లీ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు రాకపోకలు సాగించాల్సిన 30 రైళ్లు ఆలస్యమయ్యాయి. పొగమంచు వల్ల విమానాల రాకపోకల్లో జాప్యం జరిగిందని, విమాన సర్వీసులను రద్దు చేయలేదని ఢిల్లీ విమానాశ్రయ అధికారులు చెప్పారు. ఢిల్లీలో సోమవారం ఉష్ణోగ్రత 2.5 డిగ్రీల సెల్షియస్ కు పడిపోయింది. చలిగాలుల ప్రభావం వల్ల ఢిల్లీలో వాతావరణశాఖ అధికారులు రెడ్ వార్నింగ్ జారీ చేశారు. నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద, ఫరీదాబాద్ నగరాల్లో ఈ నెల 31వతేదీన వర్షం కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. తీవ్ర చలిగాలుల ప్రభావం వల్ల ప్రయాణికులు, ఇళ్లు లేని వారు ఆనంద్ విహార్, సరాయ్ కాలేఖాన్ ప్రాంతాల్లోని నైట్ షెల్టర్లలో తలదాచుకున్నారు. కళింది కుంజ్, మయూర్ విహార్ ఫేజ్ -1, ఆర్ కే పురం, ఢిల్లీ కంటోన్మెంటు ప్రాంతాల్లో దట్టమ

రైతుల అరెస్ట్ ను ఖండించిన చంద్రబాబు

అమరావతి:  రాజధాని కోసం దీక్ష చేస్తున్న రైతుల  అరెస్ట్ ను  టిడిపి అధ్యక్షులు చంద్రబాబు ఖండించారు. ఈమేరకు పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ ద్వారా  రైతుల అరెస్ట్ పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై హత్యాయత్నం అభియోగాలు పెట్టడాన్ని ఖండించారు.  రైతుబిడ్డలైన పోలీసులు రైతుల పట్ల సానుభూతిగా లేకుండా  భూములు కోల్పోయి, రాజధానిపై ఆందోళనలో ఉన్నవాళ్లపై పోలీసు కేసులా అంటూ ఆవేదహన చెందారు. నిద్రాహారాలు మాని ఆందోళన చేసే రైతులపై పోలీసు దాడులు హేయం. దొంగలు, గుండాల మాదిరిగా భూములిచ్చిన రైతులపై దాడులా..? జరిగిన సంఘటనకు పోలీసులు పెట్టిన సెక్షన్లకు పొంతన ఉందా..? రాజధానికి భూములిచ్చిన రైతులను జైలు పాలు చేస్తారా...?  అర్ధరాత్రి ఇళ్ల గోడలు దూకి రైతులను అరెస్ట్ చేస్తారా..? మహిళలు, వృద్దులను భయభ్రాంతులను చేస్తారా..? 6గురు రైతులపై 7సెక్షన్లు నమోదు చేస్తారా..? అర్ధరాత్రి హడావుడిగా జైలుకు తరలిస్తారా..? రాష్ట్రం కోసం భూములు త్యాగాలు చేసిన రైతులపై ఇంత అమానుషమా..? 33వేల ఎకరాలు అందజేసిన రైతులను పెయిడ్ ఆర్టిస్ట్ లంటారా..?  13రోజులుగా వేలాది రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా పట్టించుకోరా..?  వెంకటపాలెం,న

రాజధాని తరలింపుపై ఫైర్

అమరావతి: రాజధానికి మద్దతుగా తుళ్లూరు, వెలగపూడి ,మందడం గ్రామాల్లో రైతుల నిరసన దీక్ష లకు  అమరావతి పరిరక్షణ సమితి సోషల్ కన్వీనర్ తుమ్మల కార్తీక్,కాంగ్రెస్ మహిళ నాయకులు సుంకర పద్మ శ్రీ,అజేయ్ కుమార్,డాక్టర్ సరిత మద్దతు తెలిపారు.  ఈ సందర్బంగా తుళ్లూరు దీక్షలో సుంకర పద్మశ్రీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం  జగన్మొహన్ రెడ్డిని తీవ్ర పదజాలం తో హెచ్చరించారు.

ఎసిబికి చిక్కిన విఆర్వో

గుంటూరు:  వినుకొండ పట్టణ తహశీల్దార్ కార్యాలయంలో ఏ.సీ.బీ అధికారులు దాడులు నిర్వచించారు. ఈ సంఘటన వివరాలిలావున్నాయి.వినుకొండలో ఓ రైతు తన వ్యవసాయ భూమికి పట్టాదారు పాసుపుస్తకం పొందేందుకు తమ గ్రామా విఆర్వో ను సంప్రదించాడు. అయితే పాసుపుస్తకం ఇచ్చేందుకు అయిదు వేయాలా రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పగా రైతు ఎసిబి అధికారులను సంప్రదించాడు. ఈమేరకు సోమవారం వినుకొండ మండలం నడిగడ్డ గ్రామం వీఆర్వో చిట్టీబాబు పోలం పాసు బుక్ కోసం 5వేలు లంచం తీసుకుంటుడగా  ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కాగా విఆర్వో చిట్టిబాబు పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. 

అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

విశాఖ : గాజువాక మెయిన్ రోడ్డులో అనుమాన స్పదంగా ఓ వ్యక్తి మృతి చెందాడు. అధిక మోతాదులో మద్యం సేవించడం వలన చనిపోయినట్లు భావిస్తున్నారు.  ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తి పేరు విజయ్ గా  గాజువాక పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 

ఆర్టీసీ ఎండి గా మాదిరెడ్డి ప్రతాప్ ...

అమరావతి:  ఏపీఎస్‌ఆర్టీసీ నూతన ఎండీగా 1991ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన  మాదిరెడ్డి ప్రతాప్‌ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ  చేసింది.  ఇప్పటివరకు ఏపీఐఐసీ వైస్‌ఛైర్మన్‌, ఎండీగా పనిచేసిన  ఆయన్ను ఆర్టీసీకి బదిలీ చేసింది.  కాగా పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌భార్గవ్‌ను ఏపీఐఐసీ వైస్‌ఛైర్మన్‌, ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. 

అమరావతి పరిరక్షణ సమితి అఖిలపక్షం భేటీ...

అమరావతి పరిరక్షణ సమితి అఖిలపక్షం భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నగరంలో శుక్రవారం క్రెడయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ రాజధాని అమరావతిని ఎట్టి పరిస్థితుల్లో తరలించవద్దని ఏకగ్రీవంగా ప్రభుత్వాన్ని అఖిలపక్ష సమావేశం కోరింది. శనివారం ఉదయం నుంచి విజయవాడ ధర్నా చౌక్ లో అమరావతి పరిరక్షణ సమితి ధర్నా నిర్వహిస్తామన్నారు. 27న రాష్ట్రవ్యాప్తంగా మానహారాలకు అమరావతి పరిరక్షణ సమితి పిలుపునిచ్చారు. నల్లబ్యాడ్జీలు కట్టుకుని అందరూ మానవహారాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మంత్రివర్గ సమావేశంలో రాజధాని తరలింపుపై నిర్ణయం తీసుకోరాదని ప్రభుత్వానికి అఖిలపక్షం డిమాండ్ చేసింది. కాదని నిర్ణయం తీసుకుంటే సమావేశమై భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రయోజనాలు దెబ్బతినే విధంగా జి.ఎన్.రావు కమిటీ ఇచ్చిన నివేదిక, అధికార వికేంద్రీకరణ సాకుతో రాజధాని తరలింపుకు తీసుకున్న ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయంపై అన్ని వర్తక సంఘాలు, కార్మిక సంఘాలు, నిర్మాణ రంగ సంస్థలు సంయుక్తంగా నిరసన తెలియజేస్తున్నాయన్నారు. యాక్షన్ కమిటీ తరఫున రాజకీయ, కులమతాలకు అతీతంగా మన ప్రాంత ప్రయోజనాలే లక్ష్యంగా ఈ కమి

అమరావతిలో జర్నలిస్టులపై దాడికి పాల్పడిన వ్యక్తుల అరెస్ట్

అమరావతి:  ఉద్దండరాయునిపాలేం లో మీడియా వ్యక్తులపై దాడి చేసిన కేసులో నలుగురు వ్యక్తులను నిరసనల నేపథ్యంలో ఉద్దండరాయునిపాలేం లో మీడియా వ్యక్తులపై దాడి చేసిన కేసులో నలుగురు వ్యక్తులను  పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. గోగులముడి సురేందర్, పత్తిపాటి శ్రీనివాస రావు, పత్తిపాటి సతీష్, అల్లెవా శివాబాబు అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిని తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌కు కు కాకుండా వేరే చోటుకు తరలించడంపై వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. దాడిలో గాయపడ్డ మహిళా జర్నలిస్ట్ తోపాటు మరో ముగ్గురిని పొలిసు ఉన్నతాధికారులు పరామర్శించినట్టు తెలుస్తోంది. వారి ఫిర్యాదు ఆధారంగానే కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా శుక్రవారం రాజధాని ప్రాంతంలో కవరేజి కోసమని ప్రముఖ మీడియా జర్నలిస్టులు వెళ్లారు. అయితే వారిపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు కొందరు వ్యక్తులు. ఈ దాడి యాదృచ్చికంగా కాకుండా ప్లాన్ ప్రకారమే జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. దాంతో అమరావతి ప్రాంతంలో కఠిన ఆంక్షలు విధించారు పోలీసులు. ఎవరైనా హింసాత్మక ఆందోళనలకు పాల్పడితే వారిని అదుపులోకి తీసుకొని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే పోలీసుల చర్

జార్ఖండ్ సిం గా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం

Image
రాంఛీ : జార్ఖండ్ సీఎంగా జేఎంఎం నేత హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ద్రౌపతి ముర్ము సమక్షంలో హేమంత్ సోరెన్ జార్ఖండ్ 11వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ, ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ భాగల్, డీఎంకే నేత స్టాలిన్, ఆర్జేడీ నేత తేజస్వియాదవ్, ఆప్ నేత సంజయ్ సింగ్, జార్ఖండ్ మాజీ సీఎం రఘుబర్ దాస్ తదితరులు హాజరయ్యారు.

విశాఖ ఉత్సవ్ లో షార్ట్ సర్చ్యుట్... తప్పిన ప్రమాదం

విశాఖపట్నం: విశాఖ ఉత్సవ్ లో వేదిక సమీపంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ త్రుటిలో అప్పయం తప్పింది  దేవి శ్రీ ప్రసాద్ సంగీత విభావరి సమయంలో ఈ  ఘటన చోటుచేసుకొంది. ఈమేరకు వెంటనే  అపమత్తమైన నిర్వాహకులు  విద్యుత్ ,పోలీస్ విభాగాల సమన్వయం తో విద్యుత్ సరఫరా నిలిపి ప్రమాదం నివారించి గలిగారు. సముద్ర కెరటాలు ఉధృతి వల్ల  వీచిన గాలులతో  వేదిక సమీపంలో విద్యుత్ వైర్ లు షార్ట్ సర్క్యూట్ అయ్యాయి. 

ఆర్టీసీ కార్మికుల భారీ ర్యాలీ...

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ అక్రమ రవాణాను అరికట్టాలని డిమాండ్‌  విజయవాడ : ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఆగడాలను అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ కార్మికులు నడుంబిగించారు. బస్‌ స్టేషన్ల వద్ద ప్రైవేట్‌ ట్రావెల్స్‌ అక్రమ రవాణాను అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ బెజవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ వల్ల ఆర్టీసీ చాల నష్టపోతుందని కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు. అక్రమ రవాణాను అధికారులు అడ్డుకుంటున్నప్పటికీ ఫలితం ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ రవాణా చేస్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయవాడ పోలీస్‌ కమిషినర్‌, జిల్లా రవాణా శాఖ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు.

పిర్యాదు అందిన వెంటనే పోలీసులు స్పందస్తారు...

Image
డీజీపీ గౌతమ్ సవాంగ్ .. మంగళగిరి : ప్రజలు నుంచి ఫిర్యాదు అందగానే పోలీసులు వెంటనే  స్పందిస్తున్నారని డిజిపి డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఆదివారం డీజీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ గుట్కా, గంజాయి, అక్రమంగా ఇసుక తరలింపు వంటి విషయాల్లో పోలీసులు కఠినంగా ఉంటున్నామన్నారు.  ఈ ప్రభుత్వం వచ్చినప్పటి' నుండి మహిళల కు రక్షణ మరింత పెరిగిందని,  దిశ  చట్టం వచ్చిన తర్వాత  మహిళలకు భద్రత మరింత పెంచడంతో పాటు శిక్షలను మరింత కఠినతరం చేసామన్నారు.  దేశంలోనే ఏపీ పోలీసులు మంచి పేరు వచిందన్నారు. ఈమేరకు  ఆరు అవార్డులు వచ్చాయని,  క్రైం రేటు గత ఏడాది కంటే 6 శాతం తగ్గిందిని చెప్పారు. మావోయిస్టుల యాక్టివిటీస్ ను ఎప్పటికప్పుడు కంట్రోల్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు సక్సెస్ అవుతున్నారని  స్పందన ద్వారా వచ్చే ఫిర్యాదులను చాలా తొందరగా పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. సైబర్ క్రైం కింద 122 కేసులు కట్టాము. వాటిపై ప్రత్యేక నిఘా ఉంచాము. మైనర్ బాలికలను మోసగించే వారిపై ఫోక్సో చట్టం కింద కేసు పెడుతున్నాం. మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. రోడ్డు ప్రమాదాలు గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్ల

రాజధాని రైతుల ఇళ్ళలో పోలీసుల సోదాలు ...

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రైతుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. తుళ్లూరు మండలం వెంకటపాలెం, ఉద్దండరాయుని పాలెం, మందడం గ్రామానికి చెందిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ సందర్భంగా రాజధాని రైతులు మాట్లాడుతూ ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. అర్ధరాత్రి దాటాక తమ ఇళ్లలో పోలీసులు తనిఖీలు చేశారని, కొందరిని అరెస్టు చేసి తీసుకెళ్లారని చెప్పారు. వెంకటపాలెం, మోదుగుల లింగాయపాలెం, మందడం, వెలగపూడి, తుళ్లూరులో పోలీసులు అక్రమ అరెస్టులు చేశారని రైతులు ఆరోపించారు. అరెస్టు చేసిన రైతులను వెంటనే విడిచిపెట్టకపోతే పీఎస్‌ల ఎదుట ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. అరెస్టయినవారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారని రైతులు తెలపారు.

మూడు రాజదానులకు వ్యతిరేకంగా..

విజయవాడ: రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ జిల్లాలోని బెంజ్‌సర్కిల్‌లో ఆదివారం ఉదయం మానవహారం నిర్వహించారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. సేవ్ అమరావతి నినాదంతో హైస్కూల్ రోడ్డు నుంచి విజయవాడ బెంజ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు మాట్లాడుతూ మూడు రాజధానుల నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ పాలన తుగ్లక్ పాలనను తలపిస్తోందని మండిపడ్డారు. రాజధాని అభివృద్ధి కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేయచ్చు కానీ, పాలనను వికేంద్రీకరణ చేయడం మంచిది కాదని తెలిపారు. అమరావతిలోనే రాజధాని ఉంటుందని ప్రకటన చేసే వరకు తమ ఉద్యమం ఆగదని, అమరావతి రాజధాని పోరాటంలో రైతులకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని సమితి నేతలు స్పష్టం చేశారు.

నిపుణుల కమిటీ సందర్శన ....

 పోలవరం: పోలవరం ప్రాజెక్టును కేంద్ర నిపుణుల కమిటీ ఆదివారం సందర్శించనుంది. పోలవరం ప్రాజెక్టు పురోగతిని స్వయంగా పరిశీలించనుంది. గడిచిన కొద్ది మాసాలుగా గోదావరి వరదలు కారణంగా పనులు మందగించడం, రాష్ట్ర ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌కు సిద్ధపడిన అనంతరం తాజా పరిస్థితిని నిపుణుల బృందం పరిశీలించబోతుంది. ఇప్పటికే పలుమార్లు పోలవరం ప్రాజెక్టు సందర్శించినప్పటికీ తాజా రాక ఆసక్తిగా మారింది. పరిస్థితిని భేరీజు వేయడంతోపాటు ఇంతకుముందు తాము సూచించిన విధంగా పనులు కొనసాగుతున్నదీ లేనిదీ కమిటీ పర్యవేక్షించనుంది. నిపుణుల కమిటీ చైర్మన్‌ ఎస్‌కే హల్దార్‌, ఆర్‌కే పచౌరి, ఎస్‌ఎల్‌ గుప్తా, డి.రంగారెడ్డి, బీపీ పాండేతో సహా ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ సాంకేతిక నిపుణులు డీపీ భార్గవ పోలవరం ప్రాజెక్టును సందర్శించేవారిలో ఉన్నారు. ప్రాజెక్టులో కీలకమైన స్పిల్‌వే పనులను, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను కూడా కమిటీ పరిశీలించనుంది.

అమ్మ ఒడి లబ్దిదారుల జాబితా రెడీ...

అమరావతి:  రాష్ట్రంలో  అమ్మఒడి పథకం లబ్ధిదారుల సంఖ్య తుది జాబితా ఖరారైంది. రాష్ట్రంలో మొత్తం 41,46,844 మంది విద్యార్థులు తల్లులను ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. జనవరి 9 నుంచి వీరి బ్యాంకు ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకటి నుంచి ఇంటర్​ వరకూ చదివే విద్యార్థులు 81.7 లక్షల మంది ఉండగా అందులో 65.1 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. విద్యార్థుల వివరాలను తల్లుల ఆధార్​, రేషన్​ కార్డులతో అనుసంధానం చేసి 41.46 లక్షల మంది లబ్ధిదారులతో తుది జాబితా రూపొందించారు. బ్యాంకు ఖాతాల్లో పేర్లు తప్పుగా ఉండడం వల్ల 1.84 లక్షల మంది అనర్హులయ్యారు. 14.7 లక్షల మందిని వివిధ కారణాలతో అనర్హులుగా గుర్తించారు. ఇందులో ఆదాయపు పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, కార్లు ఉండడం, తల్లి, విద్యార్థుల ఆధార్​ తప్పుగా ఉండడం, సర్కారు నిర్ణయించినదానికన్నా ఎక్కువ స్థిరాస్తి ఉండడం, పథకం వద్దని చెప్పిన వారూ ఉన్నారు.

కొనసాగుతున్న మీసేవ సమ్మె..... అకిలపక్షం మద్దతు...

Image

పౌరసత్య బిల్లుకు మద్దతుగా బిజెపి రోడ్ షో...

Image

పౌర సత్వ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన ...

Image

స్థానిక ఎన్నికలకు సిద్దం అవ్వండి ....

Image
విశాఖపట్నం :  రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ తెలిపారు. శుక్రవారం నాడు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఆయన తన కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన గతంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా అవలంభించిన పద్ధతులనే ఈ ఎన్నికల్లో కూడా పాటించనున్నట్లు తెలిపారు.  ఎన్నికల నిర్వహణ కై కేటాయించనున్న సిబ్బందిని ర్యాండమైజేషన్ పద్ధతిలో కంప్యూటర్ ద్వారా ఎంపిక చేస్తారని తెలిపారు. ఎన్నికల విధుల్లో స్థానిక ఉద్యోగులు ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.ఒక మండలంలోని ఎంపీటీసీ, జెడ్ పి టి సి ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తారని తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల లో దశలవారీగా ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. బ్యాలెట్ బాక్సులను మరమ్మతులు చేయించి సిద్ధం చేసుకోవాలని తెలిపారు. జిల్లా పరిషత్ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా జాయింట్ కలెక్టర్, జిల్లా పరిషత్ సీఈవో స్థాయి అధికారులు వ్యవహరిస్తారని తెలిపారు. మండల పరిషత్ ఎన్నికల్లో మండల ప్రత్యేక అధికారులు రిటర్నింగ్ అధికారులుగా వ్

భలే చౌకైన బిర్యానీ...

Image
తమిళనాడు :  తన హోటల్ కి పాపులారిటీ పెంచుకోవాలని ఓ యజమాని మదిలో మెదిలిన ఆలోచన యమ సక్సెస్ అయ్యింది.   భోజన ప్రియులు బిర్యానీకి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. దీనికితోడు   చికెన్ బిర్యానీకి యమా క్రేజ్. ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ తీసి తమకు నచ్చిన రెస్టారెంట్ లో లేదా హోటల్ లో బిర్యానీ బుక్ చేసుకొని తింటున్నారు. బిర్యానీ బుక్ చేసే ముందు ఏ హోటళ్లలో ఆఫర్లు ఉన్నాయి..ఎక్కడ ధర తక్కువ అని వెతుకుతుంటారు. అటువంటి బిర్యానీ కేవలం 15 రూపాయలకే అంటే ఇంక ఎవరైనా ఊరుకుంటారా. ఎగబడి ఎగబడి కొనుకుంటారు. హోటల్ ముందు క్యూ కడతారు. తమిళనాడులో అదే జరిగింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తమిళనాడులోని కోయంబత్తూరులో కొత్తగా ఓ హోటల్ ప్రారంభమైంది. తొందరగా వ్యాపారం అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో హోటల్ యజమాని కొత్తగా ఆలోచించాడు. డిసెంబర్ 25, 26 తేదిలలో బంపర్ ఆఫర్లను ప్రకటించారు. చికెన్ బిర్యానీ 15 రూపాయలకు, ఎగ్ బిర్యానీ 10 రూపాయలకు, ప్లెయిన్ బిర్యానీ 10 రూపాయలకు, పరోటా 5 రూపాయలని ప్రకటించాడు. ఇంకేముంది క్షణాల్లో వందల మంది హోటల్ ముందు వాలిపోయారు. బిర్యానీ కోసం ఎగబడ్డారు. లైన్లు నిలబడి బిర్యానీని కొనుగోలు చేశారు. రెండు రోజుల

ఫార్మా కంపెనీలో మరో ఘోర ప్రమాదం

పరవాడ : విశాఖలోని పరవాడ ఫార్మా కంపెనీలో మరో ఘోరమైన ప్రమాదం చోటుచేసుకుంది. స్మైల్ ఎక్స్ ఫార్మలో విషవాయువులు లీకై ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విజయశ్రీ ఆర్గానిక్ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీకై ఐదుగురు కార్మికులు అస్తవ్యస్థకు గురై 24 గంటలు గడవకముందే మరో ఘటన చోటు చేసుకోవడంతో కార్మికులు అందోళన చెందుతున్నారు. కార్మికులకు యాజమాన్యం సరైన సదుపాయాలు కల్పించకపోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయని కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మీసేవ మహాధర్నాకు అనూహ్య స్పందన...

Image
ఉదృతం అవుతున్న ఆందోళనలు... ఆపరేటర్ల ఆవేదనకు అన్న వర్గాల మద్దతు... విజయవాడ  (జనహృదయం) : రాష్ట్ర రాజధాని విజయవాడలో తల పెట్టిన మహా ధర్నాకు అనూహ్య స్పందన లభించింది. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో మీ సేవా ఆపరేటర్‌లు చేస్తున్న బంద్‌ ఏడవ రోజుకు చేరుకుంది గత 15 ఏళ్లుగా మీసేవ నమ్ముకొని జీవనం గడుపుతున్న తమ బ్రతుకులు రోడ్డుపాలు చేయొద్దని తమకు బ్రతుకు భరోసా కల్పించాలని ఆపరేటర్లు ఆందోళన చేపట్టారు. ఈమేరకు రాజధానిలో మహాధర్నాకు సమాయత్తమయ్యారు దీంతో ఏళ్ల తరబడి మీసేవ పై ఆధారపడి తమ లావాదేవీలు నిర్వహిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ప్రతి చిన్న అవసరానికి ఆధారపడడం అలవాటుగా చేసుకున్న జనం ఆవేదన చెందుతున్నారు వెంటనే మీ సేవా ఆపరేటర్‌ సమస్యలు పరిష్కరించి యధావిధిగా లావాదేవీలు సాగించాలని వినియోగదారులు విజ్ఞప్తి చేస్తున్నారు కాగా మీసేవ బందుకు రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్య మద్దతు లభిస్తోంది 13 జిల్లాల వ్యాప్తంగా మండలాలు జిల్లా కేంద్రం రాష్ట్ర రాజధానిలో సైతం బంద్‌ ప్రభావం తీవ్రరూపం దాల్చుతూ ఆందోళన మిన్నంటితోంది. దశలవారీగా ప్రారంభమైన ఉద్యమం తీవ్రరూపం దాల్చుతోంది రాష్ట్రంలో

ఏటిఎం మోసాలకు ఇక చెక్ .....

 ఏటీఎం మోసాలకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నడుం బిగించింది. ఏటీఎంలో జనవరి 1 నుంచి రూ.10వేలు, అంతకు పైబడి నగదు ఉపసంహరణకు ఓటీపీని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు చేసే లావాదేవీలకు ఓటీపీ విధానం వర్తిస్తుందని ఎస్‌బీఐ పేర్కొంది. ఎస్‌బీఐ వినియోగదారులు ఏటీఎంలో నిర్దేశించిన సమయంలో నగదు విత్‌ డ్రా చేయడానికి వెళ్లేటప్పుడు స్క్రీన్‌పై ఓటీపీ అడుగుతుంది. వారి రిజిస్టర్‌ మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేయడం ద్వారా లావాదేవీ జరపొచ్చు. ఓటీపీ ద్వారా కేవలం ఒక్క లావాదేవీ మాత్రమే చేయొచ్చని ఎస్‌బీఐ తెలిపింది. దీనివల్ల అనధికార లావాదేవీలను నివారించొచ్చని పేర్కొంది. ఎస్‌బీఐ వినియోగదారులు ఇతర ఏటీఎంల్లో గానీ, ఇతర బ్యాంకు కార్డు వినియోగదారులు ఎస్‌బీఐ ఏటీఎంల్లో గానీ ఈ సదుపాయాన్ని పొందలేరు. ఈ మార్పు చేయడానికి ఏటీఎంల్లో పెద్ద మార్పులేమీ అవసరలేదని, జనవరి 1 నుంచి ఓటీపీ విధానం తీసుకొస్తున్నామని ఎస్‌బీఐ తెలిపింది. ఈ విధానం ద్వారా ఏటీఎం కేంద్రాల్లో క్లోనింగ్‌ కార్డుల ద్వారా జరిగే మోసాలకు చెక్‌ పెట్టేందుకు వీలవుతుంది.

ముగిసిన కేబినేట్ భేటి...

Image
అమరావతి: ప్రస్తుతం శీతాకాలమైనా ఏపీలో మాత్రం హాట్‌ హాట్‌గా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మూడు రాజధానుల ప్రతిపాదనలతో అమరావతి రైతులు తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్న వేళ.. రాష్ట్ర మంత్రి వర్గ భేటీ ముగిసింది. వివిధ అంశాలపై 2 గంటలకు పైగా కేబినెట్‌ చర్చించింది. సచివాలయంలో ఏపీ సీఎం జగన్ సమక్షంలో ఎంతో ఉత్కంఠ నడుమ సాగిన కేబినేట్ సమావేశం ముగిసింది. అనంతరం భేటీలో డిస్కర్షన్‌కి వచ్చిన అంశాలపై మీడియాతో మాట్లాడారు మంత్రి పేర్ని నాని. పలు ముఖ్యమైన అంశాలపై కేబినెట్‌లో చర్చించినట్టు.. వాటిని తప్పక అమలు పరుస్తామని మంత్రి పేర్ని నాని తెలియజేశారు. కేబినెట్ కీలక నిర్ణయాలు: - అమరావతిలో భూదందాపై న్యాయ నిపుణులతో చర్చ -ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీబీఐ విచారణకు కేబినెట్ ఆమోదం - ముఖ్యంగా సీఆర్‌డీఏలో జరుగుతోన్న అక్రమాలపై చర్యలు - పంచాయితీరాజ్ ఎన్నికల నిర్వహణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ - పంచాయితీరాజ్ ఎలక్షన్స్‌కు రిజర్వేషన్లు ఖరారు - ఎస్టీలకు 6.77 శాతం, ఎస్సీలకు 19.08 శాతం, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు - 108 ఆంబెలెన్స్ సర్వీసుల్లో ఎన్నో సమస్యల పునరుద్ధరణ - 412 కొత్త 108 వాహనాలు, 656 కొత్త 104 వాహనాల కొనుగోలుకు కేబిన

రాజధానిలో హోరెత్తిన మీసేవ ఆందోళన...

Image

నేను సైతం నీతో......

Image

మీసేవ బంద్ కు అన్ని వర్గాల మద్దతు.. ఉదృతం అవుతున్న మీసేవ బంద్

Image

మహిళ సేషన్లు మరింత బలోపేతం: హోంమంత్రి

  అమరావతి (జనహృదయం): దిశ చట్టం అమలుకు అవసరమైన ఫోరెన్సిక్ ల్యాబరేటరీలకు కోసం రూ. 23 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు హోంశాఖ మంత్రి సుచరిత పేర్కొన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ నియామకం చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. మహిళలు చిన్నారులపై నేరాలను అదుపు చేసేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన దిశ చట్టం అమలుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హెూం మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం మంత్రి సుచరిత మాట్లాడుతూ.. మూడు ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఏర్పాటుకు 176 మంది సిబ్బంది నియామకం కోసం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నామన్నారు. అదే విధంగా మహిళ స్టేషన్లను మరింతగా బలోపేతం చేస్తామని, సత్వర న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెండు నెలల్లో నిర్మాణాలు, సదుపాయాలకు పూర్తి నిధులు మంజూరు చేస్తామన్నారు. దిశ చట్టం ద్వారా సీఎం జగన్ ఒక అన్నలా మహిళలకు భరోసా కల్పించారని అన్నారు. దిశ చట్టం పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఐపీఎస్ అధికారిని నియమిస్తున్నామన్నారు. దిశ చట్టాన్ని చట్టసభల్లో

దిశ చట్టం అమలుపై సిఎం జగన్ సమీక్ష...

Image
తాడేపల్లి (జనహృదయం): దిశ చట్టం పగడ్బందీ అమలుకు అన్ని చర్యలూ తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు 18 కోర్టులకు అవసరమైన బడ్జెట్ ను కూడా వెంటనే కేటాయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మహిళలు, చిన్నారులపై నేరాలను అదుపు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీసుకువచ్చిన దిశ చట్టం అమలుపై సీఎం జగన్ గురువారం సమీక్ష నిర్వహించారు. మేకతోటి సుచరిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, అడ్వకేట్ జనరల్ శ్రీరాం, డీజీపీ గౌతం సవాంగ్ తదితర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. న్యాయపరంగా, పోలీసు పరంగా ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న విషయాలపై ఆయన అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీసు విభాగంలో ఉన్న ఈ సందర్భంగా రాష్ట్ర పోలీసు విభాగంలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ సామర్థ్యాన్ని నాలుగు రెట్లు పెంచేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ప్రస్తుతం ఉన్న ఫోరెన్సిక్ విభాగాన్ని రెట్టింపు చేయడానికి, మరో రెండు ఫోరెన్సిక్ ల్యాబ్ లను ఏర్పాటు చేయడానికి సీఎం అంగీకారం తెలిపారు. ఇందుకు అవసరమైన నిధులను కేటాయించాలని సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యంల

మహిళ సేషన్లను మరింత బలోపేతం: హోంమంత్రి

  అమరావతి (జనహృదయం): దిశ చట్టం అమలుకు అవసరమైన ఫోరెన్సిక్ ల్యాబరేటరీలకు కోసం రూ. 23 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు హోంశాఖ మంత్రి సుచరిత పేర్కొన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ నియామకం చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. మహిళలు చిన్నారులపై నేరాలను అదుపు చేసేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన దిశ చట్టం అమలుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హెూం మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం మంత్రి సుచరిత మాట్లాడుతూ.. మూడు ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఏర్పాటుకు 176 మంది సిబ్బంది నియామకం కోసం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నామన్నారు. అదే విధంగా మహిళ స్టేషన్లను మరింతగా బలోపేతం చేస్తామని, సత్వర న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెండు నెలల్లో నిర్మాణాలు, సదుపాయాలకు పూర్తి నిధులు మంజూరు చేస్తామన్నారు. దిశ చట్టం ద్వారా సీఎం జగన్ ఒక అన్నలా మహిళలకు భరోసా కల్పించారని అన్నారు. దిశ చట్టం పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఐపీఎస్ అధికారిని నియమిస్తున్నామన్నారు. దిశ చట్టాన్ని చట్టసభల్లో

పెద్దలు ఊరికే చెప్పలేదు ఇది పెరట్లో ఉందటే ఆరోగ్యమే...

Image
తులసి ప్రతి ఇంట్లో ఎంతో పవిత్రంగా పెట్టుకునే మొక్క. హిందువులు లక్ష్మీదేవి రూపంగా తులసి మొక్కను కొలుస్తారు. ఇండియాలోనే కాదు, విదేశాల్లో కూడా భారతీయులు తులసిని తమ ఇళ్ల ముందు కోటగా కట్టి కొలుచుకుంటున్నారు. తులసి ఇంట్లో ఉంటే పిల్లలకు ఏ గ్రహదోషాలూ అంటవని పూర్వీకుల నమ్మకం. తులసి రెండు రకాలు. ఎర్రపూలు పూసే మొక్కను కృష్ణతులసి అని, తెల్లపూలు పూస్తే లక్ష్మీ తులసి అని పిలుస్తుంటారు. తులసి ఆకుల వల్ల మనం చాలా జబ్బుల్ని దూరం చేసుకోవచ్చు. ఈ తులసి తన సహజ రంగును కోల్పోవడమో, ఆకులు సడన్ గా ఎండిపోవడమో లేదా రాలిపోవడమో జరుగుతుంది. ఈ మార్పులను బట్టి ఇంట్లో వారికి భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చని పండితులు చెబుతుంటారు. తులసి చెట్టులో మార్పులు మన భవిష్యత్తును సూచిస్తాయన్న నమ్మకం చాలా మందిలో ఉంది. తులసిలో విటమిన్ ఏ, సీ, కేతోపాటూ కాల్షియం, జింక్, ఐరన్, క్లోరోఫిల్ సమృద్ధిగా లభిస్తాయి. అందుకే ఈ మొక్కను మందుల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీని ఆకులు, పువ్వులు, గింజలు అన్నీ మన ఆరోగ్యానికి మేలు చేసేవే. తులసి మొక్కకు పూసే తాజా పూలు బ్రాంకైటిస్ సమస్యను దూరం చేస్తాయి. మలేరియా ఉన్న వారు ఈ మొక్క ఆకులు, గింజల్

చర్మ సౌందర్యానికి ఇలా ప్రయత్నించండి ....

Image
అందంగా కనిపించాలంటే చర్మం ఆరోగ్యంగా ఉండాలి. నునుపుగా, తేమతో, కాంతులీనుతూ ఉండే చర్మం కోసం సౌందర్య చికిత్సలకు బదులుగా పోషకభరిత ఆహారం మీద ఆధారపడాలి. అలాంటి స్కిన్ ఫుడ్ ఇదే! బాదం: విటమిన్ ఇ తో నిండి ఉండే బాదం పప్పులోని యాంటీఆక్సిడెంట్లు అతినీలలోహిత కిరణాల నుంచి చర్మ కణాలకు రక్షణ కల్పిస్తాయి. కాబట్టి ప్రతిరోజూ గుప్పెడు బాదం పప్పు తినాలి. క్యారెట్లు: ఈ ఆరెంజ్ రంగు అద్భుతాలు చర్మపు బాహ్య పొరలో అవసరానికి మించి కణాలు పెరగకుండా నియంత్రిస్తాయి. ఫలితంగా చర్మం నునుపుగా ఉంటుంది. గ్రీన్ టీ: గ్రీన్ టీ ఆకులు మరిగేటప్పుడు విడుదలయ్యే కోటాచి లోని యాంటీఆక్సిడెంట్లు చర్మపు క్యాన్సర్ నుంచి రక్షణ కల్పించటంతో పాటు చర్మానికి పోషకాలను అందిస్తాయి. టమేటాలు: వీటిలోని లైకోపిన్, ఫొటోకెమికల్స్ చర్మానికి వృద్దాప్య లక్షణాలను తెచ్చిపెట్టే అతినీలలోహిత కిరణాల్లోని ఫ్రీ ర్యాడికల్స్ నుంచి చర్మానికి రక్షణ కల్పిస్తాయి.

జలుబు, దగ్గు నిర్లక్ష్యం చేయొద్దు సుమా..

Image
జలుబు, దగ్గును నిర్లక్ష్యం చేస్తే? సాధారణ జలుబు, దగ్గు కదా అని నిర్లక్ష్యం చేసినా, మందుల షాపుల్లో తోచిన మాత్రలు కొనుక్కుని వాడుతూ ఉండిపోయినా... ఈ ఇబ్బందులు తగ్గకపోగా, మరింత లోతుగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఫలితంగా జ్వరం, ఎగువ, దిగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ముక్కుకు సంబంధించి సైనసైటిస్, చెవి నుంచి నీరు, చీరు కారడం మొదలైన తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. ఎలర్జీ తత్వం, లక్షణాలను బట్టి.... ముక్కు, గొంతు, చెవులకు సంబంధించిన ఎలర్జీ లక్షణాలు, తత్వాలు వేర్వేరుగా ఉంటాయి. కొందరికి వర్షాకాలం, లేదా చలికాలం, వేసవి కాలాల్లోనే సమస్యలు వేధిస్తే, మరికొందరికి ఏడాది పొడవునా వేధిస్తాయి. కాబట్టి ఎలర్జీ కారకాలతో పాటు ఎలర్జీ రకం కూడా కనిపెట్టి తదనుగుణంగా చికిత్స తీసుకోవాలి. ఎలర్జీ ఉంది అని గ్రహించడానికి తోడ్పడే లక్షణాలు ఇవే! ఆగకుండా తుమ్ములు, ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆగకుండా 20 నుంచి 30 సార్లు తుమ్ముతూ ఉండడం ముక్కు, కళ్ల నుంచి నీరు కారడం మాట్లాడేటప్పుడు, రాత్రి వేళల్లో దగ్గు ఎక్కువగా ఉండడం వీటికి దూరంగా ఉంటే మేలు! ఎలర్జీ కారకాలకు దూరంగా ఉండడమే మొట్టమొదటి ఎలర్జీ పరిష్కారం. ఇందుకోసం... ఉదయం 7కు ముందు, రాత్రి 7 తర్వా

ఈ గింజలు తింటే బిపి షుగర్ కంట్రోల్...

Image
సబ్జా విత్తనాల్లో విలువైన పోషకాలు ఉన్నాయి. మధుమేహులకు ఈ పోషకాలు రెట్టింపు మేలు చేస్తాయి. గ్లూకోజ్, ఇన్సులిన్ టాలరెన్స్ ను పెంచుతాయి. సబ్జా తో ఉన్న ఇతరత్రా ఉపయోగాలు ఏవంటే.... శరీరంలో తలెత్తే పలు రకాల ఇన్ ఫ్లమేషన్లను ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ తో అదుపు చేయవచ్చు. ఈ పోషకం సబ్జా లో ఉంటుంది. వంద గ్రాములు సబా విత్తనాల్లో 17.8 గ్రాముల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. అలాగే సబ్జా విత్తనాల్లో అధికంగా ఉండే పీచు కూడా ఇప్లమేషన్ ను తగ్గిస్తుంది. ఈ విత్తనాల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడతాయి. రక్తపోటు కలిగి ఉన్న మధుమేహులు ప్రతి రోజూ క్రమం తప్పకుండా సబ్జా విత్తనాలు తింటే వారి సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ తగ్గట్టు పలు పరిశోధనల్లో రుజువైంది. రక్తపోటు తగ్గితే గుండె మీద పడే భారం కూడా తగ్గుతుంది. కాబట్టి సబ్జా విత్తనాలు తీసుకోవడం ద్వారా గుండె జబ్బులను అరికట్టవచ్చు. సబ్జా విత్తనాలను సరిపడా నీళ్లలో కనీసం 30 నిమిషాల నుంచి 2 గంటలపాటు నానబెట్టాలి. సబ్జా విత్తనాలను నీళ్లను ఎక్కువగా పీల్చుకుంటాయి. కాబట్టి రోజంతా తరచుగా నీళ్లు తాగుతూ ఉండాలి.

ఎండు ద్రాక్షతో ప్రయోజనాలెన్నో...

Image
వర్షాకాలంతో పోల్చితే... శీతాకాలంలో దొరికే పండ్లు తక్కువ. ఇలాంటి సమయంలో... ఎండిన ద్రాక్ష (కిస్మిస్) ఆ లోటును తీర్చుతాయి. కిస్ మిస్ లో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఇతర పోషకాలుంటాయి. పైగా వీటిని తింటే... ఫ్యాట్, కొలెస్టాల్ సమస్య కూడా ఉండదు. ఎండిన ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే మిగతా డ్రైఫ్రూట్స్ కంటే వీటిలో ఫెనాల్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇవి చలికాలంలో తప్పనిసరిగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. డైరెక్టుగా తింటే పుల్లగా ఉన్నట్లు అనిపిస్తే... పాలలో, ఇతర ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవచ్చు. తద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం. జీర్ణక్రియకు మేలు : కిస్మిలో ఫైబర్ ఎక్కువ. ఇవి మలబద్దకాన్ని నివారించి, తిన్న ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేస్తాయి. పేగులు, పొట్టలో విష వ్యర్థాల్ని తరిమికొడతాయి. అందువల్ల బయటకు కనిపించని పొట్టను శుభ్రం చేసుకోవాలంటే... కిస్ మిస్ తినేయడమే. ఏసీడీటీకి చెక్ : ఎండిన ద్రాక్షలో ఐరన్, పొటాషియం , కాపర్ (రాగి), మెగ్నీషియం ఉంటాయి. ఇవి పొట్టలో యాసిడ్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తాయి. అందువల్ల ACDT లాంటి సమస్యలు తగ్గుతాయి. గుండెకు మేలు : కిస్

నిజమైన ధనవంతుడు ఎవరో తెలుసా ...బిల్ గేట్స్ మాటల్లో ....

Image
 “మీ కంటే ధనవంతుడు ఉన్నాడా?” బిల్ గేట్స్ ని ఎవరో అడిగారు. “ఒక వ్యక్తి ఉన్నాడు” అని సమాధానమిచ్చి - ఇలా చెప్పాడు. నేను డబ్బు, పేరు  సంపాదించక ముందు రోజులలో ఒక నాడు న్యూయార్క్ ఎయిర్ పోర్ట్ లో దిగాను. దినపత్రిక కొందామని చేతిలోకి తీసుకుని సరైన చిల్లర నా వద్ద లేకపోవడం వలన తిరిగి పేపర్ ను అమ్మే కుర్రాడికి ఇచ్చేశాను. “పర్లేదు...మీవద్ద చిల్లర లేకపోయినా, ఈ పేపర్ తీసుకోండి” బలవంతంగా నాచేతిలో పెట్టాడు. నేను తీసుకోక తప్పలేదు.  మరో రెండు సంవత్సరాల తర్వాత చాలా విచిత్రంగా మళ్ళీ అదే ఎయిర్ పోర్ట్ లో అదే పేపర్ కుర్రాడి వద్ద మళ్ళీ దిన పత్రిక కొనాలని ప్రయత్నిస్తే నా వద్ద చాలినంత చిల్లర లేకపోయింది.  ఆ కుర్రాడు నా చేతిలో బలవంతంగా పేపర్ పెడుతూ “ఈ పేపర్ మీకు ఉచితంగా ఇచ్చినందు వలన నేనేమీ నష్టం పోను, ఆ ఖరీదును నా లాభం లోంచి మినహాయించుకుంటాను” అన్నాడు. ఆ తర్వాత పందొమ్మిది సంవత్సరాలకు నేను బాగా డబ్బు, పేరు సంపాదించిన తర్వాత ఆ పేపర్ కుర్రాడి కోసం వెదికాను. నెలన్నర తర్వాత అతడు దొరికాడు.  “నేనెవరో తెలుసా, నాకు ఉచితంగా దినపత్రిక ఇచ్చావు ఒకసారి” అడిగాను. “మీరు తెలుసు...బిల్ గేట్స్.... ఒకసారి కాదు రెండు సార్లు ఇచ్చాను” 

వెల్లుల్లి తో అద్భుతమైన ప్రయోజనం ....

Image
  వెల్లుల్లి వాసన డిఫరెంట్ గా ఉంటుంది. అందువల్ల ఇది కూరలకు ప్రత్యేక రుచిని ఇస్తుంది. వెల్లుల్లిలో ఉండే చిన్న చిన్న పాయల్లో విషపదార్థాల్ని తరిమికొట్టే యాంటీఆక్సిడెంట్స్, సూక్షక్రిములను చంపేసే యాంటీమైక్రోబయల్, విషవ్యర్థాలను బయటకు పంపే యాంటీసెప్టిక్ గుణాలుంటాయి. ఉదయాన్నే ఏమీ తినకుండా ముందుగా వెల్లుల్లిని తింటే. . . బాడీ మెటబాలిజం (అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచెయ్యడం) బాగుంటుందనీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయనీ, హైపర్ టెన్షన్, డయాబెటిస్ ని నివారించవచ్చని పరిశోధనలో తేలింది. ఈ చిన్న చిన్న పాయలే... మన శరీరానికి ఆయుధాల్లా మారి... గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్, కేన్సర్, ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి. ప్రధానంగా ఉదయాన్నే వెల్లుల్లి తింటే మూడు ప్రయోజనాలు కలుగుతాయి. డయాబెటిస్ కంట్రోల్ : ప్రపంచవ్యాప్తంగా టైప్-2 డయాబెటిస్ పెరుగుతోంది. కారణం మన జీవనశైలిలో వచ్చిన మార్పులే. మనం తినే ఆహారం.... మన శరీరంలో షుగర్ లెవెల్స్ పెంచుతోంది. దానికి విరుగుడు వెల్లుల్లి. ఇది షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఏడు వారాల్లో సెరమ్ గ్లూకోజ్ ని 57 శాతానికి తగ్గిస్తుందని పరిశోధనల్లో తేలింది. అం

జామ ఆకులతో ...ఆరోగ్య ప్రయోజనాలు..

Image
జామ ఆకులతో జామపండ్లతో ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో... జామ ఆకులతోనూ చాలా ఉన్నాయి. జామ ఆకులతో టీ తయారుచేస్తారని తెలుసా. జామకాయలు, ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ C, పొటాషియం, ఫైబర్ లభిస్తాయి. అందుకే మనం జామకాయల్ని తినాలి, ఆకుల రసం తాగాలి. జామపండ్లను తింటే జలుబు వస్తుందని పెద్దవాళ్లు అంటుంటారు. అందువల్ల మరీ బాగా ముగ్గినవి కాకుండా దోరగా ఉన్నవి తింటే మేలు. జామకాయలు మన దేశంలో కంటే... మధ్య అమెరికాలో ఎక్కువగా కాస్తాయి. అక్కడి నుంచే ఈ చెట్లు ప్రపంచమంతా విస్తరించాయి. ఎండ వాతావరణంలోనే పెరిగే ఈ కాయలు... ఏడాదంతా కాస్తూనే ఉండటం మనకు కలిసొచ్చే అంశం. మరి జామకాయల ఆకులతో కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. 1. బ్లడ్ షుగర్ కంట్రోల్ : జామ పండ్ల ఆకుల రసం తాగితే... మన శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ క్రమపద్ధతికి చేరతాయి. చాలా ఎక్కువసేపు బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. డయాబెటిస్ ఉండేవారికి ఇది ఎంతో మేలు చేసే అంశం. అందువల్ల భోజనం తర్వాత జామ ఆకుల టీ తాగితే కలిసొస్తుంది. దాదాపు రెండు గంటలపాటూ బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. ఓ నాలుగు జామ ఆకుల్ని నీటిలో పది నిమిషాలు ఉడికించి, ఆ నీటిని తాగేయ

మీ చర్మ నిగారిమ్పుకోసం...

Image
నిమ్మరసంతో చర్మాన్ని కాంతిమంతం చేసుకోవచ్చు. శరీరంపై ఉన్న మురికిని నిమ్మరసం పోగొడుతుంది. ఇందులో ఎక్కువ మోతాదులో ఉండే సిట్రిక్ యాసిడ్, సి విటమిన్లు చర్మసౌందర్యం మీద మంచి ఫలితం చూపుతాయి. వయసు పైబడటం వల్ల వచ్చే మచ్చలతోపాటు నల్లమచ్చలు, టానింగ్, చర్మం కాంతి విహీనం కావడం, చర్మం మీద ఏర్పడే ఇతరత్రా మచ్చలను నిమ్మరసం పోగొడుతుంది. పొడిబారిన చర్మంపై, మృతకణాలున్న పెదాలపై నిమ్మరసం రాస్తే చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది. అందుకే రాత్రి నిద్ర పోయే ముందు పెదాలకు నిమ్మరసం రాసుకుని పడుకోవాలి. పొద్దున్న లేచిన తర్వాత పెదాలను శుభ్రంగా కడిగేసుకోవాలి. అయితే పెదాలపై పగుళ్లు ఉన్నప్పుడు మటుకు నిమ్మరసం రాస్తే మంట పుడుతుంది. కొందరికి మోకాళ్లు, మోచేతుల దగ్గర చర్మం నల్లగా ఉంటుంది. ఆ భాగాల్లో సగం నిమ్మచెక్కతో బాగా రుద్దితే, చర్మం రంగులో మార్పు కనపడుతుంది. " alt="" aria-hidden="true" /> నేచురల్ ఆయిల్స్ లో నిమ్మరసం వేసి బాగా కలిపి రాసుకుంటే మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. చర్మం మృదువుగా, పట్టులా మారుతుంది. కొబ్బరినీళ్లు లేదా ఆలివ్ ఆయిల్ లో రెండుమూడు నిమ్మరసం చుక్కలు వేసి రాసుకోవచ్చు. జిడ్డు చర్మం ఉ

పొడి జుట్టా ... పెరుగుతో ట్రై చేయండి ...

Image
పెరుగులో లభించే మినరల్స్, విటమిన్ ఇ, జింక్ చర్మాన్ని తాజాగా, అందంగా మార్చుతాయి. ముఖానికి ఫేస్ ప్యాక్ గా పెరుగు రాసుకుంటే చర్మం మీది మృతకణాలు, నల్లమచ్చలు తొలగిపోతాయి. చర్మం సరికొత్త నిగారింపు పొందుతుంది. " alt="" aria-hidden="true" /> పొడి జుట్టు, చుండ్రు, నిర్జీవమైన కురులు వంటి సమస్యలకు పెరుగుతో పరిష్కారం లభిస్తుంది. పెరుగులోని లాక్టిక్ ఆమ్లం మాడుకు అవసరమైన పోషకాలు, మినరల్సను అందిస్తుంది. ఫలితంగా చుండ్రు తగ్గిపోతుంది. కురులకు పెరుగు చక్కని కండీషనర్ గా పనిచేసి, వెంట్రుకలను పట్టులా మెరిసేలా చేస్తుంది. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు పెరుగు సమ్మర్ డ్రింక్ గా పనిచేస్తుంది. పెరుగులో పండ్ల ముక్కలు లేదా అవిసె గింజలు కలుపుకొని తింటే శరీరానికి సరిపడా పీచుపదార్థం లభిస్తుంది.

రొజూ ఈ టీ త్రాగి బరువు తగ్గండి...

Image
       మీరు గ్రీన్ టీ ప్రయోజనాలు తెలియనివారుండరు.  ఈ ఏడాది ఎక్కువగా వినియోగంలోకి వచ్చినది గ్రీన్ కాఫీ. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది డయాబెటిస్ ను కంట్రోల్ చెయ్యగలదు. దీని అద్భుతమైన ప్రయోజనాలు తెలిసి... ప్రపంచ దేశాలన్నీ కోట్లు ఖర్చుపెట్టి గ్రీన్ కాఫీని కొంటున్నాయి. గ్రీన్ కాఫీని గ్రీన్ కాఫీ గింజల పొడి నుంచి తయారుచేస్తారు. మామూలుగా కాఫీ గింజల్ని వేయిస్తారు (రోస్ట్). గ్రీన్ కాఫీ గింజలను రోస్ట్ చెయ్యరు. రోస్ట్ చేసే గింజలు జీవం కోల్పోతాయి. వాటిలోని క్లోరోజెనిక్ యాసిడ్ గాలిలో ఆవిరైపోతుంది. కెఫైన్ మాత్రం రోస్టింగ్ ప్రక్రియకు ప్రభావితం కాకుండా అలాగే ఉంటుంది. అందువల్ల రోస్ట్ చేసిన కాఫీ గింజల్లో కెఫైన్ ఉంటుంది కానీ ముఖ్యమైన క్లోరోజెనిక్ యాసిడ్ మాత్రం ఉండదు. మన శరీరాన్ని క్రమపద్ధతిలో (మెటబాలిజం) ఉంచడానికీ, షుగర్ లెవెల్సను కంట్రోల్ చెయ్యడానికి ఈ క్లోరోజెనిక్ యాసిడ్ అద్భుతంగా పనిచేస్తోంది. " alt="" aria-hidden="true" />          బరువు తగ్గుదల, డయాబెటిస్ కంట్రోల్ : క్లోరోజెనిక్ యాసిడ్ కి కార్బోహైడ్రేట్స్ (పిండిపదార్ధాలు)ని పీల్చేసే లక్షణం ఉంది. ఇది బ్లడ్

మద్యం మత్తులో నడిరోడ్డుపై వీరంగం

నర్సీపట్నం:  మద్యం మత్తులో వీరంగం చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విశాఖ జిల్లా నర్సీపట్నం అభి సెంటర్ లో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి తమ ద్విచక్ర వాహనానికి సైడ్ ఇవ్వలేదన్న కోపంతో బొంగు పోయిన మందుబాబులు ఆటో డ్రైవర్ను చితక్కొట్టారు అంతేకాక అడ్డొచ్చిన అతని భార్య పైన దురుసుగా ప్రవర్తించారు. కోటవురట్ల మండలం ఎండపల్లి చెందిన కార్ డ్రైవర్ ఆటో డ్రైవర్ మూర్తి తన భార్య రాజేశ్వరి సోదరుడు అప్పలరాజు తో కలిసి ఇ నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ కి బయలుదేరారు అదే మార్గంలో వస్తున్నా రామకృష్ణ శెట్టి నాగేశ్వరరావు అభి సెంటర్ వద్ద తమ బైక్ కి ఆటో సైడ్ ఇవ్వలేదంటూ ఆగ్రహించి ఆటో డ్రైవర్ నాని బాబును ఆటో నుంచి దించి తీవ్రంగా కొట్టారు తన భర్త దురుసుగా ప్రవర్తించారు.  ఈ మేరకు ఆటోడ్రైవర్ భారీ అప్పలరాజు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మాజీ ఎమ్మెల్యే మృతి పై చంద్రబాబు సంతాపం

అమరావతి: ఏలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి (కోట రామారావు) మృతి పట్ల ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  ఎంతో భవిష్యత్తు ఉన్న బుజ్జి, చిన్న వయసులోనే మృతి చెందడం బాధాకరమన్నారు. మున్సిపల్ చైర్మన్‌గా, శాసనసభ్యునిగా ఏలూరు అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు. స్మార్ట్‌సిటీగా ఏలూరును చేయాలని పరితపించారని. రోడ్లు, వంతెనలు, అంగన్వాడీ, పంచాయతీ అదనపు తరగతి భవనాలు అనేకం నిర్మించారని గుర్తు చేశారు. బడేటి బుజ్జి మృతి ఏలూరు నియోజకవర్గానికే కాకుండా తెలుగుదేశం పార్టీకే తీరని లోటని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

టిడిపి మాజీ ఎమ్మెల్యే మృతి

ఏలూరు: ఏలూరు టీడీపీ తాజా మాజీ ఎమ్మెల్యే బడేటి‌ బుజ్జి మృతి చెందారు. తెల్లవారుఝమున గుండెపోటు రావడంతో ఆంద్ర ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు అప్పటికే మృతి చెందినట్లు  వైద్యులు తెలిపారు.  2014 నుండి 2019 వరకు ఏలూరు ఎమ్మెల్యే గా  బడేటి బుజ్జి పని చేశారు. గతంలోనూ మున్సిపల్ వైస్ ఛైర్మన్ గా పనిచేసిన బడేటి కోట రామారావు (బుజ్జి).

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

శ్రీకాకుళం : జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వీరఘట్టాం మండలం వెంకంపేట గ్రామం మరియగిరి కొండ వద్ద కలప లోడ్‌తో వెళ్తున్న ఎడ్లబండిని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగభూషణం, పట్టాభి అనే ఇద్దరు రైతులు మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రాజమండ్రిలో ఉప రాష్ట్రపతి పర్యటన

రాజమండ్రి: ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు గురువారం రాజమహేంద్రవరానికి రానున్నారు. నగరంలోని వెంకటేశ్వరనగర్‌లో నూతనంగా నిర్మించిన డెల్టా ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. అనంతరం 12.10 గంటలకు రహదారులు, భవనాల శాఖ అతిథి గృహానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3.50 గంటలకు రోడ్డు మార్గంలో విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడి నుంచి సాయంత్రం 5.30 గంటలకు విజయవాడ చేరుకోనున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఉత్తరాదిలో చలి పులి

విశాఖపట్నం: ఉత్తరాది రాష్ట్రాల్లో నెలకొన్న చలి ప్రభావం ఉత్తర కోస్తా వరకు విస్తరించింది. పొరుగునున్న ఒడిశా మీదుగా వీస్తున్న గాలులతో మంగళవారం రాత్రి నుంచి చలి వాతావరణం నెలకొంది. బుధవారం కళింగపట్నంలో 16.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.   దక్షిణ తమిళనాడు పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిశాయి. రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం వుందని, అయితే ఎక్కువచోట్ల పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. ఇదేసమయంలో ఉత్తర కోస్తాలో చలి వాతావరణం కొనసాగుతుందన్నారు.

రాజధాని ప్రాంత వైకాపా నేతల సమావేశం

అమరావతి: రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న తరుణంలో రాజధాని ప్రాంత వైకాపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు గురువారం సమావేశం కానున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 3.30 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. మూడు రాజధానుల ఏర్పాటు, రైతుల ఆందోళనలపై సమావేశంలో చర్చించనున్నారు. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించటం ద్వారా రైతులకు భరోసా ఇవ్వడమే సమావేశం ముఖ్య ఉద్దేశమని వైకాపా వర్గాలు తెలిపాయి.

సూర్య గ్రహణం తో మూతపడ్డ తిరుమల దేవాలయం

తిరుమల: సంపూర్ణ సూర్యగ్రహణం గురువారం రానున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయాన్ని 13 గంటల పాటు మూసివేస్తారు. బుధవారం రాత్రి 11 గంటలకు శ్రీవారి ఆలయం తలుపులు మూసివేశారు. తిరిగి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు శ్రీవారి ఆలయం తలుపులు తెరుస్తారు.  అనంతరం ఆలయ శుద్ధి నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఇదిలా ఉండగా తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. గ్రహణం కారణంగా శ్రీవారి దర్శనాలు నిలిపివేస్తుండటంతో బుధవారం తిరుమలకు వచ్చిన భక్తులను ఉదయం 7 నుంచే వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోకి అనుమతించకుండా అధికారులు నిలిపివేశారు. అయితే అప్పటికే వైకుంఠం కాంప్లెక్స్ పూర్తిగా భక్తులతో నిండిపోవడంతో రాత్రి 11 గంటలలోపు వారందరికీ దర్శనం కల్పించేందుకు టీటీడీ అధికారులు ఈ చర్యలు చేపట్టారు.  కాగా సూర్యగ్రహణం కారణంగా గురువారం ఉదయం వీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దుచేసింది. గురువారం ఉదయం 8.08 గంటల నుంచి 11.16 గంటల వరకు సూర్యగ్రహణ కాలం ఉంటుంది. ఆలయ సంప్రదాయం ప్రకారం 6 గంటలు ముందుగా శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి 11 గంటలకు ఆలయం మూసివేశారు. బుధవారం తిరుమలకు చేరుకున్న భక్తులకు

ఏపీ కేబినెట్ కు భారీ బందోబస్తు...

అమరావతి  : ఏపీ క్యాబినెట్‌‌కు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.  శుక్రవారం జరగనున్న ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్‌ సమావేశాలు అంత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పోలీసులు సచిలవాలయం చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. క్యాబినెట్ రోజున ఇతర కొత్త వ్యక్తుల ఎవరు సచివాలయం ప్రాంతాల్లోకి రాకుండా నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే కొత్తవారు ఎవరైన వస్తే తమకు సమాచారం అందించాలని మందడం ప్రాంతంలోని ఇళ్లకు నోటీసులు అంటించారు.

పాక్షిక సూర్యగ్రహణం

 న్యూఢిల్లీ  : పాక్షిక సూర్యగ్రహణం గురువారం దేశవ్యాప్తంగా కనిపించనుంది. ఈ ఖగోళ అద్భుతాన్ని చూసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని శాస్త్రవేత్తలు, వైద్యులు సూచిస్తున్నారు. 99 శాతం సూర్యుడి కాంతిని చంద్రుడు అడ్డగించినప్పటికీ మిగిలిన ఒక శాతం వెలుగునైనా నేరుగా చూస్తే రెటీనా దెబ్బతినే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి రక్షణ లేకుండా కొన్ని సెకన్ల పాటు చూసినా కూడా ప్రమాదమే. వెల్డింగ్‌కు వినియోగించే 14 నంబర్‌ గ్లాస్‌ను ఉపయోగించడం సురక్షితం.

గంజాయి రవాణా తొమ్మిది మంది అరెస్ట్

విశాఖపట్నం: గంజాయి రవాణా చేస్తున్న తొమ్మిది మందిని పట్టుకొని పోలీసులు అరెస్టు చేశారు విశాఖపట్నం లోని కంచరపాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్ నుండి బీహార్, మహారాష్ట్రకు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న తొమ్మిది మంది ముఠా సభ్యులను కంచరపాలెం టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు వీరి వద్దనుండి, 44 కేజీల గంజాయి , ఆటో , స్కూటీ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి తొమ్మిది మందిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తండ్రి కల తనయుడి సాకారం.. కడప ఉక్కు కర్మాగారానికి పునాది ...

Image
జమ్మలమడుగు : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్టు అయిన కడప ఉక్కు కర్మాగారానికి ఆయన తనయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.15 వేల కోట్ల పెట్టుబడి అంచనాతో వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద ఈ కర్మాగారాన్ని నిర్మిస్తున్నారు. అంతకు ముందు సున్నపురాళ్లపల్లెకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అలాగే నేటి నుంచి మూడు రోజుల పాటు సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేస్తాం : సీఎం జగన్ వైఎస్సార్ : జిల్లాలో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేయడం తన జీవితంలో మరచిపోలేని రోజని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ ఉక్కు కర్మాగారాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. సోమవారం జమ్మలమడుగు మండలం రాళ్లపల్లెలో కడప ఉక్కు కర్మాగారానికి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. 'జిల్లాకు స్టీల్ ప్లాంటు రావాలని.