Posts

Showing posts from May, 2020

డా.సుధాకర్ కేసు సీబీఐ కి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశం...

సుధాకర్ పై చేయిచేసుకున్న పోలీసులపై కేసునమోదుచేసి విచారణ చేపట్టాలని ఆదేశించిన న్యాయస్థానం అమరావతి : విశాఖలో వైద్యాధికారి సుధాకర్ పై దాడి ఘటనలో కేసు నమోదుచేసి విచారణ చేపట్టాలని హైకోర్ట్ ఆదేశించింది. డాక్టర్‌ సుధాకర్‌ అరెస్టు వ్యవహారంపై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. డాక్టర్‌ సుధాకర్‌పై దాడి చేసిన పోలీసుల‌పై కేసు నమోదు చేసి సీబీఐతో  విచారణ చేపట్టాల‌ని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఎనిమిది వారాల్లో నివేదిక ఇవ్వాల‌ని సీబీఐకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. డాక్టర్‌ సుధాకర్‌ శరరంపై గాయాలున్నాయని మేజిస్ట్రేట్‌ ఇచ్చిన నివేదికలో ఉందని, ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో డాక్టర్‌ సుధాకర్‌ గాయాల‌ గురించి పేర్కొనలేదని కోర్టు పేర్కొంది.. వైద్య సిబ్బందికి మాస్కులు లేవంటూ గతంలో వ్యాఖ్యానించి సస్పెండైన మత్తు వైద్యుడు డాక్టర్‌ సుధాకర్‌ విశాఖపట్నంలో జాతీయ రహదారిపై గొడవ చేస్తున్నారని పోలీసు అరెస్టు చేయడం కల‌కలం సృష్టించింది. సుదాకర్‌ గొడవ చేస్తున్నట్లు స్థానికులు 100కు ఫోన్‌చేయడంతో పోలీసు అక్కడికి వెళ్లారు. పోలీసుల‌ను, ముఖ్యమంత్రిని డాక్టర్‌ సుధాకర్‌ దుర్భాషలాడటంతో అదుపులోకి తీసుకున్నామని పోలీసు తెలిపారు. విధ

మానసిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్ సుధాకర్...

Image
విశాఖపట్నం (జనహృదయం): ఉద్యోగం లేదన్న బాధ తో మతిస్థిమితం కోల్పోయిన దురుసుగా  ప్రవర్తించిన సుధాకర్ ని పోలీసులు అదుపులోకి తీసుకొని విశాఖ మానసిక వైద్యశాలలో జాయిన్ చేశారు అక్కడి వైద్యులు డాక్టర్ సుధాకర్ కి వైద్య సేవలు అందిస్తున్నారు. శనివారం విశాఖ నగరంలో జాతీయ రహదారిపై ఉద్యోగం లేదని ఆక్రోశంతో ప్రభుత్వ యంత్రాంగంపై దుర్భాషలాడి దయనీయ పరిస్థితిలో పోలీసులు తీసుకెళ్లిన వైనం బాధాకరమైనప్పటికీ సుధాకర్ ప్రవర్తన తీరు సరైనది కాదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నడిరోడ్డుపై సుధాకర్ ప్రవర్తనా తీరు విషమించడంతో స్థానికులు అతన్ని తాళ్లతో కట్టి పోలీసులకు అప్పగించారని విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా పేర్కొన్నారు. వృత్తిరీత్యా డాక్టర్, గెజిటెడ్ హోదా కలిగిన సుధాకర్ను చేతులు వెనక్కు పెట్టి తాళ్లతో నిర్బంధించి మోకాళ్లపై ఆటోలో తీసుకెళ్లిన ఘటనపై ఇప్పటికే కానిస్టేబుల్ను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.  కాగా మతిభ్రమించి ప్రజా ప్రతినిధులు, ముఖ్యమంత్రి, మంత్రులను దుర్భాషలాడటం సరైన పద్ధతి కాదని తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అన్యాయంగా విధుల నుంచి తొలగించడంతో మానసిక స్థైర్యం కోల్పోయిన సుధాకర్ ఈ విధంగా ప్రవర్త

లాక్‌డౌన్‌ 4.0 మార్గదర్శకాలు...

  న్యూఢిల్లీ : కరోనా వ్యాప్తి నివారణకై లాక్‌డౌన్‌ను మే 31 వరకూ పొడిగించిన కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల  చేసింది.విమాన, మెట్రో సర్వీసులకు అనుమతి లేదని, హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్‌ను అనుమతించబోమని స్పష్టం చేసింది. కంటైన్మెంట్‌ జోన్లలో అత్యవసర సేవలకే అనుమతిస్తామని పేర్కొంది.  కేంద్రం నిబంధలు .... మే 31 వరకూ విద్యాసంస్ధల మూసివేత యధాతదంగా కొనసాగుతోందని,  రాజకీయ, సామాజిక సభలు అధిక సంఖ్య లో  ఓ చోట చేరడం పై ఉన్న నిషేధం కొనసాగుతుంది.  విమాన సర్వీసులకు, విద్యాసంస్థలు, సినిమాహాల్స్‌, హోటల్స్‌కు అనుమతి లేదు. రాష్ట్ర పరిధిలో బస్సు సర్వీసులు, ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణాలపై రాష్ట్రాలదే తుది నిర్ణయం దేశంలో రాత్రి 7గంటల నుంచి ఉదయం 7గంటల వరకు కర్వ్యూ నిబంధనలు అమలు చేయాలని ఆదేశించింది.  కాగా 65 ఏళ్లు దాటిన పెద్ద వారికి, గర్భిణిస్త్రీలు , 10 ఏళ్ల లోపు చిన్నారులకు బయటికి వచ్చేందుకు అనుమతి ఇవ్వ లేదు. కంటైన్‌మెంట్‌జోన్లలో అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతి ఇవ్వగా రెడ్‌, గ్రీన్, ఆరెంజ్‌ జోన్‌ల గుర్తింపు జిల్లా అధికారులకు అధికారం ఇస్తూ కంటైన్మెంట్‌ జోన్లలో ఆంక్షలు కఠినతరం చేసింది.   

మే 31 వరకు లాక్ డౌన్ కొనసాగింపు ...

న్యూఢిల్లీ  (జనహృదయం):   దేశంలో నాలుగో విడత లాక్ డౌన్ మే31 వరకు కొనసాగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అయితే ఈ దఫా లాక్ డౌన్ మార్గదర్శకాలు విడుదల కావాల్సి ఉంది దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్న 30 జిల్లాల పై కేంద్రం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనుంది కాగా 4.0 లాక్ డౌన్ మార్గదర్శకాల్లో కొన్ని నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసే అవకాశాలు కనిపిస్తున్నాయి గ్రీన్ ఆరెంజ్ జోన్ లలో సడలింపు లను భారీగా ఇవ్వనుంది ప్రజా రవాణాపై కూడా నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాలకే కట్టబెట్టేందుకు కేంద్రం యోచిస్తోంది అలాగే వైరస్ కట్టడి, వ్యాప్తి పట్ల నిర్లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించవద్దని కూడా కేంద్రం మరోవైపు హెచ్చరికలు జారీ చేస్తోంది

మరోసారి వార్తల్లోకి ఎక్కిన డాక్టర్ సుధాకర్ విశాఖ జాతీయరహదారిపై వీరంగం

Image

మతిభ్రమించిందా? మద్యం మత్తా... మరోసారి వార్తల్లోకి ఎక్కిన డాక్టర్ సుధాకర్ విశాఖ జాతీయరహదారిపై వీరంగం

Image

వలస కార్మికులకు అండగా నిలిచిన ఏపీ ప్రభుత్వం

Image
కాలినడకన ఏపీకి  చేరిన  వలస కార్మికులకు ఊహకందని సాయం అందిస్తున్న సీఎం జగన్ అమరావతి (జనహృదయం- ప్రతినిధి రాజన్):   లాక్ డౌన్ తో చిక్కుకుపోయిన వలస కూలీలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఈ మేరకు ఒరిస్సాకు చెందిన 450 మంది వలస కార్మికులకు సకల సౌకర్యాలతో మూడు రోజులపాటు అన్ని వసతులను సమకూర్చి రవాణా సౌకర్యం ఏర్పాటు చేసి ఒరిస్సా కు తరలిస్తున్నారు పెద్దలకు పిల్లలకు మార్గమధ్యలో అవసరమయ్యే తినుబండారాలతో పాటు భోజన ప్యాకెట్లు అందించే ప్రయాణానికి బస్సులను సిద్ధం చేశారు ఏపీ నుండి ఒరిస్సా రాష్ట్ర సరిహద్దు చేరే వరకు పూర్తిస్థాయిలో వలస కూలీలకు మార్గమధ్యలో ఉదయం రాత్రి భోజనాలు ఆయా ప్రాంతాల్లో ఉన్న ఏపీ అధికారులు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇటీవల ఒడిషా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో ఒరిస్సా రాష్ట్రానికి చెందిన కార్మికులు ఏపీలో చిక్కుకు పోయారని వారిని తరలించే ఏర్పాట్లు చేయాలని చేసిన విజ్ఞప్తి మేరకు జగన్మోహన్ రెడ్డి స్పందించి మహారాష్ట్ర వలస కార్మికులు తరలించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు దీనిలో భాగంగా 450 మందిని ఆదివారం ఒరిస్సా రాష్ట్ర

మరోసారి వార్తల్లోకెక్కిన నర్సీపట్నం డాక్టర్ సుదాకర్.. పోలిసుల అదుపులో...

Image
  విశాఖపట్నం (జనహృదయం):  సస్పెన్షన్కు గురైన ప్రభుత్వ వైద్యాధికారి మతిస్థిమితం కోల్పోయి పోలీసుల అదుపులో చేరిన ఉదంతం విశాఖలో జరిగింది ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రికి చెందిన డాక్టర్ సుధాకర్ ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. డాక్టర్ సుధాకర్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ప్రభుత్వం ఇటీవల సస్పెండ్ చేసింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన తీరుకు వ్యతిరేకంగా వైద్యుల కమిటీ ఇటీవల సస్పెండ్ చేసింది దీంతో మనస్తాపానికి గురైన వైద్యాధికారి తనను అన్యాయంగా సస్పెండ్ చేశారు అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ శనివారం సాయంత్రం విశాఖ నగరంలో అక్కయ్యపాలెం జాతీయ రహదారిపై బైఠాయించి మరోసారి వార్తల్లో నిలిచారు తనకు న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది ఈ మేరకు అక్కడున్న వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సుధాకర్ ని బలవంతంగా ఆటోలో పోలీస్ స్టేషన్కు తరలించారు.  వైద్యపరీక్షల అనంతరం కేసునమోదు  చేస్తాం..  ఈ ఘటనపై విశాఖ పోలీసు కమిషనర్ ఆర్కె మీనా మాట్లాడుతూ ఈ విశాఖ నాలుగో పట్టణ పోలీ

నర్సీపట్నం లో రెడ్ జొన్ ఎత్తివేతకు సిద్దం...

Image
నర్సీపట్నం  మే 16 (జనహృదయం) : నర్సీపట్నంలో రెడ్ జోన్ ఎత్తవేసేందుకు సన్నాహాలు చేసినట్లు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ప్రకటించారు. నర్సీపట్నం మున్సిపల్ సమావేశ మందిరంలో విలేకరులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి రెడ్ జోన్ పై కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 17వ తేదీతో లాక్ డౌన్ ముగుస్తుండడంతో 18వ తేదీనుండి నర్సీపట్నాన్ని ఆరెంజ్ జోన్ పరిధిలోనికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ తో, డిఎం అండ్ హెచ్ఓతో మాట్లాడినట్లు వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఆదివారం సాయంత్రానికి  అధికారికంగా  డీ-నోటిఫికేషన్ రావాల్సిఉందని , దానికంటే ముందుగా పత్రికా ముఖంగా ప్రజలకు ఈ విషయం తెలియజేయాలని ఈ సమావేశం ఏర్పాటు చేసామని తెలిపారు. నర్సీపట్నంలో కరోనా పాజిటివ్ వచ్చిన కేసులు మన ప్రాంతానికి చెందినవి కాకపోయినా మున్సిపాలిటీ లోని మూడవ వార్డు  ప్రజలు,  ప్రభుత్వ సూచనలు మేరకు ఎంతో సంయమనం పాటించారని , ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని కరోనా నివారణలో ఓపికతో ఉన్నారని వారందరికీ పత్రికా ముఖంగా చేతులెత్తి నమస్కరిస్తున్నానని ఎమ్మెల్యే గణేష్  పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న

ఎపిలో నాలుగో విడత ఉచిత బియ్యం పంపిణీ…

అమరావతి  :  ఏపీలో నేటి నుంచి ఉచిత నాలుగో విడత రేషన్ పంపిణీ ప్రారంభమైంది రాష్ట్ర వ్యాప్తంగా కోటి నలభై ఎనిమిది లక్షల ఆరువేల మంది లబ్ధిదారులకు ఉచిత రేషన్ అందనుంది ఈ మేరకు ప్రభుత్వం వన్ చర్యలు చేపట్టింది రాష్ట్రంలో బియ్యం కార్డు ఉన్న కుటుంబాలకు మైన్ మనిషికి ఐదు కిలోల వంతున బియ్యం కార్డుకు కేజీ సెనగలు ఇవ్వనున్నారు రాష్ట్రంలో పాత కార్డులతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న సుమారు 82 వేల మందికి ఈ పథకం వర్తింపజేస్తున్నారు అయితే కార్డుదారులు ఖచ్చితంగా రేషన్ పొందేందుకు బయోమెట్రిక్ వేయాల్సి ఉంది అలాగే ఎక్కడివారు ఎక్కడి నుంచైనా తమ బయోమెట్రిక్ ద్వారా ఉచిత రేషన్ పొందేందుకు పోర్టబులిటీ సౌకర్యం కల్పించారు రేషన్ షాపుల వద్ద ఏర్పాటు చేసి టైం ఫ్లాట్ ల వారీగా కూపన్లు పంపిణీ చేసి ద్వారా రేషన్ ఇస్తారు దీంతో ఒకేసారి గుంపులుగుంపులుగా ఒకే చోట ఉండేందుకు వీలుగా లేకుండా చర్యలు చేపట్టారు.

దేశంలో పౌరులంతా సామాజిక దూరం... వ్యక్తిగత భద్రత పాటించకుంటే ప్రమాదమే...

Image
ఎవరికి వారు వ్యక్తిగత భద్రత కోసం కఠిన నిర్ణయం తీసుకోవలిందే…. చైనాను దాటిపోయిన భారత్ కరోనా పోజిటివ్ కేసులు.. న్యూడిల్లీ (జనహృదయం)  :  భారత్లో కరోనా కేసులు విజృంభిస్తుంది చైనాను దాటిపోయాయి కరోనా పుట్టినిల్లు చైనాలో 82 వేల కేసులు ఇప్పటివరకు నమోదవగా దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య ఎనభై ఆరు వేలకు అతి దగ్గరలో ఉంది ఈ మహమ్మారి వ్యాప్తి చెందకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత మూడు విడతలుగా లాక్ డౌన్ ప్రకటించి నాలుగో విడత లాక్ డౌన్లోడ్ తొలగించే దిశగా అడుగులు వేస్తున్నారు అయినప్పటికీ మనదేశంలో పౌరులు ప్రభుత్వాలకి పూర్తిగా సహకరించకపోవడంతో కరోనా కేసులు చైనా నే మించి పోయాయి ఇదే పరిస్థితి కొనసాగితే అమెరికా ని సైతం దాటేందుకు ఎంతో దగ్గరలో ఉన్నామా అనే సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి గత వారం రోజులుగా ప్రతిరోజు దేశవ్యాప్తంగా మూడు నుండి నాలుగు వేల పాజిటివ్ కేసులు కొత్తగా నమోదవుతున్నాయి సంఖ్య ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల నమోదులో 12వ స్థానంలో ఉన్న భారత్ మొదటి ఐదు స్థానాలకు చేరుకుంటుంది ఏమో అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య లో 12వ స్థానం కాగా రోజువారీ నమోదయ్యే కేసుల్లో భారత్ నా

దేశంలో 71 వేలకు చేరుతున్న కరోనా కేసులు....

Image
నిబంధనల సడలింపు తో పెరుగుతున్న కేసులు.. స్వీయ నియంత్రణ ప్రథమ లక్ష్యం... లాక్ డౌన్ తో సంబంధం లేకుండా ప్రతి పౌరుడు సామాజిక దూరం పాటించాల్సిందే... అలక్ష్యం వహిస్తే కరోనాతో కుస్తీ తప్పదు... ప్రభుత్వాలు ఎన్ని చేసినా తప్పని ముప్పు.. కరోనా కావాలా, పోవాలా తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నం అవుతోంది....   న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తూ 71 వేల మార్కు దాటిపోయింది లాక్ డౌన్ విధించిన తొలినాళ్ళలో దేశమంతటా పటిష్ట వంతంగా సామాజిక దూరం పాటించడం జనసంచారం ఎక్కడికక్కడ కట్టడి చేయడం ఎటువంటి సడలింపులు లేకపోవడంతో వందల సంఖ్యలో ఉన్న కరోనా పాజిటివ్ కేసులు లాక్ డౌన్ సడలింపులతో 5 అంకెల సంఖ్యను దాటిపోయే దిశగా పరుగు పెడుతున్నాయి.  రోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతూ, 70వేల దాటిపోయింది.  భారత్ లో కరోనా పాజిటివ్ వెలుగు చూసిన జనవరి 30 నాటికి ఒక్క కేసు ఉంటే వంద రోజులు పూర్తయ్యేసరికి 71 వేలకు అతి చేరువలో ఉండడం దురదృష్టకర పరిణామం.  కరోనా దానంతట అది వ్యాప్తి చెంది వైరస్ పంచే అవకాశం లేదు కానీ వైరస్ వ్యాప్తికి మానవులే కారకులుగా పరిగణిస్తున్నారు ఒకరి నుంచి ఒకరికి ఈ వ్యాధి వ్యాప్తి చెందుతూ దేశంలో సుమారు

20 లక్షల కోట్లతో ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని

Image
  స్తంభించిన ఆర్థిక రంగాన్ని ఆదుకునేందుకు భారీ ప్యాకేజీ రేపు విధి విధానాలు ప్రకటించనున్న ఆర్థిక మంత్రి అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా భారత జిడిపిలో 10 శాతం ప్యాకేజీగా ప్రకటించిన ప్రధాని ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టేందుకు పంచ సూత్రాల మోడీ మంత్రం…  అవసరాలకు అనుగుణంగా దేశీయ ఉత్పత్తి… పౌరులంతా దేశీయ ఉత్పత్తులనే వాడాలి అని సంకల్పం తీసుకోవాలి… మేక్ ఇన్ ఇండియా కోసం నడుం బిగించాలి… (జనహృదయం  ప్రతినిధి – రాజన్) న్యూఢిల్లీ  : కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భాగంగా విధించిన లాక్ డౌన్ తో క్షీణించిన భారత ఆర్థిక రంగాన్ని ఆదుకునేందుకు 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.  మంగళవారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించిన మోడీ భారతావనిని ఆదుకునేందుకు ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టేందుకు పంచ సూత్రాలతో పురోభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు దీనికోసం ” ఆత్మ నిర్మల్ భారత్ అభియాన్” పథకం ద్వారా  20 లక్షల కోట్ల తో ప్రకటించిన ప్యాకేజీ ఆధారంగా భారతావనిని ఆదుకునేందుకు ప్రధానమంత్రి నిర్ణయించారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా అభివృద్ధి చెందుతున్న వరుసలో ఉన్న భారత్ ఈ సంక్షోభాన్ని ఆదుకునేం

బాధిత గ్రామాల్లో బస చేసి భరోసా కల్పించండి: సీఎం జగన్

Image
  విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటన, ప్రస్తుత పరిస్థితిపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష… సహాయకచర్యలు, పరిహారంపై మంత్రులు, అధికారులుకు కీలక ఆదేశాలు… మరో మూడు రోజుల్లో మిగిలిన బాధితులకు ఆర్థికసహాయం… ప్రభావిత గ్రామాల ప్రజల వైద్యంకోసం క్లినిక్‌… రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమల్లో తనిఖీలు… ప్రమాదకర పరిశ్రమల తరలింపుపైనా ఆలోచనలు… అన్ని కమిటీల నివేదకలూ పరిగణలోనికి తీసుకోవాలని ఆదేశించిన సీఎం…   ట్యాంకుల్లో స్టెరిన్‌ తరలింపు ప్రక్రియ ప్రారంభం తిరిగి కొరియాకు 13వేల టన్నుల స్టెరెన్‌… అమరావతి   (జనహృదయం): విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్‌ లీక్‌ దుర్ఘటన అనంతరం పరిణామాలపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గ్యాస్‌ లీక్‌ ఘటన, అనంతరం తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రికి మంత్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.  సీఎం ఆదేశించిన విధంగా మరణించిన కుటుంబాల్లో లీగల్‌ హెయిర్‌ ఫైనల్‌ అయిన 8 మందిలో 5 గురికి పరిహారం అందించామని తెలిపారు. మిగిలి వారు నగరానికి దూరంగా ఉన్నందున వారికి కూడా అందిస్తామని మంత్రులు మంత్రులు బదులిచ్చారు. గ్యాస్ లీక్ గ్రామాల్లో, ఇళ్లల్లో శానిటేషన్‌ పనులు ప్రారంభమయ్యాయని, సాయ

ఎల్జి పాలిమర్స్ బాధితులకు నష్టపరిహారం అందించిన మంత్రులు

విశాఖపట్నం   (జన హృదయం): విశాఖలో ఎల్జి పాలిమర్స్గ్ గ్యాస్ ‌ లీకేజీతో మృతుల కుటుంబాలకు  రూ.కోటి చొప్పున ఎక్స్గ్రేషియా ను ఏపీ మంత్రులు సోమవారం అందించారు . ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న. బాధితులను మంత్రుల బృందం పరామర్శించింది.  గ్యాస్ లీక్ ఘటనలో మృతి చెందిన వారిలో ఐదు కుటుంబాలకు రూ.కోటి చొప్పున చెక్కులు అందజేశారు. సాయంత్రం 4 గంటల తర్వాత ప్రజలు గ్రామాల్లోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వనున్నారు. గ్యాస్ లీక్ ప్రభావిత గ్రామాల్లో మంత్రులు ఈ రోజు రాత్రి బస చేసి  ఆయా గ్రామాల్లో  ప్రజలకు  భరోసా కల్పించి వారికి ధైర్యం చెప్పేందుకు మంత్రులు నిర్ణయించారు. వి శాఖలోని ఆర్.ఆర్‌ వెంకటాపురంలో గ్యాస్‌ లీక్ అయి 12 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బాధితులకు ప్రకటించిన నష్ట పరిహారాన్ని ఏపీ మంత్రులు ఈ రోజు ఉదయం అందజేశారు.  కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను ఏపీ మంత్రులు అవంతి శ్రీనివాస్‌, కన్నబాబు, బొత్స సత్యనారాయణ పరామర్శించారు. ఏపీలో పారిశ్రామిక ప్రాంతాల వద్ద భద్రతకు సంబంధించిన ఒక కొత్త విధానాన్ని తీసుకురావాలనుకుంటున్నామని మంత్రి కన్నబాబు వివరించారు.  సీఎం జగన్‌ చేసి సూచనల మేరకు ఏపీ మంత్రులు

దేశంలో 67వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

సీఎంలతో ప్రధాని మోడీ కరోనా పై నేడు ఐదోసారి సమీక్ష భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం మోడీతో మధ్యాహ్నం మూడు నుండి 6 గంటల వరకు  జరగనున్న సీఎంల వీడియో కాన్ఫరెన్స్ (జనహృదయం ప్రతినిధి - రాజన్) న్యూఢిల్లీ : భారత్ లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది.  దేశంలో కరోనా  మొదటి కేసు నమోదైన  100రోజుల్లో  పాజిటివ్ కేసుల సంఖ్య  రోజు రోజుకి భారీగా పెరుగుతోంది ‌   వైరస్‌ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా పెరుగుతున్న కేసుల సంఖ్య  ఆందోళన కలిగిస్తోంది.  దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 4,213 పాజిటివ్ కేసులు నమోదు కాగా 97 మంది మృతి చెందారు.  తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య  67,152కి, మృతుల సంఖ్య  2206కి చేరింది. అలాగే ఇప్పటివరకు 20,917 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.  దేశంలో ప్రస్తుతం 44,029 యాక్టివ్ కేసులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నాలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా దేశంలో కరోనా వైరస్‌ మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లోనే ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది.  కరోనా పాజిటివ్‌ కేసులు అత్యధికంగా నమోదవ

ఏపీలో రెండు వేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో 2000 దగ్గరగా దేశవ్యాప్తంగా 60 వేలకు చేరువలో కరోనా కేసులు అమరావతి : ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి దేశంలోనే అత్యధికంగా పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రథమ స్థానంలో నిలవగా పరీక్షలకు దీటుగా రాష్ట్రంలో కొత్త కేసులు నమోదవుతున్నాయి ఎక్కడికక్కడ ప్రజలు స్వీయ నియంత్రణ పాటించకుంటే మరింత ఉధృతమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు ఓ పక్క ప్రభుత్వం విస్తృతంగా కరుణ కట్టడికి ప్రయత్నం చేస్తూనే ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచేందుకు ప్రయత్నం ముమ్మరం చేసింది ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరికి వారు సామాజిక భద్రత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రస్తుతం రాష్ట్రంలో రెండు వేలకు చేరువలోను, దేశంలో 60 వేలకు దగ్గరలో ( 59,662 )పాజిటివ్ కేసులు చేరుకోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో జిల్లాల వారీగా కరోనా వైరస్ వివరాలు : గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో ని 13 జిల్లాలో కొత్తగా 43 కరోనా పోసిటివ్ కేసులు నమోదైయ్యాయి. మొత్తం 1930 , వైద్య సేవలు పొందుతున్న వారు 999 , డిశ్చార్జ్ అయిన వారు 887 , మరణించిన వారు 44. గత 24 గంటల్లో రాష్ట్రంలో చేసిన కరోనా పరీక్షలు - 8,388 , మొత్తం ఇప్పటి వర

ప్రజా నిర్ణయం మేరకే భవిష్యత్ ప్రణాళిక

బాధితుల వద్దకు వెళ్లి శాంతించాలి అంటూ మంత్రులు ఎమ్మెల్యేలు విజ్ఞప్తి విశాఖపట్నం (జనహృదయం):  విశాఖ ఎల్జి పాలిమర్స్ దుర్ఘటనపై మృతదేహాల తో చేపట్టిన ప్రజా ఆందోళన శాంతి చేందుకు శాంతింప చేసేందుకు మంత్రులు విస్తృత ప్రయత్నం చేస్తున్నారు ప్రజా నిర్ణయం మేరకే భవిష్యత్తులో ఎల్జి పాలిమర్స్ పనులు నిర్వహణ జరుగుతుందని శాంతియుతంగా సమస్య పరిష్కరిస్తామని ప్రజలు ఎవరు ఆందోళన చెందనవసరం లేదని మంత్రులు బాధితులకు నచ్చచెప్పారు అయినప్పటికీ వారి ఆందోళన కొనసాగిస్తున్నారు కుటుంబ  సభ్యులను కోల్పోయిన బాధలోనూ ప్రాణాపాయ పరిస్థితి నుండి బయటకుు వచ్చినా ప్రజలు తమ ఆవేేదనను వెలిబుచ్చుతున్నారు అని దీనిిని తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రజల వేదన గోడు ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని ప్రజల నిర్ణయం మేరకే భవిష్యత్్ కార్యక్రమాలు ఉంటాయని మంత్రులుు అవంతి శ్రీనివాసరావు కృష్ణదాస్ తదితరులు హామీ ఇచ్చారు ప్రజలంతా ఆందోళన విరమించి తమ బంధువుల మృతదేహాలకు అంత్యక్రియలు చేపట్టాలని ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కమిటీ నివేదిక అనంతరం ప్రజల నిర్ణయం కూడా పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ప్రజలకు న్యాయం జరిగే వర

సంయమనం పాటించాలి.. డిజిపి సవాంగ్ విజ్ఞప్తి

ప్రజలంతా సంయమనం పాటించండి.... ప్రజా సంక్షేమమే శ్రేయస్సు ప్రాతిపదికగా ప్రభుత్వం నిర్ణయాలు చేస్తోందని ప్రజా సంక్షేమం దృష్ట్యా నిర్ణయాలు ఉంటాయని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ విజ్ఞప్తి చేశారు విశాఖలో ఎల్జి పాలిమర్స్ ప్రాంగణంలో ఆ ప్రాంతాల ప్రజలు మృతదేహాల తో నిరసన చేయడం ఆందోళన చేపట్టడం పట్ల డిజిపి మీడియాతో మాట్లాడుతూ ప్రజలంతా సంయమనం పాటించాలని పోలీసులకు సహకరించాలని ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పోలీసు చర్యలు ఉంటాయని సహృదయంతో శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని డిజిపి కోరారు.

ఎల్జి పాలిమర్స్ కంపెనీ తరలించాలని మిన్నంటిన ఆందోళన

Image
విశాఖపట్నం (జనహృదయం ప్రతినిది రాజన్) : విశాఖ ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన అనంతరం శనివారం ఐదు గ్రామాల ప్రజల్లో ఆందోళన మిన్నంటింది తమ ప్రాణాలకు ముప్పుగా పరిణమించిన రసాయన కంపెనీని తరలించాలని లేకుంటే తమ ఆందోళన ఆపేది లేదని ఈ ప్రమాదంలో మృతి చెందిన మృతదేహాలను కంపెనీ గేటు ముందు నుంచి తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్నారు ముఖ్యమంత్రి కంపెనీని తరలిస్తామని స్పష్టమైన ప్రకటన చేసే వరకూ ఈ ఆందోళన కొనసాగిస్తామని అప్పటివరకు మృతదేహాలను మనం చేసే పరిస్థితి లేదంటూ తీవ్రస్థాయిలో ప్రజలంతా ఒకచోట చేరి ఆందోళన చేపట్టారు బాధితుల బంధువులు ప్రజలు ఆందోళనతో వెంకటాపురం ఎల్ జి పాలిమర్స్ ప్రాంగణమంతా భారీ జనసందోహంతో నిండి పోయి మృతదేహంతో ఆందోళన చేస్తున్నారు వారి బాధితుల ఆవేదన కట్టలు తెంచుకొని మృతదేహాల పెద్ద విలపిస్తూ చేస్తున్న ఆందోళన కట్టడి చేయడం పోలీసు లకు సాధ్యపడలేదు సిపిఐ పార్టీ కూడా వీరికి మద్దతు పలకడంతో ప్రజలంతా కంపెనీని మూత మూసివేస్తేనే కానీ ఆందోళన విరమించి ప్రజల పరిస్థితి లేదని తేల్చి చెబుతున్నారు కంపెనీ యాజమాన్యం ని అరెస్టు చేయాలని మృతదేహాల తో నిరసన తెలియజేస్తున్నారు ఒక దశలో పోలీసులు ఆందోళన ఎందుకు యువకులను పోలీసు వాహనాల్లో

నిపుణుల పరిశీలనతో ప్రజలను అనుమతిస్తాం

జిల్లా ఇన్చార్జి మంత్రి కన్నబాబు వెల్లడి విశాఖపట్నం (జనహృదయం):  విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రాంతంలో నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా అక్కడి ప్రజలను అనుమతిస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు ఎల్జి పాలిమర్స్ ఘటన అనంతరం బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని ఇప్పటికే చాలా మంది కోరుకుంటున్నారని వారిలో చిన్నారులు కూడా ఉన్నారని ఆయన చెప్పారు ఐదు గ్రామాల్లోని పరిశీలిస్తున్నామని ప్రస్తుతం పరిస్థితి సాధారణంగా ఉన్నప్పటికీ నిపుణుల కమిటీ ఈ రోజు మధ్యాహ్నం నుండి విశాఖ రానుందని వారు పరిశీలించిన అనంతరం నివేదిక ఆధారంగా ప్రజలను వారి ఇళ్లకు అనుమతిస్తామని అప్పటి వరకు వారికి కావలసిన వసతి సౌకర్యాలు ప్రభుత్వమే కల్పిస్తుందని పేర్కొన్నారు బాధితులకు తక్షణ ఆర్థిక సహాయం అందించే దిశగా చర్యలు చేపట్టామని ఇప్పటికే ప్రభుత్వం 30కోట్లు విడుదల చేసిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ప్రచారం బాధితులందరికీ ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటామని అన్నారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం విశాఖ లోనే ఉండి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ చర్యలు చేపడతారని మంత్రి కన్నబ

విశాఖ ఎల్జి పాలిమర్స్ ప్రాంతంలో సాధారణ పరిస్థితి

డీజీపీ గౌతమ్ సవాంగ్ విశాఖపట్నం (జనహృదయం): విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రాంతంలో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు శనివారం ఉదయం ఆయన సంఘటన స్థలాన్ని, ఆ పరిసర గ్రామాలలో పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఆయన కలియతిరిగి మాస్కులు లేకుండా గాలిని పరిశీలించారు అయితే ఆక్సిజన్ బాగా అందుతుంది అని ఎటువంటి ఇబ్బంది లేదని తాను స్వయంగా తెలుసుకోవడం జరిగిందని అన్నారు చుట్టుపక్కల వున్న ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని అయితే ప్రమాద పరిసరాల్లో ఉన్న ఐదు గ్రామాల ప్రజలు పూర్తిస్థాయిలో రేపటికి వచ్చేందుకు అవకాశం ఉందని అన్నారు

విషవాయువు అరికట్టేందుకు గుజరాత్ నుండి ప్రత్యేక రసాయనం

విషవాయువు అరికట్టేందుకు ప్రత్యేక రసాయనం తో గుజరాత్ నుండి విశాఖ వచ్చిన కార్గో విమానం సాధారణ పరిస్థితి నెలకొల్పేందుకు కొనసాగుతున్న చర్యలు 11కు చేరిన మృతుల సంఖ్య..   విశాఖపట్నం :  విశాఖ ఎల్జి పాలిమర్స్ లో తలెత్తిన గ్యాస్ లీకేజ్ అరికట్టేందుకు గుజరాత్ నుండి ప్రత్యేక రసాయనాలు కార్గో విమానంలో తరలించారు.  ఎల్‌జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకేజి వల్ల తలెత్తిన పరిణామాలను అదుపులోకి తీసుకొచ్చి తదుపరి నష్టాన్ని నివారించడానికి గుజరాత్‌ నుంచి అత్యవసర ప్రాతిపదికన ప్రత్యేక రసాయనాన్ని తరలించి దానిద్వారా పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.‘పారా టెర్షియరీ బ్యుటైల్‌ కెటెహాల్‌’ (పీటీబీసీ) అనే ఈ రసాయనాన్ని గుజరాత్‌లోని వ్యాపి పట్టణంలోనే ఉత్పత్తి చేస్తారు. లీకైన గ్యాస్‌ ప్రభావం లేకుండా చేయడానికి విశాఖలో కొంతవరకు వినియోగించారు. మరింతగా పీటీబీసీ రసాయనం పంపించాలని ఎల్జీ పాలీమర్స్‌ అభ్యర్థించడంతో విషయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లగా.. విమానంలో తరలింపునకు ఆయన తక్షణమే అధికారులను ఆదేశించారని ఆ శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి దిల్లీలో తెలిపారు. 500 కిలోల రసాయనాన్ని వ్యాపి నుం

మళ్లీ దట్టమైన పొగతో పరుగులు తీసిన జనం

Image
విశాఖపట్నం: విశాఖ శివారులోని ఎల్‌జీ పాలిమర్స్‌ సంస్థ నుంచి గురువారం అర్ధరాత్రి మళ్లీ భారీ స్థాయిలో విషవాయువు లీకయిందని, పెద్ద ఎత్తున పొగలు బయటకు రావటంతో సమీప ప్రాంతాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి పరుగులు తీశారు. ప్రాణాలరచేతపట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోతున్నారు. మరోవైపు పోలీసులు సైతం అందరినీ ఖాళీ  చేయాలని చెబుతూ మొత్తం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఎన్‌ఏడీ, బాజీ జంక్షన్‌, గోపాలపట్నం, సుజాతనగర్‌, పెందుర్తి, అడివివరం, పినగాడి, సింహాచలం, ప్రహ్లాదపురం, వేపగుంట తదితర ప్రాంతాల నుంచి వేలాదిమంది అర్ధరాత్రి సమయంలో రోడ్లపైకి వచ్చేశారు.  అందుబాటులో ఉన్న వాహనాల్లో కొంతమంది వెళ్తుండగా.. చాలామంది కాలి నడకన సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. తాజా పరిస్థితిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోవటంతో ప్రజలు తీవ్ర గందరగోళంలో ఉన్నారు. మరోవైపు పుణేకు చెందిన ఎన్విరాన్‌మెంట్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు 9 మంది ప్లాంట్‌ లోపలకు వెళ్లి వాయువుపై పరిశోధన చేస్తున్నారు. ఇది గురువారం అర్ధరాత్రి దాటాక కూడా కొనసాగుతూనే ఉంది. న్యూట్రలైజర్‌ ద్వారా లోపల నుంచి వాయువు వెలువడకుండా గడ్డ కట్టేల

పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

*కరోనా(కోవిడ్-19) లేటెస్ట్ సమాచారం*            (8-5-2020)  *మొత్తం పాజిటీవ్ కేసులు* ప్రపంచంలో..39,15,636. భారత్ లో.........59,661 తెలంగాణలో........1,122 *మొత్తం మరణాలు* ప్రపంచంలో....2,70,683 భారత్ లో...........1,889 తెలంగాణలో.............29 *ఎక్కువ పాజిటీవ్ కేసులున్న టాప్ 5 దేశాలు* 33 కోట్ల మంది వున్న అమెరికాలో 12,92,623. 4.7 కోట్ల మంది వున్న స్పెయిన్ లో 2,56,855. 6 కోట్ల మంది వున్న ఇటలీలో........ 2,15,858. 6.6 కోట్ల మంది వున్న లండన్ లో ..2,06,715. 14.4 5కోట్ల మంది వున్న రష్యాలో....1,77,160. 134 కోట్ల మంది వున్న భారత్ లో.......56,351. *మరణాల్లో టాప్ 5 దేశాలు* అమెరికాలో.......76,928 మంది. లండన్ లో.........30,615 మంది. ఇటలీలో............29,958 మంది. స్పెయిన్ లో.......26,070 మంది. ఫ్రాన్స్ లో...........25,987 మంది. *భారత్ లో పాజిటీవ్ కేసులున్న టాప్ 5 రాష్ట్రాలు* మహరాష్ట్రలో......17,974. గుజరాత్ లో........7,013. ఢిల్లీ లో...............5,980. తమిళనాడులో.....5,409. రాజస్థాన్ లో........3,427. *తెలంగాణలో పాజిటీవ్ కేసులున్న టాప్ 5 జిల్లాలు* హైదరాబాద్ లో....312. సూర్యాపేట..........039. గద్వాలలో

విశాఖ ఘటన పై ప్రముఖుల సంతాపం…

Image
హైదరాబాద్‌ :  విశాఖపట్నం జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమలో జరిగిన గ్యాస్‌ లీక్‌ ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది.   ఈ ఘటనకు సంబంధించి పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.    ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విశాఖ గ్యాస్‌ లీక్‌ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు.   మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.  -: వైజాగ్‌ గ్యాస్‌ లీక్‌ ఘటన నన్ను షాక్‌కు గురిచేసింది. ఆ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులను బాధితులకు అవసరమైన సాయం అందేలా చూడాలని కోరుతున్నాయి. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను –  రాహుల్‌ గాంధీ -: విశాఖలో విషవాయువు లీక్ ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి.  పలువురు మృతి చెందడం, అధిక సంఖ్యలో ఆసుప్రతిపాలు కావడంపై ఆవేదన చెందిన చంద్రబాబు ఆర్ ఆర్ వెంకటాపురంలో దుర్ఘటన బాధాకరం,  మనుషులే కాదు మూగజీవాలు మృతిచెందాయి. కొనఊపిరితో ఉన్న ప్రజలను, మూగజీవాలను కాపాడాలి చెట్లన్నీ రంగుమారడం విషవాయు తీవ్రతకు నిదర్

ఏపీలో 1883 చేరిన కరోనా కేసుల సంఖ్య

Image
విజయనగరం జిల్లానూ వదలని కరోనా ...  అమరావతి :ఏపీలో కరోనా మహమ్మారి రోజురోజుకి ఉదృతం అవుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 56 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ విడుదల చేసిన మీడియా బులెటిన్‌లో పేర్కొంది. దీంతో రాష్ట్రంలో  మొత్తం కేసుల సంఖ్య 1833కు చేరుకుంది. ఇప్పటివరకు 780 మంది కరోనాను జయించి డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ వ్యాధి బారినపడి ఇప్పటివరకు 38 మంది మృతిచెందారని ఆరోగ్య శాఖ వెల్లడించింది.  ప్రస్తుతం యక్టివ్ గా ఉన్న 1015 మందికి  వివిధ ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. కాగా ఈ రోజు కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 8,087 శాంపిల్స్ పరీక్షించగా 56 మందికి పాజిటివ్ అని తేలింది. కొత్తగా నమోదయిన కేసుల వివరాలిలా ఉన్నాయి.  కృష్ణాలో 16, గుంటూరు 10,  కర్నూలు 7, విశాఖలో 7, నెల్లూరులో 4, కడప 6, అనంతపురం 3, విజయనగరంలో 3 చొప్పున కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ ప్రకటనలో తెలిపింది.  జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలిలా ఉన్నాయి.   

విశాఖ ఘటనలో మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా

Image
బాధితులు కోలుకునే వరకూ అన్ని విధాలా ఆదుకుంటాం సీఎం జగన్ పరిస్థితి చక్కబడే వరకు ప్రధాన కార్యదర్శి తో సహా మంత్రులు విశాఖలోనే సేవలు అందిస్తార (విశాఖపట్నం – జనహృదయం ప్రతినిధి రాజన్) విశాఖ ఘటనలో మృతి చెందిన వారికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా సీఎం జగన్ ప్రకటించారు విషవాయువు బారినపడి ఐదు గ్రామాలకు చెందిన 15వేల మందికి ఒక్కొక్కరికి 10 వేల వంతున ఆర్థిక సహాయం అందించాలని సీఎం జగన్ విశాఖ కలెక్టర్ను ఆదేశించారు బాధితులను విశాఖ కేజీహెచ్లో పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి దురదృష్టకర సంఘటనలు సంభవించడం తన హృదయాన్ని కలచి వేసిందని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బాధితులందరికీ పూర్తిస్థాయిలో కోలుకునే వరకూ ప్రతి పైసా ప్రభుత్వమే భరిస్తూ వైద్య సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు ప్రతి ఒక్కరిని ఆదుకునేందుకు తక్షణ సహాయం కింద ఐదు గ్రామాలకు చెందిన 15 వేల మంది జనాభాకు పదివేల వంతెన సహాయం ప్రకటించారు. ఈ ఘటనలో మృతి చెందిన వారికి కోటి రూపాయల వంతున ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూనే వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న వారికి 10 లక్షలు వంతెన ఆస్పత్రిలో రెండు మూడు రోజులు పాటు చికిత్స పొందుతున్న పొందినవారికి లక్ష రూపాయల

విశాఖ ఘటనపై విచారణకు ఉన్నతస్థాయి కమిటీ

న్యూఢిల్లీ  :దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విశాఖ విషవాయు ఘటనపై విచారణకు ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలు జారీ చేశారు కొద్దిసేపటి క్రితం ఉన్నత స్థాయి అధికారులతో న్యూఢిల్లీలో సమావేశమై సమీక్షించిన ప్రధాని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు గ్యాస్ లీకేజీ దానికి కారణాలు భవిష్యత్ కార్యాచరణ ఘటన తో అస్వస్థతకు గురైన వారి భవిష్యత్ ఆరోగ్య పరిణామాలు కంపెనీ చేపట్టే రక్షణ చర్యలు తదితర అంశాలపై కమిటీ సమగ్ర విచారణ జరపనుంది. కాగా విశాఖలో విషవాయువు బారినపడిన బాధితులను ఆదుకోని సహాయక చర్యలు అందించేందుకు మరియు జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ సిబ్బంది సహాయక చర్యల్లో పూర్తి సహకారం అందించి చర్యలు చేపట్టాలని ప్రధాని ఆదేశించారు ఈ ఘటన మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ఫోన్ చేసి ఈ విషయం తెలుసుకొని ఎటువంటి సహకారం కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు

ప్రాణనష్టం పెరక్కుండా సహాయక చర్యలు ముమ్మరం

Image
కొద్దిసేపట్లో విశాఖ చేరుకున్న సీఎం ఏ సహాయం అందించేందుకు అయినా సిద్ధం ప్రధాని మోడీ పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం చర్యలు ఎక్కడ చూసినా హృదయ విదారకరమైన దృశ్యాలు వీధిలోనూ కాలువలోను అపస్మారక స్థితిలో పడిన దృశ్యాలు (జనహృదయం – ప్రతినిధి రాజన్) విశాఖపట్నం   :  విశాఖపట్నం నగర శివారులో విషవాయువుల సృష్టించిన భయానక పరిస్థితులు నుండి ప్రజలను సంరక్షించేందుకు ప్రభుత్వ అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది ఏ ఒక్క ప్రాణం నష్టం జరగకుండా ఉండే విధంగా ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రులు అన్నిటినీ సిద్ధం చేసింది ఏ ఆస్పత్రికి ఈ వాయువు బారినపడి ఎవరు వచ్చినా వెంటనే అలక్ష్యం చేయకుండా వైద్యం చేస్తూ అధికార యంత్రాంగానికి సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది తెల్లవారు మూడు గంటలకు అంతా గాఢ నిద్రలో ఉన్నప్పుడు సంభవించిన ఈ దుష్పరిణామం తో ఇప్పటికే 9 మంది మృతి చెందగా 246 మంది కి అత్యవసర చికిత్స అందిస్తున్నారు అలాగే 20 మంది కి వెంటిలేటర్పై శ్వాస అందిస్తున్నారు.  శ్వాస అందక ప్రాణాలు అరచేత పట్టుకుని పరిగెడుతున్న వారు ఎక్కడపడితే అక్కడ అ పడిపోయి హృదయ విదారకమైన పరిస్థితులు పలువురిన

ఏడుగురు మృతి 200 మంది అపస్మారక స్థితిలో

Image
విశాఖపట్నం: జిల్లా పరిధిలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఉన్న ఎల్‌జి పాలిమర్స్‌లో గురువారం తెల్లవారుజామున రసాయన వాయువు లీకేజీ అయిన సంగతి తెలిసిందే.  ఈ ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందగా, 200 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. కాగా ప్రస్తుతం పరిస్థితి కొంత అదుపులోకి వచ్చినట్లు అధికార యంత్రాంగం స్పష్టం చేసింది.  గ్యాస్‌ లీకేజీ జరిగిన ప్రాంతానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరికొద్ది సేపట్లో రానున్నారు.  పరిసర ప్రాంతాల్లో సహాయక చర్యలను సమీక్షించడంతో పాటు బాధితులను పరామర్శించనున్నారు. అంతకుముందు ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ కలెక్టర్‌ వినయ్‌చంద్‌కు ఫోన్‌ చేసి ఆరా తీశారు.  తక్షణమే సహాయ కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. రసాయన వాయువు విడుదలైన బాధిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.

యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు: కలెక్టర్

విశాఖపట్నం:  నగరంలోని ఎల్జీ పాలిమర్స్‌లో జరిగిన ప్రమాదంపై కలెక్టర్ వినయ్ చంద్ ఆరా తీశారు.  విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిస్థితి అదుపులో రావడానికి మరో రెండు గంటల సమయం పట్టొచ్చని తెలిపారు. సుమారు 150 నుంచి 200 మంది వరకు అస్వస్థతకు గురై ఉంటారని భావిస్తున్నామన్నారు.  లాక్‌డౌన్ కారణంగా యంత్రాలను ప్రారంభించే క్రమంలో ఫైర్ కావడం వల్ల ప్రమాదం జరిగిందని చెప్పారు.  పరిస్థితిని అదుపుచేసేందుకు  ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, పోలీసుల శ్రమిస్తున్నారని కలెక్టర్ వినయ్ చంద్ పేర్కొన్నారు.

విశాఖలో విషవాయువు అపస్మారక స్థితిలోకి చేరిన వందలాది జనం

విశాఖపట్నం:  నగరంలోని గోపాలపట్నం పరిధి ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలోని ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది.  పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకై 3 కి.మీ మేర వ్యాపించింది.  దీంతో చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అపస్మారక స్థితిలో రహదారిపై పడిపోయిన కొందరిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ప్రజలు భయాందోళనలతో తలుపులు వేసుకొని ఇళ్లలోనే ఉండిపోయారు. సైరన్‌లు మోగించి ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. పరిశ్రమకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాల ప్రజలను ఇళ్ల నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. 25 అంబులెన్స్‌లు, పోలీసు వాహనాల ద్వారా అస్వస్థతకు గురైన వారిని విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తున్నారు. సింహాచలం డిపోనుంచి ఆర్టీసీ బస్సులను తీసుకొచ్చి పరిశ్రమకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న వారిని తరలిస్తున్నారు.

దేశంలో 50 వేలకు చేరువలో కరోనా కేసులు

న్యూఢిల్లీ  : దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే 50 వేలకు అతి చేరువలో ఉన్నాయి. గడిచిన 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 2,958 కరోనా కేసులు నమోదు కాగా, 126 మంది మృతిచెందారు. దీంతో భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 49,391కి చేరింది.  ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు 14,182 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి  డిశ్చార్జి కాగా, 1,694 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 33,514 కరోనా యాక్టివ్‌ కేసులకు చికిత్స అందిస్తున్నారు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 15,525 కరోనా కేసులు నమోదు కాగా, 617 మంది మృతిచెందారు. గుజరాత్‌లో 6,245, ఢిల్లీలో 5,104, తమిళనాడులో 4,058, రాజస్తాన్‌లో 3,158, మధ్యప్రదేశ్‌లో 3,049, ఉత్తరప్రదేశ్‌లో 2,880,  ఆంధ్రప్రదేశ్లో 1777 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఏపీలో 1777 చేరిన పాజిటివ్ కేసులు

Image
అమరావతి  : ఏపీలో లో కొత్తగా 60 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవడంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,777కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 7,782 శాంపిల్స్‌ పరీక్షించగా.. 60 మందికి కరోనా నిర్దారణ అయినట్టు పేర్కొన్నారు. వీరిలో తూర్పు గోదావరి జిల్లాలో 1, గుంటూరు జిల్లాలో 12, వైఎస్సార్‌ జిల్లాలో 1, కృష్ణా జిల్లాలో 14, కర్నూలు జిల్లాలో 17, విశాఖపట్నం జిల్లాలో 2 కేసులతోపాటుగా కర్ణాటకకి చెందినవి 1, గుజరాత్‌కు చెందినవి 12 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ సమయంలో మిగతా 7 జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇప్పటి వరకు రాష్ట్రంలో  మొత్తం కోలుకున్నవారి సంఖ్య 729కి కాగా కరోనాతో 36 మంది  మృతిచెందారు. ప్రస్తుతం 1012 మంది కరోనాతో రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా ఏపీలో ఇప్పటివరకు 1,42,274 కరోనా టెస్టులు నిర్వహించి దేశంలో ప్రథమ స్థానంలో నిలిచారు. జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.

నేటి ముఖ్యాంశాలు

Image
  ఆంధ్రప్రదేశ్‌  :  నేడు వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం చెల్లింపులు,   చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మే నెలలోనే ఆర్థిక సహాయం   సముద్రాన్ని నమ్ముకుని జీవిస్తున్న మత్స్యకారులకు ప్రభుత్వ భరోసా… దేశమంతా లాక్‌డౌన్‌ పరిస్థితుల్లోనూ వీడని ప్రభుత్వ సంకల్పం  లక్షకుపైగా మత్స్యకార కుటుంబాలకు రూ.10 వేల చొప్పున సహాయం  గతేడాది నవంబర్‌లో మత్స్యకార దినోత్సవం నాడు ఆర్థిక సహాయం మాట నిలబెట్టుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీలో 1717 కరోనా పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య 34, డిశ్చార్జ్ అయిన వారు 589 కాగా ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1094 తెలంగాణ  :  తెలంగాణలో మే 29దాకా లాక్‌డౌన్‌ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య  1096 కరోనా మరణాల సంఖ్య  29 జాతీయం  :  దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య  46,711 కరోనా నుంచి కోలుకున్న వారు 13,161 కరోనా మరణాల సంఖ్య  1583,  ప్రపంచవ్యాప్తంగా 37.23 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 2.57 లక్షల మంది మృతి ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న 12.39 లక్షల మంది

ఏపీలో 1,717కి చేరిన కరోనాపొజిటివ్ కేసుల సంఖ్య

Image
అమరావతి :ఏపీలో కరోనాపొజిటివ్ కేసుల సంఖ్య 1,717కి చేరింది. మంగళవారం కొత్తగా మరో  67 కరోనా పాజటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం  1717కి చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో 8,263 పరీక్షలు నిర్వహించగా 67 మందికి  కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలిపింది. కొత్తగా అనంతపురం జిల్లాలో 2, గుంటూరులో 13, వైఎస్సార్‌ జిల్లాలో 2, కృష్ణా జిల్లాలో 8, కర్నూలు జిల్లాలో 25, నెల్లూరు జిల్లాలో 1, విశాఖపట్నం జిల్లాలో 2 కరోనా కేసులు నమోదు అయినట్టు పేర్కొంది. అలాగే గుజరాత్‌ నుంచి వచ్చిన 14 మందికి కరోనా పాజిటివ్‌ రిజల్ట్ వచ్చింది.   గడిచిన 24 గంటల్లో 65 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. వీరిలో కర్నూలు జిల్లాలో 28, గుంటూరు జిల్లాలో 13, కృష్ణా జిల్లాలో 10, నెల్లూరు జిల్లాలో 6, చిత్తూరు జిల్లాలో ముగ్గురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు, వైఎస్సార్‌ జిల్లాలో ఇద్దరు, విశాఖపట్నం జిల్లాలో ఒక్కరు ఉన్నారు. దీంతో ఇప్పటివరకు 589 కరోనా నుంచి కోలుకోని ఇళ్లకు వెళ్లగా , రాష్ట్రంలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 34 గా ఉంది. ప్

దేశవ్యాప్తంగా 46 వేలు దాటినా కరోనా కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా విజృంభిస్తూ గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,900 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 46,433కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.  కాగా, ఒక్క రోజు వ్యవధిలో ఇంత భారీ స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకావడం తొలిసారి కావడంతో కొంతమేర ఆందోళనకర వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 12,726 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 1,568 మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 32,138 కరోనా  యాక్టివ్‌ కేసులకు  చికిత్స అందిస్తున్నారు. . దేశవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్యలో సగానికి పైగా మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీలలోనే ఉన్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 14, 541 కరోనా కేసులు నమోదు కాగా, 583 మంది మృతిచెందారు. గుజరాత్‌లో 5,804, ఢిల్లీలో 4,898, తమిళనాడులో 3,550, రాజస్తాన్‌లో 3,061, మధ్యప్రదేశ్‌లో 2,942, ఉత్తరప్రదేశ్‌లో 2,776, ఏపీలో 1717పాజిటివ్ కేసులు  కరోనా కేసులు నమోదయ్యాయి.  

ఏపీని వెంటాడుతున్న కరోనా పాజిటివ్ కేసులు

అమరావతి:  ఏపీలో కొత్త‌గా ఆదివారం 58 క‌రోనా వైర‌స్ పాజిటీవ్ కేసులు న‌మోదు అయ్యాయి.దీంతో రాష్ట్రంలో 1583 కి  పాజిటీవ్ కేసుల సంఖ్య చేరింది. ఈ మేరకుఏపీ వైద్య ఆరోగ్య శాఖ  *తాజా హెల్త్ బులిటెన్ 143 రిలీజ్ చేసింది.  గడచిన 24 గంటల్లో అత్యధికంగా కర్నూల్ జిల్లా లో 30 కేసులు, గుంటూరు 11, కృష్ణా 8,  నెల్లూరు 1, అనంతపురంలో 7,  చిత్తూర్ లో 1,చొప్పున  కొత్త‌గా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 466 కేసులు, గుంటూరు 319 కృష్ణా జిల్లాలో 266 కేసులు నమోదు అయ్యాయి. కాగా కరోనా పాజిటివ్ తో 488 మంది రోగులు కోలుకుని ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు.  వివిధ ఆసుపత్రుల్లో 1062 మందికి కొనసాగుతున్న చికిత్స పొందుతున్నారు రు. గడిచిన 24 గంటల్లో 6534 శాంపిల్స్ పరీక్షలు నిర్వహించారు.  ఇప్పటివరకు కరోనా పాజిటివ్ తో 33 మంది మృతి చెందారు. 

<no title>

భారత్‌లో కరోనా: 37,336 కేసులు.. 1,218 మరణాలు భారత్ లో కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 2,293 కేసులు, 71 మంది మృతి చెందినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 37,336కి చేరింది. 26,167 మంది చికిత్స పొందుతుండగా.. 9,950 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కరోనా వైరస్‌తో 1,218 మంది మృతి చెందారు