Posts

Showing posts from August, 2020

మీ సహకారంతో సాకారం

Image
పోలవరంపై ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ అమరావతి,  (జనహృదయం): పోలవరానికి సరళతరమైన పద్ధతిలో, సకాలంలో నిధులు విడుదల చేసేలా కేంద్ర జల్ శక్తి శాఖకు దిశానిర్దేశం చేసి 2021 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తయ్యేలా సహకరించాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని మోదీకి మంగళవారం లేఖ రాశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పోలవరం పనులకు రూ. 15 వేల కోట్లు అవసరమని, అమేరకు రుణం సేకరించేలా నాబార్డును ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఖర్చు చేసిన రూ.3,805.62 కోట్లను త్వరగా రీయింబర్స్మెంట్ చేయడంతోపాటు ఈ విధానాన్ని సరళీకృతం చేయాలని కోరారు. లేఖలో ముఖ్యాంశాలివీ.. - 2021 డిసెంబర్ చివరికి పూర్తయ్యేలా ప్రణాళిక.. పోలవరం ప్రాధాన్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం సెక్షన్ 90 ప్రకారం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి శరవేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. ప్రత్యేకంగా పీపీఏను ఏర్పాటు చేసింది. ప్రాజెక్టు పనులు 33.23 శాతం పూర్తయ్యా యి. హెడ్ వర్క్స్ లో సివిల్ పనులు 71 శాతం, కుడికాలువ పనులు 92 శాతం, ఎడమ కాలువ పనులు 52 శాతం, భూసేకరణ, సహాయ, పునరావాస ప్యాకేజీ పనులు 19 శాతం

భారత్ లో 32 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు

Image
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. కొత్తగా 67,151 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 32,34,475 చేరింది. గడిచిన 24 గంటల్లో 1059 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 59,449 కు చేరింది. వైరస్ బారిన పడ్డవారిలో ఇప్పటివరకు 24,67,759 మంది కోలుకున్నారు. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లించడానికి భారత్ లో ప్రస్తుతం 7,07,267 యాక్టివ్ కేసులున్నాయి. కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ఈ మేరకు బుధవారం హెల్త్ బులెటిన్లో పేర్కొంది. కాగా, దేశంలో ఇప్పటివరకు 3.76 కోట్ల వెరస్ నిరారణ పరీక్షలు చేశామని భారత్ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. ఏపీ: 24 గంటల్లో 8,473 మంది డిశ్చార్జ్ అమరావతి : గత 24 గంటల్లో 61,838 మందికి కరోనా వైరస్ పరీక్షలు చేయగా 10,830 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,82,469కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కరోనా నుంచి కోలుకుని నిన్న ఒక్కరోజే 8,473 మంది డిశ్చార్జ్ అవ్వగా, మొత్తం 2,86, 720 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 81 మంది మృత

ఎపిలో కొత్తగా 9927 పోజిటివ్ కేసులు…

Image
అమరావతి (జనహృదయం):  ఎపిలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలను ప్రభుత్వం  నిర్వహిస్తోంది. ఈ మేరకు  గడచిన 24 గంటల్లో 64,351 మందికి పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 33,56,852కి చేరింది. దీంతో  మంగళవారం కొత్తగా 9927 కరోనా పాజిటివ్‌కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,68,744కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో వైరస్‌ బారినపడి 92 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 3460కి చేరింది. మరోవైపు వైరస్‌ నుంచి కోలుకుని పెద్ద సంఖ్యలో బాధితులు డిశ్చార్జ్‌ అవుతున్నారు. తాజాగా 9,419 మంది డిశ్చార్‌ అవ్వగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 275352కి చేరింది.  ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

టెక్నాలజీ వాడుకలో ఈ ఏడాది 36 అవార్డుల సాధించిన ఏపి పోలీసు శాఖ....

Image
అమరావతి (జనహృదయం): ఎపిలో పోలీసు శాఖ శాంతి భద్రతల పరిరక్షణలో టెక్నాలజీ వాడుకొంటున్న తీరుపై  ఆంధ్ర‌ప్ర‌దేశ్  పోలీస్ శాఖకు అవార్డుల పరంపర కొనసాగుతోంది.   జాతీయ స్థాయిలో ఏపీ పోలీస్‌శాఖ పది అవార్డులను కైవసం చేసుకుంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు  26 అవార్డులను సాధించగా,  తాజాగా వివిధ విభాగాల్లో మరో పది అవార్డులను దక్కించుకొంది. దీంతో ఏడాది వ్యవధిలో రికార్డు స్థాయిలో 36 అవార్డులను గెలుచుకొని ఎపి పోలీస్ శాఖ స‌త్తా చాటింది. టెక్నాల‌జీ వినియోగంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీస్ శాఖ దేశానికే ఆద‌ర్శంగా నిలిచింది. ఈ అవార్డుల ప్రదానోత్స‌వానికి డీజీపీ గౌతం సవాంగ్ వెబినార్ ద్వారా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి పోలీస్‌ శాఖకు ఇస్తున్న ప్రాముఖ్యతతోనే ఇటువంటి ఘనత సాధించగలిగామని,  స‌త్ఫ‌లితాలు వ‌స్తున్నాయ‌ని డిజిపి పేర్కొన్నారు..

సెప్టెంబర్ 14 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

Image
న్యూఢిల్లీ,  : కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకూ సమావేశాలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు. ఉదయం లోకసభ, మధ్యాహ్నం రాజ్యసభ సమావేశాలు జరుగుతాయి. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ ఇరు సభలలో సభ్యులకు స్థానాలను కేటాయిస్తారు. ఇక లోకసభ సభ్యులందరూ పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో సమావేశమవుతారని, రాజ్యసభ సభ్యులు మాత్రం లోకసభ, రాజ్యసభలో కొలువుతీరుతారు. - అయితే పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే ఎంపీలందరికీ 'ఆరోగ్య సేతు' యాప్ కచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలని నిబంధన విధిస్తారని సమాచారం. సభ్యులకు స్క్రీనింగ్ నిర్వహణతో పాటు శానిటైజింగ్ వ్యవస్థ ప్రతి చోటా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అయితే ఆయా సభ్యుల వ్యక్తిగత సిబ్బందికి మాత్రం పార్లమెంట్లోకి అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ప్రతి ఆరునెలలకు ఒకసారి పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలన్న రాజ్యాంగ నిబంధనకు అనుగుణంగా కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలోనూ పార్లమెంట్ సమావేశాలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

ఏవోబీలో మావోయిస్టు డంప్ స్వాధీనం

Image
విశాఖపట్నం, (జనహృదయం) : ఆంధ్రాఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టు డంప్ ను బీఎస్ఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన నిష్టమైన సమాచారం మేరకు సరిహద్దు భద్రతా బలగాలు, జిల్లా వాలంటీర్ ఫోర్స్ బలగాలు నేతృత్వంలో ఏవోబీలోని కలిమెల పోలీసు స్టేషన్ పరిధిలోని సూకొండ సమీపంలో కురూబ్ అటవీప్రాంతంలో గాలింపు చర్యలు నిర్వహించారు. ఈ క్రమంలోనే మంగళవారం మావోయిస్టులు దాచి ఉంచిన డంప్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డంప్ లో ఆయుధాలు తయారీకు ఉపయోగించే లేత్ మిషన్, గ్యాస్ వెల్డింగ్ చేసే సిలిండెర్లు, లేత్ మిషన్ విడిబాగాలుతో బాటు ఆయుధాలు , విప్లవసాహిత్యం, ఇనుప తుక్కు సామాగ్రీ తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. మల్కనగిరి జిల్లా కార్యాలయంలో విలేకర్లు ముందు స్వాధీనం చేసుకున్న సామాగ్రీను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మలగిరి జిల్లా అదనపు ఎస్పీ మాట్లాడుతూ కురూబ్ అటవీప్రాంతంలో కలిమెల ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల సమావేశం నిర్వహించారని, ఈ మేరకు వచ్చిన సమాచారంతో గాలింపులు నిర్వహించామని, ఆ ప్రదేశంలో మావోయిస్టులు అయుధాలు తయారుచేస్తున్నట్లుగా తమకు రూఢీ అయిందని అయన తెలిపారు.    

స్పందన కార్యక్రమంపై కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్

Image
తాడేపలి,  (జనహృదయం) : కోవిడ్ చికిత్సలకు అధిక రేట్లు వసూలు చేయడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ ఆస్పత్రుల నిర్వహణ పై కలెక్టర్లు దృష్టి పెట్టాలని సూచించారు. స్పందన కార్యక్రమంపై మంగళవారం సీఎం జగన్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన జీవోలో పేర్కొన్న దాని కంటే.. కోవిడ్ రోగుల వద్ద నుంచి ఎక్కువ వసూలు చేస్తే కచ్చితంగా చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి హెచ్చరించారు. కరోనా బాధితుల పట్ల మానవత్వం చూపించాలన్నారు. కోవిడ్ బాధితుడికి అరగంటలోగా బెడ్ ఇవ్వాల్సిన బాధ్యత కలెక్టర్లదే అని తెలిపారు. 104, 14410 కాల్ సెంటర్లకు వచ్చే ఫోన్ కాల్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వరదలు, సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. గోదావరి, కృష్ణా నదిలో వరదలు తగ్గుముఖం పడుతున్నాయన్నారు. సెప్టెంబర్ 7లోగా పంట నష్టంపై అంచనాలు రూపొందించాలని.. గోదావరి వరద ముంపు బాధితులకు 2 వేల రూపాయల అదనపు పరిహారం ఇచ్చేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దానితో పాటు రెగ్యులర్‌గా ఇచ్చే రేను అదనంగా 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ

రూ.కోటి దాటిన ప్రతి లావాదేవీలపై రివర్స్ టెండరింగ్

విజయవాడ,  (జనహృదయం): అవినీతి నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంటూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కోటి రూపాయలు దాటిన వస్తు, సేవల కొనుగోళ్లకు ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ చేపట్టనుంది. కొనుగోళ్లలో పారదర్శకత కోసం రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేయాల్సిందిగా అదేశించింది. కోటి రూపాయల విలువదాటిన ప్రతీ లావాదేవీని రివర్స్ టెండరింగ్ ద్వారా చేపట్టాలని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. టెండర్ కమ్ రివర్స్ అక్షన్ విధానం ద్వారానే కొనుగోళ్లు చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ ఇంజనీరింగ్ పనుల్లో చేపట్టిన రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనం ఆదా అయ్యిందని ప్రభుత్వం 'ఏ పేర్కొంది. టెండర్ కమ్ రివర్స్ అక్షనింగ్ లేదా రివర్స్ టెండర్ల విధానాన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలు, స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలు విధిగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రివర్స్ టెండరింగ్ లో ఈ-ప్రొక్యూర్ మెంట్ విధానం అమలు చేసేందుకు తగిన ఏర్పాటు చేయాల్సిందిగా ఏపీ టెక్నాలజీ సర్వీసెసను ఏ ప్రభుత్వం ఆదేశించింది. చెల్లింపుల విధానంలోనూ మార్పులు చేయాల్సిందిగ

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఇకపై వీడియో రికార్డింగ్

అమరావతి (జనహృదయం): ఏపి‌లో స్థలాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఇకపై వీడియో రికార్డింగ్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు వీడియో రికార్డింగ్, పర్యవేక్షణకు ఏర్పాట్లు చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వీడియో రికార్డింగ్‌తో పాటు పర్యవేక్షణకు రెవెన్యూశాఖ కార్యాచరణను రూపొందిస్తోంది. ప్రయోగాత్మక‌ ప్రాజెక్టుగా 20 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో వీడియో రికార్డింగ్‌ ప్రక్రియను చేపట్టనుంది. క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు రెవెన్యూశాఖ తెలిపింది. ఈ కార్యాలయాల్లో జరిగే రిజిస్ట్రేషన్ వ్యవహారాన్ని రాష్ట్రస్థాయిలోని కంట్రోల్‌ రూం ద్వారా పర్యవేక్షించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

గ్రామ,వార్డు సచివాలయాల్లో డిజిటల్‌ చెల్లింపులు… సిం జగన్

అమరావతి (జనహృదయం):  గ్రామ,వార్డు సచివాలయాల్లో డిజిటల్‌ పేమెంట్స్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ), కెనరా బ్యాంక్‌ల సహకారంతో సచివాలయాల్లో యూపీఐ చెల్లింపుల సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎర్పాటుచేసిందినేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 15,004 సచివాలయాల్లో డిజిటల్‌ లావాదేవీలు ప్రారంభం అయ్యాయి. గ్రామ వార్డు, సచివాలయాల్లో ప్రస్తుతం 543 రకాల సేవలను ప్రభుత్వం అందజేస్తున్న విషయం తెలిసిందే. వినియోగదారులు ఇక నుంచి ఈ సేవలను అవసరమైతే డిజిటల్‌ పేమెంట్‌ ద్వారా చెల్లింపులు జరపవచ్చు. సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ ‘‘ప్రతి గడపకు ప్రభుత్వ సేవలను అందించాలన్నదే లక్ష్యం. దీని కోసం గ్రామ, వార్డు సచివాలయాలను తీసుకు వచ్చాం. వీటిలో 545 కిపైగా సేవలందిస్తున్నాం. దీంతో పాటు ప్రతి యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్‌ను పెట్టాం. ఈ యాభై కుటుంబాల బాధ్యతను వాలంటీర్‌ తీసుకుంటారు. ప్రతి 2 వేల జనాభాకు గ్రామ, వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పుడు మరో అడుగు ముందుకేశాం. డిజిటల్‌ పేమెంట్‌ వ్యవస్థను తీసుకువచ్చామని’  తెలిపారు. ఈ సందర్భంగా కెనరా బ్యాంకును సీఎం వైఎస

ముంపు బాధితులను ఆదుకోండి … సిం జగన్

అమరావతి (జనహృదయం):  నదీ పరివాహక ప్రాంతంలో ముంపు బాధితులను ఆదుకోవడంతో ఉదారంగా వ్యవహరించాలని, ఖర్చుకు వెనకాడవద్దని కలెక్టర్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. కోవిడ్‌ను కూడా దృష్టిలో ఉంచుకుని తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలన్నారు. విపత్తు నిర్వహణా బృందాలను అవసరమైన చోట్ల పెట్టుకోవాలన్నారు. గోదావరి వరదల కారణంగా తలెత్తిన పరిస్థితులను సీఎం జగన్‌ అధికారులతో సమీక్షించారు. తీసుకోవాల్సిన చర్యలపై వారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ మురళీధర్, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజుతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.          గోదావరి వరద వల్ల తలెత్తిన పరిస్థితులపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. దాదాపు 5 బ్రిడ్జిలు మునిగిపోయాయని, 13 మండలాల్లో వరద ప్రభావం ఉందని, 161 గ్రామాలలో ముంపు పరిస్థితి ఉందని  తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ వివరించారు. అలాగే దిగువన అమలాపురంలో మరో 12 గ్రామాలు ముంపునకు గురయ్యాయని చెప్పారు. 20 లక్షల క్యూసెక్కుల వరకూ వరద వస్తుం

జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేసేందుకు నిరాకరించిన సుప్రీం కోర్టు…

న్యుడిల్లి (జనహృదయం) : ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మేరకు సోమవారం న్యాయమూర్తులు పిటిషన్‌ను కొట్టివేశారు. పరీక్షలను వాయిదా వేయడం వల్ల విద్యార్థులు నష్టపోతారని సుప్రీం వ్యాఖ్యానించింది. ఒక ఏడాదిపాటు అకాడమిక్ ఇయర్‌ను వారు కోల్పోతారని, అందువల్ల అది వారి భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తుందని, కనుక పరీక్షలను వాయిదా వేయలేమని కోర్టు తెలిపింది. సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు జేఈఈ మెయిన్స్ ను ఆన్‌లైన్ మోడ్‌లో, సెప్టెంబర్ 13న నీట్‌ను ఆఫ్‌లైన్ మోడ్‌లో దేశవ్యాప్తంగా ఉన్న 161 కేంద్రాల్లో నిర్వహించేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే 11 రాష్ట్రాలకు చెందిన 11 మంది విద్యార్థులు దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ వేశారు. వారి తరఫున న్యాయవాది అలఖ్ అలోక్ శ్రీవాత్సవ కోర్టులో వాదనలు వినిపించారు. కరోనా ఉన్నందున పరీక్షలను వాయిదా వేయాలని కోరారు. అయితే ఇందుకు సుప్రీం కోర్టు నిరాకరిస్తూ సోమవారం వారి పిటిషన్‌ను కొట్టి వేసింది. దీంతో వచ్చే నెలలో యథావిధిగా ఆయా పరీక్షలు జరగనున్నాయి. అయితే కరోనా వ్యాక్సిన్ త్వరలో వస్తుందని, సాక్షాత్తూ ద

బాధ్యతలు స్వీకరించిన సిపి మనీష్ కుమార్ సిన్హా

విశాఖపట్నం (జనహృదయం): విశాఖపట్నం చాలా ప్రశాంత నగరం అని, అదే ప్రశాంతత కొనసాగించే విధంగా ముందుకెళ్తామన్నారు. నగరంలో పోలీస్ మ్యాన్ పవర్, మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తామని తెలిపారు. విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ గా మనీష్ కుమార్ సిన్హా సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం సీపీ మాట్లాడుతూ గతంలో ఎలాంటి సేవలు అందించారో అలాంటి మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు. అక్రమార్కులపై చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని సీపీ పేర్కొన్నారు. ముందుగా పోలీస్ కమిషనరేట్ వద్ద పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఇప్పటి వరకు సీపీగా పని చేసిన రాజీవ్ కుమార్ మీనా నుంచి మనీష్ కుమార్ సిన్హా బాధ్యతలు స్వీకరించారు. 2000 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన మనీష్ కుమార్ ఇప్పటి వరకు ఇంటిలిజెన్స్ ఛీఫ్ గా పనిచేశారు. ఈ సందర్బంగా డీసీపీలు ఐశ్వర్య రస్తోగి, సురేష్ బాబు, ఇతర పోలీస్ అధికారులు కొత్త సీపీని మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు .

జాతీయ డిజిటల్ ఆరోగ్య మిషన్ ప్రారంభించిన ప్రధాని

న్యూడీల్లీ (జనహృదయం): దేశ రాజధాని ఢిల్లీలో 74వ స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఎర్రకోట పై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  ఆయన ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతూ  నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌(ఎన్‌డీహెచ్‌ఎం)ను ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా  ప్రతి భారతీయుడికి ఒక ఐడీ నంబర్‌ను కేటాయించనున్నారు. పూర్తిగా టెక్నాలజీ ఆధారితమైన ఈ మిషన్‌ వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులకు దోహదం చేస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ప్రతి భారతీయుడి సమగ్ర వైద్యసమాచారం ఆ ఐడీ ద్వారా లభిస్తుందని వెల్లడించారు. దీని ద్వారా  దేశంలోని ప్రతి ఒక్కరికీ ఐడీ కార్డు జారీ చేసి వైద్యుడు లేదా ఫార్మసీకి వెళ్లిన ప్రతిసారి జాతీయ స్థాయిలో ఆ సమాచారం మొత్తం కార్డులో నిక్షిప్తమవుతుంది’ అని మోదీ వెల్లడించారు. ఈ ఎన్‌డీహెచ్‌ఎం.. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్‌ మంత్రి జన్‌ ఆరోగ్య యోజన (ఏబీ పీఎం-జేఏవై) పరిధిలోకి వస్తుంది. ఇది దేశంలో ఆరోగ్య సేవల సామర్థ్యం, పనితీరు, పారదర్శకతను గణనీయంగా మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. అలాగే సమాచారం దుర్వినియోగం కాకుండా చూసేందుకు సంబంధిత వ్యక్తుల ఆరోగ్య వివరాలను వైద

ఎస్పీ బాలు ఆరోగ్యం నిలకడగా ఉంది : వైద్యులు

చెన్నై (జనహృదయం): ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం హెల్త్ బులిటెన్‌ను చెన్నై ఎంజీఎం వైద్యులు శనివారం ప్రకటించారు. ప్రస్తుతం బాలు ఆరోగ్యం నిలకడగానే ఉందని చైన్నై ఎంజీఎం వైద్యులు ప్రకటించారు. ఐసీయూలోని లైఫ్ సపోర్ట్ సిస్టమ్ మీదే చికిత్స అందజేస్తున్నామని వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నామని వైద్యులు తెలిపారు. కరోనా పాజిటివ్ రావడంతో గత పదిరోజులుగా ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉన్నట్లుండి ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా మారిందని వైద్యులు ప్రకటించారు. వెంటనే ఐసీయూకి తరలించి వైద్య నిపుణులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానుల్లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రముఖులు, సామాన్యులు అందరూ ట్వీట్లు చేశారు.

దేశంలో 25లక్షలు దాటిన కరోనా కేసులు…

న్యూ ఢిల్లీ, (జనహృదయం): భారత్ లో కరోనా విలయ తాండవం చేస్తోంది.  గడిచిన 24గంటల్లో కొత్తగా 65,002 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా 996మంది  కరోనా పాజిటివ్తో  మరణించారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 25 లక్షల 26 వేల192 కి చేరింది.  కాగా వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 6,68,220 మంది కరోనా బాదితులకు చికిత్స కొనసాగుతున్న అందిస్తున్నారు. కరోనా మహమ్మారి నుండి కోలుకుని 18 లక్షల 08 వేల 936 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనాతో ఇప్పటి వరకు 49,036 మంది మృతి చెందారు.

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం

అమరావతి (జనహృదయం):  74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆంధ్రప్రదేశ్‌లో  శనివారం ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ప్రత్యేక వాహనంపై కంటిజంట్స్‌ను సీఎం జగన్‌ పరిశీలించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ సంక్షేమ పథకాల శకటాలను సీఎం వైఎస్‌ జగన్‌ వీక్షించారు. సంక్షేమ పథకాలు ప్రతిధ్వనించేలా ఏర్పాటు చేసిన శకటాలతో పాటు  కరోనా కష్ట కాలంలో ఆరోగ్య సేవలకు గాను ఏర్పాటు చేసిన శకటాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్‌ ప్రసంగిస్తూ.. ‘స్వాతంత్ర్య సమరయోధులకు పాదాభివందనం. స్వాతంత్ర్యం ప్రాణవాయువు లాంటిందని గాంధీజీ చెప్పారు. రాజ్యాంగం, చట్టప్రకారం నడుచుకుంటేనే అభివృద్ధి సాధ్యం. ప్రజాస్వామ్యం ప్రకారం వ్యవస్థలు నడుచుకోవాలని సిఎం పిలుపునిచ్అచారు. వీరులకు నా శతకోటి వందనాలు… 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భారతీయులకు ట్

ఫోన్ చేస్తే చాలు వైద్యం అందిస్తాం : సిఎం జగన్

Image
విజయవాడ, ఆగస్టు 7, : రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చాలా బాగా చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. నిర్వహిస్తున్న కరోనా పరీక్షల్లో 85 శాతం నుంచి 90 శాతం క్లస్టర్లు ఉన్న ప్రాంతాల్లోనే చేస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 104, 14410 కాల్ సెంటర్లు సమర్థంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ రెండు నంబర్లు సరిగా పనిచేస్తున్నాయా? లేదా? అన్న దానిపై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ప్రజలు కాల్ చేసిన వెంటనే స్పందించే వ్యవస్థ ఉండాలని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 139 కరోనా అస్పత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో భోజనం, పారిశుద్ధ్యంపై సీఎం జగన్ ఆరా తీశారు. దీంతో కరోనా బాధితులకు కచ్చితంగా మెనూ అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. టెలీ మెడిసిన్ కింద మందులు పొందిన వారికి మళ్లీ పోన్ చేసి సేవలపై ఆరా తీయాలని హోర్డింగ్స్ అధికారులకు సూచించారు. అప్పుడప్పుడు కాల్ చేసి అవి పనిచేస్తున్నాయా?

రెండు ముక్కలైన విమానం

Image
కోళికోడ్: కేరళలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. వందే భారత్ మిషన్లో భాగంగా దుబాయ్ నుంచి వస్తున్న దుబాయ్ - కాళికట్ ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం శు క్రవారం రాత్రి 7.40 గంటల సమయంలో కోళీకోడ్ ఎయిర్పోర్టో దిగుతున్న సమయంలో ప్రమాదానికి లోనైంది. భారీగా వర్షం పడుతుండటంతో రన్‌వే నుంచి పక్కకు జారీ పక్కనే ఉన్న దాదాపు 50 అడుగుల లోతైన లోయ వంటి ప్రదేశంలో పడిపోయింది. దాంతో ఆ బీ737 విమానం రెండు ముక్కలైంది. ఆ ఘోర ప్రమాదంలో పైలట్ కెప్టెన్ దీపక్ సాథే సహా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 125 మంది వరకు గాయాలపాలయ్యారు. వారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఆ విమానంలో 10 మంది చిన్నారులు సహా 184 మంది ప్రయాణీకులు, ఇద్దరు పైలట్లు, ఐదుగురు సిబ్బంది కలిపి మొత్తం 191 మంది ఉన్నారని ఎయిర్ ఇండియా తెలిపింది. ప్రమాద సమయంలో విమానంలో అగ్ని ప్రమాదం జరగలేదని పేర్కొంది. ప్రమాదంపై తక్షణమే స్పందించిన సహాయ బృందాలు క్షతగాత్రులను వైద్యశాలలకు పంపించాయి. సహాయ కార్యక్రమాలను రాష్ట్ర మంత్రి మొయిదీన్ పర్యవేక్షిస్తున్నారు. కోళికోడ్, మలప్పుర్ జిల్లాల నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఘటనాస్థలికి తరలించారు. 'అది టేబుల్ టాప్ రన్‌వే. విమానం లోతైన