Posts

Showing posts from December, 2020

రెవెన్యూ సిబ్బంది అవకతవకలపై అధికారుల నిర్లిప్తత

(పీవీ.సత్యనారాయణ రావు) * నిందితుల సహకారంతోనే తప్పించుకుంటున్న బాధ్యులు * రాజకీయ ఒత్తిళ్లతో ఫిర్యాదులు బుట్టదాఖలు * స్పందన దరఖాస్తులపై చర్యలు శూన్యం నర్సీపట్నం:   ప్రభుత్వంలోని మిగతా శాఖలపై పెత్తనం చెలాయించే రెవెన్యూ శాఖలోనే అవినీతి అవకతవకలు జోరుగా సాగుతున్నాయి. దిగువ స్థాయి రెవెన్యూ ఉద్యోగుల అవకతవకలపై నిర్దిష్ట ఫిర్యాదులు అందుతున్నా, పత్రికల్లో వార్తా కథనాలు వెలువడుతున్నా సంబంధిత అధికారులు తమకేందుకులే అనే ధోరణితో నిర్లిప్త వైఖరిని అవలంబిస్తున్నారు. స్పందన ఫిర్యాదులపై చర్యలు శూన్యం ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో మండల, డివిజన్ ,జిల్లా స్థాయిల్లో ప్రజలు అందజేస్తున్న ఫిర్యాదులు విజ్ఞప్తులలో అత్యధిక శాతం రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఉంటున్నవి. అధికారులు మారినప్పుడల్లా బాధిత ప్రజలు మరొకసారి వచ్చి అందజేస్తున్న ఫిర్యాదుల సంఖ్య అత్యధికంగా ఉంటుంది.అంతేకాకుండా ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్న ప్రభుత్వ ఉద్యోగుల్లో అత్యధిక శాతం రెవెన్యూ శాఖకు చెందిన వారే ఉంటున్నారు .అదేవిధంగా దిగువ స్థాయిలో రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది రాజకీయ అండదండలతో జరుపుతున్న అవకతవకలకు సంబంధించి పత్రికల్లో కథనాలు వెల

నగదు కొరతతో చెల్లింపులకు అవస్థలు......

 (పీవీ సత్యనారాయణ రావు) * పధకం ప్రకటించిన వెంటనే బ్యాంకులకు పరుగులు * బ్యాంకులకు పోటెత్తుతున్న లబ్దిదారులు * నగదు సర్దుబాటు చేయలేక బ్యాంకు అధికారుల అగచాట్లు నర్సీపట్నం. జగనన్న అమ్మ ఒడి........ వైఎస్సార్ రైతుభరోసా........ జగనన్న చేయూత....... వైఎస్సార్ ఆసారా..... జగనన్న సున్నావడ్డీ...... ఇలా పధకం ఏదైనా లబ్దిదారులైన ప్రజలకు నగదు పంపిణీ ఓక్కటే ప్రభుత్వ లక్ష్యం గా మారింది. అయితే పధకం ప్రారంభించిన మరునాడే లబ్దిదారులు డబ్బు కోసం బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. దాంతో ఖాతాదారులకు అవసరమైన నగదు చెల్లింపుల కోసం బ్యాంకు అధికారులు నానా తంటాలు పడుతున్నారు. బ్యాంకుల అవసరాలకు తగ్గట్టుగా నగదు సరఫరా చేయడానికి రిజర్వ్ బ్యాంకు గత కోంత కాలంగా ఇబ్బందులు పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఏటీఎంలలో అవసరమైన నగదును సర్దుబాటు చేయలేక ఇబ్బంది పడుతున్న జాతీయ బ్యాంకులకు జగనన్న పథకాలు మరిన్ని సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందే కుటుంబాలలో కేవలం మహిళల బ్యాంకు ఖాతాలకు మాత్రమే సదరు సొమ్మును ప్రభుత్వం జమ చేస్తున్నది .గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన డ్వాక్రా సంఘాల పథకంలో సభ్యులైన వందలాది

మధ్యాహ్న భోజన పధకం అమలుపై ..... త్వరలో “కాగ్” తణికీలు

Image
              (పీవీ సత్యనారాయణ రావు)  * ఈనెల 7వ తేదీ నుంచి క్షేత్ర స్ధాయిలో పరిశీలనకు ప్రత్యేక బృందాలు రాక * రికార్డుల అప్ డేట్ కు విద్యాశాఖ లో ఉరుకులు…పరుగులు. నర్సీపట్నం :  రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్ధల్లో చదువుతున్న విద్యార్థులకు కరోనా కాలంలో జరిపిన డ్రై రేషన్ పంపిణీలో అవకతవకలు జరిగినట్లుగా అందిన ఫిర్యాదులపై ” కాగ్ ” క్షేత్ర స్ధాయి తణికీలకు సన్నద్ధమవుతోంది. ప్రభుత్వ పధకాల అమల్లో లోటుపాట్లను క్షుణ్ణంగా పరిశీలించి, అవకతవకలు, నిధులు దుర్వినియోగం వంటి అంశాలను వెలికి తీసే కంప్టోట్రోలర్ ఆడిట్ జనరల్ (కాగ్) ప్రత్యేక బృందాలు ఈనెల 7వ తేదీ నుంచి రాష్ట్ర విద్యాశాఖ కు సంబంధించిన జిల్లా, మండల కార్యాలయాల్లో నూ, క్షేత్రస్ధాయి లో ప్రభుత్వ పాఠశాలల్లోనూ తణికీలు జరపనున్నాయి. మధ్యాహ్న భోజన అమలుపై పరిశీలన…. ఈ ఏడాది మార్చి19 వ తేదీ నుండి అక్టోబరు 31 వ తేదీ వరకూ ప్రభుత్వ విద్యా సంస్ధల్లో మధ్యాహ్న భోజన పధకం అమల్లో భాగంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు డ్రై రేషన్ పంపిణీ ఏవిధంగా జరిగిందనే అంశాన్ని కాగ్ ప్రత్యేక ఆడిట్ బృందాలు క్షుణ్ణంగా తణికీ చేయనున్నాయి.ఇందుకు సంబంధించిన అన్నీ రికార