Posts

Showing posts from February, 2020

మావోయిస్టు ఏరియా కమిటి సభ్యుడు లొంగుబాటు

Image
ఒరిస్సా  (జనహృదయం ) :  ఉద్యమంపై విసుగుచెంది ఓ మావోయిస్టు ఏరియా కమిటీ నెంబర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు 2018 సెప్టెంబర్ 24న విశాఖ జిల్లా డుంబ్రిగుడ ప్రాంతంలో అప్పటి తాజా మాజీ శాసన సభ్యులు కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ (అరకు మాజీ ఎమ్మెల్యేలు) హత్యా సంఘటనలో  కీలక పాత్ర పోషించిన మావోయిస్టు నేత జిప్రో హబిక బుధవారం ఒరిస్సా రాష్ట్రానికి  చెందిన మల్కాన్ గిరి జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు మావోయిస్టు పార్టీ తోను,  తుపాకితోను  రాజ్యాధికారం రాదని ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తోనే ఆదివాసీలు అభివృద్ధి చెందుతారని నమ్మిన మావోయిస్టు ఏసీమ్ పోలీసులు ఎదుట లొంగిపోయినట్లు వివరించాడు. ఇటీవల పెరిగిన పోలీస్ కూమబింగ్, ఆదివాసీల తిరుగుబాటు పార్టీలో ఆదివాసీల పట్ల నిర్లక్ష్య ధోరణి తదితర అంశాలు తనను లోగిపోయే విదంగా ప్రేరేపించాయని జిప్రో పేర్కొన్నాడు. కాగా లొంగిపోయిన మావోయిస్టు నేత ఒరిస్సా పోలీసులు స్వాగతం పలికి జనజీవన స్రవంతిలో కలిసేందుకు అనుమతి ఇచ్చారు. 

ఢిల్లీలో హ్యాట్రిక్ దిశగా కేజ్రీవాల్ ...

ఢిల్లీ :   ఎగ్జిట్ పోల్స్ అంచనావేసినట్టుగానే ఢిల్లీ పీఠం దక్కించుకొని  అరవింద్ కేజ్రీవాల్‌ హ్యాట్రిక్  సాధించేదిశగా సాగుతున్నారు. అందరూ ఊహించిన విదంగానే ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్  దూసుకుపోతూ హ్యాట్రిక్ విజయానికి చేరువయింది. మొత్తం 70 శాసనసభ స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 50కు పైగా స్థానాల్లో ఆప్ ఆధిక్యంలో కొనసాగుతోంది. న్యూ ఢిల్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆధిక్యంలో ఉన్నారు. ఆప్ మంత్రులు కూడా ఆయా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. కేజ్రీవాల్ ఇంటి ముందు అభిమానుల సందడి మొదలయ్యింది. మరోవైపు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆప్‌ కార్యాలయానికి చేరుకున్నారు. ఆప్ కార్యకర్తలు భారీగా సంబరాలు చేసుకుంటున్నారు. అక్కడ బాణా సంచా కాలుస్తూ వారు తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక ఎగ్జిట్‌ పోల్స్‌ ఎగ్జాట్ పోల్స్ కాకూడదన్న బీజేపీ ఆశలు అడియాశలే అయ్యాయి. బీజేపీ ఆప్‌కు అందనంత దూరంలో నిలిచింది. అయితే గత ఎన్నికలతో పోలిస్తే కాస్తంత మెరుగుపడడం ఒక్కటే బీజేపీకి కాస్త ఊరట కలిగించే విషయం. 2015లో ఆప్ ఏకపక్ష విజయం సాధించగా ఈ సారి మాత్రం బీజేపీ ఆ పార్టీకి గట్టి పోటీనిచ్చింది. కాంగ్రెస

బస్సులో ప్రయాణికురాలుకి పోలీస్ సహాయం

దిశాయాప్ తో తక్షణం సహాయం అందిన వైనం ...  విజయవాడ : ఓ మహిళా  ప్రయాణికురాలు   ఫిర్యాదు తో ఏలూరు త్రీ టౌన్ పోలీసు స్టేషన్  లో జీరో ఎఫ్‌ఐ‌ఆర్ నమోదుచేసామని దిశ ప్రత్యేక అధికారి దీపిక పాటిల్ తెలిపారు విశాఖపట్నం నుండి విజయవాడ వెళ్తుండగా బస్సు లో మహిళ పట్ల తోటి ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించిడంతో మహిళా ప్రయాణికురాలు పిర్యాదు చేశారు  ఈమేరము తాను పోలీస్ సహాయం కోసం తెల్లవారుజమున 4.21 గంటలకు తన సెల్ ఫోన్ తో దిశ ఎస్ ఓ ఎస్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు.  నిమిషాల వ్యవధిలోనే బాధితురాలి వద్దకు  ఏలూరు త్రీ టౌన్ పోలీసులు చేరుకొన్నారు.  బస్సులో వేదింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తిసుకొని విచారణ చేపట్టారు. కాగా వేదింపులకు పాల్పడిన వ్యక్తి ప్రొఫెసర్ గా గుర్తించారు .