Posts

Showing posts from November, 2020

60లక్షల విలువైన గంజాయి పట్టివేత

Image
ఎస్ కోట: లా శృంగవరపు కోట మండలం ముషిడిపల్లి కూడలి వద్ద శుక్రవారం రాత్రి నిర్వహించిన వాహన తనిఖీల్లో 1500కేజీల గంజాయిని పట్టుకున్నట్లు విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి తెలిపారు. శనివారం మధ్యాహ్నం శృంగవరపుకోట పోలీసు స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆమె వెల్లడించారు. పోలీసులకు అందిన ముందస్తు సమాచారం మేరకు వాహన తనిఖీలు చేస్తుండగా గోనెసంచి లోడుతో వస్తున్న ఓ లారీ, వ్యానును ఆపి తనిఖీ చేయగా గోనెసంచుల మధ్యలో 50బస్తాల గంజాయి ఉన్నట్లు గుర్తించామన్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.60లక్షల వరకు ఉంటుందని ఆమె వివరించారు. గంజాయితోపాటు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు చెప్పారు. మరో నలుగురు వ్యక్తులు పరారీలో ఉన్నారన్నారు. విశాఖ జిల్లా ముంచింగ్‌పుట్‌ మండలం పరిసరాల నుంచి గంజాయిని సేకరించి ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యా్ప్తు చేపట్టినట్లు చెప్పారు. సమావేశంలో విజయనగరం డీఎస్పీ వీరాంజనేయరెడ్డి, సీఐ శ్రీనివాసరావు, ఎస్సైలు నీలకంఠం, రాజేశ్‌ పాల్గొన్నారు. 

భారత్ సహనాన్నిపరీక్షించాలనుకుంటే దీటుగా స్పందిస్తాం ప్రధాని మోడీ

Image
రాజస్తాన్: దేశ రక్షణ కై సరిహద్దుల్లో పహారా కాస్తున్న  జవాన్లతో  ప్రధాని నరేంద్రమోదీ దీపావళి పండగ జరుపుకొన్నారు. శనివారం రాజస్థాన్‌లోని జైసల్మేర్‌  లోంగేవాలా పోస్ట్‌లో సరిహద్దు జవాన్లను కలిసి ఆయన  దీపావళి శుభాకాంక్షలు తెలిపి  స్వీట్స్ పంచారు. ఈ సందర్భంగా సరిహద్దుల్లో ఆక్రమణలకు పాల్పడుతున్న పొరుగుదేశాలైన పాకిస్థాన్‌, చైనాకు మోదీ పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. యావత్‌ ప్రపంచం విస్తరణవాద శక్తులతో సమస్య ఎదుర్కొంటోంది. విస్తరణవాదం అనేది ఒక మానసిక వ్యాధి. వారింకా 18వ శతాబ్దపు భావజాలంతోనే ఉన్నారు. దీన్ని భారత్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విస్తరణ వాదాన్ని ఎదుర్కోవడంలో భారత వ్యూహం స్పష్టంగా ఉంది. ఇతరుల అభిప్రాయాలు, విధానాలను భారత్‌ గౌరవిస్తుంది. అయితే మనల్ని పరీక్షిస్తే మాత్రం దీటైన జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రోజు భారత్‌ శత్రుదేశంలోకి ప్రవేశించి ఉగ్రవాదులను, వారి నాయకులను హతమార్చింది. దేశ సమగ్రత, ప్రయోజనాలపై భారత్‌ ఎన్నడూ రాజీపడదు. ఈ విషయం ప్రపంచానికి కూడా అర్థమైంది’ అని మోదీ చెప్పారు. అంతర్జాతీయ వేదికలపై భారత్‌ ఇంతటి గౌరవాన్ని పొందిందంటే అదంతా సైనికుల పరాక్రమాల వల్లే అని ప్రధాని జవాన్లనుకొనియాడా