Posts

Showing posts from June, 2020

ఏజెన్సీ బంద్ సంపూర్ణం

Image
చింతపల్లి (జనహృదయం) జూన్ 17: జీవో నెంబర్ 3 రద్దు కు వ్యతిరేకంగా చేపట్టిన మన్యం రెండు రోజుల బందు తొలిరోజు సంపూర్ణంగా ముగిసింది. ఏజెన్సీ వ్యాప్తంగా 11 మండలాల్లో ఈ బంద్ విజయవంతమైంది వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది వ్యాపార లావాదేవీలు నిలిచిపోయాయి బ్యాంకులు మూతపడ్డాయి కనీసం ప్రైవేటు వాహనాలు కూడా లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ఎక్కడికక్కడ రహదారికి అడ్డంగా వాహనాలు నిలిపి  వేసి రాకపోకలను స్తంభింపజేశారు అలాగే దుకాణాలన్నీ మూసి వేయాల్సిందిగా ముందుగా ప్రచారం చేశారు. దీంతో ఏజెన్సీ వ్యాప్తంగా వ్యాపార సంస్థలు తమ లావాదేవీలను బుధవారం జరగనున్న వారపు సంతలు రద్దయ్యాయి జీవో నెంబర్ 3 కొనసాగింపుపై ప్రభుత్వం సుప్రీంకోరులో రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. గిరిజన హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు రావాలని కోరారు చింతపల్లి, పాడేరు, అరకు తదితర ప్రాంతాల్లో జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు బంద్ లో  పాల్గొని విజయవంతం చేసేందుకు ప్రయత్నించారు. కాగా చింతపల్లిలో జేఏసీ నాయకులు మొట్టడం రాజుబాబు, ఉగ్రంగ

ఏపిలో ఆందోళన కలిగిస్తున్న కరోనా...

విజయవాడ, జూన్ 17: ఏపీలో కరోనా మహమ్మారి ఉదృతం అవుతోంది. రోజు, రోజుకు పెరుగుతున్న కొత్త కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో వైరస్ ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 15,188 శాంపిల్స్ పరిశీలిస్తే 275మందికి కరోనా పాజిటివ్ గా తేలినట్లు మీడియా బులిటెన్లో వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇతర విదేశాల నుంచి (26) వచ్చిన వారి కేసులతో కలిపి మొత్తం 351 కేసులు నమోదయ్యాయి. కొద్దిరోజులుగా జిల్లాల వారీగా కేసుల వివరాలను ప్రభుత్వం తెలియజేయలేదు. తాజా కేసులు కలిపితే రా(ష్టానికి సంబంధించిన కేసులు 5555కు (మొత్తం 5636కు) చేరాయి. మరో 55మంది వైరస్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2559కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా కర్నూలు జిల్లాలో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. తర్వాత గుంటూరు జిల్లాలో 500కు పైగా కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 2906మందికి నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో మొత్తం 90మంది చనిపోయారు. గత 24 గంటల్లో కోవిడ్ వల్ల కర్నూలు జిల్లా, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చ

చైనాకు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్

న్యూఢిల్లీ, జూన్ 17 చైనా సరిహద్దులో ఘర్షణల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాకు గట్టి హెచ్చరికలు పంపారు. మన సైనికుల త్యాగం వృథా కాదని పేర్కొన్నారు. భారత్ తలచుకుంటే ఏదైనా చేయగలుగుతుందన్నారు. కరోనా వ్యాప్తి, నివారణ అంశాలపై ముఖ్యమంత్రులతో రెండో రోజైన బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులతో పాటు పలువురు సీఎంలు పాల్గొన్నారు. గాల్వాన్ సరిహద్దులో అమరులైన సైనికులకు నివాళిగా ప్రధానితో పాటు ముఖ్యమంత్రులు 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా సైనికుల త్యాగాలు ఎన్నటికీ మరువలేం, వారి త్యాగం వృథాగా పోదు.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉంది ప్రధాని మోదీ సైనికుల త్యాగాలు ఎన్నటికీ మరువలేమని ప్రధాని పేర్కొన్నారు. వారి త్యాగం వృథాగా పోదని దేశానికి హామీ ఇస్తున్నట్లు ప్రకటించారు. భారత సార్వభౌమాధికారంపై రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దేశ ఐక్యత, సార్వభౌమాధికారం తమకు అత్యంత ప్రాధాన్య అంశాలని తెలిపారు. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని.. కానీ, ఎవరైనా రెచ్చగొడితే దీటుగా - బదులివ్వడానికి సిద్ధమని పేర్కొన్న

గిరిజనులకు అన్యాయం జరగనివ్వం

  అమరావతి: గిరిజన ప్రయోజనాలను కాపాడే విషయంలో రాజీపడే సమస్యే లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గిరిజనులకు అన్యాయం జరగనివ్వకుండా చూస్తామని హామీ ఇచ్చారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్ప శ్రీవాణి నేతృత్వంలో గిరిజన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిశారు. ఏజెన్సీ ప్రాంతంలోని టీచర్ పోస్టులను 100 శాతం గిరిజనులకే కేటాయించాలంటూ ఉమ్మడి ఏపీలో జారీ అయిన జీవో నంబర్ 3ను ఇటీవల సుప్రీం కోర్టు కొట్టేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీం కోరులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని వారు సీఎంను కోరారు. జీవో నంబర్ 3ను కొట్టివేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై నిర్ణయం తీసుకుని, ఆ మేరకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఇదివరకే ఆదేశాలిచ్చినట్టు ఎం వారితో చెప్పారు. ఈ నేపథ్యంలో దీనిపై గిరిజన ఎమ్మెల్యేలతో చర్చించి వారి సలహాలు తీసుకునేందుకు గురువారం గిరిజన సలహా మండలి (ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్) సమావేశాన్ని సచివాలయంలో ఏర్పాటు చేశారు. సీఎంను కలిసిన వారిలో తెల్లం - బాలరాజు, పీడిక రాజన్న దొర, కె.కళావతి, భాగ్యలక్ష్మి, చెట్టి ఫల్గుణ, ధనలక్ష్మి తదితర