Posts

Showing posts from April, 2021

లాక్ డౌన్ నుంచి దేశాన్ని కాపాడాలి ...

Image
ప్రజల్లో యువత చైతన్యం కలిగించాలి... ప్రధాని మోడీ పిలుపు  డిల్లి :  దేశంలో కరోనా మహమ్మారి ప్రమాద ఘంటికలు మ్రోగిస్తున్న నేపధ్యంలో ప్రజా చైతన్యమే పరమావధిగా భావించిన ప్రధాని మోడీ యువతరాన్ని మేల్కొలిపే ప్రయత్నం చేశారు.  యువత కరోనా కట్టడికి సహకరించాలంటూ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పిలుపునిచ్చారు.  ఆయన ప్రసంగం ఈ విదంగా సాగింది.  "కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. మనందరం కలిసి ఈ పరీక్షను ఎదుర్కొందాం.  మరోసారి మహమ్మారి పై భీకర యుద్ధం చేస్తున్నాం. వైద్య సిబ్బందికి సెల్యూట్ చేస్తున్నా. ఎంత కష్టం వచ్చినా ధైర్యం కోల్పోకూడదు.  ఆక్సిజన్ డిమాండ్ ఎక్కువ ఉంది.  ఆక్సిజన్ రైలు దేశమంతా ఆక్సిజన్ ను అందిస్తుంది.  తీవ్రంగా ఉన్న  ఆక్సీజన్ సమస్య ను  పరిష్కరించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు రంగం కూడా కృషి కృషి చేస్తుంది.   జనవరి, ఫిబ్రవరి కంటే ప్రస్తుత అవసరాల దృష్ట్యా  మందుల ఉత్పత్తి పెంచాం. మన దేశంలో బలమైన ఫార్మా సెక్టార్ ఉంది. అతి తక్కువ సమయంలో వ్యాక్సిన్ ను తయారు చేసుకొని, ఫాస్ట్ ట్రాక్ పద్దతిలో ఇప్పటివరకు  12 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించాం.  మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన అందరికి వ్య

మాస్క్ లేకుంటే 10 వేలు జరిమానా ....

Image
  మొదటిసారి వెయ్యి, రెండోసారి 10 వేలు... ఉత్తర్ ప్రదేశ్లో విశాఖపట్నం : ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటిన్చకుంటే కరోనా కట్టడి సాధ్యం కాని పరిస్తితులు కళ్ళెదుట కనిపిస్తున్న కరోనా మరణాలు, పెరుగుతున్న పాజిటివ్ కేసుల లెక్కలు లెక్కచేయని వైనం... ఎందాకకా పోతుందోనన్న భయం క్షణ క్షణం వెంటాడుతోంది.  ఈ తరుణంలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాయి.  మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి అని ప్రకటించిన ప్రభుత్వాలు మాస్క్ పెట్టుకోని వారికి జరిమానాలు కఠినతరం చేసాయి.  దీనిలో భాగంగా దేశంలోని  మాస్క్ పెట్టుకోనందుకు చాలా మంది ప్రజలకు,  అధికారులు  వెయ్యి రూపాయల వంతున జరిమానాను విధించాయి.  అయితే కొందరు ఈ  జరిమానాలు విధించినప్పటికీ బేఖాతరు చేస్తుండడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి మాస్క్ లేకుండా రెండోసారి పట్టుబడితే  10 వేల  రూపాయలు జరిమానా విధించాలని ఉత్తర్వులు జారీ చేసింది.  అలా మాస్క్ లేకుండా రెండోసారి అధికారులకు చిక్కిన అమర్జిత్ యాదవ్ అనే వ్యక్తి. దేశంలోనే ఈ రకంగా పది వేల రూపాయలు జరిమానా చెల్లించిన తొలి వ్యక్తిగా నిలిచాడు. యూపీలోని డియోరియా పట్టణంలో అతడికి పోలీసులు రూ. 10000 జరిమానా విధిం

గంటకు 10 వేల కేసులు, 60 మరణాలు

Image
  డిల్లి :  దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది.  ఈ నెల 19 న 2,73,810  పాజిటివ్కేసులు నమోదవగా  మరణాలు 1619 సంభవించాయి.  సోమవారానికి సగటున గంటకు 11,408 కేసులు, 67 మరణాలు నమోదయ్యాయి.  గత ఆదివారం నుంచి దేశంలో గంటకు 10 వేల కేసులు, 60 మరణాలు నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం స్పష్టమవుతోంది.  ఈ నెల 1న సగటున గంటకు 3,013 కేసులు, 19 మరణాలు నమోదయ్యా యి.   ఆ రోజు మొత్తం 72,330 కేసులు, 459 మరణాలు నమోదయ్యా యి.  అయితే  ఏప్రిల్ 18 నాటికి (గత ఆదివారం) ఈ సంఖ్య సగటున గంటకు 10,895 కేసులు, 62 మరణాలకు చేరడం తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.  ఈ నెల18 న దేశవ్యాప్తంగా 2,61,500 కేసులు, 1501 మరణాలు నమోదైనట్లు ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 

ఎపిలో 24 గంటల్లో 8,987 మందికి కరోనా పాజిటివ్

Image
  నిర్లక్ష్యం తగదు, పరిస్తితి విషమిస్తోంది, ఎవరికి వారు చైతన్యం కావాలి,  ప్రజల్ని ప్రభుత్వం కట్టడి చేయడం కాదు ఎవరికి వారు స్వీయ నియంత్రణ చేసుకొని కరోనా నియంత్రణకు నడుం బిగించాలి... అమరావతి:  ఏపీలో కరోనా వైరస్ భయోత్రాపాతా న్ని సృష్టిస్తోంది.  రా ష్ట్రంలో గత 24 గంటల్లో 37,922 శాంపిల్స్ ను పరీక్షించగా 8,987 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.  అలాగే గడిచిన 24 గంటల్లో మరో 35 మంది కరోనాతో మృతి చెందారు. కరోనా వల్ల నెల్లూరులో 8 మంది, చిత్తూర్ లో ఐదుగురు, వైఎస్ఆర్ కడపలో ఐదుగురు, అనంతపూర్ లో ముగ్గురు, కృష్ణ జిల్లాలో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, కర్నూల్ లో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, తూర్పు గోదావరి, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున మృతిచెందారు. గడిచిన 24 గంటల్లో 3,116 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.   మంగళవారం  వరకు రాష్ట్రంలో 1,57,53,679 శాంపిళ్లను సేకరించి పరీక్షలు నిర్వహించారు. జిల్లాల వారీగా ... విశాఖపట్నం 675, విజయనగరం 330, శ్రీకాకుళం 1344, ఈస్ట్ గోదావరి 851,  పశ్చిమ గోదావరి  99, కృష్ణ 441, గుంటూరు 1202,   చిత్తూరు 1063,  కడప 297, కర్నూల్ 758, న

ఢిల్లీలో 6 రోజుల లాక్ డౌన్

Image
  సీఎం కేజ్రీవాల్ వెళ్లడి ఢిల్లీ:  కరోనా కేసులు రోజు రోజుకి ఉదృతం అవడంతో ఆరు రోజులపాటు  లాక్ డౌన్ విధిస్తూ సిఎం కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. కేవలం 24 గంటల్లో 24వేల పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పరిస్థితి ఇలాగే కొనసాగి మరణాల రేటు పెరిగి ఆందోళన కలిగిస్తున్నన నేపథ్యంలో కరోనా ఉదృతిని అరికట్టడంలో భాగంగా నేటిి నుండి ఆరు రోజులపాటు ఢిల్లీీ వ్యాప్తంగా లాాక్ డోన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు ప్రజలంతా సహకరించి కరోనా కట్టడికి చేయూత అందించాలని సీఎం కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.

లాక్ డౌన్ పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

Image
 కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ఢిల్లీ :  కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి ప్రభుత్వం సత్వర చర్యలు చేపడుతుందని అన్ని వర్గాల అభివృద్ధి కోసం, జీవనోపాధి దృష్ట్యా రాష్ట్రాలతో కలిసి ముందుకు సాగుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పారిశ్రామిక అసోసియేషన్ ప్రతినిధులతో సోమవారం ఆన్లైన్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి లాక్ డౌన్ విధించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. లాక్ డౌన్ గురించి భయపడాల్సిన అవసరం లేదని నిర్మల సీతారామన్ చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులకు తెలిపారు. కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్న  నేపథ్యంలో రాష్ట్రాలు వీకెండ్ లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. ఈ పరిస్థిితులను అధిగమించేందుకు కరోనా సెకండ్ వేవ్ ను అరికట్టేందుకు మరోసారి లాక్ డౌన్ విధిస్తారని పారిశ్రామిక వర్గాల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి లాక్ డౌన్ పై క్లారిటీ ఇచ్చాాారు.

విశాఖ జిల్లాలో మరో 565 పాజిటివ్ కేసులు

Image
  విశాఖపట్నం:  జిల్లాలో తాజాగా సోమవారం 565 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా కరోనా స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ బి వి సుధాకర్ తెలిపారు.  ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 69,012 కేసులు నమోదు కాగా వీటిలో ప్రస్తుతం 64,128 మంది వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. కాగా కరోనా వ్యాధితో జిల్లాలో ఇద్దరు మృత్యువాత గురయ్యారని ప్రకటించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ సుధాకర్ విజ్ఞప్తి చేశారు

తెలంగాణా సీఎం కేసీఆర్ కి కరోనా పాజిటివ్

Image
 హైదరాబాద్ :  దేశంతోపాటు తెలంగాణలో కూడా కరోనా ఉధృతి కొనసాగుతోంది తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా వ్యాధితో హోమ్ ఐసోలేషన్ కి వెళ్లారు.   వైద్యుల బృందం సీఎం కేసీఆర్ కి పరీక్షలు నిర్వహించి కరోనా లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సీఎం కేసీఆర్ ఫామ్హౌస్లో కోరంటీీీ్న్ లో ఉన్నారని వైద్యులు బంధం ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉందని ఎటువంటి ప్రమాదకర పరిస్థితి లేదని ప్రకటించారు.

ఏపీలో కరోనా కట్టడికై నేడు కీలక సమావేశం

Image
అమరావతి (జనహృదయం) :  ఏపీలో కరోనా కేసులు భయోత్పానికి గురిచేస్తున్న నేపథ్యంలో    కరోనా కట్టడిపై ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సన్నద్ధమైంది. ఈ మేరకు సీఎం జగన్ నేతృత్వంలో నేడు హై లెవల్ కమిటీ సమావేశమవనుంది. ఈ సమావేశంలో కరోనా నియంత్రణపై పలు కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది. కరోనా నియంత్రణపై పూర్తి భాద్యతలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకే అప్పగించింది. ఈ తరుణంలో ఏపీలో కరోనా రోజు రోజుకి ఉదృతం అవుతుండడంతో కఠిన నిర్ణయాలతో కట్టడి చేయకుంటే పెను ప్రమాదమే. దీనిని ముందుగా గుర్తించిన జగన్ సర్కార్ కీలక నిర్ణయాలకు రంగం సిద్ధం చేస్తోంది. పాఠశాలల్లో విద్యార్థులు సైతం కరోనా బారిన పడడంతో టెన్ పరీక్షల రద్దు, ఇంటర్ పరీక్షలు వాయిదా పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే పాఠశాలలకు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. వీటితోపాటుగా దేవాలయాలు, మత సంస్థలతో పాటుగా బార్లు, రెస్టారెంట్లపై ఆంక్షలు, రాష్ట్రంలో నైట్ కర్వ్ఫూ , మార్కెట్లు, దుకాణాల విషయంలో ఆంక్షలు విధించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. మరో వైపు కోవిడ్ కట్టడికోసం వ్యాక్సినేషన్, కోవిడ్ కేర్ సెంటర్ల పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. వ్యాక్సినేషన్ వివరాల

కోరలు చాస్తున్న కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్... అవగాహన లేకుంటే పెనుప్రమడమే

Image
దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ కోరలు చాస్తోంది. అన్ని రాష్ట్రాల్లోనూ కొవిడ్ కేసులు ఊహించని రీతిలో పెరిగిపోతున్నాయి. రెండు నెలల క్రితం వరకూ కరోనా వైరస్ తాకిడి తగ్గిందని ఊపిరి పీల్చుకొనేలోపే మ్యుటేషన్ చెందిన వైరస్ తీవ్రంగా దాడి చేస్తోంది. తొలి దశలో వచ్చిన కరోనా వైరస్ కుటుంబంలో ఒకరికి సోకితే జాగ్రత్తలు తీసుకున్న మిగతా వారికి వచ్చే అవకాశం కాస్త తక్కువగా ఉండేది. కానీ, ఈ కొత్త స్ట్రెయిన్ మాత్రం కుటుంబంలో ఒకరికి వస్తే అందరికీ సంక్రమించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలంగాణ ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. అంతేకాక, ప్రస్తుతం కరోనా సోకిన వారిలో పరిస్థితి సీరియస్‌గా అవుతున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఇంకా మరణాలు కూడా అధికంగానే నమోదవుతుండడం కలవరపరుస్తోంది. ఈ క్రమంలో వైద్య నిపుణులు రెండో దశ కరోనా గురించి వెల్లడించిన కీలక వివరాలు మీలో అవగాహన కల్పించడం కోసం అందిస్తున్నాం. వ్యాక్సిన్ కచ్చితంగా అవసరమే.. ప్రస్తుతం కరోనా నుంచి రక్షణ కల్పించేందుకు మనకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్స్‌లు రెండు డోస్‌లు వేసుకున్న వారిలో కూడా వైరస్ సంక్రమించిన కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే, వ్యాక్సిన్

దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనా సెకండ్ వేవ్

Image
 దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తూ తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది.    రోజుకి రెండు లక్షలకు పైగా కొత్తగా పాజిటివ్ కేసులు నమోదవుతుండడం తీవ్ర భయోత్పాతం సృష్టిస్తోంది. ఈ నెల మొదటి వారంలో కేవలం 8 శాతంగా ఉన్న కరోనా పాజిటివ్ రేటు  రెట్టింపైంది. పాజిటివిటీ రేటు 16 శాతం దాటిపోయింది. వారాంతం లెక్కల ప్రకారం 3 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు ప్రస్తుతం 13 శాతానికి పెరిగింది. మరోవైపు భారీగా పెరుగుతున్న కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా భయాందోళనకు గురిచేస్తోంది. శనివారం ఒక్కరోజే 1500 మందికి పైగా కరోనాతో మృత్యువాతపడ్డారు. కరోనా ప్రారంభంలో లాక్ డౌన్ విధించి కట్టడికి యత్నించిన కేంద్రం.. ఈసారి ఆ బాధ్యతలను రాష్ట్రాలకే అప్పగించినట్లు తెలుస్తోంది. కరోనా కేసులు తీవ్రమవుతున్న నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ, కరోనా కరాళ నృత్యం చేస్తున్న మహారాష్ట్ర, రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సహా పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు, వారాంతపు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. ఇప్పుడు అదే బాటలో మరో రెండు రాష్ట్రాలు వచ్చి చేరాయి. తమిళనా

కరోనాతో వస్త్ర వ్యాపారి మృతి .. నర్సీపట్నంలో

Image
 నర్సీపట్నం : రెవెన్యూ   డివిజన్ కేంద్రమైన నర్సీపట్నంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా ఎస్. వి. ఆర్. షాపింగ్ మాల్ యజమాని సత్తిబాబు కరోనాతో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందారు. వారం రోజుల కిందట సత్తిబాబుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో విశాఖలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గం మధ్యంలో మృతి చెందారు. మృతుడు సత్తి బాబు గత ఏడాది కరోనా సమయంలో కష్టాల్లో ఉన్న బాధితులకు పలు సహాయ, సహకారాలు అందించి మంచి పేరు తెచ్చుకున్నారు. అటువంటి వ్యక్తి కరోనాతో మృతి చెందడం పట్ల పట్టణ వాసులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.కాగా వస్త్ర వ్యాపారి సత్తిబాబు మృతి వార్త నర్సీపట్నంలో విషాదాన్ని నింపింది.

శ్రీవారి దర్శనాలపై కరోనా ప్రభావం

Image
తిరుమల :   కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనాలపై కూడా కరోనా ప్రభావం పడింది. ఇప్పటికే పలు ఆలయాలలో భక్తుల దర్శనాలు నిలిచిపోగా, తాజాగా కరోనా ఉధృతి దృష్ట్యా శ్రీవారి దర్శనాల సంఖ్యను తగ్గించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సర్వదర్శనం టోకెన్ల జారీని పాలకమండలి రద్దు చేసింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను 30 వేల నుంచి 15 వేలకు కుదిస్తున్నట్లు ప్రకటించింది. రూ.300 దర్శన టికెట్లను ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఆన్ లైన్ లో భక్తులకు అందుబాటులో ఉంచుతామని టీటీడీపేర్కొంది .

ఒకే పాఠశాలలో 52 పాజిటివ్ కేసులు...

Image
 పాఠశా లను మూసివేసిన అధికారులు  కర్నూలు : జిల్లా లోని ఆదోని శివారు కస్తూర్బా పాఠశాలలో కరోనా బారిన పడుతున్న విద్యార్థినుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం పాఠశాలలో 300 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందులో 52 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వీరిలో 50 మంది విద్యార్థినులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. 4 రోజుల క్రితం ఇదే పాఠశాలలో 23 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో 15 మంది విద్యార్థినులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. తాజాగా పాఠశాలలో మరోసారి విద్యార్థినులు, సిబ్బంది కరోనా బారిన పడటంతో పాఠశాలను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గత వారం రోజుల వ్యవధిలో ఆదోని మున్సిపాలిటీ పరిధిలోనే 182 కేసులు నమోదయ్యాయి.

ఏపీలో మరో 6,582 కరోనా కేసులు

Image
అమరావతి :   ఏపీలో కొత్తగా 6,582 కరోనా కేసులు నమోదయ్యా యి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,62,037 కు చేరింది. వీరిలో 9,09,941 మంది కరోనా బారి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 44,686 యాక్టివ్ కేసులకు చికిత్స అందిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 22 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 7,410 కి చేరింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 2,343 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

కరోనా కట్టడి కోసం వైద్యులకు యాప్ ... సీఎం జగన్

Image
అమరావతి :   ఏపీ  లో రోజురోజుకి     కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కరోనా వ్యాక్సిన్ తొలి డోసు వేయించుకున్న అయిదు లక్షల మందికి పైగా ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ రెండో డోసు అందించాలని ఆదేశించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చిందని, ఈ నెల 19వ తేదీ నుంచి ఈ యాప్ అందుబాటులోకి రానుందని సీఎం జగన్ తెలిపారు. వైద్యాధికారులందరూ లబ్ధిదారుల వివరాలను ఎప్పుటికప్పుడు ఈ యాప్ లో నమోదు చేయాలని, దీనికోసం వైద్యాధికారులందరూ తమకు వైద్య ఆరోగ్యశాఖ కేటాయించిన యూజర్ నేమ్, పాస్ వర్డ్ లను ఉపయోగించాలని కోరారు. ఈ యాప్ ద్వారా లాగిన్ అయ్యే వైద్యాధికారికి కరోనా టీకా పొందని వారి వివరాలను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. తమకు నిర్దేశించిన వ్యాక్సినేషన్ ప్రక్రియను ఈ నెల 20వ తేదీ కల్లా పూర్తి చేయాలని ఫ్రంట్ లైన్, హెల్త్ కేర్ వర్కర్లకు సూచించారు. కరోనాతో పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వర్కర్ల భద్రతకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.