(రాజన్ - జనహృదయం ప్రతినిధి)

రంపచోడవరం : అల్లూరి సీతారామరాజు జిల్లాలో చేర్చిన రంపచోడవరం డివిజన్ పరిధిలోని ప్రజలకు ప్రభుత్వం ఊరట కల్పించింది.  జిల్లా కేంద్రం సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉన్నతాధికార యంత్రాంగం ఆ ప్రాంత ప్రజలకు ఊరట కల్పించింది.  జిల్లా కేంద్రం పాడేరు లో ఉండే జిల్లా కలెక్టర్ ప్రతి వారంలో రెండు రోజుల పాటు రంపచోడవరం డివిజన్ హెడ్ కోటర్ లో ఉండేవిధంగా గా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన జిల్లా యంత్రాంగం  వారంలో రెండు రోజుల పాటు రంపచోడవరం డివిజన్ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తారని ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి విజయ్ కుమార్ ఓ ప్రకటనలో తెలియజేశారు.

దీంతో రంపచోడవరం డివిజన్ లోని ఎటపాక, కూనవరం, వార రామచంద్రపురం తో పాటు మారేడుమిల్లి. దేవిపట్నం, చింతూరు  తదితర ప్రాంతాల ప్రజలంతా జిల్లాకు సంబంధించిన పనులన్నిటికీ రంపచోడవరం లోనే జిల్లా యంత్రాంగాన్ని కలుసుకునే దిశగా చర్యలు చేపట్టనున్నారు.   వాస్తవానికి జిల్లా కేంద్రం పాడేరు లో ఉన్నప్పటికీ రంపచోడవరం డివిజన్ ప్రజలు సౌకర్యార్థం అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ మరియు ఇతర అధికార యంత్రాంగం వారంలో రెండు రోజుల పాటు రంపచోడవరం లో ఉండి సేవలు అందించనున్నారు.

Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా

ఏపీలో కొత్త జిల్లాల వివరాలు