ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా

 (రాజన్ - జనహృదయo ప్రతినిధి)

పాడేరు :  విశాఖ, తూర్పు గోదావరి ఏజెన్సీ ప్రాంతాల కలయికతో ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లా అట్టహాసంగా పాడేరు ప్రారంభం అయ్యింది.   నూతన జిల్లాలో భాగంగా పాడేరు కేంద్రంగా జగన్ సర్కార్ ప్రకటించిన అల్లూరి సీతారామరాజు జిల్లాను సోమవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రారంభించారు.  అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో గిరిజన ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులంతా పాల్గొని నూతన కలెక్టర్ సుమిత్ కుమార్ కి స్వాగతం పలికారు.   పాడేరు, అరకువేలి, రంపచోడవరం నియోజకవర్గాల ఆధారంగా 22 మండలాలతో అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పాటయింది.

ఈ జిల్లా పరిధి 12. 251 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది.  ఇక ఈ జిల్లాలో జనాభా 9.7 54 లక్షల మంది నివసిస్తున్నారు.  మూడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి.  వీటిలో ఇరవై రెండు మండలాలు ఈ జిల్లాలో చేర్చారు. అరకువేలి నియోజకవర్గానికి చెందిన అనంతగిరి, అరకువేలి, డుంబ్రిగుడ, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాలు,  పాడేరు నియోజకవర్గానికి చెందిన పాడేరు, జి.మాడుగుల, గూడెంకొత్తవీధి, చింతపల్లి,  కొయ్యూరు మండలాలు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్లకు చెందిన దేవీపట్నం, రంపచోడవరం, వై.రామవరం, గంగవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి, ఎటపాక, చింతూరు, కూనవరం,  వార రామచంద్రపురం మండలాలు ఈ జిల్లాలో చేర్చారు.

పాడేరు కేంద్రంగా ఏర్పాటు అయిన అల్లూరి సీతారామరాజు జిల్లా తొలి కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టేందుకు వచ్చినా ఐఏఎస్ అధికారి సుమిత్ కుమార్ కు ap ప్రాంత గిరిజన ప్రజాప్రతినిధులంతా ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఆయనతోనే జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభం చేశారు ఈ కార్యక్రమంలో జి సి సి చైర్మన్ శోభా స్వాతి రాణి రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ శతక బుల్లిబాబు పాడేరు అరకు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఇతర ప్రజాప్రతినిధులు మరియు పాడేరు ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ సబ్ కలెక్టర్ వి అభిషేక్ తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని కలెక్టర్ స్వాగతం పలికారు

Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఏపీలో కొత్త జిల్లాల వివరాలు