కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఏపీలో 13 నుండి  26 కు చేరిన జిల్లాల సంఖ్య 



(రాజన్ - జనహృదయం ప్రతినిధి)

అమరావతి:  ఏపీలో  కొత్తగా ఏర్పడిన 13 జిల్లాల ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించింది. సీఎం జగన్‌ అమరావతి నుంచి ఎలక్ట్రానిక్‌ బటన్‌ ద్వారా   కొత్త జిల్లాలను ప్రారంభించారు. అదే  సమయంలో   ఆయా జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కొత్తగా నియమించిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని పరిపాలన ప్రజలకు చేరువ చేశారు.

ఈ సందర్భంగా సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  మాట్లాడుతూ  రాష్ట్ర ప్రజలకు మంచి జరిగే గొప్ప శుభదినంగా సోమవారం నాటి ఈ కార్యక్రమాన్ని అభివర్ణించారు.  ఆంధ్ర ప్రదేశ్ 26 జిల్లాల రాష్ట్రంగా రూపుదిద్దుకోందని కొనియాడారు.. గతంలో  ఉన్న 13 జిల్లాల  పేర్లు, జిల్లా కేంద్రాలను అలాగే కొనసాగుతాయని,  పరిపాలనా సౌలభ్యం, వికేంద్రీకరణ అవసరం మేరకే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని ప్రకటించారు. ప్రజలకు పరిపాలన మరింత చేరువ కావాలనే మార్పులు చేశామని . కలెక్టర్లకు అధికారంతో పాటుగా  ప్రజల పట్ల బాధ్యత పెరిగిందని అన్నారు. ప్రజల  అవసరాలు, అభీష్టానికి అనుగుణంగా మార్పులు అవసరం అని సియం జగన్ పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా

ఏపీలో కొత్త జిల్లాల వివరాలు