సుప్రీంకోర్టు సీజేఐగా ఎస్‌ఏ బొబ్డే ప్రమాణస్వీకారం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా శరద్ అర్వింద్ బొబ్డే ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్ ఎస్‌ఏ బొబ్డే చేత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణస్వీకారం చేయించారు. 47వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేసిన జస్టిస్ ఎస్‌ఏ బొబ్డే 2021, ఏప్రిల్ 23 వరకు కొనసాగనున్నారు.
రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, జస్టిస్ ఎన్వీ రమణ, మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగోయ్, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. జస్టిస్ ఎస్‌ఏ బొబ్డేకు రాష్ట్రపతి, ప్రధాని, ఉప రాష్ట్రపతితో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Post a Comment