బందరు ప్రభుత్వాసుపత్రిలో " మెకనైజ్డ్ లాండ్రీ "  అవసరం...


మచిలీపట్నం :  వంద సంవత్సారాలకు పైగా ఘన చరిత్ర కల్గిన మన బందరు ప్రభుత్వాసుపత్రిలో ఇంకా పురాతన పద్ధతులు కొనసాగుతూనే ఉన్నాయి. కృష్ణాజిల్లాలో పెద్దాసుపత్రిగా పేరొందిన ఇక్కడ  రోగులు విశ్రా౦తి పొందే మంచాలపై పరిచే దుప్పట్లు , వైద్యుల ఆఫ్రాన్స్, ఆపరేషన్ థియేటర్లలో వినియోగించే దుస్తులు ఉతకడం ఆరబెట్టడం సిబ్బందికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఆసుపత్రి ఆవరణలో సిమెంట్ కట్టడంతో ఏర్పాటుచేసిన ధోబీఘాట్ లో ఉతికి ..అక్కడే తాళ్లపై అరుగులపై అశుభ్రంగా ఆరబెడుతున్నారు. వర్షాకాలం  చలి కాలంలో ఈ అత్యవసర దుస్తులు సకాలంలో ఆరక దుప్పట్లను నిర్దేశిత వ్యవధిలో మార్చడం వీలుకావడంలేదు. ఇక వేసవికాలంలో పంపులలో నీరు రాకపోయినా మరిన్ని ఇబ్బందులు వీరు పడక తప్పడం లేదు. అంతేకాక రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు 30 నుంచి 50 దుప్పట్లు  వైద్యుల పచ్చని ఆఫ్రాన్స్ ఎంతో శ్రమించి సిబ్బంది ఉతుకుతున్నారు. అంతేకాక కొంతకాలం నుంచి ప్రతిరోజు ఆసుపత్రిలో పదుల సంఖ్యలో ప్రసవాలు జరగడం .అధిక సంఖ్యలో రోగులు ఇన్ పేషంట్లుగా చేరడంతో నిత్యం దుప్పట్లు , వైద్యుల దుస్తులు ఉతకడంతో ధోబీల ఇబ్బంది అంతా ఇంతా కాదు. వీరు పాత పద్దతిలో దుస్తులను గంటల తరబడి ఉతకడం ..దుస్తుల నుంచి నీటిని పిండే అవస్థతో అలసిపోతున్నారు


మన పొరుగు రాష్ట్రాలలో అనేక ఆసుపత్రులలో దుప్పట్లను శుబ్రపర్చేందుకు యాంత్రీకరణ విధానాన్ని ఎంచక్కా అవలంభిస్తున్నారు. మన బందరులో సైతం రూ.  3 .30 లక్షల వ్యయంతో ఆసుపత్రిలో మెకనైజ్డ్ లాండ్రీ ( ఆధునిక దోబీ ఘాట్ ) ఏర్పాటుచేసుకోవడం శ్రేయస్కరం. ఇక్కడ ప్రతి నిత్యం ఓ.పి.కి  500  మందికి తక్కువ కాకుండా రోగులు వస్తున్నారు. గత ఏడాది ఈ ఆసుపత్రిలో 2 ,283 ప్రసవాలు జరిగినట్లు రికార్డులు వెల్లడిచేస్తున్నాయి. ఇక ఇన్ పేషేంట్ విభాగంలో ఖాళీ అనేది ఉండదు. బాలింతలు , గర్బీణీలు , రకరకాల వ్యాధులతో ఇన్ పేషేంట్లు ఆయా వార్డులలో మంచాలపై చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకరినుంచి మరొకరికి అంటువ్యాధులు వ్యాపించకుండా వార్డులలో మంచాలపై వినియోగించే దుప్పట్లను పరిశుభ్రంగా ఉంచాలి. కనీసం రోజు విడిచి రోజు ఆయా బెడ్ షీట్లను మార్చాల్సిఉంది. కొన్ని వార్డులలో వారం రోజులపాటు దుప్పట్లను మార్చడం లేదని పలువురు రోగులు ఆరోపిస్తున్నారు. దశాబ్దాల కాలం నుంచి ఈ దుప్పట్లను శుబ్రపర్చేందుకు సాధారణ పద్ధతులనే అమలుచేస్తున్నారు. 


బందరు ఆసుపత్రిలో కనుక  మెకనైజ్డ్ లాండ్రీ ( ఆధునిక దోబీ ఘాట్ ) ఏర్పాటుచేసుకొంటే ఎంతో ప్రయోజనం జరుగుతుంది. ఒక ప్రత్యేక గదిలో ఆ యంత్రాన్ని అమర్చడం ద్వారా దుస్తులను ఉతకడమే కాక దుప్పట్లలో నీటిని పీల్చి ఆరరొక చర్య ఆ యంత్ర ప్రత్యేకత ..రోజుకు 200 బెడ్ షీట్లు ఎంతో శుభ్రంగా ఉతకడం ఈ   మెకనైజ్డ్ లాండ్రీ సహాయంతో సాధ్యమవుతుంది. ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా శుద్ధమైన నీరు ప్రమాదం లేని రసాయనాలు వినియోగించవచ్చు.  సాధారణ జబ్బులు , ప్రాణాంతక వ్యాధులతో చికిత్స పొందే రోగులకు ఉపయోగించే బెడ్ షీట్లు వేర్వేరుగా ఉతకడం ఇక్కడ సాధ్యపడుతుంది. అలాగే గంటకు 60 దుప్పట్లు  దుస్తులు ఈ యంత్ర సహాయంతో ఉతకవచ్చు.ఆరబెట్టవచ్చు.  ఇకనైనా మన చారిత్రాత్మక ప్రభుత్వాసుపత్రిలో దుస్తులు ఉతికే మెకనైజ్డ్ లాండ్రీ ను ఏర్పాటుచేయాలి.  


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా