స్పందనకు 22 దరఖాస్తులు.. నర్సీపట్నంలో
నర్సీపట్నం (జనహృదయం ): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందన లో భాగంగా సోమవారం ప్రజల నుండి 22 అర్జీలు వచ్చాయి. ఆర్డీవో కార్యాలయ ఇంచార్జ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి సూర్యనారాయణ అర్జీలను స్వీకరించారు.
గొలుగొండ మండలం పాకాలపాడు గ్రామానికి చెందిన ఇతంసెట్టి సత్యనారాయణ తన దరఖాస్తులో సర్వే నంబర్ 100 -1లో0.55 సెంట్ల భూమి ఉన్నదని దానికి పాస్ బుక్ ఇప్పించవలసింది గా కోరారు.
గొలుగొండ మండలం ఏ ఎల్ పురం గ్రామానికి చెందిన కురం దాసు రాజు తనకు సొంత ఇల్లు లేదని ఇంటి స్థలం ఇప్పించవలసిందిగా కోరారు.
గురందొరపాలెం గ్రామానికి చెందిన బొంతు సాంబమూర్తి తన దరఖాస్తులో సర్వేనెంబర్ 306/5A లో తనకు 0.75 సెంట్ల భూమి ఉన్నదని, రోడ్డు విస్తరణలో భాగంగా 0.29 సెంట్ల భూమి ని తీసుకున్నారని దానికి పరిహారం ఇప్పించాలని కోరారు.
ఎస్ రాయవరం మండలం గుడివాడ గ్రామానికి చెందిన పి అప్పల రాజు తన దరఖాస్తులో సర్వే నంబర్ 220 లో1.50 సెంట్ల ప్రభుత్వ మెట్ట భూమి ఉన్నదని దానిలో 30 సంవత్సరాల నుండి జీడి మొక్కలను సాగు చేసుకుంటున్నామని ,మా భూమికి డి పారం పట్టా, మరియు పట్టా దార్ పాస్ పుస్తకం ఇప్పించవలసిందిగా కోరారు.
నర్సీపట్నం మండలం బి కొత్తపల్లి గ్రామానికి చెందిన రామాయమ్మ తన దరఖాస్తులో తన కుమారుడు మిలటరీ లో పని చేస్తున్నప్పుడు సర్వే నెంబర్ 441-2A లో 4.88 ఎకరాల డ్రై భూమిని ప్రభుత్వం వారు మంజూరు చేశారని , సదరు భూమిని అమ్మడానికి నిరభ్యంతర పత్రాన్ని ఇవ్వాల్సిందిగా కోరారు.
నాతవరం మండలం ఎర్రవరం గ్రామానికి చెందిన సబ్బవరపు అప్పలనాయుడు తన దరఖాస్తులో తనకు నాలుగు ఎకరాల భూమి ఉన్నదని దానికి పట్టాదార్ పాస్ పుస్తకం ఇప్పించవలసిందిగా కోరారు.
గొలుగొండ మండలం పొగచెట్ల పాలెం గ్రామానికి చెందిన గ్రామస్తులు తమ దరఖాస్తు లో తమ గ్రామంలో మంచినీటి సమస్య ఎక్కువగా ఉన్నదని తగు చర్యలు తీసుకొని మంచినీటి సమస్యను పరిష్కరించాల్సిన దిగా కోరారు.
స్పందన కార్యక్రమం లో పంచాయతీ రాజ్, గృహ నిర్మాణం ,ఐ సి డి ఎస్ శాఖల అధికారులు హాజరయ్యారు.
Comments
Post a Comment