విశాఖ రైతుబజార్లలో రేపటినుండి కిలో 25 కే ఉల్లి అమ్మకాలు
విశాఖపట్నం (జనహృదయం): ఉల్లిపాయల ధరలకు రెక్కలొచ్చి సామాన్యునికి చుక్కలు కనిపిస్తున్నతరుణంలో మార్కెటింగ్ శాఖ రాయితీ ఉల్లిపాయల్ని సిద్ధం చేసింది. బహిరంగ మార్కెట్ లో సుమారు రూ. 60వరకు ధర పలుకుతున్న ఉల్లిని విశాఖ రైతుబజార్లలో కిలో రూ.25కే సిద్ధం చేశారు. కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఉల్లిపాయల ధరలకు లెక్కేలేదు. దిగుమతి తగ్గడం, వర్షాలు, వరదల కారణంగా డిమాండ్ కు తగ్గ సరఫరా లేదు. దీంతో ఉల్లిపాయలను అందుకోవాలంటేనే సామాన్యుడు దిగాలు పడుతున్నాడు. ఈ పరిస్తితుల్లొ రూ. 25కే ఉల్లి అమ్మకానికి సిద్దం చేయడంతో రైతు బజార్లలో జనం క్యూ కట్టనున్నారు. విశాఖలో రేపటి నుండి రైతుబజార్లు కిటకిటలాడనున్నాయి.
Comments
Post a Comment