సబ్ కలెక్టర్ ఆదేశించినా ఫలితం లేదు


పాడేరు (జనహృదయం):   2018 ఫిబ్రవరి 3వ తేదీన పాడేరు సబ్ కలెక్టర్ పాడేరులో గల సర్వే నెంబర్ 17/8A లో గల్ 20 సెంట్ల భూమి పాంగి బొంజుబాబుదే అని, సదరు భూమిని బొంజుబాబుకి అప్పగించాలని తహశీల్దార్ కు ఆదేశిస్తూ జడ్జిమెంట్ ఇచ్చారు. నాటి నుండి నేటి వరకూ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ కాల్లరిగేలా తిరుగుతున్నా సర్వే రిపోర్టు కూడా ఇవ్వకుండా సిబ్బంది తిప్పించుకుంటున్నారని బొంజుబాబు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. 20 సెంట్లు భూమి ఉన్నప్పటికీ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నామని, అధికారులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడు సబ్ కలెక్టర్ గా జడ్జిమెంట్ ఇచ్చిన ప్రస్తుత ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డి.కె.బాలాజీ దృష్టికి విషయాన్ని తీసుకుని వెళుతున్నట్లు తెలిపారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా