ఘనంగా ఏటికొప్పాక బండితల్లమ్మ వారి జాతర
ఎలమంచిలి /ఏటికొప్పాక (జన హృదయం)
ఏటికొప్పాక గ్రామంలో కార్తీకమాసం లో ప్రతీ మూడో ఆదివారం బండితల్లమ్మవారి పండుగ నిర్వహించడం ఎన్నో సంవత్సరాల నుండీ ఆనవాయితీగా వస్తోంది. అయితే 17వ తేదీ మూడో ఆదివారం కావడంతో గ్రామ పెద్దలు అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి నేత అన్నం వెంకట్రావు మాట్లాడుతూ బండితల్లమ్మ వారు చాలా మహిమ గల దేవత అని,హైదరాబాద్,వైజాగ్ మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుండీ ప్రతీ ఏటా అమ్మవారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారని తెలిపారు. అమ్మవారి పండుగ సందర్భంగా కొణతాల రామకృష్ణ, బీజేపీ ఎమ్మెల్సి మాధవ్ వంటి తదితరులు అమ్మవారి ఉత్సవాలలో పాల్గొంటారాని తెలిపారు. సిఐ నారాయణ రావు ఆదేశాలతో రూరల్ ఎస్సై సంతోష్ మరియు సిబ్బంది వచ్చే వారు ఎటువంటి ఇబ్బందులు పడకుండా బందోబస్తును ఏర్పాటు చేశారని తెలిపారు.అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి సామాన్య ప్రజలకు సైతం ఉత్సవ కమిటీ సభ్యులు 30రూపాయలు టికెట్ల రూపంలో వసూలు చేయడంతో సామాన్య భక్తులు కాస్త అసహనానికి గురయ్యారు.అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
Comments
Post a Comment