ప్లాస్టిక్ ఇస్తే బియ్యం ఇస్తా.. ఎమ్మెల్యే రోజా


ప్లాస్టిక్‌ రహిత  సమాజాన్ని స్తాపించేదుకు ఎమ్మెల్యే ఆర్కే రోజా నడుంబిగించారు.  ఈమేరకు ఆదివారం తన పుట్టిన రోజు సందర్భంగా కిలో వ్యర్థ ప్లాస్టిక్‌ వస్తువులకు కిలో బియ్యం ఇచ్చే వినూత్న పథ కానికి శ్రీకారం చుట్టారు.  ఈ కార్యక్రమానికి  తొలిరోజే మంచి స్పందన లభించింది. దీనితోపాటుగా  చిత్తూరు ఎంపీ రెడ్డెప్పతో కలిసి టవర్‌క్లాక్‌ సెంటర్‌లో ట్రై సైకిళ్ల పంపిణీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రోజా  మాట్లాడుతూ వైఎస్సార్‌ కుటుంబ సభ్యులతో పుట్టిన రోజు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.  ఒక్కో పుట్టిన రోజు ఒక్కో పథకం వినూత్నంగా చేస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం అవాయిడ్‌ ప్లాస్టిక్‌.. సేవ్‌ నేచర్‌ నినాదంతో కిలో ప్లాస్టిక్‌ వ్యర్థాలకు కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టామన్నారు.


ప్లాస్టిక్‌ వస్తువు లు భూమిలో కలవడానికి 400 ఏళ్లు పడు తుందని,  దీంతో పర్యావరణం కలుషితమై మానవమనుగడ ప్రమాదభరితంగా మారనుందని అందుకే  దీనిపై పోరాటం మొదలుపెట్టామన్నారు. అన్ని నియోజకవర్గాల్లో హానికర ప్లాస్టిక్‌ బ్యాన్‌ అయ్యేలా చూడాలని కోరారు. సీఎం జగన్‌ ఐదు నెలల పాలన ట్రైలర్‌ మాత్రమేనన్నారు. ఐదేళ్ల మెయిన్‌ పిక్చర్‌ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని తెలిపారు. చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ రాష్ట్రానికి మరో 30 ఏళ్లు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డే సీఎంగా ఉంటారని తెలిపారు. ఎమ్మెల్యే భర్త ఆర్కేసెల్వమణి, సోదరులు కుమారస్వామిరెడ్డి, రామ్‌ప్రసాద్‌ రెడ్డి, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి చక్రపాణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా