పోలీసుశాఖలో మౌలిక సదుపాయాలకు 60.32కోట్లు...
అమరావతి (జనహృదయం) : రాష్ట్రంలోని పలు పోలీసు స్టేషన్ల భవనాలు, సిబ్బంది నివాస గృహాల నిర్మాణం సహా మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు 60 కోట్ల 32 లక్షల 30 వేలు రూపాయలను మంజూరు చేస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న భవనాల పూర్తికి చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మంగళగిరిలోని పోలీసుశాఖ ప్రధాన కార్యాలయం, టెక్ టవర్, విజయవాడ, విశాఖపట్నంలో భవనాల పెండింగ్ పనుల పూర్తికి నిధులు వెచ్చించనున్నారు. తిరుపతి, రాజమహేంద్రవరం, అనంతపురం, నెల్లూరు, చిత్తూరు, గుంటూరు అర్బన్ తదితర కార్యాలయాల్లో పెండింగ్ పనులు, కొత్తగా అవసరమైన పనులను పూర్తి చేయనున్నారు. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలని డీజీపీని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది.
Comments
Post a Comment