విద్యార్థులు సృజనాత్మకంగా పనిచేయాలి: ఆచార్య పేరి
విశాఖపట్నం: విద్యార్థులు సృజనాత్మకంగా పనిచేయాలని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పేరి శ్రీనివాస రావు అన్నారు. సోమవారం ఉదయం తన కార్యాలయంలో హ్యాకథాన్ శీఘ్ర తంత్ర పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబరు 6,7 తేదీలో హ్యాకథాన్‌ను నిర్వహిస్తామన్నారు. సమాజ అవసరాలకు పరిష్కారాలు చూపే దిశగా విద్యార్థులు పనిచేయాలన్నారు. విద్యార్థుల మేధస్సుకు పదునుపెట్టే విధంగా హ్యాకథాన్ నిర్వహణ జరుగుతుందన్నారు.
హ్యాకథాన్ కన్వీనర్ ఆచార్య డి.లలిత భాస్కరి మాట్లాడుతూ ఆరు అంశాలపై ఈ పోటీ జరుగుతుందన్నారు. విద్యార్థులు సమస్యపరిష్కార సామర్ధ్యాలను ప్రస్పుటం చేసే దిశగా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 28వ తేదీలోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. బృందాలుగా విద్యార్థులు దీనిలో పాల్గొనాలన్నారు. 18 గంటలను నిర్విరామంగా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. పూర్తి సమాచారం క్సోం 9985630195, 8919165254 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
కార్యక్రమంలో కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి ఆచార్య కుడ నాగేశ్వర రావు, ఆచార్య పి.మల్లికార్జున రావు, ఆచార్య రమాసుధ, ఆచార్య వాసుదేవ రెడ్డి, ఆచ్యా భాస్యర రెడ్డి, అన్నపూర్ణ, కె.వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment