ప్రారంభోత్సవానికే పరిమితమైన కోడూరు ఇసుక డిపో

అనకాపల్లి (జనహృదయం): ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ఇసుక డిపోలు ప్రారంభానికే పరిమితం అయ్యాయని మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. మండలంలోని కోడురు గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక డిపో కేవలం ప్రారంభోత్సవంకే  పరిమితమైందని, ప్రజలకు అవసరమైన ఇసుక సరఫరా చేయడం లేదని  శనివారం ఉదయం మాజీ ఎమ్మెల్యే పీలా క్యాంపు కార్యాలయంలో ఏర్పాటయిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ఇసుక కొరత తీరేంతవరకు నిబంధనలు చూపించకుండా ప్రజలకు అవసరమైన , ఇసుకను ఫ్రీగా సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఇంకా వెబ్ సైట్లో కోడూరు ఇసుక డిపోని పెట్టకపోవడం వలన ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఇప్పటికి ఆదరణ-2 పధకంలో 10%శాతం వాటా చెల్లించిన 40%మంది(సుమారు 2వేల మందికి) లబ్దిదారులకు పనిమిట్లను అందజేయలేదని, గొడౌన్ల లో పనిముట్లు వున్నా వైస్సార్సీపీ ప్రభుత్వ వైఖరి కారణంగా అధికారులు లబ్దిదారులకు అందజేయడం లేదని అన్నారు. గత ప్రభుత్వంలో మెప్మా సంస్థ ఆధ్వర్యంలో అనకాపల్లి పట్టణంలో సుమారు 600మందికి ఉచితంగా కుట్టు శిక్షణా ఇచ్చామని, వారికి ప్రభుత్వం నుండి కుట్టు మిషన్లు ఉచితంగా ఇవ్వాల్సి వున్నా, అధికారులు జాప్యం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం వారికి కుట్టు మిషన్లను అందజేయాలని ఆయన డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో పట్టణ శాఖ టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ కేకేవీఏ నారాయణరావు, జిల్లా ఉపాధ్యక్షులు మళ్ల సురేంద్ర, బీఎస్ఎంకే జోగినాయుడు, కొణతాల శ్రీనివాసరావు, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కోట్ని బాలాజీ, కశిరెడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా