విశాఖ జిల్లాలో ఇసుక కొరత లేదు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ వెల్లడి


విశాఖ జిల్లాలో రవాణాకు సిద్ధం చేసిన సుమారు 32 వేల మెట్రిక్ టన్నుల ఇసుక 
• జిల్లా లో 8 నియోజక వర్గాల్లో 8 స్టాక్ పాయింట్ల ద్వారా ఇసుక సరఫరా
• ఇసుక వారోత్సవాలు 14 నుండి 21 వరకు 
• స్టాక్ పాయింట్ల వద్ద రేటు కార్డులు
ముడసర్లోవ ఇసుక స్టాక్ పాయింట్ తనిఖీలో కలెక్టర్ వినయ్ చంద్ వెల్లడి
 విశాఖపట్నం,నవంబరు, 4(జనహృదయం): జిల్లాలో ఇసుక కొరత లేదని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ పేర్కొన్నారు.  బుదవారం ముడసర్లోవలోని ఇసుక స్టాక్ పాయింట్ ను ఆయన సందర్శించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం జిల్లాలో స్ట్రీం (4 ½ ) ఎగువ స్థాయి రీచ్ లేనందువలన శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల నుండి ఇసుక 8 నియోజక వర్గాలలోని స్టాక్ యార్డ్ లలో నిలువ ఉంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకొనిరావడమైనదన్నారు.  ఇసుక టన్ను ధర 375 రూపాయలుగా నిర్ణయించడమైనదని, రవాణా చార్జీలు ధర కిలోమీటర్ టన్ను కు 4.90 రూపాయలుగా నిర్ణయించినట్లు వివరించారు.  సాక్ యార్డుల వద్ద రవాణా చార్జీలతో కలుపుకొని ప్రభుత్వం నిర్ణయించిన ధరలైన విశాఖపట్నం తూర్పు నియోజక వర్గం ముడసర్లోవ స్టాక్ యార్డ్ వద్ద శ్రీకాకుళం ఇసుక టన్నుకు 375 రూపాయలు కాగా రవాణా చార్జీతో టన్నుకు 600 రూపాయలు, మొత్తం 975 రూపాయలు కాగా 3334.16. టన్నుల ఇసుక  అందుబాటులో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.  తూర్పు గోదావరి జిల్లా ఇసుక ధర టన్నుకు 375 రూపాయలు కాగా, రవాణా చార్జీ టన్నుకు 1215 రూపాయలు మొత్తం 1590 రూపాయలని చెప్పారు. 11407.71. టన్నుల ఇసుక  అందుబాటులో ఉన్నట్లు ఆయన చెప్పారు.
  గాజువాక నియోజక వర్గం అగనంపూడి స్టాక్ యార్డు వద్ద  ఇసుక టన్నుకు 375 రూపాయలు కాగా రవాణా చార్జీతో టన్నుకు 600 రూపాయలు, మొత్తం 975 రూపాయలుగా ఉన్నట్లు ఆయన వివరించారు.  తూర్పు గోదావరి జిల్లా ఇసుక ధర టన్నుకు 375 రూపాయలు కాగా, రవాణా చార్జీ టన్నుకు 1075 రూపాయలు కాగా మొత్తం 1450 రూపాయలని చెప్పారు. ఈ స్టాక్ యార్డు వద్ద 13315.47  టన్నులు ఇసుక అందుబాటులో ఉన్నట్లు చెప్పారు.
  నర్సీపట్నం నియోజక వర్గంలో  నర్సీపట్నం స్టాక్ యార్డు వద్ద ఒక టన్నుకు 375 రూపాయలు కాగా రవాణా చార్జీ టన్నుకు 875 రూపాయలని చెప్పారు.  మొత్తం 1250 రూపాయలని స్టాక్ పాయింట్ వద్ద 1504.35 టన్నుల ఇసుక అందుబాటులో ఉన్నట్లు ఆయన తెలిపారు.  పాయకరావుపేట నియోజక వర్గంలోని నక్కపల్లి స్టాక్ యార్డ్ వద్ద టన్నుకు ఇసుకు ధర 375 రపాయలని, రవాణా చార్జీలతో టన్నుకు 775 రూపాయలని, మొత్తం 1150 రూపాయలని , 1475.80 టన్నుల ఇసుక అందుబాటులో ఉన్నట్లు తెలియజేశారు.  చోడవరం నియోజక వర్గంలో  చోడవరం స్టాక్ యార్డ్ వద్ద టన్నుకు ఇసుక ధర 375 రూపాయలు కాగా, రవాణా చార్జీలతో టన్నుకు 1050 రూపాయలు కాగా, మొత్తం 1425 రూపాయలని, 540 టన్నుల ఇసుక అందుబాటులో ఉన్నట్లు ఆయన వివరించారు.  అనకాపల్లి నియోజక వర్గంలోని అనకాపల్లిలో టన్నుకు ఇసుక ధర 375 రూపాయలు కాగా,  రవాణా చార్జీలతో టన్నుకు 875 రూపాయలని, మొత్తం 1250 రూపాయలు కాగా 480 టన్నుల ఇసుక అందుబాటులో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.  భీమునిపట్నం నియోజక వర్గంలోని ఆనందపురం స్టాక్ యార్డు వద్ద(శ్రీకాకుళం ఇసుక) 375 రూపాయలు కాగా, రవాణా చార్జీలతో టన్నుకు 550 రూపాయలని మొత్తం కలిపి 925 రూపాయలని ఆయన పేర్కొన్నారు.  యలమంచిలి నియోజక వర్గం అచ్యుతాపురం స్టాక్ యార్డు వద్ద ఒక టన్నుకు 375 రూపాయలు కాగా  రవాణా చార్జీలతో కలిపి 925 రూపాయలని మొత్తం ధర టన్నుకు 1300 రూపాయలని ఆయన వివరించారు.  ఆనందపుర, అచ్యుతాపురంలలో రెండు రోజుల్లో ఇసుక అందుబాటులోకి వచ్చుని ఆయన తెలిపారు.  
  ఇసుక కొనుగోలు చేయదలచిన వారు  www.sand.ap.gov.in  అనే వెబ్ సైట్లో ప్రతీ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వెబ్ సైట్ ద్వారా ఇసుక కొనుగోలు చేసుకోవచ్చునని ఆయ చెప్పారు.  వెబ్ సైట్ ద్వారా పొందిన అలాట్మెంటు ఆర్డరు ను మరియు ఆధార్ కార్డును తీసుకొని వెలితే స్టాక్ యార్డులో ఇసుకను పొందవచ్చునని ఆయన వివరించారు.  వినియోగదారులు/కొనుగోలుదారులు తమ సొంత వాహనం ద్వారా గానీ లేదా స్టాక్ యార్డు లో రవాణా శాఖ ద్వారా అందుబాటులో ఉన్న వాహనం ద్వారా కిలోమీటర్ టన్ను ఒక్కంటికి 4.90 రూపాయలు మించకుండా వాహనమును అద్దెకు తీసుకొని మీ గృహమునకు తరలించుకొనవచ్చునని, స్టాక్ యార్డులో ఎలాంటి రుసుం చెల్లించవలసిన అవసరం లేదని, ఇసుకను కొనుగోలు చేసిన వారు తమ సొంత అవసరములకు వాడుకోవడం తప్ప తిరిగి అమ్మరాదని ఆయన వివరించారు.  
  ఇసుక అక్రమ రవాణా చేయువారికి రెండేళ్ళు జైలు శిక్ష ఉంటుందని, శిక్షతో పాటు భారీ జరిమానా విధించేలా చట్ట సవరణ చేయాలని,  ఇసుక అమ్మితే భారీగా జరిమానా విధించడంతో పాటు ఇసుక మరియు వాహనాలను సీజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. 
  ఆన్-లైన్ ద్వారా ఇసుక నమోదు చేసుకున్న వారు ఏమైనా సమస్యలు ఉన్న యెడల 9390503704, 9390503705, 7893847741 సెల్ నంబర్లను ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సంప్రదించాలని ఆయన కోరారు.
  జిల్లా ఇసుక స్టాక్ యార్డు లో ఏమైనా సమస్యలు ఉన్న యెడల టోల్ ఫ్రీ నంబర్ 1800-4250002, 0891-2590100, 0891-2590102 ఫోన్ నంబర్లను  సంప్రదించాలని ఆయన కోరారు.
 విశాఖపట్నం లో నిర్మాణాలు ఎక్కువగా ఉన్నందు వలన ఇసుక డిమాండ్ ఎక్కువగా ఉన్నదని, ఒక స్టాక్ యార్డు ముడసర్లోవ వద్ద మొదలు పెట్టి తరువాత అగనంపూడి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.  డిమాండ్ ఎక్కువగా ఉన్నందు వలన స్టాక్ యార్డు లు పెంచడమైనట్లు వివరించారు. గత రెండు మూడు నెలల్లో  వరదలు రావడంతో కొంత ఇబ్బంది జరిగిందని, ఇప్పుడు వరదలు తగ్గుముఖం పట్టినందువలన ఇసుక కొరత లేకుండా పూర్తి స్థాయిలో 8 స్టాక్ పాయింట్ ల ద్వారా ఇసుక సరఫరా చేయబడుతుందని చెప్పారు.  పెద్ద జిల్లా అయినందు వలన స్టాక్ యార్డు లు పెంచడమైన్నారు. దూర ప్రాంతాల ప్రజలు ఇసుక గూర్చి ఇబ్బంది పడకుండా ఉండేందుకు నియోజక వర్గాలలో ఇసుక స్టాక్ యార్డులు అందుబాటులో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 14 నుండి 21 వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ వారోత్సవాలు లో కొత్త స్టాక్ యార్డు లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.  సుమారు 32 వేల మెట్రిక్ టన్నులు ఇసుక జిల్లాలో సిద్ధంగా ఉందని, స్టాక్ పాయింట్ వద్ద ఉప కలెక్టర్ లను నియమించినట్లు చెప్పారు.  గనుల శాఖ, ఎపిఎండిసి సిబ్బంది ఉన్నట్లు తెలిపారు. రాబోయే మూడు రోజుల్లో మరింత ఇసుక వస్తుందన్నారు. ప్రతీ స్టాక్ యార్డు వద్ద రేటు కార్డు ఉంటుందన్నారు. అక్రమంగా ఇసుక అమ్మినా తరలించినా రెండేళ్లు జైలు శిక్ష ఉంటుందని చెప్పారు. జిల్లాలో ఇసుక కొరత లేదని, జివిఎంసి వారు స్టాక్ యార్డు ను పూర్తి స్థాయిలో ఇసుక వేసుకునేందుకు చదును చేసినట్లు తెలిపారు.  రీచ్ ల నుండి ఇసుక తీసుకువచ్చే వాహనాలకు జీపిఎస్ ఏర్పాటు చేయాలని ఎడి తమ్మినాయుడుని ఆదేశించారు.  
ఈ కార్యక్రమంలో ఉప కలెక్టర్లు సిహెచ్ రంగయ్య, శ్రీనివాస మూర్తి, గనుల శాఖ ఉప సంచాలకులు సత్యనారాయణ చౌదరి, ఎడి తమ్మినాయుడు, ఎపిఎండిసి అసిస్టెంట్ మేనేజర్ శ్రీమన్నారాయణ, తదితరులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా