పంచాయతీ జమా ఖర్చుల వివరాలు పై ధ్వజమెత్తిన జనం

పంచాయతీ జమా ఖర్చుల వివరాలు పై ధ్వజమెత్తిన జన


తిమ్మరాజుపేట/అచ్యుతాపురం (జన హృదయం):
అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేట గ్రామంలో జరిగిన గ్రామసభలో ప్రజలు ధ్వజమెత్తారు.  గ్రామ పంచాయతీ ద్వారా గత (2016) సంవత్సరం నుండి 2019 మార్చి వరుకు జమ ఖర్చులు నివేదిక గ్రామ ప్రజలకు పంచాయతీ కార్యదర్శి జానకి చదివి వినిపించారు. ఆ నివేదికలో చాలా అవినీతి జరిగిందని, దీనికి సమాధానం చెప్పాలంటూ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ రంగాచారిపై ప్రజలు మండిపడ్డారు.  ఈ ఖర్చు పై నాకు అవగాహన లేదని  గత పంచాయతీ కార్యదర్శి వెంకటలక్ష్మి చుసుకోనేవారని చెప్పడంతో మరింత ఆందోళనకు చేశారు.  ఖర్చులు పై సమాధానం చెప్పలేక సభ మధ్యలోనే స్పెషల్ ఆఫీసర్ వెళ్ళిపోయారు. పంచాయతీలో గతంలో గ్రామసభలు ద్వారా అయిన ఖర్చు, అంగన్వాడీ కేంద్రాల్లో ఫ్యాన్లు, లైట్లు పై పెట్టిన ఖర్చుపై చాలా అవినీతి జరిగిందని ఇది తేల్చినంతవరుకు గ్రామస్తులు ఇంటి పన్నులు కట్టమని ధ్వజ మెత్తారు. ఈ కార్యక్రమంలో శరగడం శివబాపునాయుడు, గ్రామ అభ్యుదయ సంఘం సభ్యులు అడారి నర్సింగరావు , మళ్ళ చిన్నబాబు, తనకాల జగ్గారావు, రాపేటి గౌతమ్, కర్రి నాయుడు, శరగడం స్వామి, కర్రి భద్రరాజులు, పోలార్పు నాగేశ్వరరావు, గ్రామం సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా