జాతీయ స్థాయి పేద క్రీడాకారిణికి ఆర్థిక సహాయం
శ్రీకాకుళం గ్రామీణ మండలం లో గల పెద్దపాడు గ్రామంలో , ఉన్నత పాఠశాల లో ఎనిమిదో తరగతి చదువుతున్న కోరాడ శారద గత నెల రాష్ట్రస్థాయి కుస్తీ పోటీల్లో బాలికల విభాగంలో ప్రథమ స్థానం కైవసం చేసుకుని బంగారు పతకం సాధించింది అయితే ఈమె నవంబర్లో 17వ తారీఖున ఢిల్లీలో జరగబోయే జాతీయ స్థాయి కుస్తీ పోటీలో, పాల్గొనవలసిందిగా జిల్లా పాఠశాలల క్రీడా సంఘానికి తాకీదు వచ్చింది దీంతో క్రీడాకారుని వారి తల్లిదండ్రులు ఆర్థికంగా బలహీనం కావడంతో ,పాఠశాలలో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడు గుండ బాల మోహన్ ప్రధానోపాధ్యాయుడు అయినా మక్కా శ్రీనివాసరావు కి పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు ఈమె ఆర్థిక పరిస్థితి తెలియజేయడంతో వెంటనే పాఠశాల చెందిన ఉపాధ్యాయులు ఈమెకు నాలుగు వేల రూపాయలు తక్షణమే స్పందించి వారి జీవితంలో ఈమెకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు, దీంతో ఆమె కుటుంబ సభ్యులు , ప్రధాన ఉపాధ్యాయుడు కి,ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు, ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు మక్కా శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ పాఠశాలలో అన్ని రంగాల్లో ప్రత్యేక నైపుణ్యత గల విద్యార్థిని విద్యార్థులకు ఎప్పుడు కూడా తమ సొంత డబ్బులతోనే విద్యార్థులకు ప్రోత్సహిస్తామని, ఈ సందర్భంగా తెలిపారు, ఈ కార్యక్రమంలో పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు అయినా పి.సత్యవతి, ఎం శాంతారావు, ఎస్ వి కృష్ణారావు, జి భూషణ రావు, డి.ఎం. మల్లేశ్వరి, కే సురేష్ కుమార్, క్రాఫ్ట్ బి త్రివేణి, ఆర్ట్ సిహెచ్ రవికుమార్ మొదలగు వారు పాల్గొన్నారు
Comments
Post a Comment