పత్రికా స్వేచ్ఛను కాపాడతాం: ఏ డబ్ల్యూ జె ఏ కు గవర్నర్ హామీ
అమరావతి (జన హృదయం): ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక భూమిక పోషించే మీడియాకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందర్ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 24 30 ఉపసంహరణకు సైతం చర్యలు తీసుకుంటామన్నారు. ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధి బృందం శుక్రవారం విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసింది.ఏ డబ్ల్యూ జె ఏ జాతీయ అధ్యక్షులు కే కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం గవర్నర్ ను కలిసింది. ఈ సందర్భంగా మెమోరాండం సమర్పించారు.విజ్ఞాపన పత్రాన్ని చదివిన గవర్నర్ ఆయా అంశాలపై ప్రతినిధులతో వివరంగా చర్చించారు.ఆపై వాటన్నింటికీ సానుకూలంగా స్పందించారు. తప్పకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. గవర్నర్ ను కలిసిన వారిలో జాతీయ అధ్యక్షులు కే కోటేశ్వరరావు తోపాటు నేషనల్ కోఆర్డినేటర్లు బెలిదె హరినాథ్,బాలు బోయపాటి, సలహాదారు విశ్వేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కిరణ్ కుమార్,స్వామినాథన్ సుబ్రహ్మణ్యం, హరిబాబు తదితరులు ఉన్నారు.
Comments
Post a Comment