తల్లిదండ్రులు తమ వంతు పిల్లల కోసం కృషి చేయాలి..మంత్రి అవంతి శ్రీనివాస రావు
విశాఖపట్నం నవంబర్ 14 (జన హృదయం): అందరూ చదవాలి అందరూ ఎదగాలి అనే కాంక్షతో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బాలల దినోత్సవం మరియు నాడు నేడు (మనబడి) కార్యక్రమం గురువారం ఆనందపురం మండలం గిడిజాల గ్రామంలో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల నందు గౌరవ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు యువజన సర్విసుల శాఖ మంత్రివర్యులు శ్రీ.ముత్తంశెట్టి శ్రీనివాస రావు గారి చేతులమీదుగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మంత్రి గారు మాట్లాడుతూ ఈరోజు చాల పవిత్రమైన బాలల దినోత్సవం సందర్బంగా ఈ యొక్క కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంబించటం జరిగింది. నేటి బాలలే రేపటి పౌరులు అనే ఆలోచనతో మనబడి నాడు – నేడు కార్యక్రమం ఏర్పాటు చేశారు. మనబడి నాడు – నేడు పధకం పై అన్ని గవర్నమెంట్ పాఠశాలకు మరమత్తులు, మరియు పిల్లలకు అన్ని సౌకర్యాలు కలిపించేందుకు రూ1,500 కోట్లు మంజూరు చేసారని చెప్పారు. పాటశాలలు బాగుండాలి విద్య వ్యవస్థ అత్యత్బుతంగా ప్రతిష్టాత్మకంగా సాగాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గారు ఈ పధకం అమలు చేసారని చెప్పారు. మన రాష్ట్రాన్ని విద్య సంస్కరణలతో యావత్ భారత్ దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూపు తిప్పుకొని చూస్తున్న తరుణంలో స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా ఎన్నో ప్రభుత్వాలు వచ్చిన కూడా విద్య మీద ఇంత పెద్ద ఎత్తున కర్చు చేయటం కానీ విద్య సంస్కరణలు చేపట్టడం కానీ చెయ్యలేదు అని చెప్పారు. బడుగు, బలహీన వర్ఘాల వారికి, దళితులకు, గిరిజనులకు, పేద అగ్ర వర్ణాల వారికి ఈ దేశ చరిత్ర లోనే చిర స్థాయిగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ను ప్రారంబించటం విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంబించిన ఘనత ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహనరెడ్డి గారికే దక్కుతుందని చెప్పారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పాఠశాలలో మౌలిక వసతులు అందించాలనే ఆలోచనతో ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు కలిగి ఉండాలని మనబడి నాడు- నేడు కార్యక్రమం నిరహించారు అని చెప్పారు. మన ఆంధ్రప్రదేశ్ లో 34% గవర్నమెంట్ పాటశాలలో ఉన్నప్పుడే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఏర్పాటు చేసారు, అలాగే ప్రైవేటు స్కూల్ పర్సంటేజ్ 95% ఇంగ్లీష్ మీడియం ఉంది. దీనివల్ల తల్లి తండ్రులు పిల్లల కోసం వాళ్ళ ఆస్తులు అవి అమ్ముకొని పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో చదివించేందుకు ప్రస్తుతం L.K.G లో కూడా లక్ష రూపాయలకి చేరిపిస్తునారంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్ప వేరే ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితి రాలెదు అని చెప్పారు. దీన్ని ఉద్దేశించి మన సిఎం జగన్మోహనరెడ్డి గారు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ప్రభుత్వ పాఠశాలలు అన్నిటికి కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అమ్మఒడి పధకం పెట్టి అమ్మబడి ద్వారా జనవరి 9 నుంచి బడికి పంపించే తల్లులందరికి కూడా రూ.15,000 ప్రతి తల్లి బ్యాంకు అకౌంట్ లో జమ చేస్తుందని తెలిపారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 45వేల స్కూళ్లను ఈ కార్యక్రమం ద్వారా బాగుచేస్తున్నామని, దశలవారీగా జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ, గురుకుల, హాస్టళ్లకు అన్నివసతులూ కల్పిస్తుందని తెలిపారు. అలాగే ప్రతి విద్యార్ధి చదువుకొని మన దేశానికీ, తల్లి తండ్రులకు మంచి పేరు తీసుకొని రావాలని మంత్రి అవంతి శ్రీనివాస రావు గారు కోరారు.
Comments
Post a Comment