రైతు భరోసాకు నోచుకోని జీకేవీధి


గూడెంకొత్తవీధి (జన హృదయం) : అర్హత ఉన్నప్పటికీ అధికారులు తప్పిదం వల్ల "రైతు భరోస"కు నోచుకోలేదు.  విశాఖ పట్నం జిల్లా గూడెం కొత్త వీధి మంలానికి చెందిన జి.కె.వీధి గ్రామంలో రైతుల దుస్థితి ఇది.  మండల కేంద్రానికి ఆనుకొని ఉన్న గ్రామం ఇది.సుమారు 70 సంవత్సరాలకు పూర్వం ఏర్పడి పూర్తిగా వ్యవసాయం పై ఆధారపడి జీవిస్తున్న గ్రామం.ప్రస్తుతం వై.యస్.ఆర్.ప్రభుత్వం అందిస్తున్న" రైతు భరోస" లో ఈ గ్రామమే మాయమై పోయింది.సంబంధిత అధికారులైన ఎం.ఆర్.ఓ మరియు వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు ఇచ్చిన భరోసా "రైతు భరోస" కాలేదు.సొంతభూమి ఉండి, పట్టాదారు పాస్ పుస్తకాలు ఉండి, భూమిని సాగు చేస్తువున్నా సుమారు 60 మంది రైతులు "రైతు భరోస"ను అందుకోలేక పోయారు.రెవెన్యూ గ్రామ మైన జి.కె.వీధి గ్రామమును "రైతు భరోస"లో చేర్చలేదు.సంబంధిత అధికారులు చొరవ తీసుకుని ఈ గ్రామం ను అందులో చేర్చి వుంటే న్యాయం జరిగేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.వెభ్ ల్యాండ్ లో ఉన్న గ్రామం ను "రైతు భరోస"లో చేర్చకపోవటం లో అంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా