తెదేపాకు గుడ్బై చెప్పనున్న అవినాష్
కృష్ణా జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి మరో గట్టి దెబ్బ తగలబోతోంది. ఇప్పటికే 'గన్నవరం' ఎమ్మెల్యే 'వల్లభనేనివంశీమోహన్' పార్టీని వీడి వైకాపాలో చేరేందుకు నిర్ణయించుకోగా ఆయన దారిలో మరో యువనేత పయనించబోతున్నారు. టిడిపి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న 'ఇసుకదీక్ష' సందర్భంలోనే టిడిపిని వీడిపోవాలని తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు 'దేవినేని అవినాష్' నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆయన పార్టీని వీడతారని, ఈ మేరకు కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తున్నారని సమాచారం. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రేపు ఆయన పార్టీని వీడే ప్రకటన చేస్తారని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్(నెహ్రూ) తనయుడైన 'దేవినేని అవినాష్' గత ఎన్నికలకు ముందు తండ్రితో కలసి టిడిపిలో చేరారు.
Comments
Post a Comment