ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మహాధర్నా
న్యూ ఢిల్లీ జంతర్ మంతర్: పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమం, ఎలక్ట్రానిక్ మీడియా కు చట్టబద్ధత అనే ప్రధాన డిమాండ్లతో వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తలపెట్టిన చలో ఢిల్లీ ఆందోళన కార్యక్రమంలో భాగంగా రెండు రోజుల మహాధర్నా మంగళవారం ఉదయం 11గంటలకు న్యూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద అ ప్రారంభమైంది. అంతకుముందు ఆంధ్రా భవన్ వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి నటువంటి దేశ రాజధాని తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వర్కింగ్ జర్నలిస్టులు అధిక సంఖ్యలో తరలి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షులు కోటేశ్వరరావు నాయకత్వంలో లో నేషనల్ కోఆర్డినేటర్లు బెలిదె హరినాథ్, బాలు బోయపాటి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎ. ఎమ్.రాజు రెడ్డి సంయుక్త కార్యదర్శి కామిశెట్టీ రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కిరణ్ కుమార్ తో పాటు వందలాది మంది విలేకరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment