రోడ్డుప్రమాదంలో నుజ్జయినకారు పరిస్థితి విషమం
నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం స్టేజీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో ఒకదాని వెనుక ఒకటి వరుసగా వెళుతున్న నాలుగు కార్లు, ఒక లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో విజయవాడ- హైదరాబాద్ హైవే మీద మూడు కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 108, హైవే అంబులెన్సుల ద్వారా గాయపడినవారిని నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.
Comments
Post a Comment