చదువుల దేవాలయాలుగా సర్కారుబడులు ..... 'మనబడి నాడు నేడు' ప్రారభించిన సిం జగన్


ఒంగోలు : 'ప్రపంచంతో పోటీ పడేలా పిల్లలను తీర్చిదిద్దాల్సి ఉంది. ప్రభుత్వాలు వాళ్లకు అండగా నిలబడాల్సిన అవసర ఉంది. ఒక మంచి నిర్ణయం సరైన సమయంలో తీసుకోవాలి. నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలలను చదువుల దేవాలయాలుగా మారుస్తాం. రాజకీయ నేతలు, జర్నలిస్టులు, సినీ నటులు ఎవరు కూడా వాళ్ల పిల్లలను తెలుగు మీడియంలో చదివించడం లేదు. సంస్కృతి పేరుతో పిల్లల భవిష్యత్‌ను పట్టించుకోకపోతే భావితరాల ముందు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో తెలుగు ప్రజలు ప్రపంచంతో పోటీ పడేలా ప్రయత్నం చేస్తున్నాం. మన బడి నాడు-నేడు'కార్యక్రమంతో చరిత్రను మార్చబోయే తొలి అడుగులు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలను చదువుల దేవాలయాలుగా మారుస్తామని హామీ ఇచ్చారు. నేటి బాలలే రేపటి మన సమాజ నిర్మాతలని ఈ సందర్భంగా గుర్తుచేశారు. గురువారం ఒంగోలులోని పీవీఆర్‌ బాలుర పాఠశాలలో 'నాడు-నేడు'కార్యక్రమాన్ని ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో​ ప్రజలు, విద్యార్థులనుద్దేశించి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. రాబోయే పదేళ్లలో ప్రపంచం ఎలా ఉండబోతుందో ఊహించాలని, ఇప్పటికీ స్మార్ట్‌ ఫోన్లు, ఇంటర్‌నెట్‌ అందుబాటులోకి వచ్చాయని, పదేళ్ల తర్వాత రోబోటిక్స్‌ కీలకం కానున్నాయని తెలిపారు. మన పిల్లలకు ఇంగ్లీష​ చదువులు లేకపోతే వాళ్ల భవిష్యత్‌ ఎలా ఉంటుందో ఆలోచించండని కోరారు. ప్రపంచంతో పోటీ పడేలా పిల్లలను తీర్చిదిద్దాల్సిన అవసరం, బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఒక మంచి నిర్ణయం సరైన సమయంలో తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.  ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడితే కొన్ని సమస్యలు వస్తాయన్న విషయం తెలునని వాటిని అధిగమించేందుకు బ్రిడ్జ్‌ కోర్సులు ఏర్పాటు చేస్తాం. ఒకట్రెండు సంవత్సరాలు కష్టపడ్డా.. ఆ తర్వాత పిల్లలు ఇంగ్లీష్‌ మీడియంలో ముందుకెళ్లారు. ప్రతీ ఏడాది స్కూళ్ల కోసం రూ.3500 కోట్లు ఖర్చు చేస్తాం. వచ్చే కాలంలో రాష్ట్రంలోని 45 వేల స్కూళ్ల రూపురేఖలను మారుస్తాం. తొలి విడతలో భాగంగా దాదాపు 15,700 పాఠశాలల్లో నాడు-నేడు ప్రారంభిస్తాం. జూన్‌, 2020 నాటికి పాఠశాలల్లో అన్ని వసతులు తీసుకొస్తాం. జనవరి 9న అమ్మ ఒడి పథకం కింద రూ. 15 వేలు ఇస్తాం. అదేవిధంగా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని కూడా తీసుకొస్తున్నాం. హాస్టల్లో ఉన్న విద్యార్థులకు ఖర్చుల కోసం ఏడాదికి రూ. 20 వేలు ఇస్తాం. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా చట్టం తీసుకొచ్చాం'అని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంచేశారు.

Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా