జనాలతో పోటెత్తిన రేవుపోలవరం
ఎస్ రాయవరం (జనహృదయం): .మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం రేవుపోలవరం జనాలతో పోటెత్తింది. కార్తీకమాసం మూడవ ఆదివారం మరో కైలాసగిరిగా పేరొందిన రేవుపోలవరం తీరప్రాంత అందాలను ఆస్వాదించేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఆదివారం ఉదయం నుండి ఆటోలు, కార్లు, ద్విచక్రవాహనాలు, బస్సులలో తీరప్రాంతానికి చేరుకుని ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు.ఇసుకతిన్నెలలో ఆడుతూపాడుతూ ఆనందోత్సాహాలమధ్య సరదాగా గడిపారు.తీరప్రాంతంలోని జెట్టి, లక్ష్మీమాధవస్వామి ఆలయం, శివపార్వతుల విగ్రహాలు, చల్లదనం అందించే కొబ్బరి, జీడి తోటలలో తమ సమస్యలను మరచి సంతోషంతో గడిపారు.
Comments
Post a Comment