పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయంగా : పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

పాడేరు (జనహృదయం): ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పన ప్రభుత్వ లక్ష్యమని పాడేరు శాసనసభ్యులు భాగ్యలక్ష్మి పేర్కొన్నారు పాఠశాలల స్థితిగతులను తెలుసుకొని సంపూర్ణంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మకంగా మనబడి నాడు-నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు గురువారం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి కృషి చేస్తుందన్నారు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు చెప్పారు ఉపాధ్యాయులకు శిక్షణ అందిస్తామన్నారు గిరిజన విద్యార్థులకు ఉన్నతంగా తీర్చి దిద్దాలని సూచించారు రెండు నెలల క్రితం ఈ పాఠశాలను సందర్శించి ఇక్కడ సమస్యలను దృష్టికి తీసుకువెళ్లాలని తల్లిదండ్రుల కమిటీలను ఏర్పాటు చేశామని విద్యాసంస్థలు తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో లో పాల్గొన్న పాడేరు ఐటీడీఏ పీవో బాలాజీ మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు అవసరమైన సదుపాయాలు కల్పించి అప్పుడే బాలల దినోత్సవానికి సార్థకత చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు రానున్న మూడేళ్లలో పాఠశాలలో తొమ్మిది రకాల సౌకర్యాలు కల్పించడానికి శ్రీకారం చుట్టామని చెప్పారు ప్రస్తుత పోటీ ప్రపంచంలో తెలుగుతోపాటు ఆంగ్ల భాషా పరిజ్ఞానం అవసరం అన్నారు ప్రతి ఉద్యోగానికి సమాచారానికి ఆంగ్లభాష దోహదపడుతుందని అన్నారు విద్యార్థులు తల్లిదండ్రులు పాఠశాలలో చదివించడానికి ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంగ్ల భాష మాధ్యమాన్ని విజయవంతం చేసే బాధ్యత ఉపాధ్యాయుల పైన ఉందన్నారు ఉపాధ్యాయులు ఆంగ్ల భాషా నైపుణ్యాలను మెరుగు పరుచుకుని విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయాలని సూచించారు నిన్న భాగంగా జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా