ఆదివాసీలకు ఏజన్సీలో చట్టాలను అమలు చేయాలి

  చింతూరు (జనహృదయం): ఏజన్సీలో ఆదివాసీల కు  ఆదివాసీ చట్టాలను అమలు చేయాలని, గిరిజనులతోనే సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేయాలని గురువారం ఆదివాసీ ఆరోగ్య ఉద్యోగులు డియంఅండ్ హెవో ఇన్ చార్జ పుల్లయ్యకు వినతిపత్రం అందాజేసారు. గ్రామ సచివాలయ నియామకాలలో ఏజన్సీ చట్టాలకు, హక్కులకు విఘాతం కలిగించేలా అధికారులు వ్యవహరిస్తున్నారని మెడికల్ అండ్ హెల్త్ అసోసియేషన్ డివిజన్ అధ్యక్షులు తుష్టి జోగారావు డిమాండ్ చేసారు. ఏజన్సీ ఏరియాలో అదివాసఅ అబ్యర్ధులను మాత్రమే భర్తీ చేయాలని జీవో నెం. 68, మరియు జవో యంయస్ 97 సూచిస్తున్నప్పటికి అధికారులు మాత్రం వీటికి వ్యతిరేకంగా నియామకాలు చేస్తున్నరని అన్నారు. జీవోలు, చట్టాలు ఉన్నా ఇతర కులాల వారిని ఏవిదంగా ఏజన్సీ ఏరియాలో భర్తీ చేసారో చెప్పాలని అదికారులను ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా ఐటిడిఏ అధికారులు మాత్రం ఏమీ తెలియనట్లు ఉన్నారని ఈ విషయం పై ఐటిడిఏ అధికారులు తక్షణమే స్పందించి ఇతర కులాల నియామకాలను అరికట్టాలని, ఎంపికైన గిరిజనేతరులను వెంటనే వెనక్కి పంపించాలని, అదివాసీ అబ్యర్ధులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యమ్రంలో సోడి సత్యన్నారాయణ,పుల్లి బుచ్చయ్య, పొడియం సీత, సోడి శ్రీనివాస్ రావు, కె, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా