జన్మదినం పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు


అనకాపల్లి (జనహృదయం): పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బి వి సత్యవతి విష్ణుమూర్తి తనయుడు డాక్టర్ కె యశ్వంత్ జన్మదిన వేడుకలు  శనివారం ఘనంగా జరిగాయి. జన్మదిన వేడుకల్లో భాగంగా పలు సేవ కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా   కె విఎస్ యువసేన సభ్యులతో డాక్టర్ యశ్వంత్ ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారినీ దర్శించుకున్నారు. అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పండితులు ఆశీర్వచనం అందించారు. అనంతరం స్థానిక ఎన్టీఆర్ ఆసుపత్రి నందు పండ్లు , రొట్టెలు పంపిణీ చేపట్టారు. అనంతరం స్థానిక ఎంపి నివాసంలో ఆయన జన్మదిన వేడుకల్లో  కేక్ కటింగ్ ,స్వీట్స్ పంపిణీ నిర్వహించారు. పలు నియోజకవర్గాల నుంచి  , డాక్టర్ విష్ణు మూర్తి , సత్యవతమ్మ అభిమానులు , నాయకులు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా