బ్రాండిక్స్ సంస్థ ఆధ్వర్యంలో స్వచ్చ భారత్
ఎలమంచిలి (జన హృదయం): బ్రాండిక్స్ సంస్థ తీరంలోని పూడిమడక గ్రామాన్ని స్వచ్చ గ్రామంగా తీర్చిదిద్దేందుకు బ్రాండిక్స్ సంస్థ నిర్ణయించడం జరిగిందన్నారు బ్రాండిక్స్ భారత భాగస్వామి దొరస్వామి.నవంబర్ 17 న యలమంచిలి ఎమ్మెల్యే యు.వి. రమణమూర్తి రాజు (కన్నబాబు రాజు) సమక్షంలో పూడిమడక గ్రామస్తుల మధ్య ఈ కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించడం జరుగుతుంది. పూడిమడక గ్రామస్తుల సహకారం, భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దొరైస్వామి మాట్లాడుతూ ఈ కార్యక్రమం విజయవంతానికి పూడిమడక పెద్దలు, యువత, మహిళలు సంపూర్ణ సహకారం కావాలన్నారు. ఇటీవల తాను మరియు వారి బృందంతో కలిసి గ్రామంలో విస్తృతంగా పర్యటించడం జరిగిందని, గ్రామంలోని వీధులను, మారుమూల ప్రాంతాలను సందర్శించినపుడు గ్రామంలో నెలకొన్న పారిశుధ్య లోపాలను, చెత్తా చెదారం అధికంగా పేరుకుని పోయి వున్న ప్రదేశాలను గుర్తించడం జరిగిందన్నారు. గ్రామంలో మురుగునీటి వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, అపరిశుభ్ర వాతావరణం మూలంగా దుర్ఘంధంతో స్థానికులు ఇబ్బంది పడుతున్న దుస్థితి చూసిన నేపధ్యంలో బ్రాండిక్స్ సంస్థ పూడిమడకలో పారిశుధ్య పరిస్థితులను మెరుగుపరిచి, స్వచ్చ పూడిమడకగా గ్రామాన్ని తీర్చిదిద్దాలని నిర్ణయించడం జరిగింది. మొదటగా దీనికోసం కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఈ మేరకు నవంబర్ 17 న స్వచ్చ పూడిమడక కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించడం జరిగిందని, గ్రామంలో ఇప్పటికే బ్రాండిక్స్ సంస్థ రెండు మంచినీటి పథకాలను నిర్వహించడం జరుగుతుందని,పాఠశాలలో కూడా తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశామన్నారు. గ్రామస్తుల వినతి మేరకు స్వచ్చ పూడిమడకలో భాగంగా గ్రామంలో పారిశుద్య యాజమాన్య నిర్వహణ కూడా నిరంతరాయంగా చేపట్టేలా చర్యలు తీసుకుంటామని, ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సంపూర్ణ భాగస్వామ్యం వహించాలని..స్వచ్చ పూడిమడకను సాధ్యమైనంత త్వరలో సాధ్యం చేయడానికి అందరు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
Comments
Post a Comment