ప్లాస్టిక్ వాడకం నివారించాలని కోరుతూ ర్యాలీ


పాడేరు (జన హృదయం):  పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నివారణ కోరుతూ ర్యాలీ  నిర్వహించారు.
  అనంతరం ఆమె మాట్లాడుతూ అందరు పెద్దమనస్సుతో మానవత్వంతో,అలోచించి  రాబోయే కాలంలో వాతావరణం పెనుప్రమాదంలో పడుతుందని  కావున ఇప్పటి నుండే ప్లాస్టిక్ ను నివారించాలని కోరారు.  గ్రామ  వాలంటీర్ల సహాయంతో ప్లాస్టిక్ నివారణకు కదం తొక్కు దామన్నారు. అందరు స్వచ్ఛందంగా వచ్చి  ప్లాస్టిక్ వద్దు వాతావరణం ముద్దు అనే నినాదంతో  పాడేరు పట్టణంలో ర్యాలీ నిర్వహించడం ఆనందకరమన్నారు. 
  ప్రతి గడపకు నోటీసు పంపిస్తాము. ప్లాస్టిక్ వాడకం మానేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామవాలంటీర్లు, మండల వైస్సార్ ముఖ్యనాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా