ప్రపంచీకరణలో ఆంగ్లం అవసరం: మంత్రి కొడాలి నాని
శ్రీకాకుళం, (జనహృదయం) : ప్రపంచీకరణలో ఆంగ్లం అవసరమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వర రావు (నాని) అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాడు - నేడు కార్యక్రమాన్ని బాలల దినోత్సవం సందర్భంగా రాజాం మండలం పొగిరి జడ్పీ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర రహదారులు, భవనాల శాఖా మంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ తో కలసి ఇన్ ఛార్జ్ మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ఏపి సాంఘిక సంక్షేమ గురుకులం అధ్వర్యంలో ఐఐటి, జెఇఇ, నీట్ పరీక్షలకు సూపర్ 60 బ్యాచ్ శిక్షణను మంత్రి ప్రారంభించారు. జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) మాట్లాడుతూ స్వాతంత్ర్య వచ్చి 70 ఏళ్ళు అయినా పాఠశాలలకు మౌళిక సదుపాయాల కొరత ఉందన్నారు. రాష్ట్రంలో 45 వేల పాఠశాలలకు మౌళిక సదుపాయాలు కల్పనకు రూ.33 వేల కోట్లు కేటాయింపు జరిగిందన్నారు. ఇందులో మొదటి దశ కార్యక్రమంలో 15,715 పాఠశాలల్లో ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, మరుగుదొడ్లు, ఫర్నీచర్, ప్రహారీ గోడలు, తరగతి గదులకు పెయింటింగులు, మరమ్మతులు, ఫినిషింగులు, బ్లాక్ బోర్డుల ఏర్పాటు, రక్షిత తాగు నీరు, ఇంగ్లీషు లాబ్ ల సదుపాయం కల్పించడం జరుగుతుందని చెప్పారు. పునాధి సాయి నుండి ప్రామాణిక విద్య అందించాలని ముఖ్యమంత్రి ప్రజా సంకల్ప యాత్రలోనే నిర్ణయించారని చెప్పారు. పాఠశాలల్లో బోధనా ప్రమాణాలు పెంచడంతోపాటు ఉపాధ్యాయులకు అవసరమైన శిక్షణ అందించడం జరుగుతుందని చెప్పారు. సకాలంలో విద్యార్థులకు పుస్తకాలు, బూట్లు, యూనిఫారాలు అందించడం., మద్యాహ్న భోజనం నాణ్యత పెంచడం, విద్యారులో నైపుణ్యాలు పెంపొందించడం వంటి అంశాలరపై ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతోందని చెప్పారు. జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి కొడాలి ఆంగ్లం అవసరమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి మరియు జిల్లా
Comments
Post a Comment