Follow us for latest News updates and current affairs
జాతీయ రహదారిపై కారు దగ్దం
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
-
వైజాగ్ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న కారు తాళ్లూరు ధాబా హోటల్ వద్దకు వచ్చేసరికి జాతీయ రహదారిపై నుంచి మంటలు చెలరేగి దగ్ధమైంది. సమాచారం అందుకున్న జగ్గంపేట ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు.
ఏపీలో 13 నుండి 26 కు చేరిన జిల్లాల సంఖ్య (రాజన్ - జనహృదయం ప్రతినిధి) అమరావతి: ఏపీలో కొత్తగా ఏర్పడిన 13 జిల్లాల ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించింది. సీఎం జగన్ అమరావతి నుంచి ఎలక్ట్రానిక్ బటన్ ద్వారా కొత్త జిల్లాలను ప్రారంభించారు. అదే సమయంలో ఆయా జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కొత్తగా నియమించిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని పరిపాలన ప్రజలకు చేరువ చేశారు. ఈ సందర్భంగా సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు మంచి జరిగే గొప్ప శుభదినంగా సోమవారం నాటి ఈ కార్యక్రమాన్ని అభివర్ణించారు. ఆంధ్ర ప్రదేశ్ 26 జిల్లాల రాష్ట్రంగా రూపుదిద్దుకోందని కొనియాడారు.. గతంలో ఉన్న 13 జిల్లాల పేర్లు, జిల్లా కేంద్రాలను అలాగే కొనసాగుతాయని, పరిపాలనా సౌలభ్యం, వికేంద్రీకరణ అవసరం మేరకే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని ప్రకటించారు. ప్రజలకు పరిపాలన మరింత చేరువ కావాలనే మార్పులు చేశామని . కలెక్టర్లకు అధికారంతో పాటుగా ప్రజల పట్ల బాధ్యత పెర...
(రాజన్ - జనహృదయo ప్రతినిధి) పాడేరు : విశాఖ, తూర్పు గోదావరి ఏజెన్సీ ప్రాంతాల కలయికతో ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లా అట్టహాసంగా పాడేరు ప్రారంభం అయ్యింది. నూతన జిల్లాలో భాగంగా పాడేరు కేంద్రంగా జగన్ సర్కార్ ప్రకటించిన అల్లూరి సీతారామరాజు జిల్లాను సోమవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రారంభించారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో గిరిజన ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులంతా పాల్గొని నూతన కలెక్టర్ సుమిత్ కుమార్ కి స్వాగతం పలికారు. పాడేరు, అరకువేలి, రంపచోడవరం నియోజకవర్గాల ఆధారంగా 22 మండలాలతో అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పాటయింది. ఈ జిల్లా పరిధి 12. 251 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఇక ఈ జిల్లాలో జనాభా 9.7 54 లక్షల మంది నివసిస్తున్నారు. మూడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. వీటిలో ఇరవై రెండు మండలాలు ఈ జిల్లాలో చేర్చారు. అరకువేలి నియోజకవర్గానికి చెందిన అనంతగిరి, అరకువేలి, డుంబ్రిగుడ, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాలు, పాడేరు నియోజకవర్గానికి చెందిన పాడేరు, జి.మాడుగుల, గూడెంకొత్తవీధి, చిం...
(రాజన్ - జనహృదయం ప్రతినిధి) రంపచోడవరం : అల్లూరి సీతారామరాజు జిల్లాలో చేర్చిన రంపచోడవరం డివిజన్ పరిధిలోని ప్రజలకు ప్రభుత్వం ఊరట కల్పించింది. జిల్లా కేంద్రం సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉన్నతాధికార యంత్రాంగం ఆ ప్రాంత ప్రజలకు ఊరట కల్పించింది. జిల్లా కేంద్రం పాడేరు లో ఉండే జిల్లా కలెక్టర్ ప్రతి వారంలో రెండు రోజుల పాటు రంపచోడవరం డివిజన్ హెడ్ కోటర్ లో ఉండేవిధంగా గా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన జిల్లా యంత్రాంగం వారంలో రెండు రోజుల పాటు రంపచోడవరం డివిజన్ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తారని ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి విజయ్ కుమార్ ఓ ప్రకటనలో తెలియజేశారు. దీంతో రంపచోడవరం డివిజన్ లోని ఎటపాక, కూనవరం, వార రామచంద్రపురం తో పాటు మారేడుమిల్లి. దేవిపట్నం, చింతూరు తదితర ప్రాంతాల ప్రజలంతా జిల్లాకు సంబంధించిన పనులన్నిటికీ రంపచోడవరం లోనే జిల్లా యంత్రాంగాన్ని కలుసుకునే దిశగా చర్యలు చేపట్టనున్నారు. వాస్తవానికి జిల్లా కేంద్రం పాడేరు లో ఉన్నప్పటికీ రంపచోడవర...
Comments
Post a Comment