నేటి నుండి ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘ వారోత్సవాలు

ఎలమంచిలి/లక్కవరం (జన హృదయం):  మండలంలోని లక్కవరం ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం లో సహకార వారోత్సవాలను సహకార విద్యా అధికారి జి.సోమేశ్వరరావు, యలమంచిలి సహకార శాఖ సీనియర్ ఇన్స్పెక్టర్ కే.ప్రకాష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంఘ పాలకవర్గ సభ్యులు స్వామినాయుడు, అడపా దేవుళ్ళు తదితరులు పాల్గొన్నారు. సహకార వ్యవస్థ యొక్క ఉపయోగాలు,వాటి గురించి అవగాహన కల్పించేందుకు కృషి చేశారు. రాబోయే రోజుల్లో సహకార సంఘాలను కంప్యూటరీకరణ ప్రభుత్వం చేస్తోందని అని వారు చెప్పారు. సహకార సంఘాల అవుట్లెట్ స్టోర్స్ ఏర్పాటు చేసే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. సంఘ సీఈవో శివరామకృష్ణ మాట్లాడుతూ సహకార సంఘాల బలోపేతానికి సభ్యులు సహకరించాలని కోరారు. ఈ సంవత్సరం సహకార వారోత్సవాలను లక్కవరం సంఘంలో ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా