వల్లభనేని వంశీ వైసీపీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తీరాల్సిందేనా?


విజయవాడ (జనహృదయం):  టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు.  ఏ సభుడైనా పార్టీ మారాలనికుంటే తప్పనిసరిగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందేనని వ్యాఖానించారు.రాజీనామా చేయకుండా పార్టీ మారితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సభా నాయకుడిగా సీఎం కూడా ఇదే విషయం చెప్పారని దానికే తను కూడా  కట్టుబడి వున్నానని పేర్కొన్నారు. కాగా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 2 నుంచి 15 రోజుల పాటు జరగనున్నాయని,  ఏపీలో శాసనసభ,శాసన మండలి వ్యవస్థలను డిజిటలైజ్ చేస్తున్నామని, ఇప్పటికే పేపర్ లెస్ డిజిటలైజ్ దిశగా చర్యలు చేపట్టామని ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా