నావికాదళ అధికారులకు ఏయూలో శిక్షణ


విశాఖపట్నం: భారత నావికాదళంలో పనిచేస్తున్న కమీషన్డ్‌ ఆఫీసర్స్‌కు అవసరమైన నూతన కోర్సులను నిర్వహిస్తామని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం తన కార్యాలయంలో తూర్పు నావికాదళం సీనియర్‌ స్టాఫ్‌(ఎడ్యుకేషన్‌) కెప్టెన్‌ అనీల్‌ ఖమానీతో సమావేశమయ్యారు.


ఈ సందర్భంగా వీసీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ వర్సిటీలో త్వరలో నేవీ అధికారులకు సైబర్‌ సెక్యూరిటీ, ఇంటర్నేషనల్‌ లా, అడ్వాన్స్‌డ్‌ స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌ సర్టిఫీకేట్‌ కోర్సులను నిర్వహిస్తామన్నారు. విశ్వవిద్యాలయం నావికాదళ అధికారుల సేవలను, నిపుణతను ఉపయోగించుకుంటుందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌,, ఉజ్వల్‌ కుమార్‌ ఘటక్‌ తదితరులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా