గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి మంత్రి వనిత పిలుపు
*52 వ జాతీయ గ్రంధాలయ వారోత్సవం లో పాల్గొన్న మంత్రి వర్యులు తానేటి వనిత
పశ్చిమ గోదావరి జిల్లా
కొవ్వూరు పట్టణం లోవున్న గ్రంధాలయం లో ఈ రోజు 52 వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు జరిగాయి. ఈకార్యక్రమానికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు తానేటి వనిత ముఖ్య అతిదిగా హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు,ఈ గ్రంధాలయ వారోత్సవాల్లో పాల్గొవటం చాలా ఆనందంగా ఉంది అన్నారు. పిల్లలందరూ పాఠశాలలో చెప్పింది మాత్రమే కాకుండా గ్రంధాలయ లకు కూడా వెళ్లి చదువుకోవడం అలవాటుచేసుకోవలని సూచించారు.
విద్యార్థులు అందరూ ఈ పోటీ ప్రపంచానికి అనుగుణంగా ముందుకు వెళ్ళటానికి గ్రంధాలయలు సహాయకరంగా వుంటాయన్నారు. కరెంట్ అఫైర్స్ మరియు చరిత్ర గురించి మనకు చాలా పుస్తకాలు ఉన్నాయని,50 వేల పుస్తకాల పైగా ఉన్నాయని తెలిపారు ఈ గ్రంధాలయంను అందరూ వినియోగించుకోవాలని కోరారు .గ్రంధాలయ అభివృద్ధి కి తోడ్పడతానని హామీ ఇచ్చారు.
Comments
Post a Comment