నర్సీపట్నం మార్కెట్లో విజిలెన్స్ దాడులు..
నర్సీపట్నం , నవంబరు 12 (జనహృదయం) : నర్సీపట్నం ఇందిరా మార్కెట్ లోని ఉల్లి హెూల్ సేల్ వ్యాపారులపై విజిలెన్స్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యదర్శితోపాటు విజిలెన్స్ డీఎస్ పీ ఎ.నరసింహమూర్తి దాడులు చేపట్టారు. తొలుత సోమునాయుడు దుకాణంలో స్టాక్ వివరాలను సేకరించారు. లైసెన్స్, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యాపారం జరుగుతుందా? లేదా? దుకాణంలో నిల్వలపై ఆరా తీశారు. బిల్లులు, మార్కెట్ పన్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హెూల్ సేల్ దుకాణంలో 50 టన్నులు, రిటైల్ దుకాణంలో 10 టన్నులకు మించి ఉల్లి నిల్వలు ఉండ కూడదని డీఎస్ పీ చెప్పారు. ఉల్లి ధరలు పెరిగిన నేపథ్యంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేశాయని వివరించారు. మారిస్తే ఏఎంసీ అధికారులకు తెలియజేయాలన్నారు. కొనుగోలు చేసినా, ఈ నెలాఖరు వరకూ నిబంధనలు వర్తిస్తాయన్నారు. ఎప్పటికప్పుడు విక్రయించినా బిల్లులు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. రిటర్నర్స్ మార్కెటింగ్ శాఖకు అందజేయాలని సూచించారు. లైసెన్స్ అంగన్‌వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీలపై కూడా తీసుకున్నప్పుడు సూచించిన చిరునామాలోనే దుకాణం ఉండాలని, విజిలెన్స్ సీఐలు, ఎస్టలు దాడులు చేస్తున్నారని తెలిపారు.
Comments
Post a Comment